మెగా ఫ్యామిలీ ఇంట మరో సంబురం నెలకొంది. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మరోసారి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో సంతోషం మరింత రెట్టింపైంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే అభిమానులతో పంచుకున్నారు.
అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్..
అయితే ఈ శుభ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సంతోషం సమయంలో ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంపించారు. ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. ఈ బహుమతిపై రామ్ చరణ్ -ఉపాసనకు అభినందనలు. అపోలో నుండి ఈ బహుమతి వచ్చిందని క్యాప్షన్ రాశారు. ఈ మెగా ఫ్యామిలీ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందిని ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.


