beauty contests
-
మెరిసిన చేనేత.. మురిసిన భామలు
పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఇక్కత్ వస్త్రాలు, విశ్వవ్యాప్తంగా తరలివచ్చిన సుందరాంగుల మనసు దోచుకున్నాయి. చేనేత కళాకారుల వస్త్ర డిజైన్లను చూసి వారు ముగ్ధులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ సిల్క్ సిటీ భూదాన్ పోచంపల్లిలో.. ప్రపంచ సుందరీమణుల పోటీదారుల పర్యటనలో అడుగడుగునా చేనేత వస్త్ర కళా వైభవం కళ్లకు కట్టింది. చేనేత చీరలు, వస్త్రాలను చూసి విదేశీ వనితలు మురిసిపోయారు. ఈ సందర్భంగా కొన్ని వస్త్రాలను ధరించి ఇక్కత్ చీరల తయారీ ప్రక్రియ, డిజైన్ల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి మరోసారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. తెలంగాణ పర్యాటక శాఖ.. చేనేతను మరింత ప్రచారంలోకి తీసుకురావడంలో విజయవంతమైంది.అందగత్తెలతో ప్రపంచం దృష్టికి..పోచంపల్లిలో అందాల భామల పర్యటనతో చేనేత, ఇక్కత్ వస్త్రాలు ప్రపంచానికి మరోసారి పరిచయమైనట్లయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చేనేత కళాకారుల ప్రతిభకు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం కృషి చేసింది. పోచంపల్లికి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు.. పోచంపల్లి చీరల తయారీ, డిజైన్, అద్దకం ఇక్కత్ వస్త్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క చీర తయారీకి కళాకారులు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత.. పోటీదారుల మనస్సును హత్తుకున్నాయి. చీరలపై భిన్న డిజైన్లను తిలకించిన అందగత్తెలు పరవశించిపోయారు. రంగు రంగుల డిజైన్లతో ఉన్న ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరలు, శాలువాలు, డ్రెస్ మెటీరియల్, కాటన్, పట్టు చీరలను చేతితో తడిమి మరీ చూశారు. పోచంపల్లి, వెంకటగిరి ,గొల్లభామ, నారాయణపేట చీరలు, వస్త్రాల ప్రదర్శన సుందరీమణులను ఆకట్టుకుంది.ర్యాంప్ వాక్‌తో మెరుగులు దిద్ది..అందగత్తెలకే అసూయ పుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో.. పోచంపల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ అందగత్తెలే అచ్చెరువొందేలా హైదరాబాద్, ఢిల్లీకి చెందిన భారతీయ మోడల్స్.. ఇక్కత్ చీరలు, వస్త్రాల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది. సంప్రదాయం, ఆధునికత ఉట్టిపడేలా రూపొందించిన డిజైన్లు ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో యువతీ యువకులు ప్రపంచానికి ఆధునికత జోడించిన చేనేత దుస్తులను పరిచయం చేశారు. ర్యాంప్‌వాక్ అదుర్స్ర్యాంప్వాక్లో చేనేత డిజైన్లతో మోడల్స్ ధరించిన దుస్తులను..ప్రపంచ అందగత్తెలు కళ్లార్పకుండా చూ స్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రపంచ సుందరీమణులు, స్థానిక మోడల్స్ ధరించిన చేనేత వస్త్రాలతో వేదిక చేనేతను విశ్వవ్యాప్తం చేసింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పోచంపల్లి టైఅండ్‌డై ఇక్కత్ చేనేత కళారంగం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పడింది. మొదటిసారిగా పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరిలు నిలువు, పేక పద్ధతిలో సహజరంగులతో పట్టు చీరలను నేశారు. నాటి నుంచి ఎందరో చేనేత కళాకారులు ప్రయోగాలు చేస్తూ నూతన డిజైన్లు సృష్టిస్తూ చేనేత కళను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రపంచాధినేతల ఆకట్టుకునేలా ఇక్కత్ వస్త్రాలుపోచంపల్లి ఇక్కత్ కళ ప్రపంచ వ్యాప్తమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగ్గేట్టే మెక్రాన్‌కు.. ఇక్కడి నేతన్నలు నేసిన ఇక్కత్ చీరను బహూకరించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ పర్యాటక సంస్థ.. 2021లో పోచంపల్లికి ‘అంతర్జాతీయ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు’ బహూకరించడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చేనేత కుటీర పరిశ్రమ ద్వారా సంప్రదాయ వృత్తి, వారసత్వ సంపదను కాపాడుకుంటూనే