ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి సింగపూర్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ శనివారం నుంచి విమాన సేవలను పునఃప్రారంభించింది. సింగపూర్ నుంచి విమానం 151 మంది ప్రయాణికులతో ఉదయం 7.45 గంటలకు ఇక్కడికి చేరుకుంది.అనంతరం 10 గంటలకు 119 మంది ప్రయాణికులతో సింగపూర్ బయలుదేరి వెళ్లింది.
ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ విమానాలు నడుస్తాయని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఈ సర్వీసుల వల్ల సింగపూర్‌తో పాటు ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు వెళ్లేందుకు సులభమవుతుందన్నారు.


