తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ముగ్గురు కోతులు’.కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్షిక పాశం హీరోయిన్‌గా నటించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మాస్ ఆడియెన్స్‌కి నచ్చే మంచి ఐటం నంబర్‌ను విడుదల చేశారు.
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కో కో కొకొరొకో’ అంటూ సాగే స్పెషల్ ఐటం సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ముగ్గురు కోతులు’ చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

‘కోకో కొకొరొకో’ అంటూ సాగే ఈ పాటకు జగదీష్ అందించిన సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది. సుహాస్ ఇచ్చిన బాణీ అయితే శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. లాస్య ప్రియ ఆలపించిన పాట కుర్రకారుకి ఇన్ స్టంట్‌గా ఎక్కేసేలా ఉంది. ఈ సాంగ్‌లో ముగ్గురు హీరోలు, వారితో పాటు స్టెప్పులు వేసిన నటీమణి, ఆమె అందాలు హైలెట్ కానున్నాయి. వినోద్, రఘు, సాయి కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్లో బ్లాస్ట్ కానుంది.


