‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం : మంచు మనోజ్
‘‘ఒక పల్లెటూరులో జరిగిన వాస్తవ ఘటనలతో రూపొందిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాగే బోలెడన్ని అవార్డ్స్ వస్తాయి’’ అని హీరో మంచు మనోజ్ చెప్పారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా సాయిలు కం΄ాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘రాంబాయి నీ మీద నాకు...’ అంటూ సాగే ΄ాటను హీరో మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ తర్వాత సాయిలుకు బెదిరింపు కాల్స్ వస్తాయి. అప్పుడు తనకు సపోర్ట్‌గా నేనుంటాను’’ అన్నారు. ‘‘గతించిన చరిత్రకు, ప్రస్తుత చరిత్రకు మా సినిమా ఓ సాక్ష్యం’’ అన్నారు వేణు ఊడుగుల. ‘‘మా సినిమా చూస్తున్నవాళ్లకు తమ ప్రేమ గుర్తుకొస్తుంది’’ అన్నారు సాయిలు. ‘‘సూపర్ హిట్ ఆల్బమ్ అనే మాట మా సినిమాతో మళ్లీ వినిపిస్తుందని నమ్ముతున్నాం’’ అని పేర్కొన్నారు రాహుల్ మోపిదేవి.