breaking news
Wild Card Contestants
-
బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి
బిగ్‌బాస్ 9వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఆరుగురు హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ మాధురి అనే కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో గట్టిగానే డిస్కషన్ నడుస్తోంది. దానికి తోడు ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే తన ఎంట్రీ గురించి ఈమె బయటపెట్టేసింది. వైల్డ్‌గా ఉండేవాళ్లే వైల్డ్ కార్డ్‌గా వెళ్తారని, హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నేనేంటో చూపిస్తానని ఛాలెంజ్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!)'వైల్డ్‌గా ఉండేవాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఇలా వెళ్తున్నా. బిగ్‌బాస్ నుంచి కాల్ రాగానే ముందు వద్దని అనుకున్నా, కానీ చాలామంది ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్‌లు వచ్చాయి. ప్లీజ్ మేడమ్ మిమ్మల్ని షోలో చూడాలనుకుంటున్నాం అని చాలామంది అనడం వల్ల వెళ్దామని నిర్ణయం తీసుకున్నాను. అనుభవం, జనాలకు ఇంకా చేరువ కావాలి అనే ఉద్దేశం కూడా నాకు ఉంది' అని మాధురి చెప్పుకొచ్చింది.'హౌస్‌లో ఉన్నవాళ్లందరూ మాస్క్‌లు వేసుకుని ఉన్నారు. అందరూ యాక్టింగ్ చేస్తున్నారు. ఫేక్ రిలేషన్స్ మెంటైన్ చేస్తూ ఫేక్‌గా ఉంటున్నారు. కొద్దోగొప్పో ఇమ్మాన్యుయేల్ బెటర్‌గా అనిపిస్తున్నాడు. ఉన్నవాళ్లలో ఎవరూ నాకు టఫ్ ఫైట్ ఇస్తారని అనుకోవట్లేదు. ఇకపోతే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కామనర్స్ ఓవరాక్షన్ చేస్తున్నారు. అందుకే ఎలిమినేట్ అయి బయటకొచ్చేస్తున్నారు. ఎన్నిరోజులు ఉంటారనే ప్రశ్నకు బదులిస్తూ.. 'ఒక రోజులో బయటకొచ్చేసినా పశ్చాత్తపపడను. టాప్-5కి వెళ్లినా ఏం అనుకోను. కప్ గెలుచుకున్నా సరే పొంగిపోను. అన్ని టాస్కులు ఆడగలను నేను. నా ఆట నచ్చితే ఓట్లు వేయండి లేదంటే వద్దు' అని షోపై మాధురి తన అభిప్రాయాన్ని చెప్పింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
బిగ్‌బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే!
ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఆదివారం ఎపిసోడ్లో మొత్తం ఆరుగురు రాబోతున్నట్లు లీకులు వచ్చేశాయి. వీళ్లకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి షాకిచ్చినట్లు తెలుస్తోంది.లక్స్ పాప ఫ్లోరాతో పాటు కామనర్ శ్రీజ.. ఐదో వారం ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేశారట. మరోవైపు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా ఆరుగురు రాబోతున్నారట. వీళ్లలో ముగ్గురు సీరియల్ నటులే కావడం విశేషం. ఇంతకీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎవరెవరు వస్తున్నారు? వీళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది చూద్దాం.రమ్య మోక్షసోషల్ మీడియాలో పికెల్స్ (ఊరగాయలు) బిజినెస్‌తో పాపులారిటీ తెచ్చుకున్న రమ్య మోక్ష.. వైల్డ్ కార్డ్‌గా రాబోతుందట. చెప్పాలంటే రమ్యతో పాటు ఈమెకు మరో ఇద్దరు అక్కలు ఉన్నారు. వీళ్లంతా కలిసి ఆన్లైన్లో పికెల్స్ బిజినెస్ చేస్తుంటారు. అయితే ఈమె ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. గొడవల విషయంలో ఎక్కడా తగ్గదు. ఈమెని ఇన్ స్టాలో ఫాలో అయ్యేవాళ్లకు ఈ విషయం తెలిసే ఉంటుంది. హౌస్‌లోకి వస్తే చాలామందికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశముంది.శ్రీనివాస్ సాయి'గోల్కోండ స్కూల్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ సాయి.. తర్వాత కాలంలో హీరోగా పలు చిత్రాలు చేశాడు. కానీ అవి ఏ మాత్రం ఇతడి కెరీర్‌కి ఉపయోగపడలేదు. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేం లేనట్లు ఉన్నాయి. దీంతో బిగ్‌బాస్ వాళ్లు అప్రోచ్ అయితే వెంటనే ఓకే చెప్పేసినట్లున్నాడు. కుర్రాడు కాబట్టి హౌసులోకి వచ్చిన తర్వాత లవ్ ట్రాక్స్ లాంటివి ఉండొచ్చు.నిఖిల్ నాయర్'గృహలక్ష్మి' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులు తెలిసిన ఇతడు.. 'పలుకే బంగారమాయెనా' సీరియల్లోనూ హీరోగా నటించాడు. ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు. సిక్స్ ప్యాక్ కూడా ఉంది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ టాస్కుల్లో మిగతా వాళ్లకు పోటీ ఇవ్వడం గ్యారంటీ. సీరియల్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు కాబట్టి బాగా ఆడితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్సులున్నాయి.గౌరవ్ గుప్తాప్రస్తుతం 'గీత ఎల్ఎల్బీ' అనే సీరియల్ చేస్తున్నారు. ఇతడు కూడా సిక్స్ ప్యాక్ మెంటైన్ చేస్తున్నాడు. హౌసులోకి వెళ్లిన తర్వాత అటు లవ్ ట్రాక్స్‌తో పాటు ఫిజికల్‌గానూ మంచి పోటీ ఇచ్చే ఛాన్సుంది. చూడాలి మరి ఏం చేస్తాడో?ఆయేషా జీనత్వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఈమె చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. 'సావిత్రి గారి అబ్బాయి' సీరియల్‌తో ఇక్కడ కాస్త పాపులరే. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ రెండో సీజన్లోనూ పాల్గొంది. గతంలో తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొని రచ్చ రచ్చ చేసిన అనుభవం ఈమెకుంది. ఈమె వైల్డ్ కంటెస్టెంట్‌గా వైల్డ్ ఫైర్ చూపించే ఛాన్సులు గట్టిగానే ఉన్నాయి. ఆటనే కాదు గ్లామర్ పరంగానూ హౌసులోకి చాలామందికి పోటీ ఇవ్వడం గ్యారంటీ.దివ్వల మాధురిసోషల్ మీడియాలో రీల్స్‌తో పాపులారిటీ తెచ్చుకున్న దివ్వల మాధురి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిన్నటి వరకు సందేహంగానే ఉంది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోంది. గతంలో ఆఫర్ వచ్చినా సరే రిజెక్ట్ చేసినట్లు చెప్పింది కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. -
కమల్ హాసన్‌పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభమై నెలరోజులవుతోంది. మొదటి రెండు వారాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేకుండా పోయింది. గొడవలతో అట్టుడికిన హౌస్ తర్వాత చప్పున చల్లారిపోయింది. కంటెస్టెంట్లకు ఎక్కువ హింట్స్ వెళ్లడం వల్లే అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చేస్తే ఏమవుతుందో? అన్న జంఝాటంలో పడిపోయారు. ఇలాగైతే ఈ సీజన్.. ఆరో సీజన్ కంటే అట్టర్ ఫ్లాప్‌గా మారడం ఖాయం. ఆరుగురు కన్ఫార్మ్!అందుకే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డులను దింపబోతున్నాడు. ఈ ఆదివారం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష(అలేఖ్య చిట్టి పికిల్స్ సోదరి), నటులు నిఖిల్ నాయర్, గౌరవ్, ఆయేషా, శ్రీనివాస్ సాయి హౌస్‌లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఆయేషా జీనత్‌పై కాస్త హైప్ ఎక్కువగా ఉంది. ఊర్వశివో రాక్షసివో, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలోనూ మెరిసింది. తమిళ బిగ్‌బాస్‌లో..తమిళంలో అనేక సీరియల్స్ చేసింది. ఉప్పు పులి కారం అనే తమిళ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. తమిళ చిత్రం రాంబోలోనూ నటించింది. అయితే ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం బిగ్‌బాస్ షో! అవును, ఆయేషా తమిళ బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్‌గా నిలిచింది. ఓపక్క అల్లరి చేస్తూ, మరోపక్క తనను విమర్శిస్తే ఉగ్రరూపం చూపిస్తూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసింది. ఆ సమయంలో ఆయేషాపై ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు.రెండుసార్లు పెళ్లి?ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందన్నాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి అవమానించారని, కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని కొంతకాలం నటుడు విష్ణుతో ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత అతడిని వదిలేసి యోగేశ్‌తో రిలేషన్షిప్ మొదలుపెట్టిందని ఆరోపించాడు. తనకిప్పటికే రెండుసార్లు పెళ్లయిందని బాంబు పేల్చాడు. వీటన్నింటి గురించి ఆయేషా క్లారిటీ ఇవ్వలేదు. అయితే యోగేశ్‌తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన ఆయేషా.. తర్వాత ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.కమల్ హాసన్‌నే ఎదిరించిన లేడీఇక షోలో ఆయేషాతో వేరే కంటెస్టెంట్లకు మధ్య ఉన్న గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు కమల్ హాసన్. హోస్ట్ బుజ్జగిస్తున్నట్లుగా మాట్లాడుతుంటే ఆయేషా మాత్రం.. నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు అని ఎదురుతిరిగింది. అప్పట్లో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. బిగ్‌బాస్ షోలో రెండు నెలలవరకు కొనసాగింది. మరి ఈ బ్యూటీ ఇక్కడ కూడా వైల్డ్‌ఫైర్‌లా ఉంటుందా? తన ఆటతో ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి! View this post on Instagram A post shared by AYSHA🦋 (@aysha7__official) చదవండి: ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె -
బిగ్‌బాస్‌లోకి గ్లామర్ బ్యూటీ 'వైల్డ్ కార్డ్' ఎంట్రీ.. రికార్డ్స్ బ్రేక్ గ్యారెంటీ (ఫోటోలు)
-
బిగ్‌బాస్ సీజన్-8.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీళ్లే (ఫొటోలు)


