అచ్చం షోలే మూవీని తలపించేలా..బామ్మల బైక్‌ రైడ్‌..! | Ahmedabads 87 Year Old Elderly Woman And Her Sister Ride Goes viral | Sakshi
Sakshi News home page

అచ్చం షోలే మూవీని తలపించేలా..బామ్మల బైక్‌ రైడ్‌..!

Nov 19 2025 1:09 PM | Updated on Nov 19 2025 5:20 PM

Ahmedabads 87 Year Old Elderly Woman And Her Sister Ride Goes viral

వయసు శరీరానికే గానీ మనసుకు కాదని చాలామంది ప్రూవ్‌ చేస్తున్నారు. అయితే ఈ బామ్మలు వారందరికంటే ఇంకాస్త ముందడుగు వేసి..ఏకంగా చలాకీగా బైక్‌ రైడ్‌ చేస్తూ..సాహస యాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరు వృద్ధ మహిళలు చూస్తే..ఓల్డ్‌ ఏజ్‌ అని అనిపించదు..బంగారంలా బతకడం అంటే ఏంటో తెలుస్తుంది.!.

ఆ బామ్మలే అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు వృద్ధ అక్కాచెల్లెళ్లు. 87 ఏళ్ల మందాకిని షా తన చెల్లెలు ఉషతో కలిస స్కూటర్‌పై సాహసయాత్రలు చేస్తోంది. అంతేగాదు తన చెల్లెలుతో ఉన్న సాన్నిహిత్యం, సాహసయాత్రల పట్ల ఉన్న అభిరుచి కలగలసి ఇలా తనతో కలిసి చుట్టిరావడానికి పురిగొల్పిందని అంటోంది. ఇంత ఏజ్‌లోనూ ఆ బామ్మ మందాకిని చాలా చలాకీగా స్కూటర్‌ నడిపేస్తుంటుంది. అయితే ఈ బామ్మ 62 ఏళ్ల వయసులో ఉన్నప్పుడూ స్కూటర్‌ నడపడం నేర్చుకుందట. 

ఆరుగురు తోబుట్టువులో పెద్దది కావడంతో చిన్న వయసులోనే బాధ్యతలను నిర్వహించడం అలవాటైపోయిందట ఆమెకు. స్వాతంత్ర సమరయోధుడైన ఆమె తండ్రి వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉండేవాడట. కానీ చేతిలో చిల్లిగవ్వ లేక వ్యాపారం చేసే సాహసం చేయలేకపోయాడట. తన కుటుంబంలో తరుచు డబ్బు కొరత బాగా ఉండేదని, అందుకోసం తన తల్లి ప్రతి రోజు ఎంతలా కష్టపడేదో దగ్గరగా చూశానని అంటోంది. బహుశా అదే తనలో ఆత్మవిశ్వాసం పెంచి తన కాళ్లపై తాను నిలబడేందుకు దారితీసిందని చెబుతోంది. 

16 ఏళ్ల వయసులో తనకు ఇంగ్లీష్‌ సరిగా రాకపోయినా..బాల్‌ మందిర్‌లో మాంటిస్సోరి స్కూల్లో టీచర్‌ పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపింది. తర్వాత సామాజికి సంక్షేమ ప్రాజెక్టుల్లో పాల్గొనడం ప్రారంభించానని, దాంతో ఆమెకు మహిళా సంఘాలు, పంచాయతీ సమావేశాలు తదితర వాటిల్లో పాల్గొనే అవకాశం లభించిందని చెప్పుకొచ్చింది. ఆనేపథ్యంలోనే తానుమోపెడ్‌, జీపు నడపడం వంటివి నేర్చుకున్నట్లు వివరించింది. 

అలా 62 ఏళ్ల వయసులో సెకండ్‌హ్యాండ్‌ స్కూటర్‌ నడపడం నేర్చుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికీ తాను, తన సోదరి ఇద్దరం కలిసి నగరం చుట్టేసి వచ్చేస్తుంటామని నవ్వుతూ చెబుతోంది. అయితే స్థానికులు ఆ బామ్మను ఎందుకు వివాహం చేసుకోలేదని తరుచుగా అడుగుతుంటారట. అయితే బామ్మ ఒకప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకుందట. అయితే జీవితం మరో మార్గాన్ని చూపించడంతో ఆ దిశగా కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇక బామ్మ మందాకిని చివరగా.. పూర్తిగా జీవితాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తిని ఏది ఆపలేదని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. ఈ బామ్మ ఈ తరానికి ఎంతో స్ఫూర్తి కదూ..! 

 

(చదవండి: ఉద్యోగం ఐటీ..నాట్యంలో మేటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement