breaking news
film federation
-
ఆ కండీషన్స్ ఒప్పుకుంటేనే వేతనాల పెంపు: నిర్మాత దిల్ రాజు
ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలు, ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ చర్చలు ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఇవాళ జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో సినీ వర్కర్స్ సమ్మె యథావిధిగా కొనసాగనుంది. నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య కొన్ని ప్రతిపాదనలపై సయోధ్యం కుదరలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి భేటీ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమావేశానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరై మాట్లాడారు.ఈ చర్చలపై దిల్ రాజు మాట్లాడుతూ... ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్ , నిర్మాతల మధ్య మీటింగ్ జరిగింది. వేతనాల పెంపు, నిర్మాతల వైపు నుంచి రెండు వర్కింగ్ కండీషన్స్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. ఆ షరతులకు ఒప్పుకుంటేనే వేతనాలను పెంచుదామని నిర్మాతలు చెప్పారు. మరోసారి చర్చలు జరుగుతాయి. ఎందుకంటే ఇద్దరినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. రూ.2 వేల కన్నా తక్కువ వేతనం తీసుకునే వారికి ఒక పర్సంటేజీ ఆఫర్ చేస్తున్నాం. దాని కన్నా ఎక్కువ వేతనం తీసుకునే వాళ్లకు మరొక పర్సంటేజీ ఇవ్వాలని ప్రతిపాదించాం. ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్లతో మాట్లాడుకుని వస్తే సమస్య పరిష్కరిస్తాం' అని అన్నారు.రేపటి నుంచి చర్చలు కూడా కొనసాగుతాయని నిర్మాత సి కల్యాణ్ తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా మీటింగ్స్ జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ మూడు యూనియన్లకు పర్సంటేజ్ పెంచలేమని అన్నారు. సమ్మె కొనసాగించెందుకు నిర్మాతలు సైతం సిద్దమేనని ఆయన ప్రకటించారు. -
నిర్మాతల సమస్యను కూడా అర్థం చేసుకోవాలి: కోమటిరెడ్డి
తాము ఎప్పటికీ కార్మికుల పక్షానే ఉంటామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పట్టు, విడుపులు వదిలిపెట్టి సమస్యను పరిష్కరించుకోవాలని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులకు సూచించారు. నిర్మాతల సమస్యను కూడా అర్థం చేసుకోవాలని.. మొండి పట్టుదలకు పోతే మీరే నష్టపోతారని తెలిపారు. టాలీవుడ్లో నెలకొన్న సమస్యపై ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు.విడతలవారీగా వేతనాల పెంపుకు అంగీకరించాలని నిర్మాతల మండలికి మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రేపు మరోసారి ఫిలిం ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. మీరు సమ్మె చేస్తే చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని.. మీరు నిర్మాతల మండలి కలిసి కమిటీగా ఏర్పాటు కావాలన్నారు. ఒకే సారి పెంచాలంటే ఎవరికైనా ఇబ్బందేనని.. వెంటనే సమ్మెలు విరమించి పనిలోకి దిగాలని మంత్రి కోరారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.మా పరిస్థితి వివరించాం: ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులుమా పరిస్థితిని మంత్రికి వివరించామని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. పలు అంశాలకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మేము చెప్పిన సమస్యలపై నిర్మాతలతో మంత్రి ఫోన్ చేసి మాట్లాడారని వెల్లడించారు. రేపటి సమావేశానికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ వస్తానని చెప్పారని.. ఫిల్మ్ ఛాంబర్ భేటీలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపటి భేటీలో మా తరపున కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు. -
సినీ కార్మికుల వేతన పెంపుపై నిర్మాతలు క్లారిటీ
