విజయవాడలో మావోయిస్టుల కలకలం.. 27 మంది అరెస్ట్‌ | Vijayawada SIB Trace Maoists In Kanuru Full Details Here | Sakshi
Sakshi News home page

విజయవాడలో మావోయిస్టుల కలకలం.. 27 మంది అరెస్ట్‌

Nov 18 2025 12:31 PM | Updated on Nov 18 2025 1:56 PM

Vijayawada SIB Trace Maoists In Kanuru Full Details Here

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మంగళవారం కానూర్‌(పెనుమలూరు) కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(SIB) భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. బిల్డింగ్‌ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టు సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది.

ఆపరేషన్‌ కగార్‌ ప్రభావంతో మావోయిస్టులు, సానుభూతిపరులు పట్టణాళ్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టిన పోలీసులకు ఆరుగురు అనుమానాస్పద రీతిలో పట్టుబడ్డారు. వీళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. న్యూ ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని షెల్టర్‌ జోన్‌గా మార్చుకున్నారని నిర్ధారణ అయ్యింది. 

భారీగా ఆయుధాలు డంప్‌ చేసి ఉంటారని భావించిన అధికారులు.. అక్టోపస్‌ పోలీసుల సాయంతో భవనాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించారు. ఆపై అందరినీ అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్‌ ఆఫీస్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ పరిణామంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement