breaking news
Agaram Foundation
-
'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్
సమాజం నాకెంతో ఇచ్చింది.. మరి సమాజానికి నేనేం ఇచ్చాను? అని ఆలోచించేవారు కొద్దిమందే ఉంటారు. వారిలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ముందు వరుసలో ఉంటాడు. నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలన్న సంకల్పంతో సూర్య.. అగరం పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు. తమిళనాడులో పేద, వెనుకబడిన సామాజిక విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది. ఇటీవలే ఈ సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.నా జీవితం ఓ సినిమా కథఈ కార్యక్రమంలో ఓ యువతి.. అగరం ఫౌండేషన్ వల్ల తన జీవితమే మారిపోయిందని స్పీచ్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. నాపేరు జయప్రియ. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. నా జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. మొదట్లో ఆ సంతోషం అన్న పదమే మా జీవితాల్లో లేదు. అదెందుకో మీకు చెప్తాను. ఇదొక సినిమాకథలా అనిపించొచ్చు. మాది చిన్న ఊరు. ఆ ఊరి పేరు అగరం. ఆ గ్రామంలో ఓ తాగుబోతు తండ్రి ఉండేవాడు. పూరి గుడిసెలో జీవితంఅతడితో తాగుడు మాన్పించలేక భార్య మౌనంగా ఏడుస్తూ ఉండేది. వీరికి ఇద్దరు కూతుర్లు. వాళ్లది మట్టి గోడలతో కట్టిన ఇల్లు (పూరి గుడిసె). తాటాకులే ఇంటి పైకప్పు. వర్షం వచ్చిందంటే నీళ్లన్నీ ఇంట్లోకి వచ్చేవి. ఆ ఇంటికి పాములు చుట్టాల్లా తరచూ వస్తుండేవి. ఇదే నా జీవితం. కరెంటు లేదు. ఇంటికి మంచినీటి కనెక్షన్ లేదు. కానీ చదువుకోవాలన్న కోరిక మాత్రం నాకు బలంగా ఉండేది. చదువులోనూ ముందుండేదాన్ని. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేదాన్ని.నెక్స్ట్ ఏంటి?కొంతకాలానికి మేమున్న ఇల్లు కూలిపోయింది. అమ్మానాన్న నిరుపేదలు. ఏమీ చేయలేకపోయారు. చూస్తుండగానే 12వ తరగతి పూర్తి చేశాను. కాలేజీ టాపర్‌గా నిలిచాను. తర్వాతేం చేయాలో తోచలేదు. మా మేడమ్ అగరం ఫౌండేషన్ నెంబర్ ఇచ్చింది. వాళ్లు నాకు సాయం చేస్తారంది. 2014లో అగరం ఫౌండేషన్‌కు కాల్ చేశాను. అప్పుడే నా జీవితం ఆనందంగా ముందుకుసాగింది.గోల్డ్ మెడల్మంచి కాలేజీలో చేర్పించారు. కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. అన్నా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాను. తర్వాత టీసీఎస్‌లో చేరాను. కొంతకాలానికి ఇన్ఫోసిస్‌కు మారాను. నాకున్న ఏకైక కల సొంతిల్లు. నేను సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు కట్టాలి. అందులో అమ్మానాన్న ప్రశాంతంగా నిద్రించాలి. అగరం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. పెద్ద ఇల్లు కట్టాను. గర్వంగా చెప్తున్నాఒకటి కాదు ఇప్పుడు నాకు రెండు ఇండ్లున్నాయని గర్వంగా చెప్తున్నాను. దీనంతటికీ కారణం అగరం ఫౌండేషన్. ఆడపిల్లలకు చదువెందుకు అని ఇప్పటికీ కొందరు అంటుంటారు. అమ్మాయిలను చదవనివ్వండి. చదివితేనే కదా ఏదో ఒకటి చేయగలం అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు సూర్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆమె విజయాన్ని అభినందిస్తూ లేచి చప్పట్లు కొట్టాడు.చదవండి: నీ సినిమాలు ఆడవ్ అని ప్రొడ్యూసర్ మొహం మీదే చెప్పాడు -
అగరం .. పేదలకోసం అహరహం.. విద్యతోనే వికాసం
హీరో అంటే సినిమాల్లో ఒక్క దెబ్బకు పదిమంది రౌడీలను గాల్లోకి ఎగిరేలా కొట్టడమేనా.. హీరో అంటే హీరోయిన్‌తో రొమాన్స్ చేయడమేనా.. హీరో అంటే ఖర్చులేని కబుర్లు చెప్పడమేనా.. పైసా ఖర్చులేకుండా రక్తదానం.. అవయవదానం.. ట్రాఫిక్ రూల్స్ అంటూ ఉచిత సలహాలు ఇవ్వడమేనా.. ఆదాయపు పన్నులు ఎగ్గొట్టేసి .. రాజకీయ నాయకులతో అంటకాగుతూ సొంత లాభాలు చూసుకోవడం కాదు.. ఎక్కడికక్కడ చిల్లర పాలిటిక్స్ చేస్తూ తమకు నచ్చనివాళ్లను తొక్కేసి నచ్చేవాళ్లకు మాత్రమే సినిమా ఛాన్సులు వచ్చేలా ఇండస్ట్రీ పాలిటిక్స్ చూడడం కూడా కాదు.. అభిమాన సంఘాలను రెచ్చగొట్టి తమ ఇమేజి కాపాడుకుంటూ హీరోయిజం వెలగబెట్టడం అసలే కాదు.మరి హీరో అంటే ఏమిటి ? తాను సంపాదించిన రూపాయితో పదిపైసలు ఈ సమాజం కోసం తిరిగి ఇచ్చేవాడు హీరో.. ఒక సాధారణమైన తనను హీరోలా నిలబెట్టి గుండెల్లో గుడికట్టి ఆరాధిస్తున్న అభిమానులకు .. సమాజానికి తనవంతుగా తిరిగి ఇస్తున్నవాడు అసలైన హీరో.. అలాంటి హీరో తమిళ సూపర్ స్టార్ సూర్య..వందల్లో డాక్టర్లు... వేలల్లో ఇంజినీర్లుఅగరం ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన సూర్య పేదల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ చదువుకోవాలని ఉన్నా ఆ ఆశ తీరని పేద పిల్లలకు తోడ్పాటును అందిస్తూ వస్తున్నారు.అగరం ఫౌండేషన్ – విద్య ద్వారా జీవన మార్పుచెన్నైలో 2006లో మొగ్గ తొడిగిన ఈ అగరం అగరం ఫౌండేషన్, తమిళనాడులోని పేద, వెనుకబడిన సామాజిక వర్గాల విద్యార్థులకు ఆశాకిరణంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను బడివైపు నడిపించే బాధ్యత ఈ సంస్థ చేపట్టింది. దాదాపు పదోహేనేళ్ళుగా ఈ మహాయజ్ఞంలో ఉన్న ఈ సంస్థ ఇప్పటికి దాదాపు ఏడువేల మంది వరకు పేద విద్యార్థులను బడివైపు నడిపించింది. ఈ ఫౌండేషన్ సాయంతో చదువుకున్న వారిలో దాదాపు 1800 మంది ఇంజినీర్లుగా ఎదిగారు .. మరో 51 మంది పేద పిల్లలు ఏకంగా డాక్టర్లు అయ్యారు. గతంలో సంస్థ వార్షికోత్సవంలో సూర్య పాల్గొనగా ఒక విద్యార్ధి మాట్లాడుతూ తన ఆశను కళలను నెరవేర్చింది సూర్య సార్ అని చెబుతూ.. తన కలలకు సూర్య సార్ రెక్కలు తొడిగి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించారని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అదే కార్యక్రమంలో ఉన్న సూర్య కళ్ళలోంచి కూడా కన్నీరు ధారాపాతంగా కారడం .. ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే. ఉంది. ఇంకా వీరే కాకుండా వందలమంది రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఇంకొన్ని వేలమంది వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు.ప్రాధమిక విద్య అందించడమే కాకుండా ఉన్నత విద్య.. సాంకేతిక విద్య ఆర్జించాలనుకునే విద్యార్థులకు ఈ సంస్థ చేదోడుగా నిలుస్తోంది. పేదింటి పిల్లల ఆశల సౌధం నిర్మించుకునేందుకు అగరం ఒక్కో ఇటుకనూ పేరుస్తూ వస్తోంది. దీంతోబాటు దాదాపు 400 స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించింది ఈ సంస్థ . కరోనా సమయంలో తంజావూరులో ప్రభుత్వ ఆస్పత్రికి రూ. 25 లక్షల వైద్యపరికరాలు అందించారు. దీంతోబాటు అంతర్యుద్ధం.. ఆకలి పేదరికంతో పోరాడుతూ పొట్టచేతబట్టుకుని శ్రీలంక నుంచి వస్తున్నా శరణార్ధుల పిల్లలకు సైతం స్కాలర్షిప్ అందిస్తున్నారు.మనలో ఒకడిని సమాజం ఉన్నతంగా చూస్తుంటే సహించలేదు ఈ సమాజం.. అయన సేవల్లోని గొప్పతనానికి బదులుగా అందులో లోపాలు వెతికే రోజులివి.. కానీ సూర్య సేవలను కమల్ హాసన్ వంటి నటులు ఇది ఒక మౌనవిప్లవం.. నిశ్శబ్దంగా సమాజాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు అంటూ సూర్య చేపట్టిన ఈ దీక్షను కొనియాడారు. ఇంకో చిత్రం ఏమంటే ఇక్కడ చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లిన ఇంజినీర్లు.. డాక్టర్లు తాము కూడా సామాజిక బాధ్యతల్లో తలా ఓ చేయి వేస్తున్నారు. తమ వంతుగా వారు కూడా మరి కొందరు పేద పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. సూర్య, కార్తీల తండ్రి శివ కుమార్ వేసిన ఈ చిన్న మొక్కను ఇప్పుడు సూర్య, కార్తీ మహా వృక్షంగా మలిచారు. ఆ వృక్షం కింద వేలమంది అందండంగా చదువుకుంటూ తమ జీవితాలను వెలుగులవైపు నడిపిస్తున్నారు.Suriya Karthi Kamal #Karthi #Kamal #Suriya #Agaram pic.twitter.com/UvznU8OXPM— 𝙰𝚛𝚓𝚞𝚗 (@GaneshC32674824) August 5, 2025 -
హీరో సూర్య 'అగరం ఫౌండేషన్' 15 ఏళ్ల సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రూ.10 కోట్లు దానం చేసిన హీరో సూర్య
తమిళ హీరో సూర్య మంచి మనసు చాటుకున్నాడు. గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన హిట్ పడట్లేదు. రీసెంట్ గా రెట్రో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తెలుగులో తేలిపోయింది గానీ తమిళంలో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడు తన చిత్రానికి వచ్చిన లాభాల నుంచి ఏకంగా రూ.10 కోట్లని సూర్య దానం చేశాడు. (ఇదీ చదవండి: సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2') రెట్రో సినిమాలో సూర్య హీరోగా నటించాడు. ఇతడికి చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా రూ.104 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే లాభాలు రావడంతో హీరో కమ్ నిర్మాత అయిన సూర్య ఫుల్ హ్యాపీ అయిపోయాడు. తనకు చెందిన అగరం ఫౌండేషన్ కి రూ.10 కోట్లు దానం చేశాడు. ఈ మేరకు నిర్వహకులకు చెక్ అందజేశాడు.2006లో అగరం ఫౌండేషన్ ని సూర్యనే స్థాపించాడు. తమిళనాడులో చదివించే స్థోమత లేని చాలామంది పిల్లలని చదివించడమే ఈ సంస్థ ఉద్దేశం. ఇప్పటికే చాలామంది అగరం ద్వారా చదువుకుని ప్రయోజకులు అయ్యారు.(ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత) -
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్గా నటించింది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మే 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్సో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం పౌండేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.హైదరాబాద్‌లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ చూసి తాను స్ఫూర్తి పొందినట్లు సూర్య వివరించారు. మెగాస్టార్‌ను ఆదర్శంగా తీసుకుని చెన్నైలో అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు సూర్య వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను సందర్శించిన తర్వాత తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.సూర్య మాట్లాడుతూ.. 'ఇదంతా ఇక్కడే మొదలైంది. ఇక్కడ ఒకరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి వెళ్లాను. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. " అన్నారు. ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించేందుకు మీరు నాకు శక్తిని, ధైర్యాన్ని అందించారు. మీ వల్ల ఎనిమిది వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు అయ్యారు. మీ అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. తన ఫౌండేషన్ కోసం తెలుగు వారి నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఐదేళ్ల క్రితం అగరం ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ కోసం యుఎస్‌లో ఉన్నా. అక్కడ ఉన్న తమిళ విద్యార్థుల కోసం తెలుగు మాట్లాడే వారి నుంచే ఎక్కువ నిధులు వచ్చాయి. తెలుగు ప్రజలు చాలా దయగల హృదయం ఉన్న వ్యక్తులు. వారు ఇప్పటికీ తమిళ విద్యార్థుల చదువుకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయంలో మీపట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నా' అని అన్నారు. కాగా.. ఈ సినిమా నాని నటించిన హిట్-3 మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
అగరం కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో సూర్య-జ్యోతిక (చిత్రాలు)
-
వేదికపైనే కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య
-
వేదికపైనే కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య
చెన్నై : స్టార్ హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా.. ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారనే సంగతి తెలిసిందే. అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన ఈ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఇటీవల చెన్నైలో అగరం ఫౌండేషన్ తరఫున రెండు పుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయత్రి అనే అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను.. తన చదువుకు అగరం ఫౌండేషన్ ఎలా సహాయం చేసిందో వివరించారు. ‘మాది తంజావూరులోని ఓ చిన్న పల్లెటూరు. పదో తరగతి వరకు ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. అమ్మ దినసరి కూలీగా పనిచేసేది. నాన్న క్యాన్సర్‌తో బాధపడుతుండేవారు. అయితే పదో తరగతి పూర్తయ్యాక.. ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా కూలీ పనికి పోతానని అమ్మకు చెప్పాను. కానీ అమ్మ మాత్రం మా లాగా నువ్వు కష్టపడకూడదు.. బిచ్చమెత్తుకోని అయిన నిన్ను చదివిస్తానని చెప్పింది. ఆ తర్వాత నేను అగరం ఫౌండేషన్‌లో చేరాను. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే నాన్న చనిపోయారు. అప్పుడు చదువు మానేద్దామని అనుకున్నాను. కానీ అమ్మ నీ కోసం నువ్వు చదవాలని చెప్పింది. చాలా మంది ఇక్కడ నన్ను ఎగతాళి చేశారు. అగరం సాయంతో కాలేజీ విద్యను పూర్తిచేశాను. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. నా జీవితంలో వెలుగులు నింపిన అగరానికి, సూర్య అన్నకు కృతజ్ఞత తెలుపుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను’ అని గాయత్రి తెలిపారు. అయితే గాయత్రి తన కథ చెబుతున్న సమయంలో వేదికపైనే ఉన్న సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. గాయత్రి వద్దకు వచ్చి అప్యాయంగా పలకరించడంతో పాటు ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు సూర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ.. అగరం ఫౌండేషన్‌కు తోడుగా నిలుస్తున్న వాలంటీర్లకు, దాతలకు, పలు విద్యాసంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. -
50, 60 కథలు విన్నాను కానీ..
తమిళసినిమా: తన అగరం ఫౌండేషన్ ద్వారా పలువురికి విద్యాదానం చేస్తున్న నటుడు సూర్య. హీరోగా ప్రముఖ స్థానంలో కొనసాగుతున్న ఈయన ఇప్పుడు నిర్మాతగానూ రాణించాలన్న నిర్ణయంతో 2డి ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా తన భార్య ప్రధాన పాత్రలో నటించిన 36 వయదినిలే చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు. తాజాగా పాండిరాజ్ దర్శకత్వంలో పసంగ-2 చిత్రం, తాను హీరోగా మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో 24 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీటిలో పసంగ-2 చిత్రం ఈనెల 27న తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి సూర్య మాట్లాడుతూ విద్య, బాలల ఇతివృత్తాలతో మంచి చిత్రాలు నిర్మించాలన్న ఉద్దేశంతో తన పిల్లలు దియా, దేవ్ పేర్లు కలిసే విధంగా 2డి ఎంటర్టెయిన్మెంట్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించానన్నారు. ఈ సంస్థలో చిత్రం చేయడానికి సుమారు 50, 60 కథలు విన్నా మంచి కథ అమరలేదన్నారు. అలాంటి సమయంలో దర్శకుడు పాండిరాజ్ ఒక సీడీ ఇచ్చి ఇలాంటి కథతో మీ సంస్థలో చిత్రం చేస్తే బాగుంటుందని అన్నారన్నారు. బాలల గురించి ఆయన రెండేళ్ళు పరిశోధన చేసి తయారు చేసిన కథ అదని తెలిపారు. ఇలాంటి కథతో చిత్రం చేయాలన్నది తన ఉద్దేశం కావడంతో పసంగ-2 చిత్రాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. ఇందులో పలువురు బాలబాలికలు ప్రధాన పాత్రలు పోషించారని చెప్పారు.తాను ఒక సాధారణ వ్యక్తిగా నటించినట్లు తెలిపారు. చిత్రం చూసిన ప్రేక్షకులు ఒక మంచి ప్రయోజనకరమైన అంశాన్ని గ్రహిస్తారని సూర్య పేర్కొన్నారు. అమలాపాల్, బింధుమాదవి ముఖ్యపాత్రల్ని పోషించిన పసంగ-2 చిత్రం ఈ నెల 27 తెరపైకి రానుంది. సూర్య హీరోగా నటిస్తున్న 24 చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్లను ఈ నెల 24న విడుదల చేయనున్నారు.