అఖిల్ రాజ్(Akhil Raj), తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. నవంబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాకు నెగటివ్ టాక్ వస్తే తాను అమీర్‌పేట్ సెంటర్‌లో అర్ధనగ్నంగా తిరుగుతానంటూ చిత్ర దర్శకుడు సాయిలు సంచలన కామెంట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్‌ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ‘‘2004లో పల్లెటూరులో జరిగిన వాస్తవ ఘటనలతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈక్రమంలోనే దర్శకుడు సాయిలు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని ఆయన అన్నారు. తనకు ఎక్కువగా పల్లెటూరి కథలంటేనే ఇష్టమని, ఈ క్రమంలోనే ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ తెరపైకి వచ్చిందన్నారు. అమాయకంగా ఉండే ఆటోడ్రైవర్లు, కాలేజీల్లోని అమ్మాయిలు.. వారి మధ్య పుట్టే మొరటు ప్రేమ.. ఇవే నాకు తెలుసు. 15 ఏళ్లపాటు ఒక జంటకు నరకం చూపించిన స్టోరీనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూసిన తర్వాత మీకు నచ్చకపోతే వదిలేయండి. కానీ, నెగెటివ్‌గా మాట్లాడకండి. 21వ తేదీన ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వస్తే అమీర్‌పేట్ సెంటర్‌లో అర్ధనగ్నంగా తిరుగుతాను. ఇంత కాన్ఫిడెంట్ ఉందికాబట్టే ఈ మాట చెబుతున్నాను.' అని దర్శకుడు సాయిలు పేర్కొన్నాడు.
ఈ చిత్రాన్ని 7 జీ బృందావన్ కాలని, ప్రేమిస్తే, బేబి, సైరత్ వంటి కల్ట్ మూవీస్ తో పోల్చుకోవచ్చని మేకర్స్ తెలిపారు. ఆ చిత్రాల్లాగే ఈ సినిమా కూడా కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుందని టీమ్ తెలిపింది. మూవీ చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ఆడియెన్స్ కూడా మేము ఇలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకుంటారన్నారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా రూపొందించినా కొంత సినిమాటిక్ లిబర్టీ కూడా మూవీలో ఉంటుందన్నారు.
"Cinema కి Negative Talk వస్తే Ameerpet center లో cut drawer మీద తిరుగుతా" - #RajuWedsRambai director pic.twitter.com/ORLYH9ePK3
— Daily Culture (@DailyCultureYT) November 19, 2025


