నా కొడుకు మీద కేసెయ్యాలి! | pallaburusu movie trailer released | Sakshi
Sakshi News home page

నా కొడుకు మీద కేసెయ్యాలి!

Aug 8 2026 3:00 AM | Updated on Aug 8 2026 3:00 AM

pallaburusu movie trailer released

సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌

‘సేటూ... నా కొడుకు మీద కేసెయ్యాలి’ అంటూ ‘బలగం’ మూవీ ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి చెప్పే డైలాగ్‌తో ‘పళ్ళ బురుసు’ మూవీ ట్రైలర్‌ మొదలైంది. సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్, ప్రజ్వల్, గోమతి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పళ్ళ బురుసు’. ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఆదిత్య పిట్టీ, వివేక్‌ కృష్ణని, అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. 

శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నాకు పళ్ళ బురుసు (టూత్‌ బ్రష్‌) కొనియ్యలే... పెట్టండి సేటూ కేసు పెట్టండి’, ‘మీరు రోజూ గా పళ్ళ బురుసుతోనే పండ్లు తోముతారా? గందుకనే మస్తు తెల్లగున్నయ్‌’ అంటూ సుధాకర్‌ రెడ్డి, ‘కేసే... మీ మామనే నా మీద కేసు ఏసుండు’, ‘నా ఇజ్జత్‌ తీయనీకే ఉన్నవ్‌ నువ్వు’, ‘ఏమైనా సరే నేను హైకోర్టుకు ΄ోతా’ అంటూ మురళీధర్‌ గౌడ్‌ చెప్పే డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. కిరణ్‌ మచ్చా, ప్రజ్వల్‌ యాద్మ, గోమతి రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వినోద్‌ కె. బంగారి, సంగీతం: పవన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement