కమల్‌ హాసన్‌పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ | Bigg Boss Telugu 9: Six Wild Card Contestants Enter the House This Week | Sakshi
Sakshi News home page

కమల్‌ హాసన్‌నే ఎదిరించిన లేడీ.. తెలుగు బిగ్‌బాస్‌లో వివాదాస్పద కంటెస్టెంట్‌

Oct 10 2025 2:00 PM | Updated on Oct 10 2025 4:06 PM

Bigg Boss 9 Telugu: Know About Wild Card Contestant Ayesha Zeenath

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ ప్రారంభమై నెలరోజులవుతోంది. మొదటి రెండు వారాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేకుండా పోయింది. గొడవలతో అట్టుడికిన హౌస్‌ తర్వాత చప్పున చల్లారిపోయింది. కంటెస్టెంట్లకు ఎక్కువ హింట్స్‌ వెళ్లడం వల్లే అందరూ సైలెంట్‌ అయిపోయారు. ఏం చేస్తే ఏమవుతుందో? అన్న జంఝాటంలో పడిపోయారు. ఇలాగైతే ఈ సీజన్‌.. ఆరో సీజన్‌ కంటే అట్టర్‌ ఫ్లాప్‌గా మారడం ఖాయం. 

ఆరుగురు కన్‌ఫార్మ్‌!
అందుకే బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) వైల్డ్‌ కార్డులను దింపబోతున్నాడు. ఈ ఆదివారం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష(అలేఖ్య చిట్టి పికిల్స్‌ సోదరి), నటులు నిఖిల్‌ నాయర్‌, గౌరవ్‌, ఆయేషా, శ్రీనివాస్‌ సాయి హౌస్‌లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఆయేషా జీనత్‌పై కాస్త హైప్‌ ఎక్కువగా ఉంది. ఊర్వశివో రాక్షసివో, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. కిర్రాక్‌ బాయ్స్‌ ఖిలాడీ గర్ల్స్‌ షోలోనూ మెరిసింది. 

తమిళ బిగ్‌బాస్‌లో..
తమిళంలో అనేక సీరియల్స్‌ చేసింది. ఉప్పు పులి కారం అనే తమిళ వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్‌ చేసింది. తమిళ చిత్రం రాంబోలోనూ నటించింది. అయితే ఆమెకు క్రేజ్‌ తీసుకొచ్చింది మాత్రం బిగ్‌బాస్‌ షో! అవును, ఆయేషా తమిళ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్‌గా నిలిచింది. ఓపక్క అల్లరి చేస్తూ, మరోపక్క తనను విమర్శిస్తే ఉగ్రరూపం చూపిస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసింది. ఆ సమయంలో ఆయేషాపై ఆమె మాజీ ప్రియుడు దేవ్‌ సంచలన ఆరోపణలు చేశాడు.

రెండుసార్లు పెళ్లి?
ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందన్నాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి అవమానించారని, కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని కొంతకాలం నటుడు విష్ణుతో ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత అతడిని వదిలేసి యోగేశ్‌తో రిలేషన్‌షిప్‌ మొదలుపెట్టిందని ఆరోపించాడు. తనకిప్పటికే రెండుసార్లు పెళ్లయిందని బాంబు పేల్చాడు. వీటన్నింటి గురించి ఆయేషా క్లారిటీ ఇవ్వలేదు. అయితే యోగేశ్‌తో ఎంగేజ్‌మెంట్‌ వరకు వెళ్లిన ఆయేషా.. తర్వాత ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.

కమల్‌ హాసన్‌నే ఎదిరించిన లేడీ
ఇక షోలో ఆయేషాతో వేరే కంటెస్టెంట్లకు మధ్య ఉన్న గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు కమల్‌ హాసన్‌. హోస్ట్‌ బుజ్జగిస్తున్నట్లుగా మాట్లాడుతుంటే ఆయేషా మాత్రం.. నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు అని ఎదురుతిరిగింది. అప్పట్లో ఈ సంఘటన బాగా వైరల్‌ అయింది. బిగ్‌బాస్‌ షోలో రెండు నెలలవరకు కొనసాగింది. మరి ఈ బ్యూటీ ఇక్కడ కూడా వైల్డ్‌ఫైర్‌లా ఉంటుందా? తన ఆటతో ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి!

 

 

చదవండి: ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement