
బిగ్‌బాస్ 9వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఆరుగురు హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ మాధురి అనే కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో గట్టిగానే డిస్కషన్ నడుస్తోంది. దానికి తోడు ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే తన ఎంట్రీ గురించి ఈమె బయటపెట్టేసింది. వైల్డ్‌గా ఉండేవాళ్లే వైల్డ్ కార్డ్‌గా వెళ్తారని, హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నేనేంటో చూపిస్తానని ఛాలెంజ్ చేసింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!)
'వైల్డ్‌గా ఉండేవాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఇలా వెళ్తున్నా. బిగ్‌బాస్ నుంచి కాల్ రాగానే ముందు వద్దని అనుకున్నా, కానీ చాలామంది ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్‌లు వచ్చాయి. ప్లీజ్ మేడమ్ మిమ్మల్ని షోలో చూడాలనుకుంటున్నాం అని చాలామంది అనడం వల్ల వెళ్దామని నిర్ణయం తీసుకున్నాను. అనుభవం, జనాలకు ఇంకా చేరువ కావాలి అనే ఉద్దేశం కూడా నాకు ఉంది' అని మాధురి చెప్పుకొచ్చింది.
'హౌస్‌లో ఉన్నవాళ్లందరూ మాస్క్‌లు వేసుకుని ఉన్నారు. అందరూ యాక్టింగ్ చేస్తున్నారు. ఫేక్ రిలేషన్స్ మెంటైన్ చేస్తూ ఫేక్‌గా ఉంటున్నారు. కొద్దోగొప్పో ఇమ్మాన్యుయేల్ బెటర్‌గా అనిపిస్తున్నాడు. ఉన్నవాళ్లలో ఎవరూ నాకు టఫ్ ఫైట్ ఇస్తారని అనుకోవట్లేదు. ఇకపోతే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కామనర్స్ ఓవరాక్షన్ చేస్తున్నారు. అందుకే ఎలిమినేట్ అయి బయటకొచ్చేస్తున్నారు. ఎన్నిరోజులు ఉంటారనే ప్రశ్నకు బదులిస్తూ.. 'ఒక రోజులో బయటకొచ్చేసినా పశ్చాత్తపపడను. టాప్-5కి వెళ్లినా ఏం అనుకోను. కప్ గెలుచుకున్నా సరే పొంగిపోను. అన్ని టాస్కులు ఆడగలను నేను. నా ఆట నచ్చితే ఓట్లు వేయండి లేదంటే వద్దు' అని షోపై మాధురి తన అభిప్రాయాన్ని చెప్పింది.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)