
లక్స్ పాప ఇమేజితో బిగ్‌బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయింది. ఐదో వారంలో బయటకొచ్చేసింది. అయితే ఈమెతో పాటు రీతూ కూడా ఎవిక్షన్ రూంలో ఉన్న టైంలో.. రీతూ నిజంగా ఎలిమినేట్ అయిపోతానేమోనని భయంతో తెగ ఏడ్చేసింది. కానీ ఫ్లోరా బయటకొచ్చేయడంతో రీతూ ఊపిరి పీల్చుకుంది.
తొలివారం సంజనతో గొడవపడి కాస్త హడావుడి చేసిన ఫ్లోరా.. తర్వాత వారం నుంచి మాత్రం చాలా సైలెంట్ అయిపోయింది. గేమ్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోకపోవడం, అలానే హౌస్‌మేట్స్‌తోనూ పెద్దగా ఇంటరాక్ట్ కాకపోవడం లాంటి కారణాలతో ప్రతివారం నామినేట్ అవుతూ వస్తున్నప్పటికీ సేవ్ అవుతూనే వచ్చింది. కామనర్స్ మనీష్, ప్రియ, హరీశ్.. వరస వారాల్లో ఎలిమినేట్ కావడం ఈమెకు కాస్త ప్లస్ అయింది. ఐదో వారం మాత్రం తప్పించుకోలేకపోయింది.
(ఇదీ చదవండి: బర్త్ డే నైట్ మేమిద్దరం మాత్రమే.. అల్లు స్నేహా పోస్ట్ వైరల్)
రెమ్యునరేషన్ విషయానికొస్తే.. వారానికి రూ.2.1 లక్షల చొప్పున ఫ్లోరా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐదు వారాలు ఉన్నందుకుగానూ రూ.10.5 లక్షల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇన్నిరోజులు ఉన్నప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినప్పటికీ.. రెమ్యునరేషన్ పరంగా బాగానే సంపాదించినట్లు కనిపిస్తుంది.
ఇక వెళ్తూవెళ్తూ సంజన, దివ్య, ఇమ్మాన్యుయేల్, శ్రీజకి థమ్ అప్ ఇచ్చింది. భరణి, తనూజకి థమ్స్ డౌన్ ఇచ్చింది. సుమన్ శెట్టిని మాత్రం అటుఇటుకి మధ్యలో పెట్టింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి)