ప్రతి శుక్రవారం చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. వీటిలో ప్రేక్షకులకు నచ్చేవి, కలెక్షన్స్ తెచ్చుకునే చిత్రాలు కొన్ని ఉంటాయి. పెద్దగా స్టార్స్ లేకపోయినా సరే కొన్ని మూవీస్ అద్భుతాలు చేస్తుంటాయి. నిన్న (నవంబరు 21) విడుదలైన వాటిలో అలా 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమా మిగిలిన వాటితో పోలిస్తే మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో తొలిరోజు షాకింగ్ వసూళ్లు వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
తేజస్వి రావు, అఖిల్ రాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తీశాడు. టీజర్, ట్రైలర్, పాటలతోనే కాస్త ఆసక్తి రేపింది. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి టాక్ వచ్చింది. దీనితో పాటు అల్లరి నరేశ్ '12 ఏ రైల్వే కాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే' రిలీజైనప్పటికీ.. ఇవి అంతంత మాత్రంగానే ఉన్నాయని టాక్ వచ్చింది. దీంతో మూవీ లవర్స్.. 'రాజు వెడ్స్ రాంబాయి'కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అలా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.1.47 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ)
ఏ మాత్రం స్టార్స్ హీరోహీరోయిన్లు గానీ డైరెక్టర్ గానీ లేని ఈ సినిమాకు ఈ మాత్రం వసూళ్లు రావడం అంటే నిజంగా ఆశ్చర్యమే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మిగతా చిత్రాలతో పోలిస్తే ఇదే కాస్త లీడ్‌లో ఉంది. ఈ వీకెండ్‌తో పాటు వచ్చే వారం రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ అయ్యేవరకు ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో చూడాలి?
'రాజు వెడ్స్ రాంబాయి' విషయానికొస్తే.. 2010లో ఖమ్మం దగ్గర ఓ పల్లెటూరిలో జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) పెళ్లిళ్లకు బ్యాండ్ కొడుతుంటాడు. అదే ఊరిలో ఉండే రాంబాయిని(తేజస్వి రావు)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా రాజు ప్రేమలో పడిపోతుంది. కానీ తనకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలనేది రాంబాయి తండ్రి వెంకన్న(చెతన్య జొన్నలగడ్డ) పట్టుదల. ఇంతలోనే రాజు-రాంబాయి ప్రేమ విషయం ఊరంతా తెలిసిపోతుంది. దీంతో వీళ్లిద్దరూ ఊరి వదిలి పారిపోవాలనుకుంటారు. తర్వాత ఏమైంది? చివరకు ప్రేమలో విజయం సాధించారా లేదా అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'రాంబాయి'గా తేజస్వీ.. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)


