breaking news
Super Subbu
-
ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ
ఓటీటీలు చూసే చాలామందికి సినిమాలతో పాటు సిరీస్‌లు కూడా అలవాటే. కాకపోతే హారర్ లేదా థ్రిల్లర్ జానర్లో ఎక్కువగా చూస్తుంటారు. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఆధారంగా చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి. అలాంటి సున్నితమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని తీసిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. నెట్‌ఫ్లిక్‌లో తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతి ఏంటి? ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)కథేంటి?సుబ్రమణ్యం అలియాస్ సుబ్బు(సందీప్ కిషన్).. సికింద్రాబాద్‌లోని గవర్నమెంటు స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్‌గా కాంట్రాక్ పద్ధతిలో పనిచేస్తుంటాడు. ఇతడి నాన్న కుక్కుటేశ్వరరావు(మురళి శర్మ).. హెడ్ మాస్టర్‌గా చేసి రిటైర్ అవుతాడు. అయితే తండ్రి దృష్టిలో సుబ్బు ఓ పనికిరాని వెధవ. కొన్ని కారణాల వల్ల సుబ్బు.. ఆదిలాబాద్‌లోని మాకిపూర్ అనే పల్లెటూరికి సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా వెళ్లాల్సి వస్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకి, పెళ్లి చేసుకోబోయే దివ్య(మానస చౌదరి)కి తెలియకుండా దాచిపెడతాడు. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే తెలియని పల్లెటూరి జనానికి.. సుబ్బు ఇవన్నీ చెప్పగలిగడా? సుబ్బు ఇంట్లో వాళ్ళకు ఇదంతా ఎప్పుడు తెలిసింది? సుబ్బుని ప్రేమించిన స్వాతి(మిథిలా పాల్కర్)ఎవరు? చివరకు ఏమైంది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?హస్త ప్రయోగం, కండోమ్, యోని, ఫ్యామిలీ ప్లానింగ్, వేసక్టమీ, శానిటరీ ప్యాడ్, పునరుత్పత్తి వ్యవస్థ, ఎయిడ్స్ గురించి, ఆడపిల్లలు-మగపిల్లలు పుట్టడం, నెలసరి.. ఈ పదాలు వినగానే అవేదో బూతు అన్నట్టు ఇప్పటికీ చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. బయటకు ఇదంతా మాట్లాడుకూడదు అనే అనుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడే నగరాల్లో వీటన్నింటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. కానీ పల్లెటూళ్లలో మాత్రం ఇప్పటికీ వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం పెద్దగా చేయరు. అలాంటి సెన్సిటివ్ అంశం గురించి చెబుతూ తీసిన సిరీస్ ఇది.సెక్స్ ఎడ్యుకేషన్ అన్నాం కదా అని ఇందులో మొత్తం అవే ఉంటాయి అని మాత్రం అనుకోవద్దు. తొలి రెండు ఎపిసోడ్స్‌లోనే ఇవన్నీ చూపించారు. మిగతా అంతా ఆ పల్లెటూరిలో సుబ్బు ఎలాంటి కష్టాలు పడ్డాడు? అక్కడి మగవాళ్ళు ఇతడిని ఎలా ఇబ్బంది పెట్టారు అని సాగుతుంది. కానీ సిరీస్ ఆద్యంతం ఫుల్ కామెడీగా తీశారు. కాన్సెప్ట్‌కి తగ్గట్టే కంప్యూటర్, పెన్ డ్రైవ్ లాంటి పదాలతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొన్నిచోట్ల వినిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో బూతు లేకుండానూ చెప్పే ప్రయత్నం చేశారు.ఓ సీన్లో మగపిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? అని ఊరి ఆడవాళ్లు.. సుబ్బు పాత్రని అడుగుతారు. వారికి 'ఎక్స్' క్రోమోజోములు, 'వై' క్రోమోజోములు అని సిటీలో చెప్పినట్టుగా చెబితే అర్థం కాదు. అలాంటి విషయాన్ని రెండు పూల కుండీలను తీసుకుని ఇందులో ఉన్నది ఒకటే మట్టి కానీ ఒక దాంట్లో ఒక పూల చెట్టు ఇంకో దాంట్లో ఇంకో పూల చెట్టు ఉంది ఎందుకు? అని అడుగుతాడు. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం మొలకెత్తుతుంది అని మహిళలంతా చెబుతారు. మరి మట్టిని తిడితే ఏం లాభం ఉంటుంది అని అందరికీ అర్థమయ్యేలా సుబ్బు చెబుతాడు.మొత్తం ఏడు ఎపిసోడ్స్‌గా తీసిన ఈ సిరీస్‌లో కాన్సెప్ట్ వినగానే అసభ్యంగా అనిపిస్తుంది గానీ ఎక్కడ ఆ ఛాయలు లేకుండా చాలా జాగ్రత్తగా తీశారు. పల్లెటూరు, అందులో ఉండే మనుషులు.. సెక్స్ అనే దాని పట్ల వాళ్ళకు ఉండే అవగాహన.. మగ పిల్లాడు కోసం పిల్లల్ని కంటూనే ఉండటం, కండోమ్ వాడటం అంటే ఏదో మహాపాపం అన్నట్టు ఫీల్ అయిపోవడం. ఆడవాళ్లకి కూడా దీనిపై కనీస అవగాహన లేకపోవడం లాంటి ఆసక్తికర విషయాలని కామెడీగా చూపించడం బాగుంది. బాగా ప్రెజంట్ చేశారు కూడా. కాకపోతే సుబ్బు పాత్రకు తప్పితే మిగతా ఎవరికీ కనెక్ట్ అవ్వం. ఎందుకో ఆయా పాత్రలతో ఎందుకో ఎమోషన్ ఫీల్ కాలేకపోతాం. ఇక చివరి ఎపిసోడ్స్‌లో కథ కాస్త నెమ్మదించడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం చిన్న మైనస్.ఓ సీన్ లో సుబ్బు.. అనుకోకుండా ఆ ఊరిలో వుండే రజినీ అనే వేశ్య ఇంటి వెళ్తాడు. ఆమెతో తన పరిస్థితి అంతా చెబుతాడు. ఆ టైమ్‌లో ఆమె.. 'నేను చేసే పని బూతు అంటారు కానీ అందులో నేను పని వెతుక్కుంటున్నా.. మీరేమో మీరు చేస్తున్న పనిలో బూతుని చూస్తున్నారు' అనే చెప్పే డైలాగ్ కానీ.. ఓసారి ఊరిలో ఆడవాళ్ళకి క్లాస్ చెప్తూ.. 'అందరికీ జన్మస్థానమైన ప్రదేశం శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గు ఎందుకు అమ్మా' అని శానిటరీ ప్యాడ్స్ ఉపయోగం గురించి చెప్పే డైలాగ్ గానీ సీన్‌కి తగ్గట్లు అనిపిస్తాయి.సుబ్బు జీవితంలోకి మొదట వచ్చే దివ్య క్యారెక్టర్లో స్వార్ధం ఉంటే.. తర్వాత వచ్చే అమ్మాయి క్యారెక్టర్లో ట్విస్టులు బాగుంటాయి. స్వాతి క్యారెక్టర్ అయితే సబ్బుతో ప్రేమలో పడి, కలిసి ఒక్కటయ్యేవరకు వెళ్తుంది. ఈమె పాత్రలో క్యూట్‌నెస్, ఇన్నోసెన్స్, డేరింగ్ లాంటివి కనిపిస్తాయి. అయితే సుబ్బుని జీవితాంతం ప్రతి దానికి భయపెడుతూ, ఒక నిస్సహాయుడుగా చేసేస్తాడు అతడి తండ్రి. చివరకు దాన్ని ఎలా అధిగమించాడనేది ఇందులో ఉంటుంది. ఈ సీన్స్ చాలామంది కుర్రాళ్లకి కనెక్ట్ అవుతాయి.ఎవరెలా చేశారు?యాక్టింగ్ విషయానికి వస్తే సుబ్బుగా సందీప్ కిషన్ అదరగొట్టేశాడు. ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు. చాలా సహజంగా అనిపిస్తుంది. మురళీ శర్మ చేసిన కుక్కుటేశ్వరరావు పాత్ర ఇరిటేషన్ తెప్పిస్తుంది. దివ్య చేసిన మానస చౌదరి ఓకే. స్వాతిగా చేసిన మిథిలా పాల్కర్ మాత్రం చాలా నచ్చేస్తుంది. సంపూర్ణేష్ బాబు ఉన్నాడు. ఉన్నంతలో కామెడీ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. హీరో పక్కనే ఉండే గెటప్ శ్రీను పాత్ర కూడా పర్లేదు. బ్రహ్మానందం రెండు మూడు సీన్స్‌లో కనిపించారు. వేశ్యగా దివ్య పిళ్ళై కనిపించేది కాసేపు అయినా ఇంపాక్ట్ చూపిస్తుంది.రైటర్-డైరెక్టర్ మల్లిక్ రామ్.. సెక్స్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ తీసుకున్నప్పటికీ దాన్ని లైట్ హార్టెడ్ కామెడీగా చూపించి చెప్పడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీకి తగ్గట్టు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఓటీటీలో ఏదైనా కామెడీగా చూద్దామనుకుంటే ఈ సిరీస్ ట్రై చేయండి. అసభ్యకర సీన్స్ ఏం లేవు గాని అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినిపిస్తాయి. ఇదంతా 18 ప్లస్ కంటెంట్ కాబట్టి ఒంటరిగానే చూడండి.-చందు డొంకాన (ఇదీ చదవండి: ‘ఇసకపట్నం’ వెబ్‌సిరీస్ రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి నాగబంధం, రావు బహదూర్ అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇవి రెండు కూడా కంటెంట్ పరంగా కాస్త డిఫరెంట్‌గా ఉండబోతున్నాయనే ఆసక్తి కలిగిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఆలియా భట్ ప్రధాన పాత్ర చేసిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' కూడా ఇదే వారాంతం రిలీజ్ కానుంది. మరి దీని తెలుగు వెర్షన్ విడుదల చేస్తారా అనేది క్లారిటీ లేదు.(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)మరోవైపు ఓటీటీల్లో మాత్రం 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చూడదగ్గవి చాలానే ఉన్నాయండోయ్. సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బ', ఐశ్వర్య రాజేశ్ 'ఇసకపట్నం' లాంటి తెలుగు సిరీస్‌లతో పాటు లేటెస్ట్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ 'అబ్సెషన్' మూవీ ఇదే వారం రానుంది. మాలీవుడ్ టైమ్స్ లాంటి డబ్బింగ్ చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. రామ్ చరణ్ 'పెద్ది' కూడా ఈ వారం డిజిటల్ రిలీజ్ అంటున్నారు. కాకపోతే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూన్ 29 నుంచి జూలై 05 వరకు)నెట్ఫ్లిక్స్సూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - జూలై 02పెద్ది (తెలుగు సినిమా) - జూలై 02 (రూమర్ డేట్)ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 02హ్యుమన్ వెపర్ (జపనీస్ సిరీస్) - జూలై 02స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) - జూలై 05అమెజాన్ ప్రైమ్అబ్సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 30 (రెంట్)ఎల్లే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01ఇసకపట్నం (తెలుగు సిరీస్) - జూలై 02హాట్స్టార్మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 03జీ5మర్మదేశం (తెలుగు సిరీస్) - జూలై 03ముతస్సీ (మలయాళ సిరీస్) - జూలై 03సన్ నెక్స్ట్హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) - జూలై 03ఆహాటాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 03sఆపిల్ టీవీ ప్లస్సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ) -
వినోదాలు పంచే సుబ్రహ్మణ్యం
హీరో సందీప్ కిషన్, హీరోయిన్ మిథిలా పాల్కర్, నటుడు మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని ధోబాల్ రచించిన ఈ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో గెటప్ శ్రీను, మానస చౌదరి, జీవన్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. చిలకా ప్రోడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతి నిర్మించిన ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘సూపర్ సుబ్బు’లో సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు చిల్లుకూరి రావు అనే టీచర్ పాత్ర చేశాను. ప్రజలు మాట్లాడటానికి సంకోచించే అంశాన్ని హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘మానవ సంబంధాలు, పరస్పర అవగాహన వంటి అంశాలను ఎంతో హాస్యంతో చెప్పిన కథ ఇది’’ అన్నారు మిథిలా పాల్కర్. -
'మగ పిల్లాడి కోసం చిట్కా చెప్పండి సార్'.. సూపర్ సుబ్బు ట్రైలర్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఆపీసర్గా ఓ పల్లెటూరికి వెళ్లిన సందీప్ కిషన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అక్షర జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలకు లైంగిక విద్యపై ఎలా అవగాహన కల్పించాడనే కథగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ట్రైలర్లో కామెడీ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.ఈ టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్‌లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషించారు. -
2026పై నెట్‌ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్‌లా?
ఇప్పుడు ఓటీటీ జమానా నడుస్తోంది. ఏ సినిమాని థియేటర్లో చూడాలి? దేన్ని ఓటీటీలో చూడాలని ముందే ఫిక్సయిపోతున్నారు. చిన్న మూవీస్‌ని చాలా వరకు ఓటీటీల్లోనే చూసేందుకు బాగా అలవాటు పడిపోయారు. అందుకే తెలుగు చిన్న చిత్రాల పరిస్థితి దారణంగా తయారైంది. మరోవైపు ఆయా ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్‌తో రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే తెలుగులో, తమిళంలో పేరున్న చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఈ ఏడాది దాదాపు 30 వరకు ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్‌లతో రాబోతుంది. ముంబైలో మంగళవారం సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన ఈ సంస్థ.. 2026లో వచ్చే తమ అప్‌కమింగ్ ప్రాజెక్టుల గురించి బయటపెట్టింది.(ఇదీ చదవండి: మహేశ్‌తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్‌పై క్లారిటీ)ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు', సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' లాంటి సినిమాలతో పాటు చాలానే మూవీస్, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ డబ్బింగ్‌తో రాబోతున్నాయి. హిందీలో మీడియం రేంజ్ స్టార్స్ అందరూ కూడా వీటిలో నటించడం విశేషం. ఇంతకీ ఏ సినిమాలు, సిరీస్‌లు.. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోతున్నాయంటే?తక్షకుడు (తెలుగు సినిమా) - ఆనంద్ దేవరకొండసూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - సందీప్ కిషన్మేడిన్ కొరియా (తమిళ సినిమా) - ప్రియాంక మోహన్లవ్ (తమిళ సిరీస్) - ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ఫ్యామిలీ బిజినెస్ (హిందీ సిరీస్) - అనిల్ కపూర్, విజయ్ వర్మహమ్ హిందుస్థానీ (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, ప్రతీక్ గాంధీహలో బచ్చోన్ (హిందీ సిరీస్) - వినీత్ కుమార్ సింగ్, గిరిజా ఓక్కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - మోనా సింగ్, బరుణ్ సోబ్తితలాష్: ఏ మదర్స్ సెర్చ్(హిందీ సిరీస్) - పరిణీతి చోప్రాఇక్కా (హిందీ సినిమా) - సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నామిస్ మ్యాచ్డ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - ప్రజక్తా కోలీ, రోహిత్ షరాఫ్ముసాఫిర్ కేఫే (హిందీ సిరీస్) - విక్రాంత్ మస్సే, వేదికా పింటోలస్ట్ స్టోరీస్ 3 (హిందీ సిరీస్) - రాధిక ఆప్టే, కొంకన్ సేన్ శర్మటోస్టర్ (హిందీ మూవీ) - రాజ్ కుమార్ రావ్, సన్యా మల్హోత్రామా బెహన్ (హిందీ సినిమా) - మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రిచుంబక్ (హిందీ సిరీస్) - నీనా గుప్తాద గ్రేట్ ఇండియా కపిల్ షో సీజన్ 5 (కామెడీ షో) - కపిల్ శర్మమామ్లా లీగల్ హై సీజన్ 2 (హిందీ సిరీస్) - రవి కిషన్గాంధారి (హిందీ సినిమా) - తాప్సీ, ఇష్వాక్ సింగ్గ్లోరీ (హిందీ సిరీస్) - దివ్యేందు, పులకిత్ సామ్రాట్గోస్కోర్ పండిట్ (హిందీ సినిమా) - మనోజ్ బాజ్‌పాయ్, శ్రద్ధాదాస్లెగసీ (తమిళ సిరీస్) - మాధవన్, అభిషేక్ బెనర్జీకర్తవ్య (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, రషిక దుగల్ఆపరేషన్ సఫేద్ సాగర్ (హిందీ సిరీస్) - సిద్ధార్థ్లాకప్ (రియాలిటీ సిరీస్) - ఏక్తా కపూర్, శోభా కపూర్దిండోరా 2 (హిందీ సిరీస్) - భువన్ బామ్, రోహిత్హే దిల్ సున్ రహా హై (హిందీ సిరీస్) - కపిల్ శర్మదేశీ బ్లింగ్ (హిందీ రియాలిటీ షో) - కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాశ్అక్యూజ్డ్ (హిందీ సిరీస్) -కొంకన్ సేన్ శర్మ, ప్రతిభ రత్న(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్) -
సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్
శృంగారం లేదా సె*క్స్ ఎడ్యుకేషన్ అనే పదాలు వింటే చాలు చాలామంది అదేదో బూతులా చూస్తారు. అసలు ఈ పదాలు ఉచ్ఛరించడమే తప్పు అన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ ప్రస్తుత జనరేషన్లో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది పలు రకాలుగా అవగాహన తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీశారు. దాని టీజర్ ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)'సూపర్ సుబ్బు' పేరుతో తీసిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ముంబైలో మంగళవారం ఓ ఈవెంట్ నిర్వహించిన సదరు ఓటీటీ సంస్థ.. అక్కడ దీని టీజర్ రిలీజ్ చేసిది. కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసింది. టీజర్ బట్టి చూస్తే.. సుబ్బు.. చిన్నప్పటి నుంచి చిలిపి కుర్రాడు. పెద్దయిన తర్వాత కూడా అలానే ప్రవర్తిస్తుంటాడు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడనుకుంటే ఏకంగా 60 మంది అమ్మాయిలు ఇతడిని రిజెక్ట్ చేస్తారు.మరోవైపు సుబ్బుకి టీచర్‌గా అవకాశమొస్తుంది. కాకపోతే ఓ పల్లెటూరిలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు వెళ్లిన పనిలో సక్సెస్ అయ్యాడా లేదా? అనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. ఈ సిరీస్‌లో సందీప్ కిషన్‌కి జోడీగా మిథిలా పాల్కర్ నటించింది. మురళీ శర్మ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు చేశారు. (ఇదీ చదవండి: నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!) -
కొత్త తెలుగు సినిమాలు.. డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే జనాలు వెళ్తూనే ఉన్నారు. కాకపోతే చాలామంది.. ఓటీటీలో రిలీజైన తర్వాతే మొబైల్ లేదా టీవీల్లో కొత్త సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సంస్థలు కూడా కేవలం ఓటీటీల్లో కొన్నింటిని నేరుగా విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు అలానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ దానిలో రాబోయే పలు తెలుగు, తమిళ చిత్రాలు, వెబ్ సిరీసుల గురించి అధికారిక ప్రకటన చేసింది.'ఓజీ'తో రీసెంట్గా హిట్ కొట్టిన ప్రియాంక మోహన్ చేసిన తమిళ మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. గత కొన్నాళ్ల నుంచి కొరియన్ చిత్రాలు, సిరీస్‌లకు చాలామంది అమ్మాయిలు ఫ్యాన్స్ అయిపోతున్నారు. అలాంటి ఓ అమ్మాయి కొరియా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీసినట్లు కనిపిస్తుంది. ఆర్ఏ కార్తీక దీనికి దర్శకుడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)ఆనంద్ దేవరకొండ, 'లాపతా లేడీస్' ఫేమ్ నితాన్షీ గోయల్ జంటగా నటించిన సినిమా 'తక్షకుడు'. వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అనే ట్యాగ్ లైన్‌తో రాబోతుంది. పోస్టర్ చూస్తుంటే ఇదో రూరల్ బ్యాక్ డ్రాప్లో జరిగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో ఆనంద్ దేవరకొండతోనే 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే మూవీ తీసిన వినోద్ అనంతోజు దీనికి దర్శకుడు.సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. మిథిలా పాల్కర్, మురళీ శర్మ ఇతర పాత్రలు చేస్తున్నారు. ఓ టీచర్.. పల్లెటూరికి వెళ్లి స్కూల్లో పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఫన్నీగా చూపించబోతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రాలన్నీ కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయని చెప్పారు. మరి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారా? వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: Bigg Boss 9: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)