గత కొన్నిరోజులుగా టాలీవుడ్లో నిర్మాతలు vs సినీ కార్మికులు అనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వర్కర్స్ యూనివర్స్ సమ్మె చేస్తున్నారు. అటు నిర్మాతలు గానీ ఇటు యూనియన్స్ గానీ ఎవరూ కూడా తగ్గట్లేదు. దీంతో తర్వాత ఏం జరుగుతుందా అని అందరూ చూస్తున్నారు. ఇలాంటి టైంలో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఫిల్మ్ ఛాంబర్లో కలిసి మాట్లాడుకున్నారు. అనంతరం మీడియా సమావేశం పెట్టి వేతన పెంపు గురించి క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్)రోజుకి రూ.2000, అంతకు లోపు గానీ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంచడానికి అంగీకరించారు. అలానే రోజుకి రూ.1000 లేదా అంతకంటే తక్కువ వేతనం తీసుకుంటున్న కార్మికులకు మొదటి ఏడాది 20% రెండవ ఏడాది 0%, మూడో ఏడాది 5% వేతనం పెంచడానికి నిర్మాతలు సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే నిర్మాతలు పెట్టిన కండిషన్స్‌కు ఫెడరేషన్ అంగీకరిస్తేనే ఈ వేతన పెంపునకు నిర్మాతలు అంగీకరిస్తారని నిర్మాతల మండలి పేర్కొంది.నిర్మాతల వైపు నుంచి వేతన పెంపుపై స్పష్టత వచ్చింది. మరి వర్కర్స్ యూనియన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ') -
నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
ప్రస్తుతం టాలీవుడ్లో గందరగోళ వాతావరణం నెలకొంది. తమకు 30 శాతం వేతనాలు పెంచి ఇచ్చేంతవరకు షూటింగ్స్‌కి హాజరయ్యేది లేదని వర్కర్స్ యూనియన్స్ స్ట్రైక్ చేస్తున్నాయి. దీనికి పలువురు నిర్మాతలు సమ్మతించడం లేదు. ఈ విషయమై పలువురు ఫెడరేషన్ సభ్యులు.. చిరంజీవిని శనివారం కలిశారని, ఈ మేరకు చిరు వీళ్లకు హామీ ఇచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా చిరంజీవినే స్పందించారు. అసలు ఏం జరుగుతుందో చెప్పుకొచ్చారు.'ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులం అని చెప్పుకొంటున్న కొందరు వ్యక్తులు.. మీడియాలోకి వెళ్లి నేను వారిని కలిసి 30 శాతం వేతన పెంపు తదితర డిమాండ్లకు అంగీకరించానని తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ఆ విషయం నా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా అసలు నిజమేంటో చెప్పాలనుకుంటున్నాను. ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ నేను కలవలేదు. ఇది ఇండస్ట్రీకి సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా, ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం, పరిష్కారం చూపడం సాధ్యం కాదు'(ఇదీ చదవండి: మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ')'తెలుగు చిత్రసీమలో ఫిల్మ్ ఛాంబర్ అగ్రసంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత. అంతవరకు అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఇలాంటి అసత్య ప్రకటనలని నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి' అని చిరంజీవి తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు-ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్య తేలేంత వరకు షూటింగ్స్ చేయొద్దని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. అలానే ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతోనూ సంప్రదింపులు జరపొద్దని పేర్కొంది.(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్) -
కాసేపట్లో ఫిల్మ్ ఫెడరేషన్ నేతలతో కోఆర్డినేషన్ కమిటీ భేటీ
-
నిర్మాత విశ్వప్రసాద్.. మాపై కేసులు పెట్టడం దారుణం!
టాలీవుడ్లో ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మె నడుస్తోంది. తమ జీతాలు 30 శాతం వరకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అటు నిర్మాతలు ఇటు వర్కర్స్ ఎవరూ తగ్గట్లేదు. అయితే ఈ వివాదంలో నిర్మాత విశ్వప్రసాద్ తీరుపై ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందనే దశలో విశ్వప్రసాద్ తమపై కేసులు వేయడం దారుణం అని మండిపడ్డారు. సినీ కార్మికులు అందరూ విశ్వప్రసాద్ తీరుపై చాలా కోపంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?)ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తనకు రూ.కోటిన్నర నష్టం వచ్చిందని, దీన్ని ఫెడరేషన్ సభ్యులు భరించాలని టీజీ విశ్వప్రసాద్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎక్కడ కూడా వారిని డిస్ట్రబ్ చేయలేదు, డిమాండ్ చేయలేదు కానీ తమపై పని కట్టుకుని కేసులు వేయడం బాధాకరం అని అన్నారు. విశ్వప్రసాద్ సినిమాలు తీస్తున్నారు కానీ సరైన ప్లానింగ్ లేదని, ఆయన వేసిన కేసుల్ని తమ లీగల్ టీమ్ చూసుకుంటుందని పేర్కొన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఛాంబర్ వరకు కార్మికులు అందరం ధర్నా చేస్తాం అని తెలిపారు.(ఇదీ చదవండి: మొన్న నేషనల్ అవార్డ్.. ఇప్పుడు తెలుగు సింగర్ రోహిత్ నిశ్చితార్థం) -
టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..!
తెలుగు సినిమా ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లేఖను విడుదల చేసింది. దాదాపు 30 శాతం వేతనం పెంచిన వారి షూటింగ్స్‌కు మాత్రమే వెళ్లాలని తెలిపింది. ఇవాళ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.పెంచిన వేతనాలు వెంటనే అమలు చేయాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఏ రోజు వేతనాలు ఆరోజే ఇవ్వాలని కోరింది. 30 శాతం వేతనాలు పెంచి ఇచ్చిన వారికి షూటింగ్‌లకు మాత్రమే పాల్గొనాలని ఫెడరేషన్ నాయకులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న చిత్రాలపై ప్రభావం పడనుంది. -
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం
సాక్షి,హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కొమరం వెంకటేశ్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్‌గా, చిత్రపురి కాలనీ హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కొమరం వెంకటేశ్ పనిచేశారు. ఆయన మృతి పట్ల సినీ కార్మిక సంఘాలు సంతాపం తెలిపాయి. (చదవండి: Sreeleela: ఆహాలో ఆకట్టుకుంటున్న శ్రీలీల కొత్త సినిమా) -
Breaking News: టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్..!
-
ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి : మంత్రి తలసాని
తెలుగు పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మే డే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తలసాని ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా ఉన్నారని, సినీ పరిశ్ర పరిశ్రమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, సినీ కార్మికుల కోసం పెద్ద ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నారని పేర్కొన్నారు. చిత్రపురిలో పాఠశాలలు, ఆస్పత్రికి కావాల్సిన స్థలం ఉందని, ఒకవేళ చిరంజీవి చిత్రపురిలో ఆసుపత్రి నిర్మిస్తే వేలాది కార్మికులకు ఉపయోగం ఉంటుందని తలసాని అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని , ఇల్లు లేని కార్మికులకు చిత్రపురిలో ఇల్లు ఇస్తామని వెల్లడించారు. ఇక సినీ కార్మికోత్సవాన్ని పురస్కరించుకొని 24 విభాగాలకు చెందిన కార్మికులంతా మెగాస్టార్ చిరంజీవిని చిత్ర పరిశ్రమ పెద్దగా ప్రకటించడం విశేషం. చదవండి: నేను చెబితే ఆరోజు షూటింగ్ ఆగిపోయేది: చిరంజీవి -
ఫిలిం ఫెడరేషన్ మేడే ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా చిరంజీవి
మే ఒకటిన హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్లాప్స్ ) తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తుంది. ఈ సందర్బంగా శనివారం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, దర్శకుల సంగం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్లతో పాటు 24 క్రాఫ్ట్ కు సంబందించిన అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా .. దర్శకుల సంఘం అధ్యక్షుడు కాసి విశ్వనాధ్ మాట్లాడుతూ .. అందరికి పండగలు ఉంటాయి ఆలాగే సినిమా ఇండస్ట్రీ కి కూడా ఓ పండగ ఉంటుంది. అదే మేడే. ఆ రోజున గ్రాండ్ గా సినిమా రంగం అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ట్రెజరర్ సురేష్ మాట్లాడుతూ .. ప్రస్తుతం కరోనా బిఫోర్.. కరోనా ఆఫ్టర్ అన్న విధంగా ప్రపంచం మారిపోయింది. ఇప్పుడిప్పుడే అందరూ దాన్నుంచి బయటకొచ్చారు. కరోనా సమయంలో నిత్యావసరాలు దొరకని పరిస్థితిలో చిరంజీవిగారు సీసీసీ ద్వారా నిత్యావసరాల సరుకులు అందించిన ఆయనకు సినిమా రంగ పెద్దలకు, తలసాని గారు కూడా ఎంతో సహకారం అందించారు. వారికి మా ధన్యవాదాలు. కరోనా తరువాత పరిశ్రమ ఏదైనా పెద్ద పండగ అందరం కలిసి జరుపుకోవాలని ఈ ప్లాన్ చేసాం. తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు. -
ఐదు రోజులుగా ఆగిపోయిన సినిమా షూటింగులు
టాలీవుడ్లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య వార్ మళ్లీ మొదలైంది. ఇప్పటికే ఐదు రోజులుగా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో ఈ కేసును లేబర్ కమిషనర్ సుమోటోగా విచారణకు స్వీకరించారు. ఈ సందర్భంగా సీసీఐ అనే కొత్త క్లాజును నిర్మాతలు తెరమీదకు తీసుకొచ్చారు. అయితే, దక్షిణభారత దేశంలోని ఏ ఫెడరేషన్‌లోనూ ఈ క్లాజు లేదని తెలుగు ఫిలిం ఫెడరేషన్ వాదిస్తోంది. ఈ క్లాజు అమలుచేస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటివరకు తాము ఫెడరేషన్ చెప్పినట్లే చేశామని, ఇకమీదట కూడా అలాగే చేస్తూ పోతుంటే మాత్రం భారీగా నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు తెలిపారు. దీంతో ఈవివాదం ఇంకా ఎటూ తేలకుండానే ఆగిపోయింది. -
నేటి నుంచి సమ్మె షురూ!
