'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్ | Hrithik Roshan Trolls Him And War 2 Movie Failure Publicly | Sakshi
Sakshi News home page

Hrithik Roshan: తగిలిన దెబ్బ మర్చిపోలేకపోతున్నాడు.. మరోసారి హృతిక్ బాధ

Nov 22 2025 4:53 PM | Updated on Nov 22 2025 5:42 PM

Hrithik Roshan Trolls Him And War 2 Movie Failure Publicly

సాధారణంగా హీరోలు తమ సినిమా ఫ్లాప్ అయితే జీర్ణించుకోలేరు. ఒకవేళ ఇదే జరిగితే వీలైనంత వరకు దానిగురించి మాట్లాడరు. కచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తప్పించుకుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం కొందరు నిజాయితీగా ఒప్పేసుకుంటారు. ఇప్పుడు కూడా అలానే జరిగింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. అందరిముందు తన మూవీ ఫ్లాప్ అని చెప్పాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

ఈ ఏడాది రిలీజైన పాన్ ఇండియా సినిమాల్లో 'వార్ 2' ఒకటి. ఇందులో హృతిక్ రోషన్‌తో పాటు తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటించాడు. విడుదలకు ముందు చాలా హంగామా చేశారు. అభిమానులు కాలర్ ఎత్తుకుంటారని తారక్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. కట్ చేస్తే థియేటర్లలో మూవీ ఫ్లాప్ అయింది. తర్వాత ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయాడు. కొత్త ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు. కానీ హృతిక్ మాత్రం ఈ ఫలితాన్ని మర్చిపోలేకపోతున్నాడు.

(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)

కొన్నిరోజుల క్రితం 'వార్ 2' గురించి హృతిక్ ఓ ట్వీట్ చేశాడు. తన పని తాను చేశానని, కానీ అనుకున్న ఫలితం రాలేదన‍్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చాడు. కానీ తాజాగా దుబాయిలో జరిగిన ఓ లాంచ్ ఈవెంట్‌లో మాత్రం పబ్లిక్‌గా ఫ్లాప్ అని ఒప్పుకొన్నాడు. చెప్పాలంటే తనపై తానే ట్రోలింగ్ చేసుకున్నాడు.

ఈ ఈవెంట్‌ని హోస్ట్ చేసిన యాంకర్.. హృతిక్‌ని పొగుడుతూ సూపర్‌స్టార్‌ని చప్పట్లతో వెల్కమ్ చెప్పాలని అన్నాడు. స్టేజీ మీదకు వచ్చిన హృతిక్.. 'మీ అందరికీ ధన్యవాదాలు. నా లేటెస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్ అయింది. అయినా సరే మీరు ఇంత ప్రేమ, అభిమానం చూపుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా' అని హృతిక్ చెప్పాడు. మూవీ వచ్చి దాదాపు నాలుగు నెలలు అవుతున్నా హీరో.. మూవీ రిజల్ట్‌ని మర్చిపోలేకపోతున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ బోల్డ్ సిరీస్.. కొత్త సీజన్ టీజర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement