సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్ | Super Subbu Series Teaser | Sakshi
Sakshi News home page

Super Subbu: ఫన్నీగా 'సూపర్ సుబ్బు' టీజర్.. డిఫరెంట్ కాన్సెప్ట్

Feb 3 2026 6:07 PM | Updated on Feb 3 2026 6:36 PM

Super Subbu Series Teaser

శృంగారం లేదా సె*క్స్ ఎడ్యుకేషన్ అనే పదాలు వింటే చాలు చాలామంది అదేదో బూతులా చూస్తారు. అసలు ఈ పదాలు ఉచ్ఛరించడమే తప్పు అన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ ప్రస్తుత జనరేషన్‌లో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది పలు రకాలుగా అవగాహన తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీశారు. దాని టీజర్ ఇప్పుడు విడుదల చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

'సూపర్ సుబ్బు' పేరుతో తీసిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ముంబైలో మంగళవారం ఓ ఈవెంట్ నిర్వహించిన సదరు ఓటీటీ సంస్థ.. అక్కడ దీని టీజర్ రిలీజ్ చేసిది. కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసింది. టీజర్ బట్టి చూస్తే.. సుబ్బు.. చిన్నప్పటి నుంచి చిలిపి కుర్రాడు. పెద్దయిన తర్వాత కూడా అలానే ప్రవర్తిస్తుంటాడు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడనుకుంటే ఏకంగా 60 మంది అమ్మాయిలు ఇతడిని రిజెక్ట్ చేస్తారు.

మరోవైపు సుబ్బుకి టీచర్‌గా అవకాశమొస్తుంది. కాకపోతే ఓ పల్లెటూరిలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు వెళ్లిన పనిలో సక్సెస్ అయ్యాడా లేదా? అనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. ఈ సిరీస్‌లో సందీప్ కిషన్‌కి జోడీగా మిథిలా పాల్కర్ నటించింది. మురళీ శర్మ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు చేశారు. 

(ఇదీ చదవండి: నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!)

Advertisement
 
Advertisement
Advertisement