తమిళ నటుడు సూర్య సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారని విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విద్యకు సంబంధించి ఆయన నిర్వహిస్తున్న ‘అగరం ఫౌండేషన్’ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా నటుడు ఆర్.మాధవన్ ఈ కార్యక్రమాపై చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘అంగరం ఫౌండేషన్’ ద్వారా..
‘అంగరం ఫౌండేషన్’ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అందుతున్న సహాయంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్‌లో ఈయన కీలక వ్యాఖ్యలు పేర్కొన్నారు. ‘ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. వారిలో 51 మంది వైద్యులు, సుమారు 1800 మంది ఇంజినీర్లుగా ఎదిగారు అని మాధవన్ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీషేర్ చేస్తూ సెల్యూట్ ఎమోజీలను జోడించారు. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.
6వేల మంది విద్యార్థుల జీవితాల్లో..
అగరం ఫౌండేషన్ కార్యక్రమాల గురించి సూర్య గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ రెండు దశాబ్దాల్లో దాదాపు 6వేల మంది విద్యార్థుల జీవితాల్లో ఈ ఫౌండేషన్ ఎంతో మార్పును తీసుకొచ్చింది’ అని తెలిపారు. విద్యను అత్యుత్తమ రక్షణ కవచంగా అభివర్ణించిన ఆయన ప్రతికూల పరిస్థితుల్లోనూ చదువును కొనసాగిస్తున్న విద్యార్థులను అభినందించారు. 
పిల్లల సమక్షంలో వివాహం
తమిళ స్టార్ జంట సూర్య-జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2006లో ప్రేమ వివాహం చేసుకున్న వీళ్లు.. ఇప్పుడు తమ బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రిస్టియన్ పద్ధతిలో పిల్లల సమక్షంలో ఉంగరాలు మార్చుకుని కొత్త జంటలా వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని జ్యోతిక తన ఇన్ స్టాలో షేర్ చేసింది. 'ది సీక్వెల్- 20 ఏళ్ల ప్రేమకు మరో ప్రతిజ్ఞ' పేరుతో వీడియో షేర్ చేసిన జ్యోతిక తన మనసులోని మాటలకు అద్భుతమైన అక్షరరూపం ఇచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..)