‘‘గురువారం నుంచి స్ట్రయిక్ చేయడం ఖాయం. ఈ విషయాన్ని మేం ఫిల్మ్‌చాంబర్‌కు తెలిపాం’’ అని ఏ.పి. చలన చిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షులు కొమర వెంకటేశ్ వెల్లడించారు. వేతనాల విషయంలో చిన్న చిత్రాలకు వెసులుబాటు ఇవ్వాలని కోరడం, ఫెడరేషన్ సభ్యులు కాని వారితోనైనా పని చేయించుకునే హక్కు నిర్మాతలకుందనీ ఫిల్మ్‌చాంబర్ పేర్కొనడం సరికాదని వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ -‘‘చిన్న చిత్రాలకైనా, పెద్ద చిత్రాలకైనా కార్మికుల కష్టం ఒకటే. ఇంకా చెప్పాలంటే, పెద్ద చిత్రాలను ఎక్కువ రోజుల్లో తీస్తారు కాబట్టి, రోజుకి తక్కువ సన్నివేశాలే తీస్తారు. కానీ, చిన్న చిత్రాలను తక్కువ రోజుల్లో పూర్తి చేయాలనుకుంటారు గనక, రోజుకి ఎక్కువ సన్నివేశాలు తీస్తారు. ఆ విధంగా చిన్న చిత్రాలకే ఎక్కువ కష్టం ఉంటుంది. కోటి రూపాయల్లోపు తీసేవి మాత్రమే చిన్న చిత్రాలు. కానీ, మూడు నుంచి ఐదు కోట్ల లోపు నిర్మించేవి చిన్న చిత్రాలుగా పరిగణిస్తున్నారు. అది సరికాదు. ఎవరితోనైనా పని చేయించుకోవాలనుకున్నప్పుడు మాతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఎందుకు? 24 శాఖల్లోని వారినే తీసుకోవాలన్నది మా డిమాండ్’’ అని చెప్పారు. దేశం మొత్తం మీద చూస్తే, తెలుగునాటే వేతనాలు బాగున్నాయని కొంతమంది అనడం గురించి ఆయన స్పందిస్తూ -‘‘అది నిజం కాదు. ముంబయ్‌లో ఉదయం ఆరు నుంచి రెండు గంటల వరకు మాత్రమే ఓ కాల్షీట్ ఉంటుంది. కానీ, ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు వరకు ఓ కాల్షీట్. అంటే ముంబయ్‌లో ఒక్క కాల్షీట్ పనికి ఇచ్చే వేతనం ఇక్కడ రెండు కాల్షీట్స్ పనిచేస్తే ఇస్తున్నట్లు లెక్క’’ అని వివరించారు. -
రేపు సినిమా షూటింగులు బంద్
సినిమా షూటింగులన్నింటినీ గురువారం నాడు బంద్ చేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహించాలని ఫిల్మ్ ఫెడరేషన్ కోరింది. ఇతరులు సినిమా షూటింగులలో పాల్గొంటే సహించేది లేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. వేతనాలు పెంచాల్సిందిగా సినీ కార్మికులు ఎన్నాళ్ల నుంచో డిమాండ్ చేస్తున్నా, ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. -
ముదిరిన ఫిలిం ఫెడరేషన్ వివాదం