తెలుగు నటుడు శివాజీ (Sivaji) వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రాజేశాయి. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే, ఉత్తరాఖండ్ మహిళా, శిశు సంక్షేమ మంత్రి రేఖ ఆర్య భర్త గిరిధారి లాల్ సాహు అమ్మాయిలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. బిహార్ అమ్మాయిలు రూ.20-రూ.25 వేలకే పెళ్లికి అందుబాటులో ఉంటారంటూ అవమానకరంగా వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
గత నెలలో అల్మోరాలో జరిగిన ఒక కార్యక్రమంలో గిరి ధారి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ‘‘మీరు వృద్ధాప్యంలో పెళ్లి చేసుకుంటారా? మీరు పెళ్లి చేసుకోలేకపోతే, మేం మీ కోసం బిహార్ నుండి ఒక అమ్మాయిని తీసుకొస్తాం... అక్కడ రూ.20,000 నుండి 25,000 ధరకు ఒక అమ్మాయిని తెచ్చుకోవచ్చు" అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఖండించాయి. విషయంపై బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
Husband of the minister Rekha Arya in BJP government in Uttarakhand, Girdhari Lal, said:
“Women for marriage are available in ₹20-25k in Bihar. Come with me, I will get you one.”
This is the mentality of the BJP. After winning Bihar by bribing women voters, the BJP is now… pic.twitter.com/hgqImwPaua— Saral Patel (@SaralPatel) January 2, 2026
తప్పే.. క్షమించండి!
అంతేకాదు ఈ గొడవ తర్వాత తన మాటలను వక్రీకరించారంటూనేసాహు క్షమాపణలు చెప్పాడు. ‘‘నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే, నేను చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను" అంటూ సాహు ఒక వీడియో విడుదల చేశాడు.
బీజేపీ స్పందన
బీజేపీ రాష్ట్ర విభాగం దీన్ని ఖండించింది. సాహుకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. పార్టీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ మన్వీర్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, తమ పార్టీ ఇటువంటి ద్వేషపూరిత భావజాలాన్ని, మహిళలపై అనుచిత ప్రేలాపనలను తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.
చదవండి: ధర్మశాలలో ర్యాగింగ్ భూతం : పోరాడి ఓడిన 19 ఏళ్ల పల్లవి
మహిళా కమిషన్ నోటీసులు
కాంగ్రెస్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రౌతేలా మాట్లాడుతూ, స్వయంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమంత్రి భర్త మహిళలపై ఇంత అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. దీనికి స్పందించిన బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ (BSWC) సాహుకు నోటీసులందించేందుకు సిద్ధపడుతోంది. ప్రభుత్వ మంత్రి భర్తగా ఇలాంటి వ్యాఖ్యలు ఖండించదగినవని, ఇది అతని మానసిక స్థితికి అద్దం పడుతోందంటూ BSWC చైర్‌పర్సన్ అప్సర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్


