breaking news
Priyanka Arul Mohan
-
నమ్రత మాల్దీవులు టూర్.. ఫన్నీగా 'ఫౌజీ' బ్యూటీ
మాల్దీవులు టూర్ వీడియో షేర్ చేసిన నమ్రతఫన్నీ పోజులతో నవ్విస్తున్న 'ఫౌజీ' ఇమాన్విబీచ్ ఒడ్డున మత్తెక్కించే పోజుల్లో ప్రియాంక మోహన్బర్త్ డే సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ అనన్య పాండేగ్లామరస్గా తయారైన బ్యూటీ అషూరెడ్డిలంగా ఓణీలో యాంకర్ రష్మీ గౌతమ్ స్టిల్స్ View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) -
విహారయాత్రలో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫోటోలు)
-
అందమే కుళ్లుకునేలా.. శ్రీలీల ఇలా మృణాల్ అలా!
చీరలో అందమే అసూయపడేలా శ్రీలీలజిగేలుమనే చీరలో మెరిసిపోతున్న మృణాల్బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ప్రియా వారియర్అబుదాబి ట్రిప్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంకడిమ్ లైటింగ్ వెలుతురులో మానస వారణాసివంకాయ రంగు చీరలో ఈషా రెబ్బా గ్లామర్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) -
'ఓజీ' బ్యూటీ దుబాయి ట్రిప్.. అందమైన రుక్మిణి
దుబాయి ట్రిప్ వేసిన 'ఓజీ' బ్యూటీ ప్రియాంకచీరలో అందంగా కనిపిస్తున్న రుక్మిణి వసంత్గ్లామరస్ లుక్‌లో కె ర్యాంప్ హీరోయిన్ యుక్తికలరిపయట్టు ప్రాక్టీసులో 'సలార్' శ్రియారెడ్డిఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు.. రెజీనా ఎమోషనల్బ్లాక్ శారీలో పద్ధతిగా హీరోయిన్ శ్రుతి హాసన్ View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
కొత్త తెలుగు సినిమాలు.. డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే జనాలు వెళ్తూనే ఉన్నారు. కాకపోతే చాలామంది.. ఓటీటీలో రిలీజైన తర్వాతే మొబైల్ లేదా టీవీల్లో కొత్త సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సంస్థలు కూడా కేవలం ఓటీటీల్లో కొన్నింటిని నేరుగా విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు అలానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ దానిలో రాబోయే పలు తెలుగు, తమిళ చిత్రాలు, వెబ్ సిరీసుల గురించి అధికారిక ప్రకటన చేసింది.'ఓజీ'తో రీసెంట్గా హిట్ కొట్టిన ప్రియాంక మోహన్ చేసిన తమిళ మూవీ 'మేడ్ ఇన్ కొరియా'. గత కొన్నాళ్ల నుంచి కొరియన్ చిత్రాలు, సిరీస్‌లకు చాలామంది అమ్మాయిలు ఫ్యాన్స్ అయిపోతున్నారు. అలాంటి ఓ అమ్మాయి కొరియా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీసినట్లు కనిపిస్తుంది. ఆర్ఏ కార్తీక దీనికి దర్శకుడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)ఆనంద్ దేవరకొండ, 'లాపతా లేడీస్' ఫేమ్ నితాన్షీ గోయల్ జంటగా నటించిన సినిమా 'తక్షకుడు'. వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు అనే ట్యాగ్ లైన్‌తో రాబోతుంది. పోస్టర్ చూస్తుంటే ఇదో రూరల్ బ్యాక్ డ్రాప్లో జరిగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో ఆనంద్ దేవరకొండతోనే 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే మూవీ తీసిన వినోద్ అనంతోజు దీనికి దర్శకుడు.సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. మిథిలా పాల్కర్, మురళీ శర్మ ఇతర పాత్రలు చేస్తున్నారు. ఓ టీచర్.. పల్లెటూరికి వెళ్లి స్కూల్లో పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఫన్నీగా చూపించబోతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రాలన్నీ కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయని చెప్పారు. మరి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారా? వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తారా అనేది చూడాలి.(ఇదీ చదవండి: Bigg Boss 9: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?) -
ఓజీ హీరోయిన్ 'ప్రియాంక' ఫోటోలు లీక్.. వార్నింగ్ ఇచ్చిన నటి
చెన్నై బ్యూటీ ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. తను స్నానానికి వెళ్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీలుగా వైరల్ అవుతున్నాయి. బాత్రూమ్ ఫోటోలు లీక్ అంటూ కొందరు ఫోటోలు షేర్ చేశారు. దీంతో తాజాగా ఆమె షోషల్ మీడియాలో రియాక్ట్ అయింది. రీసెంట్గా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో ఆయనకు సతీమణిగా ప్రియాంక మోహన్ నటించిన విషయం తెలిసిందే.వాస్తవంగా నెట్టింట వైరల్ అవుతున్న ప్రయాంక మోహన్ ఫోటోలు అన్నీ కూడా AI క్రియేట్ చేసినవే.. కానీ, అవి నిజమైన వాటి మాదిరిగానే ఉండటంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఆమె ఇలా స్పందించారు. ఇలాంటి నకిలీ ఫోటోలను వైరల్ చేయడం ఇకనైనా ఆపేయండి. నన్ను తప్పుగా చిత్రీకరించే కొన్ని AI-జనరేటెడ్ చిత్రాలు సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి వీటిని షేర్ చేయడం ఆపేయండి. AIని నైతిక సృజనాత్మకత కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి తప్పుడు సమాచారం కోసం కాదు. మనం ఏమి క్రియేట్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి వాటిని ఇతరులతో పంచుకుంటున్నాం అనేదాని గురించి జాగ్రత్తగా ఉండండి. అందరికీ ధన్యవాదాలు. అంటూ ఆమె షేర్ చేసింది.ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్, పవన్ కల్యాణ్ మధ్య సువ్వి.. సువ్వి సాంగ్ ఉంటుంది. ఆ పాటలో ఆమె ఇదే కాస్ట్యూమ్‌తో కనిపిస్తుంది. దీనిని ఛాన్స్‌గా తీసుకున్న కొందరు ఏఐ సాయంతో మరింత నీచంగా ఫోటోలు క్రియేట్ చేశారు. అవే ఇప్పుడు ప్రియాంకకు ఇబ్బందిగా మారాయి. నెటిజన్లు ప్రియాంక మోహన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ తీరుపై కాస్త ఏకాగ్రత పెట్టాలని సలహాలు ఇస్తున్నారు. ఏఐ సాయంతో ఇలాంటి ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసేవారిపై తప్పకుండా కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి ఆనందం కోసం మరోకరిని బలి చేయడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ (2019) చిత్రం ద్వారా ప్రియాంకా మోహన్ తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత శ్రీకారం, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో మెప్పించిన ఈ బ్యూటీ రీసెంట్గా ఓజీలో నటించింది. తమిళనాట శివ కార్తికేయన్ హీరోగా డాక్టర్, డాన్ సినిమాల్లో నటించింది.#priyankaMohan pic.twitter.com/wwyq3tnUC9— ❤️🩵🧡 (@ArjunPrathap13) October 10, 2025 -
OG X Review : ‘ఓజీ’ ట్విటర్ రివ్యూ
పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో అయినా తమ హీరోకి విజయం దక్కాలని కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాకు కావాల్సినంత హైప్‌ని తెచ్చిపెట్టింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 25) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఓజీ కథేంటి? ఎలా ఉంది? పవన్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో సంబంధం లేదు. ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటే..బాగోలేదని మరికొంతమంది చెబుతన్నారు. రొటీన్ గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని.. ఎలివేషన్స్ తప్ప ఇంకేమి లేదని కామెంట్స్ చేస్తున్నారు. కథ- కథనం వదిలేసి..దర్శకుడు దృష్టంతా ఎలివేషన్‌పైనే పెట్టాడని విమర్శిస్తున్నారు. #OG A Run of the Mill Gangster Drama that is technically strong and has a few solid elevation blocks, but the rest is mundane!The first half of the film is satisfactory. Despite the drama moving in a flat way, it manages to build intrigue. The intro and interval block are well…— Venky Reviews (@venkyreviews) September 24, 2025ఓటీ టెక్నికల్‌గా బాగుంది. కొన్ని ఎలివేషన్స్ మినమా మిగతా కథంతా రొటీన్ అంటూ ఓ నెటిజన్ కేవలం 2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. OG MOVIE REVIEW:Story:❌❌❌❌Action:⭐️Acting:❌❌❌❌VFX: ⭐½BGM:⭐️OG MOVIE RATING: ⭐️⭐½#og #ogreview #ogmovie #pawankalyan #OGonSept25 pic.twitter.com/iTrVi0W1TH— Baap of movies (@baapofmovies) September 24, 2025 స్టోరీ బాగోలేదు. యాక్షన్, వీఎఫెక్స్ పర్వాలేదు. బీజీఎం బాగుంది అంటూ ఓవరాల్‌గా ఈ చిత్రానికి 2.25 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్.Rod movie ra babu 🙏🙏Sujeeth ga nvu TFI vadileyra Thamman bayya yentha kavalo antha iste saripodi talakaya noppi vachesindi bgm ki 🙏 #OGReview #TheycalllHimOGReview— Manoj AA (@AlluBhai__) September 24, 2025 ఓజీ ఓ రాడ్ మూవీ. సుజీత్ అర్జెంట్‌గా తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతే మంచిది. తమన్ బయ్యా..ఎంత కావాలో అంతే బీజీఎం ఇస్తే సరిపోతుంది. తలకాయ నొప్పి వచ్చేసింది నీ నేపథ్య సంగీతానికి’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#OGReview 1. Second Half inkoncham better ra thieyavachu and expected drama. 2. 70% movie antha fights ee unnie.3. @MusicThaman Ekkada negaloo kadu ekkada thagaloo kuda telisinavadu goppavadu ra ayya !!!!!!4. Heroine ndhukuuuu— Dune (@Aloanworrier) September 24, 2025 సెకండాఫ్ ఇంకొంచెం బెటర్‌గా తీయొచ్చు. కథనం ఊహించేలా ఉంది. సినిమాలో 70 శాతం యాక్షనే ఉంది. తమన్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన గొప్పవాడు. హీరోయిన్ ఎందుకు ఉందో.. అంటూ ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.#OGreview: Style without soul, mediocre fight choreographyRating: 2/5#Pawanakalyan #TheycalllHimOG #SujeethSambhavam @FridayWallMaghttps://t.co/Zg2Qz2fjUD— Kausalya Suharika R (@KausalyaSuhari1) September 24, 2025 First half is peak in every aspect, Sujeet fanism at high…2nd half starts with bang, loved the drama & emotion, then comes climax with cinematic high…BC this is just half of Gambheera he ll be unleashed in part2 #OG— The is my surname (@Bloodufan) September 24, 2025#TheyCallHimOG is Disappointing We were excited for this magnum opus after hearing the songs and seeing the trailer, but it did not live up to our expectations in terms of story or visual effects. Thaman is one of the few people who did their job from the start.— FukkardBO (@FukardBO) September 24, 2025#TheyCallHimOG - Original Gunapam🙏#OG #OGReview #PawanKalyan #Cinee_WorlddReview #Cinee_Worldd pic.twitter.com/fIbsouR5bs— cinee worldd (@Cinee_Worldd) September 24, 2025Rey edhem cinema ra babu 1000rs booka #DisasterOG #DisasterOG pic.twitter.com/yhWp70EabW— Tiger'sDragon🐲 (@TigersDragon999) September 24, 2025Finally Original Review 😭 💯 #OGReview || #DisasterOG pic.twitter.com/3tcKrOMVff— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 𝟐.𝟎 (@KarnaReddy2_0) September 24, 2025#TheyCallHimOG - PK’s Swag & Screen presence Super. Emraan, Priyanka Dummy. Thaman’s BGM elevates. Gud Visuals. Passable 1st Hlf & Poor 2nd Hlf. No proper Emotions. Intro Seq, Interval block, Police Stn scene, Traveling Soldier remix impressive. Style with no substance. AVERAGE!— Christopher Kanagaraj (@Chrissuccess) September 24, 2025 -
They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఓజీనటీనటులు: పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుదేవ్ నాయర్, రాహుల్ రవీంద్రన్ తదిరులునిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు : డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరిదర్శకత్వం: సుజీత్సంగీతం: తమన్ ఎస్సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసఎడిటర్ : నవీన్ నూలివిడుదల తేది: సెప్టెంబర్ 25, 2025‘హరిహర వీరమల్లు’ లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన మూవీ ‘ఓజీ’(OG Review). మూడేళ్ల కిత్రం శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం పవన్ కారణంగా ఆలస్యమై.. ఎట్టకేలకు కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? వరుస డిజాస్టర్స్‌ను చవిచూసిన పవన్‌కు ‘ఓజీ’తో అయినా హిట్ పడిందా, లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1970-90ల మధ్యకాలంలో జరుగుతుంది. జపాన్‌లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్) ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(ప్రకాశ్‌రాజ్)పై అటాక్ జరిగితే.. రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్ట్‌ని నిర్మించి.. సత్యదాదా డాన్‌గా ఎదుగుతాడు. అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకొని నాసిక్‌లో కొత్త జీవితం ప్రారంభిస్తారు (OG Movie Review). ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ)తో పాటు తన కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నగరాన్ని తమ గుప్పిట్లో పెటుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్‌లో ఉన్న తన కంటేనర్ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్‌లో ఉన్న ఓమీ.. ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్ట్‌ని స్వాధీనం చేసుకొని.. అతడి మనుషులను దారుణంగా చంపేస్తాడు. అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటేనర్‌లో ఉన్న విలువలైన వస్తుంలేంటి? సత్యాదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ప్లాష్‌బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..గ్యాంగ్‌స్టర్ కథలు.. అందులోనూ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఓజీ(They Call Him OG Review) కూడా అలాంటి రొటీన్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ స్టోరీనే. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథనంలో ఎక్కడా బిగువు లేదన్నది తెలుస్తూ ఉంటుంది. కథ ముందుకు సాగేకొద్ది.. పవన్ నటించిన పంజా సినిమాతో పాటు చాలా సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. వాటిని మరిపించేందుకు ఏవైనా ట్విస్టులు అయినా ఉంటాయా అంటే అదీ ఉండదు. కథ ప్రారంభంలోనే క్లైమాక్స్ సీన్ ఊహించొచ్చు. కథ-కథనం విషయాన్ని పక్కన పెట్టి.. ఎలివేషన్‌పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రారంభంలో ఆ ఎలివేషన్ ఆకట్టుకున్నా.. ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ అవ్వడంతో ఒకానొక దశలో చిరాకు అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు కూడా పవన్ గతంలోనే చేసిన సినిమాలనే గుర్తు తెస్తాయి. ఇక లాజిక్ల గురించి మాత్రం అస్సలు ఆలోచించొద్దు. కత్తితో గన్ నుంచి వదిలిన బుల్లెట్లను ఆపడం.. రక్తంతో కాలి బూటుకి అంటుకున్న అగ్నిని చల్లార్చడం.. ఇలా ‘బాలయ్య’ ను మించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.జపాన్‌లో కథను ప్రారంభించడంతో ఇదేదో కొత్త కథలా ఉండే అనుకుంటాం. కానీ ఆ మరుక్షణమే కొత్తదనం ఆశించడం తప్పనే విషయం తెలిసిపోతుంది. సత్యదాదాకు ఓజీ పరిచయం అవ్వడం.. ముంబై వదిలి అజ్ఞాతంలోకి వెళ్లడం.. కన్మణితో ప్రేమాయణం ఒకవైపు.. ఓమీ అరచకాలు.. దాదా పోర్ట్‌పై దాడి.. ఈ విషయం తెలిసి ఓజీ ముంబై రావడం.. ఫస్టాప్ అంతా ఇలా రొటీన్‌గానే సాగినా.. క్యారెక్టర్లకు ఇచ్చిన ఎలివేషన్ సీన్లు ఫర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ ఫ్యాన్స్‌కి నచ్చుతుంది. ఇక సెకండాఫ్ కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. ఫ్యామిలీ సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలివేషన్ మీద పెట్టిన శ్రద్ధలో సగమైనా ఎమోషనల్ సీన్లపై పెడితే బాగుండేది. రక్తపాతం జరుగుతున్నా.. కీలక పాత్రలు కనుమరుగవుతున్నా.. ఎక్కడా జాలీ, బాధ కలగదు. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. పార్ట్ 2 కోసమే అన్నట్లుగా.. క్లైమాక్స్‌లో ఓజీ ప్లాష్బ్యాక్కి మరో ఎలివేషన్ ఇచ్చారు. ‘అవసరం’ అయినప్పడు మళ్లీ వస్తా’ అని హీరోతో ఓ డైలాగ్ చెప్పింది.. రెండో భాగం కూడా ఉందని ప్రకటించారు. ఎవరెలా చేశారంటే.. పవన్ నటన పరంగా చేయడానికేమి లేదు. వింటేజ్ లుక్ తప్ప ఆయన నుంచి కొత్తగా ఏమి ఆశించొద్దు. ఆయనకు సంబంధించిన చాలా సీన్లు డూప్‌తో తీశారు. అది తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్ సీన్లే కాదు ఎలివేషన్ సన్నివేశాల్లోనూ డూప్‌నే వాడినట్లు ఉన్నారు. కొన్ని చోట్ల పవన్‌కి కళ్లజోడు పెట్టి మ్యానేజ్ చేస్తే.. మరికొన్ని చోట్ల తలను కిందికి దింపి కవర్ చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా పవన్‌ని తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక విలన్ ఓమీగా ఇమ్రాన్ హష్మీ బాగానే నటించాడు. ఇక కన్మణి పాత్రకి ప్రియాంక మోహన్ న్యాయం చేసింది. తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. సత్యదాదాగా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గీతగా శ్రియారెడ్డి మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆమె పాత్రకు ఒకటి రెండు బలమైన సన్నివేశాలు పడ్డాయి. తేజ్ సప్రూ, సుదేశ్ నాయర్, హరీశ్ ఉత్తమ్, రాహుల్ రవీంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధానబలం. రొటీన్ సన్నివేశాలకు కూడా తనదైన బీజీఎంతో హైప్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్లు బాగున్నాయి. వీఎఫెక్స్ తేలిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే) -
పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
పవన్ హీరో అని కాదు.. అందుకే ‘ఓజీ’ ఒప్పుకున్నాను: ప్రియాంక మోహన్
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రం ‘ఓజీ’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రధానపాత్ర చేశారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రియాంక అరుళ్ మోహన్ మాట్లాడుతూ– ‘‘1980–1990లలో జరిగే కథ ‘ఓజీ’. ఈ చిత్రంలో ఓజాస్ గంభీరపాత్రలో పవన్‌గారు, కణ్మణిగా నేను నటించాం. గంభీర జీవితాన్ని మలుపు తిప్పేపాత్ర కణ్మణిది. కథ, అందులోని నాపాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటాను. ఈ సినిమా కథ, కణ్మణిపాత్ర నచ్చినందుకే ఒప్పుకున్నాను... పవన్‌కల్యాణ్‌గారు హీరో అని కాదు. ఇమ్రాన్ హష్మితో నాకు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు సర్ప్రైజింగ్గా ఉంటాయి. ఇక ధనుష్‌గారి డైరెక్షన్‌లోని ‘జాబిలమ్మా నీకు అంత కోపమా’లో ‘గోల్డెన్ స్పారో’ అనే స్పెషల్ సాంగ్ చేశాను. జస్ట్ ఒక్క రోజులో ఈపాట పూర్తయింది. తెలుగులో కథలు వింటున్నాను.ఇతర భాషల్లో కొన్ని సినిమాలు కమిట్ అయ్యాను. రజనీకాంత్‌గారి ‘జైలర్ 2’ సినిమాలో నటించలేదు. అవకాశం వస్తే చేయాలని ఉంది. ఈ మధ్య కొంతమంది దర్శక–నిర్మాతలు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు తీస్తున్నారు. ఇందుకు హ్యాపీగా ఉంది. నాకు కామెడీపాత్రలూ చేయాలని ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సోషల్ మీడియాలో నా హ్యాండిల్స్‌ను నా టీమ్ చూసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల టైమ్ వేస్ట్ అవుతుందని నా ఫీలింగ్. నా ఫొటోలు షేర్ చేయడానికి సోషల్ మీడియాను వినియోగించుకుంటాను... అంతే. పెయిడ్ నెగటివ్ క్యాంపైన్స్ ఉంటాయని విన్నాను.ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాక్సాఫీస్ నంబర్స్‌ను పట్టించుకోను. ఒకప్పుడు సినిమా బాగుందా? లేదా అని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఫలానా సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఫలానా సినిమా అంత కలెక్ట్ చేసిందని చెప్పుకుంటున్నాం. కొందరు ఫేక్ కలెక్షన్స్ చూపించి, సినిమా సూపర్ హిట్ అని చెబుతుంటారు. కానీ సినిమాలో సరైన కంటెంట్, క్వాలిటీ ఉండవు. మనీ గురించి మాట్లాడుతూ సినిమా సోల్‌ను మర్చిపోతున్నాం’’ అన్నారు. -
డిజైనర్ చీరలో అనసూయ.. బీచ్ ఒడ్డున 'ఓజీ' బ్యూటీ
డిజైనర్ చీరలో మరింత అందంగా అనసూయబీచ్ ఒడ్డున 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్కేరళ వెళ్లిపోయిన 'సింగిల్' ఫేమ్ ఇవానాజిమ్ వేర్లో హీరోయిన్ ఈషా రెబ్బా గ్లామర్దేవకన్యలా మెరిసిపోతున్న 'ఉప్పెన' కృతిశెట్టి'తెలుసు కదా' షూటింగ్ జ్ఞాపకాలతో రాశీఖన్నా View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) -
గ్లామరస్ 'ఓజీ' బ్యూటీ.. కిరాక్ కేతిక శర్మ
ఓజీ బ్యూటీ ప్రియాంక మోహన్ గ్లామరస్ పోజులుకిరాక్ పుట్టించేస్తున్న అదిదా కేతిక శర్మవజ్రాలు లాంటి డ్రస్సులో జాన్వీ కపూర్జీన్ షార్ట్‌తో తెగ హ్యాపీగా యువనటి దీపికా పిల్లిజపాన్లో తిరిగేస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరిఎర్రని చీరలో ఒయ్యరాలు పోతున్న అనసూయజిమ్లో వర్కౌట్ చేస్తున్న బిగ్‌బాస్ దివి View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) -
ప్రశాంతమైన కన్మణి
పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్మోహన్ పోషించిన కన్మణి పాత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ‘‘ఓజీ’లో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు.ప్రతి తు పానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంకా అరుళ్మోహన్ కన్మణి పాత్ర. మా సినిమా నుంచి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘ఫైర్ స్టార్మ్..’కు విశేష స్పందన లభించింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్న ఈ సినిమాకి సంగీతం ఎస్. తమన్, కెమెరా: రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస. -
అవకాశాల వేటలో సక్సెస్ఫుల్ హీరోయిన్
ఒక్కోసారి సక్సెస్ఫుల్ నటి అని ముద్ర వేసుకున్నా అవకాశాలు ముఖం చాటేస్తుంటాయి. నటి ప్రియాంక మోహన్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఈ కన్నడ భామ మాతృభాషతో పాటు తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె 2019లో కన్నడ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగులో నాని గ్యాంగ్‌లీడర్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ చిత్రం ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్, డాన్ చిత్రాల్లో వరుసగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అంతేకాకుండా గ్లామర్‌కు దూరంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఇలా సూర్యతో ఎదర్కుమ్ తుణిందవన్ (ఈటీ), ధనుష్ సరసన కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఆ మధ్య తెలుగులో నాని సరసన 'సరిపోదా శనివారం' చిత్రంలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు కరువయ్యాయి. నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నిర్మించిన 'జాబిలమ్మా నీకు అంత కోపమా' చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. అంతే ఆ తరువాత తమిళంలో మరో అవకాశం రాలేదు. తెలుగులోనూ ఓజీ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. దీంతో మడి కట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఉండదని గ్రహించారో ఏమోగానీ గ్లామర్‌కు తెర రేపింది. తాజాగా వివిధ భంగిమల్లో ఫొటోలు తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అందులో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు చోటు చేసుకున్నాయి. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా ప్రియాంకమోహన్ అవకాశాల వేట మొదలుపెట్టారన్నమాట. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!
సినిమాటిక్ యూనివర్స్ అనగానే గుర్తొచ్చే పేరు లోకేశ్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సినిమాలని ఒకదానికొకటి లింక్ చేసిన ఇతడు.. ఎల్సీయూ సృష్టించాడు. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'కూలీ' తీస్తున్నాడు. ఇది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఓవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటే 'బెంజ్'. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు క్రేజీ రూమర్ ఒకటి వినిపిస్తోంది.సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. లోకేశ్ ఇప్పటివరకు తీసిన చిత్రాల్లోనూ హీరోయిన్లు కనిపించేది కూడా తక్కువే అని చెప్పొచ్చు. కానీ 'బెంజ్'లో మాత్రం ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకున్నారట. వాళ్లలో సంయుక్త, ప్రియాంక మోహన్ ఇప్పటికే ఖరారు కాగా.. మడోన్నా సెబాస్టియన్‌ని కూడా తీసుకోవాలని చూస్తున్నారట.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో?)సంయుక్త, ప్రియాంక హీరో సరసన నటిస్తారని.. మడోన్నా మాత్రం విలన్ వాల్టర్‌గా చేస్తున్న నివీన్ పౌలీ పక్కన కనిపించబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. రీసెంట్గా 'బెంజ్' విలన్‌కి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేసి నివీన్ పౌలీ పాత్రని పరిచయం చేశారు. లోకేష్ యూనివర్స్‌లో ఈ మూవీ కూడా భాగమేనని చెప్పుకొచ్చారు. మరి ఎలా ఏ సినిమాతో లింక్ చేస్తారనేది ఇంకా సస్పెన్స్. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.లోకేశ్ ప్రస్తుతం 'కూలీ' తీస్తున్నాడు. దీని తర్వాత 'ఖైదీ 2' ఉంటుంది. అలానే రోలెక్స్, విక్రమ్ 2 చిత్రాల్ని కూడా తీస్తానని ఇదివరకే చెప్పాడు. అయితే కొన్నిరోజులుగా ఆమిర్ ఖాన్‌తో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. చూడాలి మరి వీటిలో ఏది ముందు మొదలవుతుందో?(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) -
ఓజీ భామ ప్రియాంక మోహన్ గ్లామర్ షో (ఫొటోలు)
-
శరిపోదా శనివారం నుంచి 'ఓజీ'తో స్పీడ్ పెంచేసిన ప్రియాంకా మోహన్ (ఫోటోలు)
-
దుల్కర్ సల్మాన్‌కు జోడీగా ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ బ్యూటీ
సినిమాకు హద్దులు చెరిగి చాలా కాలమే అయ్యింది. భాషాభేదం చూడకుండా టాలెంట్ ఉంటే భారతీయ సినిమాలోనే కాదు ప్రపంచ సినిమలోనూ ఎవరైనా నటించవచ్చు. ఇక ఇటీవల శాండిల్‌వుడ్ తారల విస్తరణ బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. పలువురు కన్నడ బ్యూటీలు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించి స్టార్స్‌గా వెలిగిపోతున్నారు. కాగా ఇప్పుడు నటి ప్రియాంక మోహన్ కూడా దక్షిణాది స్టార్‌గా ముద్ర వేసుకుంటున్నారు. ఈ కన్నడ భామ 2019 కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. మాతృభాషలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ నటిస్తూ ఐదేళ్లలోనే తన కంటూ ఒక స్థానాన్ని సంపాందించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో నాని గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చి సరిపోదా శనివారం చిత్రంతో హిట్ అందుకున్నారు. ఇక తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రంలో నటించి తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్నారు. అలాగే డాన్ చిత్రంలో శివకార్తికేయన్‌తో రెండో సారి జత కట్టి మరో విజయాన్ని అందుకున్నారు. ఆ మధ్య ధనుష్ కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించిన ప్రశంసలు అందుకున్న ప్రియాంక మోహన్ తాజాగా ధనుష్ దర్శకత్వం వహించిన నిలావుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ప్రత్యేక పాటలో మెరిశారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కాగా ఇటీవల నటుడు జయంరవితో జత కట్టిన బ్రదర్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ప్రియాంక మోహన్‌కు అవకాశాలు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీకి నటుడు దుల్కర్సల్మాన్ చాన్స్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఇటీవల లక్కీ భాస్కర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఈయన మాతృభాషలో కథానాయకుడిగా నటిస్తూ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి ఆర్డీఎక్స్ చిత్రం ఫేమ్ నకాశ్ హిదాయత్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇందులో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటి ప్రియాంక మోహన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అలాగే కోలీవుడ్ వెర్సస్టైల్ యాక్టర్ ఎస్జే.సూర్య కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించనున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇందులో నటి ప్రియాంక మోహన్ నాయకిగా నటిస్తే ఇదే ఈమె తొలి మలయాళ చిత్రం అవుతుంది. -
నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా
టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్.. తమిళంలోనూ హీరోయిన్గా పలు సినిమాలు చేస్తోంది. అలా చేసిన లేటెస్ట్ మూవీ 'బ్రదర్'. జయం రవి హీరో. కొన్నిరోజుల క్రితం తమిళ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఎలాంటి హడావుడి లేకుండానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ 'బ్రదర్' సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?అక్కా తమ్ముళ్ల ఫ్యామిలీ డ్రామా స్టోరీలతో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఓ మూవీనే 'బ్రదర్'. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే.. రూ.5 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కంటెంట్ మరీ రొటీన్‌గా ఉండటమే దీనికి కారణం. స్టార్ యాక్టర్స్ బోలెడంతమంది ఉన్నాసరే సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)దీన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ తమిళ రిజల్ట్ చూసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. జీ5లో ప్రస్తుతం తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇష్టముంటే దీనిపై లుక్కేయొచ్చు.'బ్రదర్' విషయానికొస్తే.. అన్యాయాన్ని తట్టుకోలేని కార్తి (జయం రవి), తనతో పాటు కుటుంబాన్ని కూడా తలనొప్పిగా మారతాడు. న్యాయం కావాలని గొడవలు పడే ఇతడితో.. లా డిగ్రీ చేయిస్తే అయినా సరే బాగుపడతాడేమోనని తండ్రి భావిస్తాడు. కానీ అక్కడా నిరాశే. కనీసం అక్క ఆనంది(భూమిక) దగ్గరకు పంపిస్తే బాగుపడతాడేమోనని ఆశపడతారు. కానీ కార్తి వల్ల వాళ్ల కుటుంబం చిక్కుల్లో పడుతుంది. చివరకు వీటిని కార్తి ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ') -
యాక్టింగ్ రాదని ట్రోల్స్.. కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్.. లక్కీ హీరోయిన్ (ఫొటోలు)
-
ముత్యం లాంటి నవ్వుతో ప్రియాంక మోహన్.. చూస్తే ఫిదానే! (ఫొటోలు)
-
స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ఏమందంటే?
కొన్నిరోజుల క్రితం తమిళ హీరో జయం రవి విడాకులు తీసుకున్నాడు. తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిపోయిందని ఇతడి భార్య ఆర్తి చెప్పుకొచ్చారు. ఇదలా ఉంచితే జయం రవి.. హీరోయిన్ ప్రియాంక మోహన్ని నిశ్చితార్థం చేసుకున్నాడనే రూమర్‌తో పాటు దండలతో ఉన్న ఫొటో కూడా వైరల్ అయింది. దీంతో అందరూ అది నిజమే అనుకున్నారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్)అయితే అది 'బ్రదర్' సినిమాలోనిది అని తేలింది. జయం రవి, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ తమిళ మూవీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియాంక.. ఎంగేజ్మెంట్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.'జయం రవి, నేను కలిసి 'బ్రదర్' సినిమా చేశాం. ప్రమోషన్లో భాగంగా మూవీ టీమ్ ఓ ఫొటో రిలీజ్ చేసింది. అందులో మేమిద్దరం మెడలో దండలు వేసుకుని ఉంటాం. దీంతో వెంటనే వైరల్ అయిపోయింది. అది చూసి మేం నిజంగానే నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది అనుకున్నారు. షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఇది నా దృష్టికి రాలేదు. ఆ ఫొటో నిజమే అనుకుని టాలీవుడ్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. అసలు విషయం తెలిసి అది సినిమాలో స్టిల్ అని క్లారిటీ ఇచ్చా. రిలీజ్ చేయడానికి వేరే ఫొటో ఏం దొరకలేదా అని మూవీ టీమ్‌ని తిట్టుకున్నా' అని ప్రియాంక మోహన్ చెప్పుకొచ్చింది. ఈ సంఘటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రియాంక చెప్పింది. అయితే జయం రవి విడాకుల చర్చ ఓ వైపు నడుస్తుండగానే ఈ ఫొటో వైరల్ అవడం దీనికి కారణమైంది. ఏదైతేనేం మూవీ ప్రమోషన్‌కి ఇది కాస్తోకూస్తో పనికొచ్చినట్లు ఉంది. (ఇదీ చదవండి: నటుడిగా 50 ఏళ్లు పూర్తి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్) -
ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్
నటి ప్రియాంక మోహన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొంది. ఈ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకోగా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.రీసెంట్గా సరిపోదా శనివారం చిత్రంతో ప్రియాంక మోహన్‌కు మరింత పాపులారిటీ పెరిగింది. అయితే, తొర్రూరులో రీసెంట్గా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు ఆమె వెల్లింది. అయితే, ఆమె స్టేజీ మీదకు చేరుకోగానే చాలామంది ఒక్కసారిగా అక్కడకు చేరిపోయారు. దీంతో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలింది. అయితే, ఈ ప్రమాదం నుంచి ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడింది.ఇదే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హానుమండ్ల ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరబాద్‌కు తరలించినట్లుగా తెలుస్తుంది. గాయపడిన ఝాన్సి రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినికి అత్త అవుతారనే విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి ప్రియాంకా మోహన్ స్పందించింది. తాను స్వల్ప గాయాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ఘటనలో గాయిపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. Actress #PriyankaMohan narrowly escapes harm as the stage collapses during the Kasam Shopping Mall inauguration in Thorrur town Palakurthy mla @YJR_INC injured 🤕 pic.twitter.com/CpPct7EqA3— 000009 Aarathi (@ui000009) October 3, 2024 -
అభిమాని అయితే ఇలా ప్రవర్తిస్తాడా: ప్రియాంక మోహన్
సినీ నటీమణుల జీవితం అద్దాల మేడ లాంటిది అంటారు. పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు కూడబెట్టిన ప్రముఖ నటీమణులు కూడా అప్పుడప్పుడు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వీరిని అభిమానించే ఆరాధించే అభిమానులతో కూడా అవస్థలు ఎదురవుతుంటాయి. రీసెంట్గా నానితో సరిపోదా శనివారం చిత్రంతో ఈ బ్యూటికి మంచి గుర్తింపు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలో ఎదుగుతున్న ప్రియాంక మోహన్.. పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఈ కన్నడ భామ మొదట్లో గ్లామరస్ పాత్రలోనూ నటించారు. అలా ఆమె వెండి తెరపై అందాలను ఆరబోసిన చిత్రం టిక్ టాక్. ఆమె లక్కు ఏమిటంటే తమిళంలో టిక్ టాక్ తొలి చిత్రం అయినా, మొదట విడుదలైన చిత్రం శివకార్తికేయన్‌తో జత కట్టిన డాక్టర్. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం అలా శివకార్తీకేయన్ సరసన డాన్ అనే మరో చిత్రంలో నటించి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సూర్యకు జంటగా ఎదర్కుమ్ తునిందన్ (ఈటీ), ధనుష్‌తో కలిసి కెప్టెన్ మిల్లర్ చిత్రాలు నటించారు. ఇటీవల తెలుగులో నటించిన సరిపోదా శనివారం చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. కాగా తాజాగా జయం రవితో జతకట్టిన బ్రదర్ చిత్రం దీపావళికి విడుదలకు కానుంది. మరికొన్ని చిత్రాలు చేతిలో ఉన్న ప్రియాంక మోహన్ తాజాగా మరోసారి చర్చలోకి ఎక్కారు. 'బ్రదర్' అనే తమిళ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక మోహన్.. సెల్ఫీ కోసం యత్నించిన ఒక అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన అక్కడ పెద్ద కలకలానికి దారి తీసింది. ఈ వ్యవహారం గురించి నటి శరణ్యతో ప్రియాంక మోహన్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులో ఆమె పేర్కొంటూ అతను చాలా రోజులుగా తనను ఇంటి వరకు ఫాలో అవుతూ వచ్చేవాడిని చెప్పారు. బ్రదర్ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం రోజున కూడా అతను తన గ్రూప్‌తో స్థానిక వెలచ్చేరిలోని ఫినిక్స్ మాల్ నుంచి తనను ఫాలో అవుతూ వచ్చేవాడిని చెప్పారు. అభిమాని అయితే ఇలా ప్రవర్తిస్తాడా అంటూ మండిపడ్డారు. -
చీరలో మీనాక్షి అందం.. ఐదేళ్లయినా మర్చిపోని ప్రియాంక!
అందాల నిధి అగర్వాల్.. చూపు తిప్పడం కష్టమేభర్తతో కలిసి హీరోయిన్ కీర్తి పాండియన్ స్మైలీ పోజులు'గ్యాంగ్ లీడర్' మూవీకి ఐదేళ్లు.. ప్రియాంక థ్యాంక్యూ పోస్ట్హాట్నెస్ పెంచేసిన తెలుగు బ్యూటీ అషూరెడ్డికోహ్లీతో ఫొటో.. తెగ ఆనందపడిపోతున్న నటి రాధికచీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న మీనాక్షి చౌదరినడుము అందాలు చూపిస్తున్న ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Keerthi Pandiyan (@keerthipandian) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
‘సరిపోదా శనివారం’ మూవీ థాంక్స్ మీట్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సితార బర్త్ డే విషెస్.. డ్యాన్స్ ఇరగదీసిన తెలుగు సింగర్
అన్న గౌతమ్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన సితారవరలక్ష్మి వ్రతం చేసిన బిగ్ బాస్ స్రవంతిపీరియడ్స్ టైంలో ఆకలి గురించి అనసూయ పోస్ట్చీరలో అందాలతో మత్తెక్కించేలా ప్రియాంక మోహన్డ్యాన్స్ ఇరగదీసిన సింగర్ శ్రావణ భార్గవిసెల్ఫీలతో మెంటలెక్కించేస్తున్న థిన్ బ్యూటీ మిథిలా పాల్కర్ముద్దొచ్చేలా సెల్ఫీలు తీసి పోస్ట్ చేసిన సుప్రీత View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi) View this post on Instagram A post shared by avantika (@avantika) View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) View this post on Instagram A post shared by Sangeerthana (@sangeerthana__vipin) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Kavya Manohar Shetty (@kavyashettyofficial) View this post on Instagram A post shared by VB🤍 (@vedikabhandari) -
రివ్యూ: ‘సరిపోయిందా’ శనివారం!
టైటిల్: 'సరిపోదా శనివారం' నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులునిర్మాణ సంస్థ: డివీవీ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరిరచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మురళి జిఎడిటర్: కార్తీక శ్రీనివాస్విడుదల తేది: ఆగస్ట్ 29, 2024కథేంటంటే.. సూర్య(నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అన్యాయాన్ని సహించడు. అయితే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒక రోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ వారమే శనివారం. మిగతా ఆరు రోజులు ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ.. తనకు కోపం వచ్చేలా చేసిన వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుంటాడు. శనివారం ఆ డైరీలో రాసుకున్న వాళ్ల భరతం పడతాడు. కట్ చేస్తే.. దయానంద్ అలియాస్ దయా(ఎస్జే సూర్య) క్రూరమైన పోలిస్ ఆఫీసర్. తనకు కోపం వస్తే చాలు.. సోకులపాలెం గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతారు. దయా చేసే అన్యాయాలను చూసి తట్టుకోలేకపోతుంది కానిస్టేబుల్ చారులత(ప్రియాంక అరుల్ మోహన్). తన పైఅధికారి కావడంతో అతన్ని ఏమి చేయలేక.. సోకులపాలెం ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు సూర్య కూడా సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్నా అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సోకులపాలెం ప్రజలను దయా నుంచి విముక్తి కల్పించేందుకు సూర్య, చారులత కలిసి వేసిన ప్లాన్ ఏంటి? శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే సూర్య.. క్రూరమైన సీఐ దయాను ఎలా ఎదిరించాడు? దయాకు సోకులపాలెం గ్రామ ప్రజలపై కోపం ఎందుకు? చిన్నప్పుడే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన సూర్య మరదలు కల్యాణికి చారులతకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు సోకులపాలెం ప్రజలకు దయా నుంచి విముక్తి లభించిందా లేదా అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని విలన్ పట్టి పీడిస్తుంటాడు. అతను చేసే అన్యాయాలను ఎదిరించి, ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి హీరో వస్తాడు. తనకు సంబంధం లేకున్నా.. వారికి అండగా నిలిచి చివరకు విలన్ నుంచి ఆ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పిస్తాడు.. ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సరిపోదా శనివారం కథ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. అయితే అన్ని సినిమాల్లో మాదిరి హీరో ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకుండా.. కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కొట్టడం ఈ సినిమా స్పెషల్. అంతకు మించి ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని చిత్రబృందం ముందు నుంచి చెబుతూ రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ట్రైలర్లోనే కథ ఏంటో చెప్పి ముందే ఆడియెన్స్ మైండ్ సెట్ చేశారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొత్త కథను చెప్పేందుకు ప్రయత్నం చేయలేదు కానీ.. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్మూలతో పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మదర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ ఫార్మెట్లో కథనాన్ని నడిపించాడు. మొదలు.. మలుపు... దాగుడు మూతలు.. ముగింపు అంటూ కథను విడదీసి చెప్పాడు. నాని, ఎస్జే సూర్యల నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. సినిమా నిడివి కూడా ఎక్కువగా(174 నిమిషాలు) ఉండడం, ఊహకందేలా కథనం సాగడం ఉండడం సినిమాకు మైనస్. హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించడానికి గల కారణం సినిమా ప్రారంభంలోనే చూపించి.. ఆడియన్స్ మైండ్‌ని సెట్ చేశాడు. ఆ తర్వాత ఒకవైపు సూర్యకు, మరోవైపు సీఐ దయాకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ..వీరిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆలోచించేలా చేశాడు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో మొత్తం నాని-సూర్యల చుట్టే కథనం సాగుతుంది. అయితే సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. ఊహకందేలా కథనం సాగినా..నాని, సూర్యలు తమ నటనతో బోర్ కొట్టకుండా చేశారు. కొత్తదనం ఆశించకుండా వెళ్తే ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. తనదైన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇందులో కూడా ఓ డిఫరెంట్ పాత్ర చేశాడు. వారం మొత్తం ప్రశాంతంగా ఉండి.. ఒక్కరోజు మాత్రమే కోపం ప్రదర్శించే యువకుడు సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రం బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐ దయా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. సూర్య పాత్రను మలచిన తీరు..అతని నటన సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ పాత్ర గుర్తిండిపోతుంది. ఇక కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక అరుళ్ మోహన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా సాయి కుమార్, కార్పెరేటర్ కుర్మానంద్గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాని ‘సరిపోదా శనివారం’ మూవీ స్టిల్స్
-
'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫోటోలు)
-
గోల్డెన్ స్పారో
నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్, ఈ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ‘గోల్డెన్ స్పారో’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలోనే ప్రియాంక, జీవీ ప్రకాష్ అతిథులుగా కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. -
ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు: హీరో నాని
‘‘ఈ మధ్య కొన్ని చోట్ల గమనించాను. ఏంటి సార్... కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమాలకు రావడం లేదంటున్నారు. మంచి సినిమాలు ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు సార్. వస్తూనే ఉంటారు. మనమే అప్పుడప్పుడు మిస్ అవుతుంటాం. ఈసారి మిస్ అయ్యేదే లేదు. డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కు ఏదైనా మాట చెప్పాల్సి వస్తే మనదో సామెత ఉంది. ‘కలిసొచ్చే కాలం వస్తే... నడిచొచ్చే సినిమా వస్తుంది’’ అంటారు కదా. సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు... థియేటర్స్‌కు పోతారు’’ అని నాని అన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘దయా పాత్రను మేం ఊహించినదానికన్నా ఎక్కువగా చేశారు ఏస్జే సూర్యగారు. దానయ్యగారు పాజిటివ్ పర్సన్ . అందుకే మంచి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిర్మాత కల్యాణ్‌కు ఈ సినిమా ట్రైనింగ్ గ్రౌండ్ అనుకోవచ్చు. వివేక్ ఆత్రేయ శివతాండవం ఏంటో థియేటర్స్‌లో చూస్తారు. ఈ సినిమా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని చెప్పారు. వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ!’ సినిమా రిలీజ్ డే రోజు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కొందరు ల్యాగ్ అన్నారు. మరికొందరు బాగుంది అన్నారు. అయితే నానీగారు నాకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. చాన్స్ అన్నది చాలా చిన్న పదం. నానీగారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు’’ అని తెలిపారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘కథల ఎంపికలో నానీగారు నంబర్ వన్ . కథ నచ్చితే కొత్త దర్శకులకూ అవకాశం ఇస్తారు. నానీగారితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. సాధారణంగా నేను ఏ సినిమా వేదికపైనా ఇంత మాట్లాడలేదు. సినిమా మాట్లాడిస్తుంది. ‘సరిపోదా శనివారం’ సినిమా చూశాను. పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ ఓ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు’’ అని చెప్పారు. ‘‘సరిపోదా శనివారం’ కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పాను. తెలుగు ప్రేక్షకుల కోసం సొంత డబ్బింగ్ చెప్పాను’’ అని వెల్లడించారు ఎస్జే సూర్య. ‘‘సూర్య (నాని పాత్ర), చారులత (ప్రియాంక పాత్ర)లను గుర్తు పెట్టుకుంటారు’’ అని తెలిపారు ప్రియాంకా అరుళ్. ‘‘నాని కష్టపడి స్టార్ అయ్యాడు. ఆస్కార్ వేదికపై మన ఖ్యాతి చాటారు డీవీవీ దానయ్య, రాజమౌళిగార్లు’’ అని పేర్కొన్నారు నటుడు అలీ. అతిథులుగా పాల్గొన్న దర్శకులు దేవా కట్టా ప్రశాంత్ వర్మ , శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. నాని తండ్రి రాంబాబు, సంగీత దర్శకుడు జేక్స్, కెమెరామేన్ మురళి తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని
టాలీవుడ్ హీరో నాని.. కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఇతడి కూడా హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఉంది. వీళ్లిద్దరూ జంటగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శ్రీవారిని దర్శించుకున్నారు.(ఇదీ చదవండి: విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?)శుక్రవారం రాత్రి తిరుపతి చేరుకున్న నాని కుటుంబం.. అలిపిరి మెట్ల మార్గాన తిరుమల చేరుకున్నారు. కొండపైన రాత్రి బస చేసి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొక్కులు కూడా చెల్లించుకున్నారు. దర్శనానంతరం బయటకు రాగా అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.(ఇదీ చదవండి: ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్) -
హీరో నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది: నాని
‘‘హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. ఈ థియేటర్లో మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) కలసి ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ లాంచ్ వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది. మీ ప్రేమను నాపై ఇలానే చూపిస్తూ ఉంటే వంద శాతం కష్టపడి మరిన్ని మంచి చిత్రాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా’’ అని హీరో నాని అన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘29న థియేటర్స్‌లో ‘సరిపోదా శనివారం’ని సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు.నటుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘చాలా మంచి కంటెంట్ ఉన్న చిత్రం ఇది.. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘గ్యాంగ్ లీడర్’ సినిమా తర్వాత నానీగారితో ‘సరిపోదా శనివారం’ చేశాను. అందరూ కుటుంబంతో వెళ్లి మా సినిమా చూడండి’’ అని ప్రియాంకా అరుళ్ మోహన్ చెప్పారు. ‘‘మా సినిమా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది’’ అన్నారు డీవీవీ దానయ్య. -
కార్తీతో.. ముగ్గురు భామలు?
దక్షిణాది స్టార్స్‌లో నటుడు కార్తీ ఒకరు. ఇప్పటికి 25 చిత్రాలను పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. వాటిలో మెయ్యళగన్ చిత్రం, వా వాద్ధియార్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సర్ధార్– 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈయన ఇంతకు ముందు నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన సర్ధార్ చిత్రానికి సీక్వెల్. సర్ధార్ చిత్రం 2022లో విడుదలై సూపర్‌హిట్ అయ్యింది. కాగా కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రంలో నటి రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగానూ నటి లైలా ముఖ్య పాత్రలోనూ నటించారు.ఆ చిత్ర దర్శకుడు పీఎస్.మిత్రన్‌నే సర్ధార్– 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సర్ధార్ చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ అధినేత ఎస్.లక్ష్మణన్‌నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా పోతే ఇందులో సర్ధార్ చిత్రంలో నటించిన రాశీఖన్నా, గానీ, రజీషా విజయన్ గానీ,లైలా గానీ నటించడం లేదు. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్రల కోసం నటి ప్రియాంక మోహన్, మాళవిక మోహన్, ఆషికా రఘునాథ్‌ను నటింపజేయడానికి వారితో చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ఇందులో నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, జార్జ్ సీ.విలియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో సర్ధార్ చిత్రం కంటే మరింత భారీగా సర్ధార్– 2 రూపొందుతోందన్నమాట. కాగా నటుడు కార్తీ ఈ మూడు చిత్రాల్లోనూ ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్యభరిత కథా పాత్రల్లో కనిపిస్తుండడం గమనార్హం. -
Priyanka Arul Mohan: కైపెక్కించే చూపులతో కుర్రాళ్లను ఆగం చేస్తున్న ప్రియాంక మోహన్ (ఫోటోలు)
-
ముంగురులతో హీరోయిన్ ప్రియాంక మోహన్.. క్యూట్‌నెస్ వేరే లెవల్ (ఫొటోలు)
-
Priyanka Arul Mohan: సీతాకోకచిలుకలా మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
-
హీరోయిన్ కాకపోయుంటే ఏం చేసేదాన్నంటే?: ప్రియాంక మోహన్
హీరోయిన్లు.. ఏ భాషలో అవకాశం వస్తే అక్కడ నటించేస్తారు. అలా ఒక్క తమిళ సినిమానే తీసుకుంటే హిందీ, మలయాళ, తెలుగు, గుజరాత్, కన్నడ, మరాఠీ భాషలకు చెందిన హీరోయిన్లు ఇక్కడ కథానాయికలుగా నటించేస్తున్నారు. కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార కూడా ఇతర భాష(కన్నడ)కు చెందిన నటే అన్నది గమనార్హం. మరో బ్యూటీ ప్రియాంక మోహన్.. మాతృభాష కన్నడలో నటించిన తరువాత తెలుగులో గ్యాంగ్‌లీడర్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కోలీవుడ్ నుంచి పిలుపుఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా, కోలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ శివకార్తికేయన్ సరసన డాక్టర్, డాన్ చిత్రాల్లో వరుసగా నటించి విజయాలను అందుకున్నారు. అలాగే ఎదర్కుం తునిందవన్ చిత్రం ద్వారా సూర్యతో జత కట్టే అవకాశాన్ని అందుకున్నారు. ఆ చిత్రం నిరాశపరిచినా, ఈ మధ్య ధనుష్‌తో కలిసి నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్న ప్రియాంక మోహన్ ఓ ఇంటర్వ్యూలో తాను ఇంజినీరింగ్ విద్యార్థిని అని చెప్పారు.సినీరంగంలో ఎంట్రీచదువు పూర్తయిన తరువాత ఒక మంచి ఉద్యోగంలో చేరాలన్నదే తన కల అన్నారు. తాను సినీరంగంలోకి ప్రవేశించాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అందుకోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని చెప్పారు. నటిని కాకుంటే ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేదాన్నని తెలిపారు. ఇకపోతే తనకు నచ్చిన నటుడు రజనీకాంత్ అని చెప్పారు. ఆయన నటనతో పాటు తన సింప్లిసిటీ చాలా నచ్చుతుందన్నారు. ఏదో ఒక రోజు ఆయన్ని కలిసే అవకాశం రాకపోతుందా? అని ఎదురు చూస్తున్నానని నటి ప్రియాంక మోహన్ పేర్కొన్నారు.చదవండి: ఈ సినిమాతో టాలీవుడ్ నాకు మెట్టినిల్లు అయిపోయింది: జ్యోతి రాయ్ -
సమ్మర్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక మోహన్
సమ్మర్ వచ్చిందంటే సినీ తారల్లో చాలా మంది విదేశీ ట్రిప్‌కు రెడీ అయిపోతారు. అలాంటి ట్రిప్‌ను నటి ప్రియాంక మోహన్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషతోపాటు, తెలుగు, తమిళం భాషల్లోనూ ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. తెలుగులో 'నాని' సరసన 'గ్యాంగ్‌లీడర్' చిత్రంలో నటించిన ఈమె ఆ తరువాత తమిళంలో శివకార్తీకేయన్‌కు జంటగా డాక్టర్, డాన్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి హిట్ కావడంతో ఈ వెంటనే నటుడు సూర్యకు జంటగా ఎదుర్కు తుణిందవన్ (ET) చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రియాంక మోహన్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఇటీవల ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తొలి రోజుల్లో పక్కింటి అయ్యాయి ఇమేజ్ను తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు గ్లామరస్ ఫొటోలతో హల్చల్ చేస్తూ అలాంటి పాత్రలకు రెడీ అనే సిగ్నల్‌ను పంపుతున్నారు. కాగా ప్రస్తుతం మరోసారి తెలుగులో నాని సరసన సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో యువ నటుడు కవిన్‌తో జత కట్టే అవకాశం తలుపు తట్టింది. ఇలా నటిగా బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ ప్రస్తుతం సమ్మర్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏ దేశంలో ఉన్నారో గానీ అక్కడ దిగిన ఫొటోలను సామాజక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
Priyanka Arul Mohan Photos: ఈ గ్లామర్ సరిపోదా అంటూ ఊపేస్తున్న హీరోయిన్ (ఫోటోలు)
-
గ్లామర్ పాత్రలకు ఓకే.. ఫోటో షూట్ తో గ్రీన్ సిగ్నల్ (ఫొటోలు)
-
గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన హోమ్లీ హీరోయిన్
గ్లామర్ లేనిదే సినిమా లేదు అని చెప్పవచ్చు. ఇక చాలా మంది ఈతరం హీరోయిన్లు గ్లామర్‌ను నమ్ముకునే గడిపేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నటనకు అవకాశం ఉన్న పాత్రలకే తమ ప్రాధాన్యం అంటుంటారు. అయితే నటించేది మాత్రం గ్లామరస్ పాత్రల్లోనే. తాజాగా నటి ప్రియాంక మోహన్ కూడా ఇదే బాట పట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కన్నడ భామ మాతృభాషలో ఒకటి రెండు చిత్రాలు చేసిన తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నాని సరసన నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించింది. అందులోనూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈ అమ్మడిని అక్కడ పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటు ప్రియాంక మోహన్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం హిట్‌తో శివకార్తికేయన్‌తో మరోసారి డాన్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. ఈ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. అలా పాపులరైన ప్రియాంక మోహన్‌కు స్టార్ నటుడు సూర్యతో జతకట్టే అవకాశం వచ్చింది. ఆయనతో ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ET) చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాలన్నింటిలోనూ ఈ అమ్మడు హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది. దీంతో అలాంటి ఇమేజ్‌కు పరిమితమైంది. అలాంటిది ఇటీవల ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఒక సామాజిక బాధ్యత కలిగిన పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. తాజాగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి జయం రవికి జంటగా నటిస్తున్న బ్రదర్ చిత్రం. మరొకటి డాన్స్ మాస్టర్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే చాలా గ్యాప్ తరువాత తెలుగులో పవన్‌కల్యాణ్‌తో జత కట్టే అవకాశాన్ని పొందినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా ప్రియాంక మోహన్ గ్లామర్ గోదాలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రత్యేకంగా ఫొటో షూట్ చేసుకుని దిగిన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తోంది. అలా తాజాగా బెడ్ రూమ్‌లో ఫొటో షూట్ చేసుకున్న గ్లామరస్ చిత్రాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇవి గ్లామర్ పాత్రలకు గ్నీన్ సిగ్నలా అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు తమ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇలాంటి గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. వీటి వల్ల కూడా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. నటి ప్రియాంక మోహన్ గ్లామరస్ ఫొటోలకు ఇది కూడా ఒక కారణం అయ్యింటుందనేది ట్రోల్ అవుతోంది. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
తన ప్రత్యేకత సిల్వర్ స్క్రీనే కాదు.. ఇన్‌స్టా ప్యాషన్ కూడా..
ప్రియంకా మోహన్.. నటించబోయే నెక్స్›్ట మూవీ కోసం ఎంతమంది ఎదురుచూస్తారో.. సోషల్ మీడియాలో ఆమె నెక్స్›్ట ఫొటో కోసమూ అంతేమంది వేచి చూస్తుంటారు. దీన్నిబట్టే చెప్పొచ్చు స్టోరీస్ సెలెక్షన్లో ప్రియంకా ఎంత ప్రత్యేకంగా ఉంటుందో! సిల్వర్ స్క్రీన్ కథే కాదు.. ఇన్‌స్టాలోని ఫ్యాషన్ స్టోరీనూ! ఆ స్టోరీ టెల్లింగ్‌లో ఈ బ్రాండ్స్ కూడా పార్ట్‌నర్సే! అకోయ జ్యూలరీ.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ట్రెండ్‌కి తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్‌లో తెగ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఆ క్రేజే ఈ బ్రాండ్‌ను సెలబ్రిటీలకూ దగ్గర చేస్తోంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్ లోనే కొనుగోలు చేసే వీలుంది. దేవ్నాగరి.. అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియంకా.. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నారు. కానీ అమ్మమ్మ స్ఫూర్తితో చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవ్నాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీర బ్రాండ్: దేవ్నాగరి, రూ. 57,000 జ్యూలరీ బ్రాండ్: అకోయ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇవి చదవండి: Alia Bhatt: తనకు 'ఆలూ' అనే ముద్దు పేరు ఎలా వచ్చిందో తెలుసా! -
ధనుష్ సినిమాలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్..
హీరోగా బిజీగా ఉన్న ధనుష్ దర్శకుడిగా, నిర్మాతగానూ కొనసాగుతున్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రాయన్. ఇది ధనుష్ 50వ చిత్రం అన్నది తెలిసిందే. దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న రాయన్ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోది. దీంతో ధనుష్ ప్రస్తుతం తన 51వ చిత్రం కుబేరపై దృష్టి పెట్టారు. కుబేర.. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇకపోతే ధనుష్ మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన సోదరి కొడుకు పవిష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. నటి అనికా సురేంద్రన్, మాథ్యూ థామస్, ప్రియ ప్రకాశ్ వారియర్, రమ్య రంగనాథన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇందులో ధనుష్ కీలక పాత్రలో మెరవనున్నారు. దీనికి జీవి ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. స్పెషల్ సాంగ్ ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ పేరెంట్స్.. దర్శకుడు కస్తూరి రాజా, విజయలక్ష్మి నిర్మిస్తున్నారు. మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిలావుకు ఎన్మేల్ ఎన్నడీ కోబం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో ప్రియాంక మోహన్ నటించినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ధనుష్‌తో కలిసి ఈ బ్యూటీ కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న నిలావుకు ఎన్ మేల్ ఎన్నడీ కోబం చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పాట చిత్రంలో చాలా కీలకమని తెలిసింది. చదవండి: మూడు నెలల తర్వాత చెప్పింది చేసిన 'బిగ్‌బాస్ 7' విన్నర్ -
అభిమాని వింత కోరిక తీర్చిన 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్!
హీరోయిన్ ప్రియాంక మోహన్.. అభిమాని అడిగిన వింత ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఇన్ స్టాలో పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు 'ఆస్క్ ఎనీ థింగ్' పేరు ఫన్ సెషన్ లాంటిది పెడుతుంటారు. అయితే కొందరు ఆకతాయులు ఫన్నీ ప్రశ్నల్లాంటివి అడుగుతుంటారు. తాజాగా ప్రియాంక మోహన్ విషయంలో అలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) నాని' గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రియాంక మోహన్.. ఆ తర్వాత 'శ్రీకారం' అనే మూవీలో నటించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ పూర్తిగా తమిళంకే పరిమితమైపోయింది. మళ్లీ ఇప్పుడు 'ఓజీ', 'సరిపోదా శనివారం' లాంటి తెలుగు చిత్రాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇన్ స్టాలో ప్రియాంక మోహన్.. 'ఆస్క్ ఎనీథింగ్' అని చిన్న ఫన్ సెషన్ పెట్టింది. ఇందులో ఓ నెటిజన్/అభిమాని.. 'మీ గోళ్లు చూపించండి మేడమ్' అని అడిగాడు. దీనికి బదులిచ్చిన ప్రియాంక.. తన చేతిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. 'వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో ఏంటో' అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
నాని 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్ అలాంటి సినిమా చేసిందా..?
కథానాయికలు ఒక స్థాయికి చేరే వరకు పీత కష్టాలు పీతవి అన్నట్లు వారి కష్టాలు వారికి ఉంటాయి. ఆ తర్వాత వారేంటో చూపిస్తారు. నటి ప్రియాంకా అరుళ్ మోహనన్ కూడా ఇందుకు అతీతం కాదన్నది ఇటీవలే తెలిసింది. ఈ కన్నడ బ్యూటీ చదివింది ఇంజినీరింగ్. అయితే ఎంచుకున్న వృత్తి మాత్రం నటన. మొదట్లో మోడలింగ్ చేసిన ఆ తర్వాత మాతృభాషలో కథానాయకిగా సినీ రంగప్రవేశం చేశారు. కన్నడ చిత్రంలో నటించిన వెంటనే తెలుగు చిత్రంలో లభించే అవకాశం వరించింది అలా విక్రమ్‌కుమార్ నానీకి జంటగా గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ప్రియాంక తన నటనతో అందరి దృష్టిలో పడ్డారు. అలాంటి సమయంలో డాక్టర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అదే హీరోతో జతకట్టి డాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దీంతో ప్రియాంకమోహన్‌కు స్టార్ ఇమేజ్ వచ్చిందనే చెప్పాలి. వరుసగా సూర్య సరసన ఎదర్కుమ్ తుణిందవన్ (ET), ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ నటించి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో శృంగారభరితంగా నటించారా..? ఈ బ్యూటీకి అందాలారబోతలకే దూరం అనే పేరు ఉంది. తాజాగా తెలుగులోనూ నానితో సరిపోదా శనివారం చిత్రం చేస్తుంది. ప్రియాంక తమిళంలో నటించిన తొలి చిత్రం డాక్టర్ అనేది ప్రచారంలో ఉంది. అయితే అంతకుముందే ఆమె 'టిక్ టాక్' అనే చిత్రంలో నటించారు. కానీ ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అందులో ప్రియాంకమోహన్ బెడ్ రూమ్ సన్నివేశాలు చూసి అభిమానులు షాక్ అయ్యారు. కారణం అందులో ఈ అమ్మడు శృంగారభరితంగా నటించడమే. దీంతో కెరీర్ ఆరంభంలో ఇదంతా సహజమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కనిపిస్తున్నారు. సీన్స్ కట్.. పోలీసులకు నిర్మాత ఫిర్యాదు 'టిక్ టాక్' సినిమా నుంచి ప్రియాంక మోహన్ సీన్స్ తొలగించడంతో నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియాంక మోహన్ 2017లో 'టిక్ టాక్' అనే తమిళ సినిమాకు సంతకం చేసినట్లు చెబుతున్నారు. నటి ప్రియాంక మోహన్‌తో మూడున్నర కోట్ల రూపాయలతో ‘టిక్‌టాక్’ సినిమా తీశానని, ఆ తర్వాతే ఆమె ఇతర సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే డిసెంబర్ 2023లో డిఎస్ఆర్ ఫిల్మ్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రాన్ని చూసి నిర్మాత షాక్ అయ్యాడు. సినిమాలోని ప్రియాంక మోహన్‌కి సంబంధించిన ముఖ్యమైన 20 నిమిషాల సన్నివేశాలను నిర్మాతకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగా తొలగించారు, దీంతో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దాంతో నిర్మాతకు మూడున్నర కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, సినిమా పరాజయానికి DSR ఫిలింస్ కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిర్మాతకు నష్టం కలిగించిన డీఎస్ఆర్ ఫిల్మ్, మాస్టరింగ్ ఇంజనీర్ దినేష్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో పోలీసులను నిర్మాత కోరారు. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Captain Miller Review: ‘కెప్టెన్ మిల్లర్’ రివ్యూ
టైటిల్: కెప్టెన్ మిల్లర్ నటీనటులు: ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్, నివేదిత తనీష్ తదితరులు నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్ దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్ సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని ఎడిటర్: నాగూరన్ విడుదల తేది: జనవరి 26, 2024(తెలుగులో) కథేంటంటే.. ఈ సినిమా కథంతా స్వాతంత్రానికి పూర్వం అంటే 1930లో సాగుతుంది. తమిళనాడులోని ఓ చిన్న గ్రామానికి చెందిన అగ్ని అలియాస్ అగ్నీశ్వర(ధనుష్) సొంత ఊరిలోనే కుల వివక్షకు గురవుతాడు.తక్కువ కులానికి చెందిన వారనే సాకుతో ఆ ఊరి వాళ్లని గుడిలోకి రానివ్వడు అక్కడి రాజు(జయప్రకాష్). ఆ కోపంతో అగ్ని బ్రిటీష్ సైన్యంలో చేరతాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తయ్యాక అతనికి మిల్లర్ అనే పేరుపెట్టి విధుల్లోకి పంపుతారు. ఫస్ట్ డ్యూటీలోనే తన పై అధికారిని చంపేస్తాడు. అనంతరం తోటి సైనికుడు రఫీక్(సందీప్ కిషన్) సహాయంతో అక్కడ నుంచి పారిపోయి దొంగగా మారుతాడు. రాజన్న(ఎలగో కుమారవేల్) ముఠాతో కలిసి దొంగతనాలు చేస్తూ..వచ్చిన డబ్బులో కొంచెం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సంఘాలకు పంపుతుంటారు. ఓ సారి తన ఊరిలోని గుడిలో రహస్యంగా దాచిపెట్టిన విలువైన ఓ పెట్టెను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వారి నుంచి ఆ పెట్టెను మిల్లర్ దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పెట్టెను మిల్లర్ ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది? అందులో ఏం ఉంది? తన ఊరి ప్రజలపై దండయాత్రకు వచ్చిన బ్రిటీష్ సైన్యాన్ని కెప్టెన్ మిల్లర్ ఎలా తిప్పికొట్టాడు? ఈ కథలో భానుమతి(ప్రియాంక అరుల్ మోహన్), శివన్న(శివరాజ్‌కుమార్)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అంటరానితనం, కులవివక్షతో , నిమ్నవర్గాల అణచివేత నేపథ్యంలో తమిళ్‌తో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు వచ్చాయి. కెప్టెన్ మిల్లర్ కథ కూడా అలాంటిదే. బ్రిటీష్ కాలంలో కుల వివక్ష ఎలా ఉండేది? తక్కువ కులం వారిని బ్రిటీష్ వారితో పాటు సంస్థాన రాజులు ఎలా చిన్న చూపు చూసేవారు? తమ అవసరాలకు ఎలా వాడుకునేవారు? అనేది ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్. అణగారిన వర్గానికి చెందిన ఓ యువకుడి జర్నీని ఐదు చాప్టర్లుగా విడగొట్టి చెబుతూ..అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. బీభత్సమైన వయొలెన్స్ కారణంగా కథలోని మెయిన్ పాయింట్‌కి ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. హీరో ఎవరి కోసం పోరాడుతున్నాడో, ఎందుకు మారిపోయాడో అనేది క్లారిటీగా చూపించలేకపోయారు. సన్నివేశాల పరంగా చూస్తే సినిమా బాగుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం గత సినిమాలన్నీ గుర్తొస్తాయి. ఈ కథలో సినిమాటిక్ లిబర్టీని కూడా ఎక్కువే తీసుకున్నాడు దర్శకుడు. కథ 1930లో సాగినప్పటికీ.. అత్యాధునిక ఆయుధాలు వాడడం, స్టైలిష్ బైక్స్, గాగూల్స్ వాడటం వాస్తవికతతో దూరంగా అనిపిస్తాయి. 'ఘోర హరుడు' కథతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ.. అతని నేపథ్య సన్నివేశలను చూపించారు. హీరో బ్రిటీష్ సైన్యంలోకి చేరడానికి గల కారణం బలంగా ఉంటుంది. అయితే సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ ఫస్టాఫ్‌లోనే పరిచయం చేశారు. దీంతో ఆయా పాత్రల తీరు ఎలా ఉండబోతుందనేది ఆడియన్స్‌కి ముందే తెలిసిపోతుంది. అలాగే ఇన్ని పాత్రలను పరిచయం చేయడంతో కథ సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ మాత్రం అదిరిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో వయోలెన్స్ మరింత ఎక్కువతుంది. బ్రిటీష్ సైన్యంతో పాటు స్థానిక రాజు చేసే కుట్రలు అంతగా ఆకట్టుకోలేవు. అయితే సైన్యంతో హీరో గ్యాంగ్ చేసే పోరాట ఘట్టాలు మాత్రం అదిరిపోతాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని సంభాషణలు కూడా ఆలోచింపచేస్తాయి. ‘మనం వాళ్ల(బీటీష్) దగ్గర బానిసలమే.. వీళ్ల(స్థాయిక రాజు) దగ్గర బానిసలమే.. వీళ్ల కంటే తెల్లోళ్లే నయం. ఇక్కడ ఉంటే మనల్ని చెప్పులు కూడా వేసుకోనివ్వరు. అదే బ్రిటిష్ సైన్యంలో చేరితే బూట్లు ఇస్తారు. ఇక్కడ మనల్ని గుళ్లోకి రానివ్వరు. అక్కడ వాళ్లు పక్కన కూర్చోపెట్టుకుని మంచి భోజనం పెడతారు. దేన్ని స్వాతంత్రం అన్నాలి?’ లాంటి డైలాగ్స్ అప్పట్లో అంటరానితనం ఏ స్థాయిలో ఉండేదో తెలియజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో మొత్తం ధనుష్ వన్‌మ్యాన్ షో. అగ్నిగా, కెప్టెన్ మిల్లర్‌గా ధనుష్ అదరగొట్టేశాడు. అయితే ఇలాంటి పాత్రలు ధనుష్‌కి కొత్తేమి కాదు. గతంలో కూడా ఈ తరహా పాత్రల్లో నటించాడు. ఇక శివన్నగా శివరాజ్‌కుమార్ తన పాత్ర పరిధిమేర అద్భుతంగా నటించాడు. భానుమతిగా ప్రియాంక అరుల్ మోహన్ ఆకట్టుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాత్ర నిడివి తక్కువే అయినా.. గుర్తిండిపోతుంది. నివేదితా సతీష్ డిఫరెంట్ పాత్రలో నటించింది. రాజుగా జయప్రకాశ్, రాజన్నగా ఎలగో కుమారవేల్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్ పరంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. 1930ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించాడు సినిమాటోగ్రాఫర్ సిద్థార్థ్. జీవి ప్రకాశ్ బీజీఎం సినిమా స్థాయిని పెంచింది. యాక్షన్ సీన్స్ అదరిపోయాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘కెప్టెన్ మిల్లర్’ విభిన్నమైన కథ.. నా క్యారెక్టర్ చాలా ఢిపరెంట్: హీరోయిన్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' తమిళంలో ఇప్పటికే 100 కోట్ల వసూళ్ళని దాటింది. జనవరి 26 న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ కెప్టన్ మిల్లర్ విశేషాలని పంచుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత 'కెప్టెన్ మిల్లర్'తో తెలుగులో కనిపించడం ఎలా అనిపిస్తోంది? నా గత చిత్రాలు ‘వరుణ్ డాక్టర్,' 'డాన్' తెలుగు ప్రేక్షకులని విశేషంగా అలరించాయి. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ తో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. కెప్టెన్ మిల్లర్' లో ధనుష్ లాంటి అద్భుతమైన నటుడితో కలిసి పనిచేయడానికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ సినిమా, పాత్ర గురించి వివరంగా చెప్పారు. బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ విషయంలో దర్శకుడి విజన్ ని ఫాలో అయ్యాం. మీరు ఎక్కువ నటనకు ఆస్కారం ఉండే పాత్రలను ఎంచుకుంటారు కదా? ఏదైనా కథను బట్టి ఉంటుంది. కథ, నా పాత్ర నచ్చితేనే ఎంచుకుంటాను. 'కెప్టెన్ మిల్లర్' కథతో పాటు నా పాత్ర నాకు బాగా నచ్చింది. ఇంత రగ్గడ్ రోల్ చేయడం ఎలా అనిపించింది ? దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మునుపటి చిత్రం నాకు బాగా నచ్చింది. అతను స్పష్టమైన విజన్ ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్. ఇంత పెద్ద కాన్వాస్ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది 'కెప్టెన్ మిల్లర్'లో మీ పాత్ర ఎలా ఉంటుంది? సినిమా చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా, యూనిక్ ఉంటుంది. 1930ల నేపధ్యంలో సాగే సినిమాలోని ప్రతి ఒక్కటీ ప్రేక్షకులకు ఫ్రెష్ గా కనిపిస్తుంది, విభిన్న కథ, పాత్రలు, కాస్ట్యూమ్స్, యూనిక్ స్టయిల్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తాయి. తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు? తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. కథ, యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. 'గ్యాంగ్ లీడర్' తర్వాత నానితో మళ్లీ కలిసి వస్తున్న 'సరిపోదా శనివారం' సినిమా ఎలా వస్తోంది? సినిమా చాలా బాగా వస్తోంది. ప్రస్తుతం దాని షూటింగ్లో ఉన్నాను. మీరు ఇంకేమైన తెలుగు సినిమాలు చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి'ఓజీ' సినిమా చేస్తున్నాను. నాని, ధనుష్ వంటి వెర్సటైల్ నటులతో కలిసి పనిచేయడం ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు? వారంతా కష్టపడి, అంకితభావంతో పని చేస్తారు. చాలా హంబుల్ గా ఉంటారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాలని చూశారా? ప్రస్తుతం షూటింగ్లో ఉండటం వలన చూడలేకపోయాను. సంక్రాంతి సందర్భంగా వచ్చిన సినిమాలన్నింటిని చూడటానికి ఆసక్తిగా ఉన్నాను. -
Captain Miller HD Stills: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ స్టిల్స్
-
హైదరాబాద్‌లో సరిపోదా...
‘అంటే సుందరానికీ!’ చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. ‘‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని పూర్తిగా యాక్షన్–΄్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తారు. హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నవంబరులో ఒక షెడ్యూల్ పూర్తి చేశాం. రెండో షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ్రపారంభించాం. ఈ షెడ్యూల్లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌తో పాటు నాని, ఇతర ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్‌ని చిత్రీకరించనున్నాం. పాన్ ఇండియా చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రా నికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
స్టార్ హీరోయినే కానీ ఆ టైంలో అష్టకష్టాలు పడింది!
ఇండస్ట్రీలోకి వస్తున్న వారసులు మినహా చాలామంది నటీనటులు సొంతంగా ఎదిగినవాళ్లే. హీరోయిన్లలో లేడీ సూపర్‌స్టార్ నయనతార కూడా మొదట్లో అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. కానీ చాలా కష్టాలు పడిన తర్వాత అంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజులో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇక దక్షిణాదిలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ దీనికి ఏ మాత్రం అతీతం కాదు. (ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?) తొలుత మోడలింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియాంక మోహన్.. అడపాదడపా యాడ్స్ చేస్తూ వచ్చింది. అయితే ఈ టైంలో కనీస అవసరాలకు కూడా ఇవి సరిపోకపోవడంతో చాలా కష్టాలు పడింది. అలా మోడల్‌గా చేస్తూనే సినీ రంగంపై ఆసక్తి పెంచుకుంది. నటించడం తెలియకపోవడంతో యాక్టింగ్ కోర్స్ చేసింది. ఆ తర్వాత ఓ కన్నడ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ వెంటనే తెలుగులో నాని 'గ్యాంగ్ లీడర్'లో హీరోయిన్గా చేసింది. దీనితో పాటు శర్వానంద్ 'శ్రీకారం'లోనూ నటించింది. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అదే టైంలో తమిళ డైరెక్టర్ నెల్సన్ దృష్టిలో పడింది. అతడు తీసిన 'డాక్టర్' మూవీలో చేసింది. ఇది సూపర్ హిట్ కావడంతో ప్రియాంక దశ తిరిగింది. తమిళంలో డాన్, ఈటీ లాంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్, ఓజీ తదితర పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్) -
లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్
దర్శకులు నిర్మాతలుగా మారడం అన్నది మూవీ ఇండస్ట్రీలో కొత్తేం కాదు. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్.. ఈ రూట్లోకి వచ్చారు. వస్తూనే ఉన్నారు. 'లియో' లోకేష్ కనకరాజ్ కూడా ఈ మధ్యే 'జీ స్క్వాడ్' పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా నిర్మాత అయిపోయాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) 'జైలర్' తర్వాత నెల్సన్ డైరెక్ట్ చేసే మూవీ ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తన శిష్యుడు శివ బాలన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీస్తున్నాడు. లేడీ ఓరియంటెడ్ కథతో తీస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ లీడ్ రోల్ చేస్తోంది. గతంలో నెల్సన్ తీసిన ఫస్ట్ మూవీ 'డాక్టర్'లో ప్రియాంకనే హీరోయిన్. సో తన లక్కీ హీరోయిన్‌తోనే నెల్సన్.. తొలి చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ప్రియాంక సరసన కవిన్ హీరోగా నటిస్తున్నాడు. ఎస్జే సూర్య కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారు. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) -
Priyanka Arul Mohan : ప్రియాంక మోహన్ బ్యూటిఫుల్ (ఫొటోలు)
-
శివకార్తికేయన్ చేసిన పనివల్లే ప్రియాంకా మోహన్ బొద్దుగా అయిందా?
తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్న కన్నడ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. 2019లో ఒందు కథై హేల అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకగా పరిచయమైన నటి ఈమె. ఆ వెంటనే టాలీవుడ్లో నాని 'గ్యాంగ్ లీడర్' ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో పాగా వేసింది. ఇక్కడ శివకార్తికేయన్ సరసన డాక్టర్ చిత్రంలో నటించి దాంతో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ఏకంగా సూర్యతో రొమానన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ET) చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశ పరిచినా ప్రియాంక మోహన్‌కు పెద్దగా నష్టం జరగలేదు. ఆ వెంటనే మరోసారి శివకార్తికేయన్‌తో డాన్ చిత్రంలో జతకట్టే అవకాశం వరించింది. లక్కీగా ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అలా లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ తాజాగా ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ అమ్మడికి మరోసారి తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా నానితో 'సరిపోదా శనివారం' అనే చిత్రం ద్వారా రెండో సారి జతకట్టనుంది. ఆ సినిమా పూజా కార్యక్రమంలో ఆమె కొంచెం బొద్దుగా కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు వస్తుండటంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. అందులో ముఖ్యంగా నటుడు శివ కార్తికేయన్ గురించి మాట్లాడుతూ ఆయనతో తాను రెండు చిత్రాలు చేసినట్లు చెప్పింది. శివ కార్తికేయన్‌కు ఒక ఎడిక్ట్ ఉందని, ఆయన స్వీట్స్ ఎక్కువగా తింటారని చెప్పింది. షూటింగ్ స్పాట్లో కూడా స్వీట్స్ తింటూ పక్కనున్న వారికి కూడా ఇస్తారని చెప్పింది. అలా ఆయన తనను కూడా స్వీట్స్ తినమని ఒత్తిడి చేసే వారని చెప్పింది. అలా ఒక హీరో అయ్యుండి కూడా బరువు పెరుగుతాననే భయం కూడా శివకార్తికేయన్‌కు ఉండదని నటి ప్రియాంకా మోహన్ పేర్కొంది. అలా పరోక్షంగా తను ఎందుకు బొద్దుగా అయిందో ఇలా చెప్పకనే చెప్పిందా బ్యూటీ.. కాగా దక్షిణాది భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తరచూ తన గ్లామరస్ ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ ట్రెండింగ్ అవుతోంది. -
సరిపోదా శనివారం?
‘అంటే సుందరానికీ’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు. అలాగే ఈ నెల 23న ఓ అప్డేట్, 24న ఈ సినిమా ్ర΄ారంభోత్సవం జరపనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. -
విజయ్ డబుల్ రోల్.. జ్యోతికతో పాటు మరో హీరోయిన్ కూడా!
దళపతి విజయ్ ఇద్దరు భామలతో కలిసి నటించి చాలాకాలం అయ్యింది. అప్పుడెప్పుడో 2007లో అళగియ తమిళ్ మగన్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి శ్రియ, నమితలతో రొమాన్స్ చేశారు. ఆ తర్వాత బిగిల్ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేసినా ఇద్దరు హీరోయిన్లతో నటించలేదు. తాజాగా లియో చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్‌లు విజయ్‌తో జత కట్టారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది రెండు భాగాలుగా విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాగా విజయ్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. విశేషం ఏంటంటే ఇందులో విజయ్ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో నటి జ్యోతిక విజయ్ సరసన నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో హీరోయిన్గా నటించే అవకాశం నటి ప్రియాంక మోహన్‌ను వరించిందని సమాచారం. దీనికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, సిద్ధార్థ చాయాగ్రహణం అందించనున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇది విజయ్ నటించే 68వ చిత్రం. దీనికి సంబంధించి పూర్తి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: అనిరుద్ గురించి విజయ్ దేవరకొండ వైరల్ కామెంట్స్ -
పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్.. పోస్టర్ రిలీజ్
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటింస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. ఇటీవలె ముంబైలో షూటింగ్ ప్రారంభమయ్యింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తుందంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటినే నిజం చేస్తూ తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుందంటూ మేకర్స్ ట్విటర్ వేదికగా తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా గతంలో ఈ ముద్దుగుమ్మ నాని సరసన గ్యాంగ్ లీడర్, శర్వానంద్ సరసన శ్రీకారం చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పవన్ కల్యాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. 𝑷𝑹𝑰𝒀𝑨𝑵𝑲𝑨 𝑴𝑶𝑯𝑨𝑵… We are very happy & excited to have you on board for #OG. ❤️@PawanKalyan @PriyankaaMohan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing#TheyCallHimOG pic.twitter.com/OMED1rGkrF — DVV Entertainment (@DVVMovies) April 19, 2023 -
ధోని నిర్మించబోయే తొలి చిత్రంలో హీరో హీరోయిన్లు వీరే!
భారత మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ధోని, ఆయన సతీమణి సాక్షి కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తమిళంలో తొలి సినిమాను నిర్మించనున్నాడు. గ్రాఫిక్ నవల ‘అధర్వ: ది ఆరిజన్’ రచయిత రమేశ్ తమిళ్ మణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇందులో హీరో, హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనేది మాత్రం చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం ధోని నిర్మించబోయే తొలి చిత్రంలో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లు హీరో హీరోయిన్ లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం పేరున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ధోని నుంచి రాబోయే తొలి చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి. -
ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో ప్రియాంక మోహన్, నివేదితా సతీష్
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చెయన్నాడు. ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా ప్రియాంకా అరుళ్ మోహన్, నివేదితా సతీష్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘ధనుష్‌గారు చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ‘‘స్ఫూర్తి నింపే నటుడు ధనుష్ గారితో కలిసి నటించేందుకు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు నివేదితా సతీష్. 1930–1940 నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారు. జీవీ ప్రకాశ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. -
డైరెక్టర్‌తో మనస్పర్థలు? రజనీ ‘జైలర్’ నుంచి తప్పుకున్న హీరోయిన్!
కథానాయకిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి ప్రియాంక మోహన్. తెలుగు, మలయాళం చిత్రాలలో నటించిన ఈమె ఆ తరువాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నటించిన తొలి చిత్రం డాక్టర్. ఈ చిత్రం ఆమెకు సక్సెస్‌తో స్వాగతం పలికింది. ఆ తరువాత అదే హీరోతో రొమాన్స్ చేసిన డాన్ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. దీంతో కోలీవుడ్‌లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది. అయితే హీరో సూర్యకు జంటగా నటించిన ఎదుర్కుమ్ తుణిందవన్ చిత్రం ఈ అమ్మడిని నిరాశ పరిచిందనే చెప్పాలి. చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్ లుక్ వైరల్ అయినా ఆమెకు వరుసగా అవకాశాలు ప్రియాంక వస్తున్నాయి. వాటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రం కూడా ఒకటి. ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. కాగా ఈ చిత్రం నుంచి నటి ప్రియాంక మోహన్ వైదొలగినట్లు తాజా సమాచారం. దీని గురించి ఈ భామపై రకరకాల వదంతులు వస్తున్నాయి. చదవండి: అలనాటి హీరోయిన్ల మధ్య మీనా బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్ డాక్టర్ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు నెల్సన్‌తో మనస్పర్థలే చిత్రాన్ని ఆమె వదులుకోవడానికి కారణమనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ఇకపోతే ప్రియాంక మోహన్ వదులుకున్న పాత్రలోనే నటి తమన్నా నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక మోహన్ కూడా ఈ విషయమై స్పందించలేదు. ప్రస్తుతం ఆమె రాజేష్ దర్శకత్వం, జయం రవి కాంబినేషన్లో నిర్మిస్తున్న చిత్రంలో ఆమె నటిస్తోంది. -
జయం రవితో ప్రియాంక మోహన్ రొమాన్స్!
సినిమా హీరోయిన్ల విషయంలో ప్రతిభ కంటే అదృష్టం బాగా పని చేస్తుంది. సక్సెస్ వెంటేనే అవకాశాలు వరిస్తాయి. ఇవన్నీ నటి ప్రియాంక అరుళ్ మోహన్‌కు కరెక్ట్‌గా వర్తిస్తాయి. అమ్మడి అందం ఓకే అయినా, ఒడ్డు పొడుగులో మార్కులు తక్కువే పడతాయి. అయితే లక్ మాత్రం అందుకోనంత వేగంగా పరుగెడుతోందని చెప్పవచ్చు. ఇటీవల అందాలారబోత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తోంది. (చదవండి: కోలీవుడ్‌లో సంచలనం.. డైరెక్టర్ లింగుస్వామికి జైలు శిక్ష) తెలుగులో నానితో గ్యాంగ్ లీడర్ చిత్రం తరువాత ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ శివకార్తీకేయన్‌తో జత కట్టిన తొలి చిత్రం డాక్టర్, రెండో చిత్రం డాన్ వరుసగా విజయాలు సాధించడంతో అమ్మడు లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. మధ్యలో సూర్యతో ఎదర్కుమ్ తుణిందవన్ చిత్రంలోనూ నటించింది. అలా చాలా తక్కువ సమయంలో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఏకంగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న జైలర్ చిత్రంలో నటించే ఛాన్స్‌ను కొట్టేసింది. అదే విధంగా నటుడు జయం రవితో రొమాన్స్ చేస్తోంది. ఎం.రాజేష్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటిస్తున్నారు. ఇది ఆయన 30వ చిత్రం. ఇందులో ప్రియాంక మోహన్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఊటీలో ప్రారంభం అయ్యి తొలి సెడ్యూల్ను పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ చెన్నైలో మొదలు కానుంది. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఇతి ఇతివృత్తంతో కూడిన ఇందులో నటుడు నట్టి, వీటీవీ గణేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
దిక్కుతోచని స్థితిలో ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ..!
తమిళంలో రెండు హిట్ చిత్రాల్లో నటించినా ప్రియాంక మోహన్‌కు అవకాశాలు రావట్లేదట. 2019లో కన్నడ చిత్రం ద్వారా నటిగా పరిచయమైన బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్లో అడుగు పెట్టింది. తెలుగులో ఆమె ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్రీకారం’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత ఆమెను తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. అయితే కోలీవుడ్‌లో మాత్రం అవకాశాలు దక్కాయి. తమిళంలో డాక్టర్ చిత్రంతో ఎంట్రీ వచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో శివ కార్తికేయన్ డాన్ చిత్రంతో మరో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధ్యలో సూర్యతో ఎదుర్కుమ్ తుణిందవన్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ ఇక్కడ వరకు కథ బాగానే నడిచింది. ఇప్పుడే అమ్మడు అయోమయంలో పడింది. కొత్త చిత్రాలు అవకాశాలు కనుచూపు మేర కనిపించడం లేదట. ఇలాంటప్పుడు ఏ హీరోయిన్ అయినా అవకాశాల వేట పట్టక తప్పదు. అయితే కన్నడం, తెలుగు, తమిళం మూడు భాషల్లో నటించిన ప్రియాంక మోహన్ ఇప్పుడు ఏ భాషలో అవకాశాల కోసం ప్రయత్నించాలో తెలియక సతమతపడుతుందట. దీంతో ఆమె ప్రస్తుతం ఇన్‌స్ట్రాగామ్‌ను మార్గంగా ఎంచుకుంది. ఇటీవల వివిధ భంగిమల్లో రకరకాల గ్లామర్ దుస్తుల్లో ఫొటోషూట్ చేయించుకుని ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ ముందుగా ఏ భాషలో అవకాశం వస్తుందా? అని ఎదురు చూస్తోంది. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్..
