తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర | Shiva Temples Yatra Telangana Cultural Society Singapore | Sakshi
Sakshi News home page

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

Feb 16 2026 1:11 PM | Updated on Feb 16 2026 1:28 PM

Shiva Temples Yatra Telangana Cultural Society Singapore

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం  వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర  ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ  తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. 

సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను  నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు.  భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. 

ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను  నిర్వహించిన  సొసైటీ వారికి  ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు  తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు  వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. 



ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్,  దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.

వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి  సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ  సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ  ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త  నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్,   భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement