విజయవాడL ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. విజయవాడలో 248 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి యూపీ తరలించేందుకు విజయవాడలో ఉంచిన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా యూపీకి గంజాయి తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 50 లక్షల రూపాయల ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి తరలించడానికి సిద్ధం చేసిన రెండు లారీలను సీజ్ చేశారు అధికారులు.


