సాక్షి, విజయవాడ: హైకోర్టు చెప్పినా లెక్క చెయ్యని చంద్రబాబు ప్రభుత్వం.. హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి పోస్టింగ్ ఇచ్చింది. మార్టూరు సీఐగా యార్లగడ్డ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
గతంలో మంగళగిరి రూరల్ సీఐగా పనిచేసిన యార్లగడ్డ శ్రీనివాసరావు.. హైకోర్టు డ్రైవర్‌పై దాడి చేశాడు. అదే కేసులో గతంలో సీఐని ప్రభుత్వం వీఆర్‌కు పంపింది. సీఐపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హైకోర్టు ఆదేశంతో సీఐపై కేసు నమోదైంది. అదే సీఐకి చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్‌గా మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. సీఐకి పోస్టింగ్ ఇవ్వడంపై పోలీసు, హైకోర్టు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.


