
అందంలోనే కాదు అద్భుతమైన గానంలోనూ ‘భేష్’ అనిపించుకున్నారు మిస్ వరల్డ్ అందాల తారలు...
మిస్ వరల్డ్ (2019) టోని–అన్ సింగ్, వైట్నీ హ్యూస్టన్ పాట ‘ఐ హ్యావ్ నథింగ్’ను మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్‌లో అద్భుతంగా ఆలపించింది.
మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా తన సినిమాల్లోని పాటలను మ్యూజిక్ లేకుండానే పాడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.
మిస్ వరల్డ్(1997) డయాన హేడెన్ ప్రొఫెషనల్ సింగర్. కాలేజీ రోజుల్లో ఎన్నో పోటీల్లో పాల్గొంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేసింది.
మిస్ వరల్డ్ (1999) యుక్తా ముఖీ మోడలింగ్, నటనలోనే కాదు గానంలోనూ ‘భేష్’ అనిపించుకుంది. హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్‌లో మూడు సంవత్సరాల కోర్సు చేసింది.
మిస్ వరల్డ్ (2017) మానుషి చిల్లర్ కూచిపూడి డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా.
మిస్ వరల్డ్ (1994) ఐశ్వర్య రాయ్ టెలివిజన్ షోలతో సహా ఎన్నో కార్యక్రమాలలో తన మధుర గాత్రాన్ని వినిపించింది.
(చదవండి: ఎవరీ అవధేష్ కుమార్ భారతి? ఏకంగా రాష్ట్రపతి ఆయన సేవలకు..)