అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటిస్తోన్న తాజా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఈ మూవీకి సాయిలు దర్శకత్వం వహించారు. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
(ఇది చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం : మంచు మనోజ్)
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాను ప్రేమించిన అబ్బాయికి.. కుటుంబానికి మధ్య నలిగిపోయే ఓ అమ్మాయి కథే ఈ రాజు వెడ్స్ రాంబాయి అని ట్రైలర్‌లోనే తెలిసిపోతుంది. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది.
Their hearts beat as one, their love faces every storm ❤️🔥
Experience the Emotionally Stirring & heart-touching trailer of the Greatest love saga #RajuWedsRambai ❤️❤️
▶️ https://t.co/lrlbW9zT95
Launched by The Star of New Age Films @AdiviSesh garu💫#RajuWedsRambaiOnNov21st pic.twitter.com/RufYYOLkvA— Dolamukhi Subaltern Films (@dsfofficial_) November 13, 2025