Jr NTR Samantha Tollywood Most Popular Actors As Per Ormax Media 2022: వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనే టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి మోస్ట్ పాపులర్ నటుడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నటిగా స్టార్ హీరోయిన్ సమంత టాప్ 1 స్థానంలో నిలిచారు. తారక్ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. సామ్ తర్వాత కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేశ్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా ఉన్నారు. వీరితోపాటు బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరోగా అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. తర్వాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఉండగా చివరగా 10వ స్థానంలో వరుణ్ ధావన్ ఉన్నాడు. మోస్ట్ పాపులర్ హిందీ హీరోయిన్గా అలియా భట్ నిలిచింది. తర్వాత దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్, కృతి సనన్ ఉండగా, చివరిగా అనుష్క శర్మ చోటు దక్కించుకుంది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/wxyhPygor6 — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular female Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZWDBHowzxE — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular male Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/NgFZDHnbcw — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 Ormax Stars India Loves: Most popular female Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/OwerlKLNgo — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 తమిళంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా ఫస్ట్ ప్లేస్‌లో నయన తార నిలిచింది. తర్వాత సమంత, కీర్తి సురేశ్, త్రిశ, జ్యోతిక, ప్రియాంక మోహన్, తమన్నా, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, హంసిక ఉన్నారు. ఆరో స్థానంలో నిలిచిన ప్రియాంక మోహన్‌ను ఆల్‌టైమ్ హైయెస్ట్ ర్యాంక్‌గా ప్రకటించింది ఓర్మాక్స్ మీడియా. ఇక హీరోల విషయానికొస్తే మొదటి స్థానంలో విజయ్ ఉండగా తర్వాత అజిత్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్, శివకార్తికేయన్, రజినీ కాంత్, విక్రమ్, కమల్ హాసన్, శింబు నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/irsBaQz6K2 — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 All-time highest rank: Priyanka Mohan takes the no. 6 position, her best-ever rank on Ormax Stars India Loves #OrmaxSIL pic.twitter.com/DbTr9eQgIK — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 Ormax Stars India Loves: Most popular male Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZBwaSywyLB — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 హాలీవుడ్ హీరోయిన్లలో స్కార్లెట్ జాన్సన్, ఏంజిలీనా జోలీ, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్ లారెన్స్, గాల్ గాడోట్, ఎమ్మా స్టోన్, కేట్ విన్స్లెట్, ఎలిజబెత్ ఓల్సెన్, జెండయా, నటాలీ పోర్ట్మన్ వరుసగా ఉన్నారు. హీరోలలో టాప్ 1 ప్లేస్‌లో టామ్ క్రూజ్ ఉండగా, తర్వాతి స్థానాల్లో రాబర్ట్ డౌనీ జూనియర్, డ్వేన్ జాన్సన్, విల్ స్మిత్, టామ్ హోలాండ్, లియనార్డో డికాఫ్రియో, క్రిస్ హెమ్స్వోర్త్, విన్ డీసిల్, క్రిస్ ఇవాన్స్, జానీ డెప్ నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/7SZQM9GxKE — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 Ormax Stars India Loves: Most popular male Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/zxScetz4bj — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 -
అలా అయితేనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తా: హీరో శివకార్తికేయన్
Sivakarthikeyan About Pan India Movies: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా నటించిన డాన్ చిత్రం ఈ రోజు ప్రపపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శిబిచక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల నేపథ్యంలో గురువారం మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా చిత్రాలపై స్పందించాడు. ఐడియా కొత్తగా ఉంటేనే పాన్ ఇండియా చిత్రాలలో నటించడానికి తాను సిద్ధమని అన్నాడు. అనంతరం డాన్ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని, దర్శకుడు కథ చెప్పగానే కాలేజీ రోజులు గుర్తుకు రావడంతో వెంటనే నటించడానికి ఒకే చెప్పానన్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ఐలాన్ చిత్రాన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి తన ఎస్.కె.ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం -
ఈటీ (ఎవరికీ తలవంచడు) మూవీ రివ్యూ
టైటిల్: ఈటీ (ఎవరికీ తలవంచడు) నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ వర్మ, సత్యరాజ్ తదితరులు నిర్మాత: కళానిధి మారన్ రచన, దర్శకుడు: పాండిరాజ్ సంగీతం: డి. ఇమ్మాన్ సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు ఎడిటర్: రూబెన్ విడుదల తేది: మార్చి 10, 2022 సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈటీ (ఎదుర్కుమ్ తునిందవన్) తెలుగులో 'ఎవరికీ తలవంచడు' సినిమా వచ్చేసింది. విభిన్నమైన రోల్స్‌లో అదరగొట్టే సూర్య సినిమాలపై భారీగానే అంచనాలుంటాయి. ఇదివరకూ సూర్య చేసిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు కరోనా కారణంగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయితేనేం బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. సుమారు మూడేళ్ల తర్వాత 'ఎవరికీ తలవంచడు'తో థియేటర్లలోకి వచ్చాడు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. అమ్మాయిల సమస్యలపై పోరాడే పవర్ఫుల్ పాత్రలో సూర్య నటించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 10న (గురువారం) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. మరీ సూర్య నటించిన ఈటీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: దక్షిణపురంలో అందరితో సరదాగా గడుపుతూ జీవిస్తుంటాడు లాయర్ కృష్ణమోహన్ (సూర్య). ఇతడు ఉత్తరపురంలోని అధిర (ప్రియాంక అరుల్ మోహన్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు ప్రేమించుకునే క్రమంలోనే వారి గ్రామంలోని అమ్మాయిలు ఆత్మహత్యలు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతుంటారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం ఫలితముండదు. ఇదిలా ఉంటే కృష్ణ మోహన్, అధిరలు పెళ్లి చేసుకునే క్రమంలో అధిర స్నేహితురాలు ఆపదలో ఉన్నట్లు మెసేజ్ వస్తుంది. దీంతో ఆమెను కాపాడేందుకు వెళ్లిన లాయర్ కృష్ణమోహన్‌కు అమ్మాయిల ఆత్మహత్యలు, యాక్సిడెంట్లకు కారణం, ఆ చావుల వెనక ఉంది ఎవరనేది తెలుస్తుంది. సూర్య వారిని ఎదుర్కొన్నాడా? 500 మంది అమ్మాయిలను ఎలా కాపాడాడు ? దక్షిణపురం, ఉత్తరపురం గ్రామాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ? కృష్ణ మోహన్ చిన్నతనంలో తన చెల్లెలికి ఏం జరిగిందనేదే సినిమా కథ. ఎలా ఉందంటే ? రెండు గ్రామాల మధ్య జరిగిన సంఘటన ద్వారా ప్రారంభమైన సినిమా అమ్మాయిలపై జరిగే ఆకృత్యాల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ పాండిరాజ్. అమ్మాయిలు అంటే బలహీనం కాదు బలవంతులు అని చాటి చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మాయిలు మనోధైర్యంతో ఎలా ఎదుర్కొవాలో నేర్పిన చిత్రమిది. రొటీన్ ఫార్ములా అయినా పవర్‌ప్యాక్ యాక్షన్ సీన్స్‌తో మాస్ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించి మంచి సందేశమిచ్చారు. హీరో, విలన్ల మధ్య వచ్చే సీన్స్ ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ యాక్షన్ సీన్, మహిళల నగ్న చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూసే జనానికి వాటికి కారకులు ఎవరో తెలిసేలా చేయాలని చూపించే సీన్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తాయి. తప్పు చేయని మహిళలు కాదు అశ్లీల చిత్రాలు తీసేవారు సిగ్గుపడాలని చెబుతూ మహిళలకు ఈ సినిమాతో ధైర్యమిచ్చే ప్రయత్నం చేశారు. 'అబ్బాయిలు ఏడవద్దు అని చెప్పడం కాదు అమ్మాయిలను ఏడిపించొద్దని చెప్పండి' లాంటి మహిళల కోసం చెప్పే డైలాగ్స్ క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. డి. ఇమ్మాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందనే చెప్పవచ్చు. సీరియస్‌గా సాగే కథలో అక్కడక్కడా వచ్చే ప్రేమ సన్నివేశాలు, కామెడీ సీన్స్ ఉఫ్ అనిపిస్తాయి. అమ్మాయిల చావులకు కారణమేంటనే విషయం తెలుసుకోవాలని ఎదురుచూసే ప్రేక్షకుడికి ఈ సీన్స్ కొంచెం బోర్ కొట్టిస్తాయి. కానీ లాయర్ కృష్ణ మోహన్, అధిరల మధ్య వచ్చే లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కామెడీ బాగానే పండిందని చెప్పవచ్చు. ఆకాశమే హద్దురా, జైభీమ్ తరహాలో కాకపోయినా మహిళల పక్షాన నిలబడిన లాయర్ కృష్ణమోహన్ పాత్రలో నటించిన సూర్య 'ఈటీ' చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఎవరెలా చేశారంటే? విభిన్నమైన గెటప్పులతో, రోల్స్‌తో అదరగొట్టే సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎప్పటిలానే ఈ సినిమాలో లాయర్ కృష్ణ మోహన్‌గా తనదైన శైలిలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. అధిరగా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ నటన కూడా బాగుంది. ఫస్టాఫ్‌లో సాధారణ యువతిగా నటించి ఆకట్టుకున్న ప్రియాంక సెకండాఫ్‌లో అశ్లీల చిత్రాలకు గురైన బాధితురాలిగా పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే పాత్రలో చక్కగా నటించింది. ఇక కృష్ణమోహన్ తండ్రిగా సత్యరాజ్, అమ్మగా శరణ్య పొన్వన్నన్, దేవదర్శిని చేతన్, సుబ్బు పంచు తమదైన పాత్రమేరకు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కామ (వినయ్ రాయ్). స్త్రీలను కించపరుస్తూ మాట్లాడటం, వాళ్లను హింసించడం, అమ్మాయిలను వీఐపీలకు ఎరగా వేసి వాడుకునే కామేష్ పాత్రలో వినయ్ రాయ్ బాగానే నటించాడు. కార్తీ నటించిన 'చినబాబు' సినిమా ఫేమ్ పాండిరాజ్‌కు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇది మూడో సినిమా. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా తీయడంలో పాండిరాజ్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించి మహిళలపై జరిగే అరాచాకాలు, వారు ఎలా నిలదొక్కుకోవాలో చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో పూర్తిగా విజయం సాధించారనే చెప్పవచ్చు. అమ్మాయిలపై జరిగే ఆకృత్యాలు, అరాచకాలపై చాలానే సినిమాలు వచ్చాయి. అయితే అమ్మాయిలను పురుషులు చూసే కోణం మారనప్పుడు, మహిళలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే రోజు రానంతవరకూ ఇలాంటి ఎన్ని సినిమాలు వచ్చినా స్వాగతించడంలో తప్పులేదు. -
`ఈటీ` మూవీ ట్విటర్ రివ్యూ
హీరో సూర్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన హీరోగా నటించిన `ఆకాశం నీ హద్దురా`, `జై భీమ్` ఘన విజయం సాధించాయి. అయితే ఈ రెండు చిత్రాలు కరోనా కారణంగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. దాదాపు మూడేళ్ల తర్వాత సూర్య థియేటర్‌కి వస్తున్న చిత్రం `ఈటీ`(ఎవరికి తలవంచడు). పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ గురువారం (మార్చి 10) ఈటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అవేంటో చూద్దాం. #ET First Half 🔥 Interval Fight MARANAMASS 💥💥💥💥 — Rocky Bhai (@RockybhaiOffcl) March 10, 2022 ఫస్టాఫ్ మాస్ జాతరే అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇక సెకండాఫ్ డీసెంట్‌గా సాగుతుందట. 2022లో ఫస్ట్ రియల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే అని పేర్కొంటున్నారు. అలాగే సినిమాలో మహిళలకు సంబంధించిన అంశాలు చాలా బాగున్నాయని, పర్ఫెక్ట్ ఉమెన్స్ డే గిఫ్ట్ అంటున్నారు. #EtharkkumThunindhavan [4.5/5] : @Suriya_offl scores big time.. Any emotions.. He is much needed as he could convincingly sends out a sensitive message. From humor to Mass, he has done enough to satisfy both fans and general audience#EtharkumThunindhavan #ET #ETReview #ETFDFS pic.twitter.com/6njWqWDgkK — Swayam Kumar (@SwayamD71945083) March 10, 2022 #EtharkkumThunindhavan Good first half with same old masala things ... Afterwards very poor writing and full of cringe material... Music is very worst.. totally disaster 😭😭😭😭@Suriya_offl #EtharkkumThuninthavan #ET — Tech பாட்டி... (@Kavin506) March 10, 2022 Half way through #EtharkkumThuninthavan Full on packed entertainment. Loving it !! Suriya in #ET 🔥 — Venkatramanan (@VenkatRamanan_) March 10, 2022 #ET Movie Review.... First Real Blockbuster movie in 2022 💥 Guarantee ah TN la mattum 100cr eduthudum 💥#EtharkkumThunindhavan @Suriya_offl pic.twitter.com/fIHuSkNVi8 — சசிCasio (@Sasicasio) March 10, 2022 #EtharkkumThunidhavan Never expected this from @pandiraj_dir ! Yes it is an emotional family entertainer with mass elements well woved in. Intro, Interval and Climax ...pucca 🔥🔥🔥 Well done @pandiraj_dir ⚔️#ET is feast for mass movie audiences. 4/5#ETReview #ETFDFS — Kerala Boxoffice Stats (Wear Double Mask) (@kboxstats) March 10, 2022 #EtharkkumThunindhavan #ET 2nd half - Into the climax but I would like to write it now . Stamp Mar 10th, 22 as #Suriya’s official comeback . After donkeys years (almost 10 hrs) his muvi wil b celebrated by every1 in theatres 🔥🔥🔥 Hartick blockbusters for @Suriya_offl https://t.co/TWECwXnosn — Zaro (@toto_motto) March 10, 2022 -
ET Movie: మహిళలు గర్వపడే సినిమా ఇది
‘‘ఈటీ’ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో కనిపిస్తాను. ఇంట్రవెల్‌కు ముందు చాలా హ్యాపీగా కనిపించే నా పాత్ర, ఇంట్రవెల్ తర్వాత కాస్త సీరియస్‌గా కనిపిస్తుంది. ఇందుకు ఓ కారణం ఉంది. ఆ కారణం ఏంటో సినిమాలో చూడాలి’’ అన్నారు ప్రియాంకా అరుల్ మోహనన్. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈటీ’. ఇందులో ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్గా నటించారు. తమిళంలో కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో సునీల్ నారంగ్, డి. సురేశ్‌బాబు, ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం రేపు(గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ– ‘‘మహిళల అంశాలతో పాటుగా మనం న్యాయంగా ఉంటే ఎవరికీ తలవంచాల్సిన పని లేదనే దృష్టి కోణంలో ఈ సినిమాను పాండిరాజ్‌గారు తెరకెక్కించారు. నాది చాలా బాధ్యతాయుతమైన పాత్ర. సినిమాలో సూర్యగారికి, నాకు సమాన ప్రధాన్యత ఉంటుంది. ఇక ఈ సినిమా మహిళలను ఎడ్యుకేట్ చేసేలా ఉంటుంది. మహిళలు గర్వపడే సినిమా ఇది’’ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెబుతారు? అన్న ప్రశ్నకు స్పందిస్తూ– ‘‘మహిళలు ఏ రంగంలో ఉన్నా హ్యాపీగా ఉండాలి. పనిలో మీ ప్రతిభ చూపండి. సమస్య వస్తే ఎదుర్కోండి’’ అని అన్నారు. -
సినిమాకు ఎల్లలు లేవు – శివ కార్తికేయన్
‘‘థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు, చప్పట్లే నాకు ప్రేరణ.. రెండేళ్లుగా వాటిని మిస్ అవుతున్నా. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మీ చప్పట్లు, ఈలలు వింటుంటే సంతోషంగా ఉంది. సినిమాకు ఎల్లలు లేవు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని హీరో శివ కార్తికేయన్ అన్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘వరుణ్ డాక్టర్’. కోటపాడి జే రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ‘‘మా సినిమాలో చాలా వినోదం ఉంది’’ అన్నారు నెల్సన్ దిలీప్ కుమార్. ‘‘ఈ చిత్రంలో యాక్షన్, థ్రిల్, కామెడీ, మంచి కథ, కథనం ఉన్నాయి’’ అన్నారు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి. ‘‘ఈ చిత్రంలో నటించడం గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రియాంకా అరుల్ మోహన్. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, సంగీతం: అనిరుధ్.


