ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, ధనంజయ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో డా. వైశాఖ్ జె. గౌడ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకా మోహన్‌ని ఖరారు చేసినట్లు ప్రకటించింది చిత్రయూనిట్.
ఈ సందర్భంగా ప్రియాంకా మోహన్ మాట్లాడుతూ–‘‘శివ రాజ్‌కుమార్ సార్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన నటిస్తున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’లో భాగం కావడంతో నా కల నిజమైంది. ప్రతిభావంతులైన ధనంజయతో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు.