పలువురు ఉపా«ధి పొందుతున్నందుకు ఈ గుర్తింపు ఇచ్చారు. పోచంపల్లి వస్త్రాలు తప్పనిసరి.. దేశ, విదేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో అతిథులకు పోచంపల్లి శాలువాను కప్పడం సంప్రదాయంగా మారింది. ఇక్కత్ చేనేత వస్త్రాలను సిల్క్, కాటన్, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కార్ప్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టెన్లు, పిల్లో కవర్లు తదితర వెరైటీలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్, అమెరికాలకు వెళ్తున్నాయి. ముస్లిం దేశాలలో మహిళలు ముఖానికి ధరించే స్కార్ఫ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక అపెరల్ ఫ్యాబ్రిక్, హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్‌ను యూరప్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.పేటెంట్ హక్కులతో ముందుకు..పోచంపల్లి వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2003లో కేంద్ర ప్రభుత్వం జియొగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్) సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక్కత్ కళ దేశంలో మరెక్కడా లేదు. మారుతున్న కాలానుగుణంగా ఇక్కడి చేనేత కళాకారులు పోచంపల్లి ఇక్కత్ డిజైన్లలో గద్వాల, కంచి, ధర్మవరంతో పాటు కొత్త కొత్త డిజైన్లు వచ్చేలా వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. కాగా పేటెంట్ హక్కులు పొందినప్పటికీ.. నకిలీ వస్త్రాల తయారీ చేనేత వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇక్కత్ యూనివర్సల్ బ్రాండ్ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పోచంపల్లి టై అండ్ డైలోనే ఇక్కత్ ఉంది. ఇక్కత్ అనేది ఒక యూనివర్సల్ బ్రాండ్. చేనేత చీరలు పూర్తిగా చేతితో మగ్గంపై ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సంప్రదాయ కళ. నూలు ఉడకబెట్టడం, రంగుల అద్దకం వంటి చేతి వృత్తి. ఎంతో మంది మహిళలు ఇక్కత్ చీరల పనితో జీవనోపాధి పొందుతున్నారు. పోచంపల్లి చీరల డిజైన్ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయి. – ఎం.హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లాచేనేతకు ప్రభుత్వం చేయూత తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందాల భామలు పోచంపల్లి చీరలు, వస్త్రాలకు ముగ్ధులయ్యారు. ప్రపంచ పటంలో పోచంపల్లి కళాకారులు రూపొందించిన వస్త్రం సంపద వెల కట్టలేనిది. సీఎం రేవంత్ అధ్వర్యంలోని ప్రభుత్వం చేనేతకు చేయూత నిస్తోంది. – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి(చదవండి: మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా! ) -
మిస్ వరల్డ్ మధురమైన పాట
అందంలోనే కాదు అద్భుతమైన గానంలోనూ ‘భేష్’ అనిపించుకున్నారు మిస్ వరల్డ్ అందాల తారలు...మిస్ వరల్డ్ (2019) టోని–అన్ సింగ్, వైట్నీ హ్యూస్టన్ పాట ‘ఐ హ్యావ్ నథింగ్’ను మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్లో అద్భుతంగా ఆలపించింది.మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా తన సినిమాల్లోని పాటలను మ్యూజిక్ లేకుండానే పాడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.మిస్ వరల్డ్(1997) డయాన హేడెన్ ప్రొఫెషనల్ సింగర్. కాలేజీ రోజుల్లో ఎన్నో పోటీల్లో పాల్గొంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేసింది.మిస్ వరల్డ్ (1999) యుక్తా ముఖీ మోడలింగ్, నటనలోనే కాదు గానంలోనూ ‘భేష్’ అనిపించుకుంది. హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్‌లో మూడు సంవత్సరాల కోర్సు చేసింది.మిస్ వరల్డ్ (2017) మానుషి చిల్లర్ కూచిపూడి డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా.మిస్ వరల్డ్ (1994) ఐశ్వర్య రాయ్ టెలివిజన్ షోలతో సహా ఎన్నో కార్యక్రమాలలో తన మధుర గాత్రాన్ని వినిపించింది. (చదవండి: ఎవరీ అవధేష్ కుమార్ భారతి? ఏకంగా రాష్ట్రపతి ఆయన సేవలకు..) -
16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..
