సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికత,సాంకేతికతల సమన్వయానికి నిదర్శనంగా సూపర్ ఏఐ అకాడమీ (SUPER AI Academy) మహాశివరాత్రి 2026ని ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రిని నిర్వహించింది . ఈ సందర్బంగా ‘డిజిటల్ నాద యజ్ఞం” ద్వారా 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలను రూపొందించడం విశేషంగా నిలిచింది. కేవలం 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలలో 108 గీతాలను ప్రత్యేక ప్రసారం చేసింది.
Zoom వెబినార్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే సమయంలో శివతత్వాన్ని ఆధారంగా చేసుకుని గీతాలను సృష్టించారు. క్రమబద్ధమైన సాహిత్య రూపకల్పన కోసం ChatGPT Custom GPT వినియోగించగా, సంగీత నిర్మాణానికి AI ఆధారిత సంగీత సాధనాలను ఉపయోగించారు. అలాగే దీన్ని వాణిజ్య కార్యక్రమంలా కాకుండా పరమశివునికి సమర్పించిన సమూహ భక్తి నాదార్పణగా భావించామని నిర్వాహకులు ప్రకటించారు. “
డిజిటల్ నాద యజ్ఞం”కార్యక్రమంలో శివుని విభిన్న రూపాలైన శివ, రుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, లింగ రూపాలు, శివ తాండవం వంటి ఉత్సాహభరిత భావాలతో కూడిన గీతాలను సృష్టించారు. భాషా, సాంస్కృతిక భక్తి పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిబింబంగా అన్ని గీతాలు తెలుగులోనే ఉండటం విశేషం. వీటిని సమయపాలన, సమన్వయంతో రియల్‌టైమ్ ట్రాకింగ్ వంటి పద్ధతులతో కార్యక్రమం సజావుగా నిర్వహించామన్నారు.
ఈ కార్యక్రమం Impact Foundation సహకారంతో, District Governor 320H గంపా నాగేశ్వర్ రావు నాయకత్వంలో Impact International ట్రెజరర్ గంపా ఆదిత్య భారత్ సహకారం అందించారు. SUPER AI Academy కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయ శ్రీ తదితరులు పాల్గొనేవారి సమన్వయం మరియు సాంకేతిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందర్భాల్లో కృత్రిమ మేధస్సును సృజనాత్మకంగా వినియోగించడం సులభమనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినట్లు సూపర్ ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు Nikeelu Gunda తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారికి నమోదు, సమాచారం అందించేందుకు AIMahashivaratri. com అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేశారు.ప్రాంతీయ భాషల్లో AI అవగాహన పెంపొందించి, సృజనాత్మకత, ఉపాధి, సాంస్కృతిక పరిరక్షణకు సాంకేతికతను సాధనంగా మార్చడమే తమ ప్రధాన ధ్యేయమని, గ్రామీణ , ప్రాంతీయ భాషా వర్గాల వరకు కృత్రిమ మేధస్సు విద్యను చేర్చాలని తమ లక్ష్యమని సూపర్ ఏఐ అకాడమీ ప్రకటించింది.


