'మగ పిల్లాడి కోసం చిట్కా చెప్పండి సార్'.. సూపర్ సుబ్బు ట్రైలర్ | Sandeep Kishan Super Subbu web series Official Trailer out now | Sakshi
Sakshi News home page

Super Subbu Trailer: 'ఆర్ యూ వర్జిన్'.. ఫుల్ కామెడీగా ట్రైలర్

Jun 24 2026 7:04 PM | Updated on Jun 24 2026 7:08 PM

Sandeep Kishan Super Subbu web series Official Trailer out now

టాలీవుడ్ హీరో సందీప్‌ కిషన్‌, మిథిలా పాల్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు.  ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఆపీసర్‌గా ఓ పల్లెటూరికి వెళ్లిన సందీప్‌ కిషన్‌ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అక్షర జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలకు లైంగిక విద్యపై ఎలా అవగాహన కల్పించాడనే కథగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్‌ ట్రైలర్‌లో కామెడీ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

ఈ టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్‌ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్‌లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement