
హీరో అంటే సినిమాల్లో ఒక్క దెబ్బకు పదిమంది రౌడీలను గాల్లోకి ఎగిరేలా కొట్టడమేనా.. హీరో అంటే హీరోయిన్తో రొమాన్స్ చేయడమేనా.. హీరో అంటే ఖర్చులేని కబుర్లు చెప్పడమేనా.. పైసా ఖర్చులేకుండా రక్తదానం.. అవయవదానం.. ట్రాఫిక్ రూల్స్ అంటూ ఉచిత సలహాలు ఇవ్వడమేనా.. ఆదాయపు పన్నులు ఎగ్గొట్టేసి .. రాజకీయ నాయకులతో అంటకాగుతూ సొంత లాభాలు చూసుకోవడం కాదు.. ఎక్కడికక్కడ చిల్లర పాలిటిక్స్ చేస్తూ తమకు నచ్చనివాళ్లను తొక్కేసి నచ్చేవాళ్లకు మాత్రమే సినిమా ఛాన్సులు వచ్చేలా ఇండస్ట్రీ పాలిటిక్స్ చూడడం కూడా కాదు.. అభిమాన సంఘాలను రెచ్చగొట్టి తమ ఇమేజి కాపాడుకుంటూ హీరోయిజం వెలగబెట్టడం అసలే కాదు.
మరి హీరో అంటే ఏమిటి ? తాను సంపాదించిన రూపాయితో పదిపైసలు ఈ సమాజం కోసం తిరిగి ఇచ్చేవాడు హీరో.. ఒక సాధారణమైన తనను హీరోలా నిలబెట్టి గుండెల్లో గుడికట్టి ఆరాధిస్తున్న అభిమానులకు .. సమాజానికి తనవంతుగా తిరిగి ఇస్తున్నవాడు అసలైన హీరో.. అలాంటి హీరో తమిళ సూపర్ స్టార్ సూర్య..
వందల్లో డాక్టర్లు... వేలల్లో ఇంజినీర్లు
అగరం ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన సూర్య పేదల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ చదువుకోవాలని ఉన్నా ఆ ఆశ తీరని పేద పిల్లలకు తోడ్పాటును అందిస్తూ వస్తున్నారు.
అగరం ఫౌండేషన్ – విద్య ద్వారా జీవన మార్పు
చెన్నైలో 2006లో మొగ్గ తొడిగిన ఈ అగరం అగరం ఫౌండేషన్, తమిళనాడులోని పేద, వెనుకబడిన సామాజిక వర్గాల విద్యార్థులకు ఆశాకిరణంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను బడివైపు నడిపించే బాధ్యత ఈ సంస్థ చేపట్టింది. దాదాపు పదోహేనేళ్ళుగా ఈ మహాయజ్ఞంలో ఉన్న ఈ సంస్థ ఇప్పటికి దాదాపు ఏడువేల మంది వరకు పేద విద్యార్థులను బడివైపు నడిపించింది. ఈ ఫౌండేషన్ సాయంతో చదువుకున్న వారిలో దాదాపు 1800 మంది ఇంజినీర్లుగా ఎదిగారు .. మరో 51 మంది పేద పిల్లలు ఏకంగా డాక్టర్లు అయ్యారు. గతంలో సంస్థ వార్షికోత్సవంలో సూర్య పాల్గొనగా ఒక విద్యార్ధి మాట్లాడుతూ తన ఆశను కళలను నెరవేర్చింది సూర్య సార్ అని చెబుతూ.. తన కలలకు సూర్య సార్ రెక్కలు తొడిగి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించారని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అదే కార్యక్రమంలో ఉన్న సూర్య కళ్ళలోంచి కూడా కన్నీరు ధారాపాతంగా కారడం .. ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే. ఉంది. ఇంకా వీరే కాకుండా వందలమంది రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఇంకొన్ని వేలమంది వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు.
ప్రాధమిక విద్య అందించడమే కాకుండా ఉన్నత విద్య.. సాంకేతిక విద్య ఆర్జించాలనుకునే విద్యార్థులకు ఈ సంస్థ చేదోడుగా నిలుస్తోంది. పేదింటి పిల్లల ఆశల సౌధం నిర్మించుకునేందుకు అగరం ఒక్కో ఇటుకనూ పేరుస్తూ వస్తోంది. దీంతోబాటు దాదాపు 400 స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించింది ఈ సంస్థ . కరోనా సమయంలో తంజావూరులో ప్రభుత్వ ఆస్పత్రికి రూ. 25 లక్షల వైద్యపరికరాలు అందించారు. దీంతోబాటు అంతర్యుద్ధం.. ఆకలి పేదరికంతో పోరాడుతూ పొట్టచేతబట్టుకుని శ్రీలంక నుంచి వస్తున్నా శరణార్ధుల పిల్లలకు సైతం స్కాలర్షిప్ అందిస్తున్నారు.
మనలో ఒకడిని సమాజం ఉన్నతంగా చూస్తుంటే సహించలేదు ఈ సమాజం.. అయన సేవల్లోని గొప్పతనానికి బదులుగా అందులో లోపాలు వెతికే రోజులివి.. కానీ సూర్య సేవలను కమల్ హాసన్ వంటి నటులు ఇది ఒక మౌనవిప్లవం.. నిశ్శబ్దంగా సమాజాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు అంటూ సూర్య చేపట్టిన ఈ దీక్షను కొనియాడారు. ఇంకో చిత్రం ఏమంటే ఇక్కడ చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లిన ఇంజినీర్లు.. డాక్టర్లు తాము కూడా సామాజిక బాధ్యతల్లో తలా ఓ చేయి వేస్తున్నారు. తమ వంతుగా వారు కూడా మరి కొందరు పేద పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. సూర్య, కార్తీల తండ్రి శివ కుమార్ వేసిన ఈ చిన్న మొక్కను ఇప్పుడు సూర్య, కార్తీ మహా వృక్షంగా మలిచారు. ఆ వృక్షం కింద వేలమంది అందండంగా చదువుకుంటూ తమ జీవితాలను వెలుగులవైపు నడిపిస్తున్నారు.
Suriya Karthi Kamal #Karthi #Kamal #Suriya #Agaram pic.twitter.com/UvznU8OXPM
— 𝙰𝚛𝚓𝚞𝚗 (@GaneshC32674824) August 5, 2025