అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఇట్లు అర్జున. ఈ మూవీతోనే అనీశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లవ్ ఎంటర్‌టైనర్‌కు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మొదటి సినిమాగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ చూస్తే భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ టీజర్‌లో సన్నివేశాలు కామెడీతో పాటు థ్రిల్ పంచేలా ఉన్నాయి. ఈ మూవీ అక్టోబర్ 30న థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.
Arjun & Keerthi welcomes you to their world filled with love, silence & a hint of madness ❤️🔥#ItlluArjuna Teaser Out Now!
— https://t.co/UlrwGqDjQI
THIS OCTOBER 30th, 𝘩𝘪𝘴 𝘭𝘰𝘷𝘦 𝘸𝘪𝘭𝘭 𝘣𝘦 𝘩𝘦𝘢𝘳𝘥 𝘪𝘯 𝘵𝘩𝘦𝘢𝘵𝘦𝘳𝘴 𝘸𝘰𝘳𝘭𝘥𝘸𝘪𝘥𝘦 🫶💥
A @MusicThaman Musical… pic.twitter.com/ZmNVv1RAZu— What Next Entertainments (@WhatNextEnts) September 19, 2026