హైదరాబాద్ వేదికగా మరికొద్ది రోజుల్లో 72వ మిస్ వరల్డ్ – 2025 పోటీలు జరగనుండటం విధితమే. దీనిలో దాదాపు 120 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంటులు భాగస్వాములు కానున్నారు. ఇందులో భాగంగా నగరానికి చేరుకున్న మిస్ వరల్డ్ థాయిలాండ్ 2025 ‘ఓపాల్ సుచాత చువాంగ్ శ్రీ’ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో సోమవారం సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని సింఘానియాస్ వస్త్ర దుకాణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న ‘ఓపాల్ ఫర్ హర్’కు మద్దతుగా సింఘానియాస్ చీరలు, లెహంగాలను ధరించారు. తన ఫ్యాషన్ ప్రయాణంతో పాటు తన వ్యక్తిగత విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!! గ్లోబల్ వేదికగా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో థాయిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషంగా ఉంది. అనూహ్యంగా.. మిస్ థాయ్లాండ్గా మిస్ వరల్డ్ వేదికకు సిద్ధం కావడానికి కేవలం 15 రోజులు మాత్రమే పట్టింది. నా జీవితంలో ఇదొక మిరాకిల్. తక్కువ సమయంలో ఈ అవకాశం రావడం నా అదృష్టం. ప్రోత్సాహాన్ని అందించిన థాయ్ ప్రజలకు, అంతర్జాతీయ అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ వేదికపై విజేతగా నిలవడమే నా దేశానికిచ్చే రిటర్న్ గిఫ్ట్. పుట్టి పెరిగిందంతా థాయ్‌లాండ్ ఫుకెట్‌లో. విద్యాభ్యాసం అక్కడే చేశాను. ఉన్నత చదువులకు బ్యాంకాక్ వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్యాషన్ ప్రయాణం మొదలైంది. ఆ బాధ నాకు తెలుసు.. సామాజిక బాధ్యతలో భాగంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాను. 16 ఏళ్ల వయసులో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. ఇందులో భాగంగా నాన్ క్యాన్సరస్ లంప్‌ను తీసేశారు. ఆ అవస్థలు, వేదన నాకు భాగా తెలుసు. అందుకే.. రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటాను. ముందస్తు చికిత్స–గుర్తింపు అవసరముంది. మహమ్మారిపైన అవగాహన కల్పించడమే జీవిత లక్ష్యం. మిస్ థాయ్లాండ్గా నా స్వరాన్ని వినిపిస్తున్నాను. ఇలాంటి సామాజిక బాధ్యతల్లో భాగంగా ‘ఓపాల్ ఫర్ హర్’లో పాలుపంచుకున్నా. థాయ్ ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. ప్రపంచానికి సేవచేస్తాను. ఈ విషయాల్లో మా అమ్మే నాకు స్ఫూర్తి. ఆతిథ్యం అదుర్స్.. ఎయిర్ పోర్ట్‌లో లభించిన స్వాగతం సత్కారాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇంతటి ఘనమైన ఆతిథ్యం జీవితంలో ఇదే మొదటిసారి. హైదరాబాద్ విశిష్టతల గురించి విన్నాను.. ఇది పెరల్ సిటీ అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. నాకు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీ వెళ్లి ఆభరణాలు కొనుక్కుంటాను. చార్మినార్, పెద్దమ్మతల్లి టెంపుల్‌కు కూడా వెళతాను. (చదవండి: 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..! తండ్రి ఫెయిలైనా..తనయ సాధించింది..!) -
ప్రపంచంలోనే తొలి ఏఐ అందాల పోటీలు!
ఎన్నో రకాల అందాల పోటీలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి సాంకేతికతో కూడిన అందాల పోటీలను చూసి ఉండరు. ప్రపచంలోనే తొలిసారిగా ఏఐ అందాల పోటీలు వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్(WAICA) పిలుపునిచ్చింది. ఈ పోటీలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన మోడల్స్ పాల్గొంటారు. కోటి రూపాయల విలువ చేసే ప్రైజ్‌మనీలతో భారీ ఎత్తున ఈ ఏఐ అందాల పోటీలను నిర్వహిస్తోంది WAICA. ఈ ఐఏ మోడల్స్‌ని ప్రేక్షకుల్లో వాటికున్న ఆదరణ, ఫ్లాట్‌ఫామ్‌లో ఎక్కువగా వినియోగించగలిగేది, సోషల్ మీడియా క్రేజ్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని న్యాయనిర్ణేతలు విజేతను ప్రకటిస్తారు. తొలిసారిగా కంప్యూటర్ సాంకేతికత సృష్టించిన మనుషుల అందాల పోటీ అనేది ఫ్యాషన్ వైవిధ్యానికి ఓ నిదర్శనం. వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ వర్చువల్ మోడల్స్‌ని సబ్స్క్రిప్షన్-ఆధారిత ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్యాన్వ్యూని(Fanvue) కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ సదరు వర్చువల్ మోడల్ ఫ్యాన్ వ్యూ, పీఆర్ మద్దతులను కూడా బేస్ చేసుకుని విజేతను ప్రకటించడం జరుగుతుంది. అలాగే రన్నరప్, మూడో స్థానంలో ఉన్న విజేతలకు కూడా నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ పేర్కొంది. ఈ పోటీలకు ఎంట్రీలు గత ఆదివారం(ఏప్రిల్ 14) నుంచే ప్రారంభమయ్యాయి. మే 10న విజేతలను ప్రకటిస్తారు. ఇక ఈ అందాల పోటీ ఈ నెలఖారులోపు జరగనుంది. ఇక ఈ పోటీలు నలుగురు సభ్యుల ఫ్యానెల్ సమక్లంలో జరుగుతుంది. ఆ ఫ్యానెల్లో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లయోన్సర్ జడ్డిలు..ఒకరేమో మూడు లక్షల ఫ్యాన్‌ఫాలోయింగ్ కలిగిన స్పెయిన్‌కు చెందిన ఐతానా లోపెజ్, మరోకరు రెండు లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమిలీ పెల్లెగ్రిని జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇక వారిలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు..పీఆర్ సలహదారు, వ్యవస్థాపకుడు ఆండ్రూ బ్లాచ్, మరొకరు అందాల పోటీ చరిత్రకారుడు, బ్యూటీ క్వీన్ స్కాండల్స్ పుస్తక రచయిత అయిన సాలీ-ఆన్ ఫాసెట్ విజేతలను ప్రకటిస్తారు. ఇది ఏఐ సృష్టికర్తలలో దాగున్న ప్రతిభ సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు జరుగుతున్న అందాల పోటీ అని ఫ్యానల్ వ్యక్తులు చెబుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా 100 శాతం ఏఐ జనరేటేడ్ మోడల్స్‌నే క్రియేట్ చేయాలి. అందుకోసం ఎలాంటి టూల్స్ ఉపయోగిస్తారనేందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఓన్లీ ఏఐ జెనరేటర్ క్రియేషన్స్ని స్వాగతిస్తుంది. అది డీప్ ఏఐ, లేదా వ్యకగత టూల్స్ వంటివి ఏదైనా కావొచ్చు. ఈ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవారు దాదాపు రూ. 4 లక్షలపైనే నగదు బహుమతి అందజేస్తారు నిర్వాహకులు. ( చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా భారత్
న్యూఢిల్లీ: భారత్ త్వరలో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక అవనుంది. ఈ ఏడది జరిగే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తన అధికారిక ఎక్స్(ట్విటర్)లో ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదికగా నిలవనుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose — Miss World (@MissWorldLtd) January 19, 2024 ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ కన్వెన్షన్ సెంటర్, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. కేవలం అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. గతంలో భారత్‌కు చెందిన ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ తదితరులు మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యారు. ఇదీచదవండి.. మోదీ భావోద్వేగం -
మంచి అవకాశాలు వస్తే నటిస్తా.. మిసెస్ సౌత్ ఇండియా రన్నరప్
తమిళ సినిమా: మిసెస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో తమిళనాడుకు చెందిన వైశాలి.ఎస్ మొదటి రన్నర్‌గా కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శనివారం సాయంత్రం మీడియాతో ముచ్చటిస్తూ గతవారం కేరళలో పెగాసెస్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ మిసెస్ సౌత్ ఇండియా అందాల పోటీలను నిర్వహించిందన్నారు. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 14 మంది మగువలు పాల్గొన్నారన్నారు. వారిలో తానొకరినని చెప్పారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీల్లో తాను మొదటి రన్నర్‌గా నిలిచానని పేర్కొన్నారు. అదేవిధంగా మిసెస్ ఇన్స్పౌరింగ్గా ఎన్నికయ్యానని తెలిపారు. ఇది తన కెరీర్లో ఆరంభమేనని ముందు ముందు మరిన్ని అందాల పోటీల్లో పాల్గొని మిసెస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అందుకు తన కుటుంబ సపోర్టు ఎంతగానో ఉందని పేర్కొన్నారు. వివాహమైన ప్రతి స్త్రీ తనకంటూ ఒక గుర్తింపును పొందాలన్నారు. అందుకు తగిన ప్రయత్నాలు చేయాలని నచ్చిన రంగంలో ఇష్టమైన వృత్తిని చేపట్టాలని అన్నారు. తాను తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఏదైనా సమస్యలను అధిగమిస్తూ ఈ విజయాన్ని సాధించానన్నారు. తనకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితం స్ఫూర్తి అని చెప్పారు. సామాజిక స్ఫృహ అధికమన్నారు. అలా క్యాన్సర్ బాధితులకు కోసం తన జుట్టును దానం చేశానని, తనను స్ఫూర్తిగా తీసుకొని పలువురు తన బాటలో పయనించడం సంతోషంగా ఉందన్నారు. సినిమాల్లో నటిస్తారా అని అడుగుతున్నారని ఇటీవలే నటుడు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన కలగ తలైవన్ చిత్రంలో చిన్న పాత్ర పోషించానని, అదేవిధంగా నిమిర్దు సెల్లడా అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించానని చెప్పారు. ఇకపై కూడా మంచి అవకాశాలు వస్తే నటిస్తానన్నారు. తన అభిమాన నటుడు రజనీకాంత్ అని వైశాలి పేర్కొన్నారు. -
మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు
లక్నో: అందాల పోటీలు..ఈ పేరు వినగానే అందరూ డబ్బున్న వారే పాల్గొంటారని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక రిక్షా డ్రైవర్ తన కూతురు ఈ అందాల కిరీటం గెలవాలని కలలు కన్నాడు. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. చివరికి ఒక అడుగు దూరంలో తన కూతురికి ఆ అవకాశం చేజారిపోయింది. అయితే, వీఎల్సీసీ మిస్ ఇండియా పోటీలో రన్నరప్‌గా తన కూతురుని ప్రపంచం ముందు నిలబెట్టడంలో మాత్రం ఆయన విజయం సాధించాడు. ఈ పోటీల్లో మన హైదరాబాదీ అమ్మాయి మానసా వారణాసి విన్నర్‌గా నిలవగా.. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాన్యా సింగ్ రన్నరప్‌గా నిలిచింది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ అందరి మన్ననలను పొందుతున్న మాన్యా విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం. అందాల పోటీలలో నిలవాలంటే అందంగా ఉండాలి. చక్కని ముఖవర్చస్సు కలిగి, అందమైన శరీరాకృతి కోసం ఎన్నో చేయాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న విషయమని చాలా మందికి ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడం వలన తమ ఆశను మనస్సులోనే చంపుకొంటారు. అయితే, ఉత్తరప్రదేశ్ కు చెందిన మాన్యా సింగ్ అందరిలా ఆలోచించలేదు. ఈమె తండ్రి ఒక ఆటోవాలా. తల్లి ఇంటిలో పనులు చేసుకొంటూ తన ఇద్దరు పిల్లలను చూసుకొనేది. పేదరికం కారణంగా మాన్య కొద్దివరకే చదువుకొని ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి ఎదురైంది. మాన్య డిగ్రి ఫీజు కోసం తల్లి దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారాన్నికూడా కుదువపెట్టాల్సి వచ్చింది. తన ఖర్చుల కోసం ఇంట్లో వారు పడుతున్న కష్టాన్ని చూడలేని మాన్య పద్నాలుగు ఏళ్లప్పుడే ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. రాత్రిపూట కాల్సెంటర్లో ఉద్యోగం చేసుకుంటూ, ఉదయంపూట చదువుకునేదాన్ని అని చెప్పింది. మిస్ఇండియా పోటీల్లో గెలవాలని నిర్ణయించుకొని దీనికోసం ఎన్నో తిండి, నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు నడిచి వెళ్తు రిక్షా డబ్బులు కూడా దాచుకునే దాన్నని మాన్యా గుర్తు చేసుకుంది. ఈ రోజు మానాన్న, అమ్మా, అన్నయ్య నాకోసం పడ్డ కష్టం, వారు నాకు అందించిన సహకారం వలనే ఈ స్థానంలో నిలిచాను’ అని ఆమె వివరించింది. చదవండి: ‘మిస్ ఇండియా’ కిరీటం.. విన్నర్‌గా తెలుగమ్మాయి -
అందమైన గెలుపు
‘‘మీ లక్ష్యం ఏంటి?’’ మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ .. ఏ బ్యూటీ కంటెస్ట్లోనైనా కామన్ క్వశ్చన్ ఇది. కంటెస్టెంట్స్ ఇచ్చే సమాధానమూ సర్వ సాధారణమే.. ‘‘అనాథలకు సేవ చేయడం’’ అంటూ! అయితే అందాల కిరీటం దక్కగానే ధ్యేయం మారిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల తలుపులు తట్టే ప్రయత్నం మొదలవుతుంది. గత కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. కానీ ఆ సంప్రదాయాన్ని కాదని.. సినిమా, మోడలింగ్ రంగాల్లో అవకాశాలు వచ్చినా సింపుల్‌గా ‘నో’ చెప్పి ఇతర రంగాల్లో స్థిరపడ్డ అందాల రాణులూ ఉన్నారు. వాళ్ల గురించి తెలుసుకుందాం. ఇంద్రాణి రెహ్మాన్ మన దేశంలో అందాల పోటీలు 1952లో ప్రారంభమయ్యాయి. ఆ యేటి బ్యూటీ ‘మిస్ ఇండియా యూనివర్స్’ ఇంద్రాణి రెహ్మాన్. సినిమా రంగాన్ని ఎంచుకోక.. తనకు ఇష్టమైన శాస్త్రీయ నృత్యంలోనే సాధన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. పద్మశ్రీ బిరుదూ పొందారు. హార్వర్డ్ మొదలు ఎన్నో యూనివర్శిటీల్లో బోధించారు. జూలియర్డ్ స్కూల్లో ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉన్నారు. రీటా ఫారియా 1966లో ‘మిస్ వరల్డ్’గా ఎన్నికైన రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన తొలి భారతీయురాలే కాదు.. ఫస్ట్ ఏషియన్ కూడా. అలా ఆమె క్రౌన్ ధరించిందో లేదో ఇలా మోడలింగ్, సినిమా చాన్సెస్ ఆమె ఇంటి కాలింగ్ బెల్ నొక్కాయి. ‘నో చాన్స్’ అని చెప్పింది. ఆమె ఆశ, ఆశయం అంతా డాక్టర్ కావాలనే. తర్వాత డాక్టర్ డేవిడ్ పావెల్ అనే ఎండోక్రైనాలజిస్ట్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో స్థిరపడ్డారు రిటా ఫారియా. కవితా భంభాని 1969లో ‘మిస్ ఇండియా’గా ఎన్నికయ్యారు కవితా భంభాని. ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లోకి అడుగు పెట్టారు. ఇంటీరియర్ డిజైనర్‌గా ఖ్యాతి సంపాదించారు. సినిమా రంగంతో ఆమెకున్న కనెక్షనల్లా హీరో అనిల్ కపూర్ ఆమెకు మరిది కావడమే. అవును.. అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్.. కవితా భంభాని చెల్లెలు. అలమ్జీత్ కౌర్ 1978 ‘మిస్ ఇండియా యూనివర్స్’ అలమ్జీత్ కౌర్. లా చదువుతున్నప్పుడు మిస్ ఇండియా కంటెస్ట్‌లో పాల్గొన్నారు. మిస్ యూనివర్స్ కంటెస్ట్‌లో బెస్ట్ నేషనల్ కస్ట్యూమ్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఈ పోటీల తర్వాత మళ్లీ న్యాయశాస్త్ర రంగంలోకి వచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీప్తీ దివాకర్ 1981లో ‘మిస్ ఇండియా వరల్డ్’గా ఎన్నికయ్యారు దీప్తీ దివాకర్. ఆమె భరతనాట్య కళాకారిణి. ప్రపంచ వ్యాప్తంగా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. రచనా వ్యాసాంగం కూడా చేస్తారు. ‘ట్రీ ఆఫ్ వర్స్’ అనే ఆధ్యాత్మిక కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఉత్తరా మాత్రే ఖేర్ 1982 ‘మిస్ ఇండియా వరల్డ్’ కిరీటాన్ని గెల్చుకున్నారు. స్వల్ప కాలమే మోడల్‌గా పనిచేసి, తర్వాత ఆ రంగానికి స్వస్తి చెప్పారు. రెస్టారెంట్ బిజినెస్‌లోకి దిగారు. ప్రస్తుతం నాసిక్‌లో భర్తతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఓ ట్రస్ట్‌నూ నిర్వహిస్తున్నారు. అన్నీ థామస్ 1998 ‘మిస్ ఇండియా వరల్డ్’ అన్నీ థామస్. డాక్టర్ కావాలనుకున్నారు. కాని ఈ బ్యూటీ కంటెస్ట్ తర్వాత మెడిసిన్ తన కప్ ఆఫ్ టీ కాదని గ్రహించి.. ఈవెంట్ మేనేజర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నారు. సారా కార్నర్స్ 2001లో ‘మిస్ ఇండియా వరల్డ్’గా కిరీటాన్ని అందుకున్నారు సారా. తొమ్మిదేళ్ల వయసు నుంచే మోడలింగ్‌లో ఉన్న ఆమె ఈ కంటెస్ట్ తర్వాత మోడలింగ్‌కు గుడ్‌బై చెప్పి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లోకి అడుగుపెట్టారు. రచయిత్రి కూడా. పిల్లల కోసం కథలు రాస్తారు. వాసుకీ సుంకవల్లి న్యూయార్క్ యూనివర్శీటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వాసుకీ 2011లో ‘మిస్ ఇండియా యూనివర్స్’గా గెలుపొందారు. రెయిన్ మేకర్ సంస్థ సహ స్థాపకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వన్యా మిశ్రా 2012 ‘మిస్ ఇండియా వరల్డ్’ వన్యా మిశ్రా. ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ అయిన ఆమె తన కాలేజ్మేట్తో కలిసి ఫ్యాషన్ అంyŠ లైఫ్ స్టయిల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. శిల్పా సింగ్ 2012 ‘మిస్ ఇండియా యూనివర్స్’ శిల్పా సింగ్. క్యూబ్ 26 అనే టెక్ స్టార్టప్‌తో బిజినెస్, మార్కెటింగ్ రంగంలో స్థిరపడ్డారు. మిస్ ఇండియా నుంచి మార్కెటింగ్ హెడ్ దాకా సాగిన తన ప్రయాణాన్ని టెడెక్స్ టాక్‌లో పంచుకున్నారు కూడా. -
మిస్ ఇండియా యుఎస్ఏ 2014గా ప్రణతి గంగరాజు
వాషింగ్టన్: జార్జియాలో నివాసం ఉంటున్న తెలుగమ్మాయి ప్రణతి గంగరాజు ప్రతిష్ఠాత్మమైన మిస్ ఇండియా యుఎస్ఏ 2014 టైటిల్ గెలుచుకుంది. సినిమా నటన, నిర్మాణంలో కోర్సు చేస్తున్న 19 ఏళ్ల ప్రణతికి నృత్యం, పాటలు పాడటం, రాయడం, ఈత లాంటి హాబీలున్నాయి. న్యూయార్క్ ప్రాంతానికి చెందిన ఐఎఫ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంతకుముందు ఈ టైటిల్ గెలుచుకున్న మోనికా గిల్.. ఈసారి విజేత ప్రణతికి కిరీటం అలంకరించింది. 2016 జూన్ నెలలో గోవాలో జరిగే కార్యక్రమంలో మరోసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోటీలలో ఫ్లోరిడాకు చెందిన మోనికా షా (24), హవాయికి చెందిన ఏంజెలా నంద్ (27)లకు వరుసగా రెండు, మూడు స్థానాలు లభించాయి. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మొత్తం 21 మంది భారత సంతతి అమ్మాయిలు ఈ అందాల పోటీలో పాల్గొన్నారు. న్యూజెర్సీకి చెందిన రియా కౌర్‌కు మిస్ టీన్ ఇండియా అమెరికా టైటిల్ లభించింది. మిస్ ఇండియా అమెరికా పోటీలో పాల్గొనేవాళ్లు 17-27 ఏళ్ల మధ్యవారై ఉండాలి, పెళ్లి చేసుకుని ఉండకూడదు, తాము ప్రాతినిధ్యం వహించే దేశానికి చెందినవాళ్లై ఉండాలి. ప్రధానంగా వీరికి నాలుగు అంశాల్లో పోటీ పెడతారు. ఈవెనింగ్ గౌన్, ఇండియన్ డ్రస్, టాలెంట్, ప్రశ్న-జవాబులు ఈ అంశాలు.