మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది: నాని | Saripodhaa Sanivaaram Trailer Launch | Sakshi
Sakshi News home page

మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది: నాని

Aug 14 2024 12:06 AM | Updated on Aug 14 2024 12:06 AM

Saripodhaa Sanivaaram Trailer Launch

‘‘హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌ నాకు చాలా స్పెషల్‌. ఈ థియేటర్‌లో మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) కలసి ‘సరిపోదా శనివారం’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన సినిమాతో ఈ నెలాఖరు అదిరిపోతుంది. మీ ప్రేమను నాపై ఇలానే చూపిస్తూ ఉంటే వంద శాతం కష్టపడి మరిన్ని మంచి చిత్రాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటా’’ అని హీరో నాని అన్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని, ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. 

డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ– ‘‘29న థియేటర్స్‌లో ‘సరిపోదా శనివారం’ని సెలబ్రేట్‌ చేసుకుందాం’’ అన్నారు.

నటుడు ఎస్‌జే సూర్య మాట్లాడుతూ– ‘‘చాలా మంచి కంటెంట్‌ ఉన్న చిత్రం ఇది.. తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా తర్వాత నానీగారితో ‘సరిపోదా శనివారం’ చేశాను. అందరూ కుటుంబంతో వెళ్లి మా సినిమా చూడండి’’ అని ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ చెప్పారు. ‘‘మా సినిమా మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంటుంది’’ అన్నారు డీవీవీ దానయ్య.

Advertisement
 
Advertisement
Advertisement