రీసెంట్ టైంలో మ్యూజికల్ కన్సర్ట్స్ అనేది ట్రెండ్ అవుతుంది. ప్రముఖ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ర్యాపర్స్ పలు నగరాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అలానే ఇంటర్నేషనల్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ కన్సర్ట్.. ముంబైలో శుక్రవారం రాత్రి జరిగింది. కానీ చాలామందికి ఇదో పీడకలలా మిగిలింది. ఎందుకంటే లక్షలు విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముంబైలోని మహాలక్ష‍్మీ రేస్ కోర్సులో ఈ కన్సర్ట్ జరిగింది. వేలాదిమంది హాజరయ్యారు. స్టేజీకి దగ్గరలో చాలామంది గుమిగూడారు. ఇదే అదనుగా తీసుకున్న దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 24 ఖరీదైన మొబైల్ ఫోన్స్, 12 గోల్డ్ చెయిన్స్ దొంగతనానికి గురయ్యాయి. వీటి విలువ రూ.18 లక్షల వరకు ఉంటుంది. ఈ మేరకు కన్సర్ట్‌కి వచ్చిన చాలామంది.. సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ దొంగతనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. గోల్డ్ చెయిన్స్, ఫోన్స్‌కి సంబంధించిన వివరాలన్నీ తీసుకున్నారు. వీటిని పోగొట్టుకున్న వాళ్లలో ముంబై, సూరత్, బెంగళూరు, కేరళకు చెందిన పలువురు ఉన్నారు. ఏదేమైనా కన్సర్ట్‌కి వెళ్దామనుకునే చాలామందికి ఈ సంఘటన మేలుకొలుపు లాంటిదని చెప్పొచ్చు. చూడాలి మరి పోలీసులు ఈ కేసులో తర్వాత ఏం చేస్తారో?


