బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం.
ఈ ఆలయం కరీంనగర్ జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, అయితే ప్రస్తుతం ఈ ఆలయం సిద్దిపేట జిల్లాలో ఉంది.
ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ సందర్భంగా జరిగే లక్ష్మీ నరసింహ స్వామి జాతర చాలా ప్రసిద్ధి చెందింది మరియు తెలంగాణలో జరిగే పెద్ద జాతరలలో ఒకటి. ఈ సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.
భారీ ఎత్తున ఉన్న కొండ లాంటి రాయి చుట్టూ జరిగే రథోత్సవం కనువిందుగా ఉంటుంది.


