మావోయిస్టుల అరెస్ట్ అప్‌డేట్స్..
విజయవాడ:
- 50 మంది మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు.
- ప్రత్యేక అనుమతితో ఐదు జిల్లాల పరిధిలో అరెస్టయిన మావోయిస్టులను విజయవాడ కోర్టుకు తరలింపు.
- మావోయిస్టులందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు.
- మరికొద్ది సేపట్లో భారీ భద్రత నడుమ మావోయిస్టులను కోర్టుకు తరలించనున్న పోలీసులు
మీడియా ముందుకు మావోయిస్టులు
- ఏపీలో నిన్న పట్టుబడిన 50 మంది మావోయిస్టులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
- ఈ సందర్భంగా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు.
కాసేపటి క్రితమే ఏపీలో పట్టుబడిన 50 మంది మావోయిస్టులను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పోలీసులు తరలించారు. భారీ భద్రత నడుమ మావోయిస్టులను ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మ్యాగ్జైన్లు, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్స్, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను స్వాధీనం చేసుకుని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించిన పోలీసులు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఏపీలో హైఅలర్ట్ కొనసాగుతోంది.
నిఘా వర్గాలు అలర్ట్..
ఇదిలా ఉండగా.. అల్లూరి జిల్లాలోని దండకారణ్యంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత ఏజెన్సీలో హై అలర్ట్ జారీ చేశారు. మావోయిస్టులు అడవిని వీడుతున్న నేపథ్యంలో అర్బన్ ప్రాంతాల్లోనూ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. విజయవాడ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకోవడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏజెన్సీకి సమీపంలో ఉన్న ప్రాంతాల్లోకి మావోయిస్టులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు.


