థాయిలాండ్‌లో జరుగుతున్న మిస్ యూనివర్స్ పోటీలో మానికా విశ్వకర్మ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆదివారం జరిగిన చైన్‌రియాక్షన్ ప్రశ్న సెషన్‌లో ఇతర పోటీదారుల తోపాటు మానికా విశ్వకర్మ కూడా పాల్గొన్నారు. ఆ రౌండ్‌లో ఒక ఇంటర్వ్యూర్ మానికాను మాజీ మిస్ యూనివర్స్ (1994) సుష్మితా సేన్ అడిగిన ప్రశ్ననే అడగడం విశేషం. అందుకు చాలాచక్కగా సమాధానం ఇచ్చి..తాను వేషధారణతోటే కాదు, తెలివితేటలతో కూడా మెప్పించగలనని చెప్పకనే చెప్పింది.
అప్పుడు మిస్‌యూనివర్స్ ఫైనల్ సుష్మితా సేన్‌ని 'మీకు స్త్రీగా ఉండటంలో సారాంశం ఏమిటి?' అనే ప్రశ్న ఎదురైంది. అదే ప్రశ్న మళ్లా ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 22 ఏళ్ల మానికాకు యాధృచ్ఛికంగా ఎదురైంది. అయితే మానికా ఏం సమాధానం ఇచ్చిందంటే..
నాడు సుష్మితా చాలా సింపుల్‌గా ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. స్త్రీగా ఉండటం అంటే జీవితాన్ని పోషించగల సామర్థ్యం, మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని పోషించగల సామర్థ్యం అని చెప్పగా, మానికా ఇలా చెప్పింది. "మహిళలను సమాజం తరుచుగా పలు పాత్రల్లో చూస్తుంటుంది. అయితే మహిళలు మాత్రం తాము ఒక వ్యక్తిగా మానవుడిగా చూడాలని కోరుకుంటారు.
మాకు పెంచే సామర్థ్యం, జీవితాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. అంతేగాదు మా చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని అందంగా తీర్చిద్దిగల సామర్థ్యం కూడా మాకు ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే స్త్రీగా ఉండటం అంటే అదే. కేవలం ప్రతి వస్తువు అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, దానిని స్వీకరించి.. విస్తరించగల సామర్థ్యం కూడా ఆమెకు ఉంది. అంటే స్త్రీగా ఉండటం అంటే..అనంతంగా ఉండటమే దాని సారాంశం." అని మానికా అత్యద్భుతంగా సమాధానమిచ్చింది.
కాగా ఢిల్లీలో నివశిస్తున్న మానికా విశ్వకర్మ ప్రస్తుతం పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతోందామె. ఈ ఏడాది ఆగస్టులో మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని గెలుచుకుంది. ఇక ఈ 74వ మిస్ యూనివర్స్ పోటీ నవంబర్ 21న థాయిలాండ్‌లోని నోంతబురిలోని పాక్ క్రెట్‌లోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగనుంది.
(చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..)


