రష్మిక- విజయ్ పెళ్లి తేదీపై కన్‌ఫ్యూజన్‌.. కన్‌ఫామ్ చేసినట్టేనా? | Rashmika indirectly confirms her wedding to Vijay Deverakonda on this date | Sakshi
Sakshi News home page

Rashmika: విజయ్‌ దేవరకొండతో పెళ్లి.. ఆ డేట్‌ కన్‌ఫామ్ చేసిన రష్మిక..!

Feb 3 2026 8:35 PM | Updated on Feb 3 2026 9:16 PM

Rashmika indirectly confirms her wedding to Vijay Deverakonda on this date

టాలీవుడ్‌లో ఇప్పుడంతా వీరిద్దరి పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. డేటింగ్‌ నుంచి ఎంగేజ్‌మెంట్‌ వరకు ఫ్యాన్స్‌లో  కన్‌ఫ్యూజన్‌ అలాగే ఉంది. గతేడాది నిశ్చితార్థం జరిగినట్లు వార్తలొచ్చినప్పటికీ ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఎవరి పెళ్లి అనుకుంటున్నారా?  అదేనండి మన రష్మిక- విజయ్ దేవరకొండ జంట గురించే. గత కొద్ది రోజలుగా ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్‌ అంటూ వార్తలు హల్‌ చల్‌ చేశాయి. అంతేకాకుండా ఈనెల 2న రష్మిక- విజయ్ వెడ్డింగ్ అంటూ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిన వీడియో తెగ వైరలైంది. కానీ అదంతా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది.

అయితే తాజాగా మరో మ్యారేజ్ డేట్‌ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తుండగా ఓ అభిమాని ఫోటో తీసుకుంటానంటూ రష్మికను రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే మాస్క్ తొలగించి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్స్‌ చెప్పాడు. దీనికి రష్మిక దేనికి రా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది. వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు. దీనికి రష్మిక క్యూట్‌గా నవ్వుకుంటూ ‍అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్మైల్‌తో పెళ్లి తేదీ ఫిక్సయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు.

గత డిసెంబర్‌లో వచ్చిన సమాచారం ప్రకారం రష్మిక- విజయ్ ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ప్యాలెస్‌లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో తమ సినీ ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే వీటిపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కాగా.. వీరిద్దరు జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement