
తెలుగు సినిమా ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లేఖను విడుదల చేసింది. దాదాపు 30 శాతం వేతనం పెంచిన వారి షూటింగ్స్కు మాత్రమే వెళ్లాలని తెలిపింది. ఇవాళ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పెంచిన వేతనాలు వెంటనే అమలు చేయాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఏ రోజు వేతనాలు ఆరోజే ఇవ్వాలని కోరింది. 30 శాతం వేతనాలు పెంచి ఇచ్చిన వారికి షూటింగ్లకు మాత్రమే పాల్గొనాలని ఫెడరేషన్ నాయకులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న చిత్రాలపై ప్రభావం పడనుంది.