మళ్లీ వివాదం.. సుమలత తీరుపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహం | Film Federation Fire On Johny Master Wife Sumalatha, Cuts Support To Dancers Association Over Unilateral Decisions | Sakshi
Sakshi News home page

Film Federation: మళ్లీ వివాదం.. సుమలత తీరుపై ఫెడరేషన్ ఆగ్రహం

Aug 7 2026 9:19 PM | Updated on Aug 8 2026 10:52 AM

Film Federation Fire On Johny Master wife Sumalatha

టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ భార్య సుమలత తీరును ఎండగడుతూ లేఖ విడుదల చేసింది. చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ నిర్ణయాలను ధిక్కరిస్తూ మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిల్మ్ ఫెడరేషన్ ఆరోపించింది.

సస్పెండ్ చేసినా సభ్యులను కలుపుకుపోవాలని కౌన్సిల్ సమావేశంలో అందరం నిర్ణయం తీసుకోని మీకు అవకాశం ఇచ్చామని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ రోజు నుంచి మీకు ఫెడరేషన్ ఎటువంటి సహాయసహకారాలు అందించమని ఫిల్మ్ ఫెడరేషన్ తీర్మానించింది.  మీ అసోసియేషన్‌ సమస్యల పరిష్కారం లో ఫెడరేషన్ ఎటువంటి బాధ్యత తీసుకోదని లేఖలో పేర్కొంది. ఫిల్మ్ ఛాంబర్‌తో జరిగే వేతనాల అగ్రిమెంట్ విషయంలో ఫెడరేషన్ ఎటువంటి సపోర్ట్ చేయదని తెలిపింది. ఫెడరేషన్ నిర్ణయంతో మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా డాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయనిరాకరణ కొనసాగనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement