
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే జనాలు వెళ్తూనే ఉన్నారు. కాకపోతే చాలామంది.. ఓటీటీలో రిలీజైన తర్వాతే మొబైల్ లేదా టీవీల్లో కొత్త సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సంస్థలు కూడా కేవలం ఓటీటీల్లో కొన్నింటిని నేరుగా విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు అలానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ దానిలో రాబోయే పలు తెలుగు, తమిళ చిత్రాలు, వెబ్ సిరీసుల గురించి అధికారిక ప్రకటన చేసింది.
'ఓజీ'తో రీసెంట్‌గా హిట్ కొట్టిన ప్రియాంక మోహన్ చేసిన తమిళ మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. గత కొన్నాళ్ల నుంచి కొరియన్ చిత్రాలు, సిరీస్‌లకు చాలామంది అమ్మాయిలు ఫ్యాన్స్ అయిపోతున్నారు. అలాంటి ఓ అమ్మాయి కొరియా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీసినట్లు కనిపిస్తుంది. ఆర్ఏ కార్తీక దీనికి దర్శకుడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)
ఆనంద్ దేవరకొండ, 'లాపతా లేడీస్' ఫేమ్ నితాన్షీ గోయల్ జంటగా నటించిన సినిమా 'తక్షకుడు'. వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అనే ట్యాగ్ లైన్‌తో రాబోతుంది. పోస్టర్ చూస్తుంటే ఇదో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో ఆనంద్ దేవరకొండతోనే 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే మూవీ తీసిన వినోద్ అనంతోజు దీనికి దర్శకుడు.
సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. మిథిలా పాల్కర్, మురళీ శర్మ ఇతర పాత్రలు చేస్తున్నారు. ఓ టీచర్.. పల్లెటూరికి వెళ్లి స్కూల్లో పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఫన్నీగా చూపించబోతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు.
అయితే ఈ చిత్రాలన్నీ కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయని చెప్పారు. మరి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారా? వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి.
(ఇదీ చదవండి: Bigg Boss 9: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)


