బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడిన ఈ భామకు ఇప్పటికే ఓ దువా అనే కూతురు ఉన్నారు. రెండో సారి కూడా కూతురే పుట్టడంతో ఈ జంట ఆనందం మరింత రెట్టింపైంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు.
కాగా.. ఈ బాలీవుడ్ జంట 2018లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. వీరికి 2024లో మొదటిసారి కూతురు జన్మించగా.. దువా అనే పేరు పెట్టారు. తాజాగా మరోసారి ఈ దంపతులకు కూతురు జన్మించడంతో ఆనందంలో మునిగిపోయారు. ఇక సినిమాల విషయానికొస్తే రణ్‌వీర్ సింగ్ దురంధర్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు.


