కొరియన్ కనకరాజుతో మరో హిట్.. టాలీవుడ్ లక్కీ ఛార్మ్‌ రితికా! | Ritika Nayak gets another Hit with Varun tej Korean Kanakaraju Movie | Sakshi
Sakshi News home page

Ritika Nayak: టాలీవుడ్ లక్కీ ఛార్మ్‌గా రితికా.. వరుస బ్లాక్‌బస్టర్లతో క్రేజీ ఆఫర్లు!

Aug 7 2026 9:05 PM | Updated on Aug 7 2026 9:05 PM

Ritika Nayak gets another Hit with Varun tej Korean Kanakaraju Movie

తెలుగు సినీ ప్రియులను తన అందం, అభినయంతో కట్టిపడేస్తోంది భామ రితికా నాయక్. ఇటీవల వచ్చిన 'కొరియన్ కనకరాజు చిత్రంతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఓ వైపు మెస్మరైజ్ చేసే అందం, మరోవైపు పాత్రలో లీనమయ్యే నటనతో రితికా థియేటర్లలో మ్యాజిక్ చేస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతుండటంతో, టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను నిర్మాతలు లక్కీ ఛార్మ్‌గా భావిస్తున్నారు. ఈ చిన్నదాని గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ కాదని.. ప్రాజెక్ట్‌కి ప్లస్ పాయింట్ అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందం ఉన్నచోట అభినయం ఉండదు అంటారు, కానీ రితికా నాయక్ ఆ మాటను తప్పుగా నిరూపించింది. 'కొరియన్ కనకరాజు' మూవీలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. క్యూట్ లుక్స్, సహజమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో తన పాత్రకు ఒదిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ భామ మరిన్ని పెద్ద ప్రాజెక్టుల్లో మెరిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement