‘కూటమి నేతలు కల్తీ రాజకీయాలు చేస్తే సహించేది లేదు’ | YSRCP Pithapuram Incharge Vanga Geetha Slams Chandrababu Govt Over Tirumala Ghee Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

‘కూటమి నేతలు కల్తీ రాజకీయాలు చేస్తే సహించేది లేదు’

Feb 17 2026 3:11 PM | Updated on Feb 17 2026 3:30 PM

YSRCP Pithapuram Incharge Vanga Geetha Takes On Chandrababu Govt

కాకినాడ:  కూటమి నేతలు కల్తీ రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ వంగా గీతా. మహా శివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదగయ సాక్షిగా ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ తిరుమల పవిత్రతను రోడ్డెక్కించారని ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూ ప్రసాదంపై కల్తీ ఆరోపణలు చేసిన కూటమి నాయకులు.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు వంగా గీతా. 

రాష్ట్ర బడ్జెట్‌లో సూపర్‌సిక్స్‌ పథకాలకు పంగనామం పెట్టిన కూటమి ప్రభుత్వం.. పథకాలకు నిధులు కేటాయించకుండా గుడ్డి సున్నా చూపించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులక పాల్పడి అక్రమ కేసుల పెట్టడమేనా పరిపాలన అంటే? అని ఆమె నిలదీశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement