ది రాజాసాబ్ మూవీ మేకర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు కోరుతూ నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో సాధారణ ధరలకే తెలంగాణలో ది రాజాసాబ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నిర్ణయంతో ది రాజాసాబ్ నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది.
కాగా.. మారుతి డైరెక్షన్లో తెరకెక్కించిన హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా వస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో రిద్ధికుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.


