వీకెండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై నాగ్‌ సీరియస్..! | Bigg Boss Telugu 10 Day 13 Promo: Nagarjuna Warns Krishna, Srushti Over Their Game | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu: వీకెండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఆ ఇద్దరిపై నాగ్‌ సీరియస్..!

Sep 19 2026 7:04 PM | Updated on Sep 19 2026 7:21 PM

Bigg Boss Telugu Seasin 10 latest Promo Out Now

ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్‌ మరింత రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్సీ రేస్ ముగియడంతో ఎలిమినేషన్‌ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌లో కొంతైనా క్లారిటీ వచ్చే అవకాశముంది. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో నాగార్జున కంటెస్టెంట్స్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హౌస్‌లో సృష్టి ఫ్లైయింగ్ కిస్‌ ఇవ్వగా.. ఆట బాగా ఆడితే తానే కిస్ ఇస్తానంటూ కౌంటరిచ్చాడు. ఈ వీక్‌లో కృష్ణుడు, సృష్టి ఆటతీరుపై నాగ్ అగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరిని వెనకవైపు కూర్చోబెట్టి పనిష్‌మెంట్ ఇ‍చ్చాడు. మీరిద్దరు కేవలం ప్రేక్షకుల్లాగే వీక్షించాలని నాగ్ అన్నారు. ఈ ‍ప్రోమోలో నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. నాని మూవీ ది ప్యారడైజ్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ప్రోమో ఇవాల్టి ఎపిసోడ్‌పై బిగ్‌బాస్‌ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement