కోలీవుడ్ స్టార్ అజిత్ జీవితం ఆధారంగా వస్తోన్న మూవీ గ్లాడియేటర్స్. ఆయన సినిమాలతో పాటు కార్ రేసింగ్‌లోనూ దూసుకెళ్తున్నారు. అజిత్ రేసింగ్ జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో అజిత్ కార్ రేస్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో అజిత్ జర్నీ గురించి ఆయన సతీమణి కూడా మాట్లాడారు. రేసింగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ట్రైలర్‌లోని కార్ రేసింగ్ సన్నివేశాలు సైతం అజిత్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దాదాపు గంటన్నర రన్‌టైమ్‌తో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అజిత్ రియల్ రేసింగ్ ఈవెంట్ ఫుటేజీ కూడా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


