రీతూతో బంధం.. అమ్మతో పంచుకున్న డిమాన్‌ పవన్‌ | Bigg Boss Telugu 9 Nov 19th Episode Highlights, Demon Pavan, Divya And Sanjana Family Entered In BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 9: రీతూతో బంధం.. అమ్మతో పంచుకున్న డిమాన్‌ పవన్‌

Nov 20 2025 10:45 AM | Updated on Nov 20 2025 11:29 AM

Demon Pavan with his mother in bigg boss 9 telugu house

బిగ్‌బాస్ 9 తెలుగులో ఫ్యామిలీ వీక్‌ కొనసాగుతుంది. కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు వస్తున్నారు. బుధవారం ఎపిసోడ్‌లో డీమాన్ పవన్ తల్లి పద్మ, సంజన ఫ్యామిలీ, దివ్య అమ్మ శ్రీలక్ష్మీ సందడి చేశారు.  పిల్లల మీద ఒక తల్లి ఎప్పటికీ స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తుంది. ఈ ఎపిసోడ్‌ అంతా  తల్లుల ప్రేమ చుట్టూ తిరిగింది. వారి అల్లరి, ప్రేమ, కన్నీళ్లు అన్నింటికి ప్రేక్షకులు కూడా కనెక్ట్‌ అయిపోయారు. ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా బిగ్‌బాస్‌ కూడా గట్టిగానే ప్లాన్‌ చేశాడని చెప్పాలి.

రీతూతో ఉండటానికి కారణం ఇదే: పవన్‌
డిమాన్‌ పవన్‌ మన ఇంట్లో పిల్లోడిలా ఉంటాడు. ఎలాగైనా సరే తన కలలు నెరవేర్చుకోవాలని పోరాడే మధ్యతరగతి కుర్రోడిలా కనిపిస్తాడు. రీతూ విషయంలో తనని మోకాళ్ల మీద నిల్చోపెట్టినా సరే జీవితంలో గెలవాలనే భరించాడు. బిగ్‌బాస్‌లో పవన్‌ ఆటను చూసి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతని అమ్మగారు చాలా ఎమోషనల్‌ అయ్యారు. తన బిడ్డ ఇంట్లో ఉన్న సమయంలో ఎలాంటి పనిచేసేవాడు కాదంటూ ఒక మధ్యతరగతి తల్లిలా చెప్పే మాటలు మెప్పిస్తాయి. పవన్‌ను హగ్‌ చేసుకుని గోరుముద్దలు తినిపించడం.. తన తండ్రి ఆరోగ్యం ఎలా ఉందని పవన్‌ అడుగుతూనే.. ఆయన గురించే  బెంగగా ఉందంటూ డిమాన్ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో పవన్‌ను ఓదారుస్తూ.. లేదురా ఏం బాధపడకు.. మొన్నటి కంటే ఇప్పుడే బావున్నారని ఆమె ధైర్యం నింపింది. 

అయితే, రీతూతో  బాండింగ్‌ పెరగడానికి కారణం ఇలా చెప్పాడు. ' ఇక్కడ మొదట్లో నాకు ఎవరూ సపోర్ట్ చేయకపోయినప్పటికీ రీతూ మాత్రమే ఫస్ట్‌ నుంచి నాతో ఉంది. ఆమె మాత్రమే నాకు సపోర్ట్‌గా నిలబడింది. ప్రతి టాస్క్‌లో నేను స్ట్రాంగ్‌  అంటూ ఇతర కంటెస్టెంట్స్‌ తీసేస్తున్నారు. అలాంటి సమయంలో రీతూ నాకోసం మాట్లాడేది. మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్లని మనమూ బాగా చూసుకోవాలి కదమ్మా.. అందుకే  ఆమెతోనే ఎక్కువసేపు ఉంటున్నాను . అయితే, పవన్‌ మదర్‌ కూడా ఏం కాదులే అంటూ ఊ కొట్టారు.  ఫ్యామిలీ ఫొటో టాపిక్‌ విషయంలో కూడా అర్థం చేసుకున్నాం అని ఆమె చెప్పింది. పవన్‌ను మోకాళ్ల మీద నిల్చోపెట్టడం కాస్త బాధగా అనిపించిందని ఆమె చివరగా చెప్పింది.

సంజన ఫ్యామిలీ కోసం ఇమ్మానియేల్, కల్యాణ్‌ త్యాగం
బిగ్ బాంబ్  వల్ల సంజనాకు ఫ్యామిలీ వీక్ లేదని నాగార్జున చెప్పారు. కానీ, హౌస్‌మేట్స్‌లో ఎవరైనా ముగ్గురి దగ్గరి నుంచి వారి ఫ్యామిలీతో గడిపపే టైమ్ నుంచి కొంత అడిగి తీసుకోవచ్చని బిగ్‌బాస్‌ ఆఫర్‌ ఇస్తాడు. దీంతో   ఇమ్మానుయేల్ తన 45 నిమిషాల ఫ్యామిలీ టైమ్ నుంచి 15 నిమిషాలు త్యాగం చేశాడు. కల్యాణ్‌ కూడా తన 15 నిమిషాల నుంచి 5 నిమిషాలు ఇచ్చేందుకు సిద్ధపడితే.. సంజనా తన నుంచి ఒక్క నిమిషం మాత్రమే తీసుకుంది. అలా ఫైనల్‌గా సంజనా తన భర్తతో పాటు పిల్లలను కలుసుకుంది.

తనూజ నా పెద్ద కూతురు: దివ్య అమ్మ
దివ్య మదర్‌ శ్రీలక్ష్మీ అదరగొట్టేశారు. అందరికంటే ఆమె చాలా ప్రత్యేకంగా కనిపించారు. హౌస్‌లోకి అడుగుపెట్టిన సమయం నుంచి అందరినీ తెగ నవ్వించారు.  దివ్య కంటే ఇతర హస్‌మేట్స్‌తోనే ఆమె ఎక్కువగా మాట్లాడుతూ మెప్పించారు. దివ్య తల్లి మాటలకు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. దివ్య తన అమ్మతో ఉన్న అనుబంధాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించింది. దివ్య చిన్నతనంలో చేసిన అల్లరి విశేషాలను వారితో సరదాగా పంచుకుంది. భరణి తనకు సొంత  అన్నయ్య మాదిరి కనిపిస్తారని చెప్పింది. ఆపై తనూజ తనకు పెద్ద కూతరులాంటిదని హగ్‌ చేసుకుంది. ప్రతి ఇంట్లో పెద్ద కూతురులా తనూజ కనిపిస్తుందని మెచ్చుకుంది. తనూజ మాదిరే మా పెద్ద అమ్మాయి కూడా ఉంటుందని చెప్పింది. ఇక డిమాన్‌ పవన​్‌-రీతూ రిలేషన్ గురించి మాట్లాడుతూ పంచ్‌లు వేసింది. ఈ ఎపిసోడ్‌ మొత్తం దివ్య మదర్‌ క్రాక్‌ చేసి రచ్చలేపిందని చెప్పాలి. దివ్య కంటే మరింత స్పోర్టివ్‌గా ఆమె ఉండటం విశేషం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement