‘ఐబొమ్మ వన్‌’ పేరుతో మరో వెబ్‌సైట్‌.. సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ | Movie Piracy Portal Ibomma Name As Creator of Ibomma One | Sakshi
Sakshi News home page

‘ఐబొమ్మ వన్‌’ పేరుతో మరో వెబ్‌సైట్‌.. సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌

Nov 20 2025 9:08 AM | Updated on Nov 20 2025 9:08 AM

Movie Piracy Portal Ibomma Name As Creator of Ibomma One

సినిమా పైరసీ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌ తర్వాత ‘ఐబొమ్మ’ (Ibomma), ‘బప్పంటీవీ’ (Bappamtv) పూర్తిగా క్లోజ్‌ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌ నిర్మాతలు, సినీ నటులు సీసీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ఇమ్మడి రవి లాంటి వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని నిర్మాత సీ కల్యాణ్‌ కామెంట్‌ కూడా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే  ఇంటర్నెట్‌లో కొత్తగా ‘ఐబొమ్మ వన్‌’ వెబ్‌సైట్‌ తెరపైకి వచ్చింది.

గతంలో ఉన్న ఐబొమ్మ మాదిరిగానే కొత్త సినిమాలు అందులో ఉన్నాయి. సినిమాను చూసేందుకు క్లిక్‌ చేస్తే ‘మూవీరూల్స్‌’కు కనెక్ట్‌  కావడం గమనార్హం. అలా మళ్లీ తెరపైకి ఐబొమ్మ పేరు వచ్చేసింది. ఈ రకంగా పైరసీ ద్వారా  సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.  ఐబొమ్మ క్లోజ్‌ కావడంతో ఇండస్ట్రీ, పోలీసులు సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఐబొమ్మ వన్‌ తెరపైకి రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement