Miss World 2025
-
హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకున్న మిస్ వరల్డ్ తారలు
గ్లోబల్ వేదికగా ఏ రంగంలోనైనా హైదరాబాద్ తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఇది ఇప్పుడొచ్చిన గుర్తింపేం కాదు.. నిజాం కాలం నుంచే అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం ప్రసిద్ధి చెందింది. ఆనాటి సంస్కృతులు, ఆహారం, విలాస నగరంగానే కాకుండా ఇప్పటి ఐటీ, సినిమా, క్రీడలు తదితర రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ ఒరవడిలో వీటన్నింటి సమాహారంగానే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు నగరంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నగరానికి వచి్చన విషయం విధితమే. ఈ ప్రయాణంలో అందాల తారలు నగరానికి ముగ్దులైపోతున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారు.. కానీ ఈ మిస్ల అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది భాగ్యనగరం. ఈ నేపథ్యంలో పలువురు మిస్‌వరల్డ్ పోటీదారులు ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు.. బెల్జియం చాక్లెట్లు మావే.. వచి్చనప్పటి నుంచి చూస్తున్నా.. ఎంతో ఆతీ్మయత, ప్రేమ నింపుకున్న మనుషులు మీరంతా..?! నాకు చాలా సంతోషంగా అనిపించింది. అధునాతన జీవన విధానం బాగా నచ్చింది. దీనికి సమానంగా సామాన్య జీవనం కనిపిస్తోంది. మిస్ వరల్డ్ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రాంతాలను సందర్శించాను.. ఎంత అందమైన నగరమో. ఇక్కడి బెల్జియం చాక్లెట్లను చూశాను. ఈ బెల్జియం చాక్లెట్లకు మాతృక మా దేశమే. హైదరాబాద్‌లో షాపింగ్ చేయడం మరచిపోలేని అనుభూతి. – కారెన్ జాన్సెన్, మిస్ బెల్జియంఅమ్మా నాన్నలను తీసుకొస్తా.. ఇక్కడ అద్భుతమైన జీవన విధానమే కాదు.. ఎన్నో వింతలు ఉన్నాయి. మిస్ వరల్డ్ బృందంతో పాటు అవన్నీ సందర్శించాను. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను చూడటానికి మళ్లీ హైదరాబాద్ వస్తా. వీటిని చూపించడానికి మా తల్లిదండ్రులను కూడా తీసుకొస్తాను. నా ఫేవరెట్ డెస్టినేషన్ నగరాల్లో హైదరాబాద్ కూడా చేరింది. నగరం చూట్టూ ఉన్న ప్రకృతి కూడా నాకు బాగా నచి్చంది. – ఎమ్మా మోరిసన్, మిస్ కెనెడామరో ఇల్లులా అనిపించింది.. భారత దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. అంతెందుకు విదేశాలకు చెందిన కొన్ని సంస్కృతులు సైతం ఇక్కడ తారసపడ్డాయి. ఈ వైవిధ్యాన్ని చూడటానికి భారత్ మొత్తం తిరగాల్సిన పనిలేదు. కేవలం హైదరాబాద్ వస్తే చాలు. ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్నా. ఢిల్లీ వెళ్తే ఒకలా, చెన్నై, లద్దాక్ వెళితే మరోలా.., ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంస్కృతి కనిపిస్తుంది. అంతెందుకు కోల్‌కతా (బెంగాల్) వెళితే మా బంగ్లాదేశ్ మూలాలు కనిపిస్తాయి. ఇవన్నీ హైదరాబాద్‌లో చూశా. ఇది ఒక మినీ ఇండియా. నాకైతే హైదరాబాద్ మరో ఇల్లులా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మీయ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. నాకు నచి్చన స్పైసీ ఫుడ్ లభిస్తుంది. వారసత్వ వంటకాలు బాగున్నాయి. నేను తిన్న కొబ్బరి చట్నీ అయితే సూపర్బ్. – అక్లిమా అతికా కొనికా, మిస్ బంగ్లాదేశ్అమ్మాయిలకు అనువైన నగరం.. ఇక్కడి అమ్మాయిలను చూస్తే సంతోషంగా ఉంది. వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. మా దేశం జింబాబ్వే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం.. అంతర్జాతీయంగా ఫ్యాషన్ రంగంలో మా కళకు, డిజైనింగ్‌కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్ల డిజైనింగ్ ఇక్కడ చూసి సంతోషం అనిపించింది. ఒక మోడల్‌గా గర్వపడుతున్నా. విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెడ్‌గా మారుతోంది. మేమంతా వివిధ దేశాల నుంచి వచ్చిన మహిళలుగా మాకు వేర్వేరు నమ్మకాలున్నాయి. కానీ ఇక్కడి సంస్కృతిక సమ్మేళనం, వైవిధ్యం ఐక్యతను ప్రదర్శిస్తోంది. ఇలాంటి సమాంతర వ్యవస్థ ఉండటం అద్భుతం. రంగు, రూపం వంటి అంశాలతో భిన్నంగా ఉన్న స్త్రీలను ఈ వైవిధ్యం విజేతను చేస్తుంది. అవకాశం ఉంటే మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది. –కోర్ట్నీ జాంగ్వే, మిస్ జింబాబ్వే మొదటి సారి పానీ పూరీ తిన్నా.. వియత్నాంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పానీ పూరీ గురించి వీడియోలు చూశాను. ఉన్నత చదువుల కోసం ఆ్రస్టేలియా వెళ్లినప్పుడు కూడా కొన్ని సార్లు వీటి గురించి విన్నాను. అయితే హైదరాబాద్ వచ్చాకే పానీ పూరీ మొదటి సారి తిన్నా. వీటి రుచిని మాటల్లో చెప్పలేను. మొదట్లో వీటిని సరిగా తినలేకపోయాను. మిస్ ఇండియా నందినీ గుప్తా పానీపూరీ ఎలా తినాలో చూపించింది.. అప్పటి నుండి తినడం అలవాటైంది. ప్రస్తుతం హైదరాబాద్ అనగానే మొదట పానీపూరీనే గుర్తొస్తుంది. ఇక్కడి ప్రజలు ఆతీ్మయంగా పలుకరిస్తారు. నేను బసచేసే హోటల్ సిబ్బంది చూపించే ప్రేమ ఇంటిని మరిపిస్తోంది. చారి్మనార్ వీధుల్లో కొన్న వస్తువులు వియాత్నాం తీసుకెళతాను. ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే బొట్టు పెట్టి ఆహ్వానించిన విధానం నాకెంతో నచి్చంది. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రదర్శించిన నృత్యాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. – హూన్ త్రాన్ నీ, మిస్ వియాత్నాం -
మిస్ వరల్డ్ కధలు: సిఎంతో సారీ చెప్పించుకున్న హైదరాబాద్ బ్యూటీ...
ఐశ్వర్యారాయ్ తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని 3వసారి దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్(Diana Hayden) దక్కించుకుంది. 1997 మిస్ వరల్డ్ పోటీ విజేత మెయిన్ టైటిల్‌తో పాటు మూడు సబ్–టైటిళ్లను కూడా గెలుచుకుని అలా గెలిచిన ఏకైక మిస్ వరల్డ్‌గా నిలిచింది. జన్మతః హైదరాబాద్ నగరంలోని ఆంగ్లో–ఇండియన్ కుటుంబంలో జన్మించిన డయానా హేడెన్... సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆమె పాఠశాల విద్యార్ధినిగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు దాంతో ఆమె 13 సంవత్సరాల వయస్సులోనే తన భృతి కోసం పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది.మిస్ వరల్డ్‌గా గెలిచిన ఏడాది తర్వాత, హేడెన్ లండన్ కు వెళ్లి రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ లో నటనను అభ్యసించింది. అక్కడ ఆమె షేక్స్పియర్ రచనలపై దృష్టి సారించి ఉత్తమ నటి నామినేషన్ పొందింది. ఆమె దక్షిణాఫ్రికాలో షేక్స్పియర్ ఒథెల్లో చలనచిత్రంతో 2001 లో, తెరపైకి అడుగుపెట్టింది. ఇండియన్ టీవీ షో బిగ్ బాస్ రెండవ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొంది 13 వ వారంలో ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయింది. మిస్ వరల్డ్ గెలిచినప్పటికీ సినిమా టీవీ రంగాల్లో ఆమె పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. తెహ్ జీబ్, అబ్ బస్, లోన్ ఎ లవింగ్ డాల్...తదితర చిత్రాల్లో నటించినా ఆమె కేవలం ఒక సాదా సీదా నటిగానే మిగిలిపోయింది.ఐశ్వర్యారాయ్, సుష్మితాసేన్ల తరహాలో కాకుండా బ్రౌన్ స్కిన్‌తో కొంత విలక్షణమైన అందంతో టైటిల్ గెల్చుకున్న డయానా హేడెన్ తన రూపం పట్ల కొందరు చేసిన పరుషమైన కామెంట్స్‌కు గురి కావాల్సి వచ్చింది. అలాంటివాటిలో ముఖ్యంగా ఆనాటి త్రిపుర సిఎం విప్లవ్‌కుమార్ దేవ్ ఆమె రూపాన్ని హేళన చేయడం ప్రస్తావనార్హం. అసలు మిస్ వరల్డ్ టైటిల్ గెలిచే సత్తా ఉన్న అందం ఆమెకు లేనేలేదని, ఐశ్వర్య గెలిచిందంటే ఓ అర్ధం ఉందని అంటూ ఆయన ఆమె రూపాన్ని ఎద్దేవా చేయడం సంచలనం సృష్టించింది. మనకు లక్ష్మి, సరస్వతి వంటి అందమైన దేవతలు ఉన్నారని డయానా లు కాదని అంటూ ఆయన తీవ్రమైన వ్యంగ్యోక్తులతో ఆమెను కించపరిచారు. ఈ మాటలు తీవ్ర వివాదంగా మారడంతో ఆయన డయానాను క్షమాపణలు కోరారు. -
ఇక్కడి సంస్కృతికి ఫిదా అయ్యాం
తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్‌లో భాగంగా ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’ ఈవెంట్ కూడా పూర్తయింది. ఇందులో టర్కీ, వేల్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జాంబియా దేశాలకు చెందిన సుందరీమణులు గెలుపొందారు. వాళ్ల పరిచయాలు..బుద్ధవనం ప్రాజెక్ట్ వెరీ వెరీ స్పెషల్– ఇడిల్ బిల్గెన్, మిస్ టర్కీమిస్ వరల్డ్ పాజెంట్‌లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచింది మిస్ టర్కీ ఇడిల్ బిల్గెన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘ఈ రోజు నాకు చాలా స్పెషల్. నా దేశానికిప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగానూ చాలా ఉత్సాహంగానూ ఉన్నాను. ఈ హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో ముందంజలో ఉండటం మరింత ఆనందం. మహిళల భద్రత, సాధికారత, విద్య, సాంస్కృతిక గుర్తింపు, మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా ప్రభావం, వాతావరణ మార్పుల... ఇలా విభిన్నమైన టాపిక్స్‌తో హెడ్ టు హెడ్ చాలెంజింగ్ రౌండ్ గడిచింది. ఎక్కడైనా మహిళల విజయానికి చదువు చాలా ముఖ్యమైనది. ఏ దేశంలోనైనా అభివృద్ధి, సాధికారిత రెండూ కలిసి ప్రయాణించాలి. జనాభాలో సగం మంది వెనకబడి ఉంటే మనం విజయం సాధించలేం. ఇక్కడ మహిళలు వెనుకబడి ఉండకుండా ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. సాంకేతికత, వైద్యపురోగతికి ఈప్రాంతం కేంద్రంగా ఉంది. ప్రజల ఆప్యాయత, ప్రేమ, దయాగుణం, ఇక్కడి సంస్కృతి హైలైట్ చేస్తున్నాయి. ఇవే విషయాలను వేదికపై నుంచి వినిపించాను. తెలంగాణలోని టూరిజం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా బుద్ధవనం ప్రాజెక్ట్ వెరీ వెరీ స్పెషల్. అక్కడ మాంక్స్ చదివే మంత్రాలు ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి. నేను రేడియేషన్ అంకాలజీలో మెడిసిన్ చేస్తున్నాను. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. ‘నేనొక వైద్యురాలిని, అంతేకాదు నేను ఒక టర్కిష్ మహిళను. మిస్ వరల్డ్‌లో టర్కిష్ మహిళల గొంతుగా నేను ఉండాలనుకుంటున్నాను’ అని వేదికపై వివరించాను. బ్యూటీ విత్ ఎ పర్పస్ప్రాజెక్ట్లో భాగంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవగాహనకు కృషి చేస్తున్నాను. ఒక వైద్యురాలిగా క్యాన్సర్ రోగులకు సహాయకారిగా ఉండటం నా బాధ్యత. క్రీడలు అంటే చాలా ఇష్టం. మానసిక ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి క్రీడలు, జిమ్ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అసాధ్యం అనేది మన డిక్షనరీలో ఉండకూడాదు. ఎలాంటి సమస్య వచ్చినా దానిని అధిగమించగలను, సాధించగలను అనే ఆలోచన మనలో ధైర్యాన్ని నింపుతుంది. విజయాలను మన ముందుంచుతుంది’ అంటూ వివరించింది ఇడిల్.యువతకు చదువు చాలా ముఖ్యం– మిల్లీ మే ఆడమ్స్, మిస్ వేల్స్మిస్ వరల్డ్ పాజెంట్‌లో భాగంగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ టాప్ టెన్ జాబితా యూరప్కుప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ వేల్స్ మిల్లీ మే ఆడమ్స్ టాప్ టెన్ జాబితాలోకి చేరింది. ఈ సందర్భంగా మిల్లీ మాట్లాడుతూ – ‘‘ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది. స్వతహాగా పర్యటనలు చేయడం, చారిత్రక ప్రదేశాలు సందర్శించడం అంటే నాకు చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడు గొప్ప గొప్ప కట్టడాలను సందర్శిస్తుంటాను. అందులో భాగంగా గతంలో ఇండియాకు వచ్చినప్పుడు తాజ్‌మహల్‌ని సందర్శించాను. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పాజెంట్‌లో భాగంగా హెరిటేజ్ టెంపుల్స్, చార్మినార్ చాలా బాగా నచ్చాయి. ఇక్కడి శిల్పనిర్మాణం అద్భుతం అనిపిస్తుంది. ట్రిప్స్ చాలా ఎంజాయ్ చేశాం. ఇక్కడి సంస్కృతితో పాటు మహిళల సాధికారిత గురించి తెలుసుకున్నాను. ప్రభుత్వాలు అందిస్తున్న రక్షణ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫ్రీ బస్ సౌకర్యం గురించి తెలుసుకున్నాం. బ్యూటీ విత్ ఎ పర్పస్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ రౌండ్లో 20 మందితో పోటీపడ్డాను. పోటీలో నా వర్క్స్ గురించి, చదువుప్రాముఖ్యత గురించి అడిగారు. నేను వేల్స్లో మెడిసిన్ చదువుతున్నాను. స్ట్రీట్ డాక్టర్స్ అనే జాతీయసంస్థతో కలిసి పనిచేయడంతో పాటు, యువతకు చదువు ఎంత అవసరమో వివరిస్తూ, పాఠశాల విద్య పట్ల అవగాహన కల్పిస్తున్నాను. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అందాల పోటీల ద్వారా నిధుల సేకరించి, ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన పిల్లలకు మద్దతుగా నిలుస్తున్నాను. నా విజయానికి ఇవన్నీ ఉపకరించాయి. యువతులు, బాలికలకు తమపై తమకు పూర్తి విశ్వాసం ఉండాలి. అప్పుడు ప్రపంచంలో ఏదైనా సాధించడానికి మనకు సహకారం అందుతుంది. కోరుకున్న జీవితాన్ని గడపటానికి మహిళకు సాధికారతతో పాటు దయ, వినయం కూడా ఉంటే ఎక్కడ ఉన్నా రాణిగా వెలిగిపోతాం’’ అంటూ అందమైన నవ్వుతో సమాధానమిచ్చింది మిస్ వేల్స్.పెళ్లి తప్పించుకుని మెడిసిన్ చదివాఫేత్ వాలియా, మిస్ జాంబియా‘‘వృత్తిరీత్యా డాక్టర్ని. నాకు ఒక తమ్ముడు. మా అమ్మ పాస్టర్. నాన్న కార్పెంటర్. మేము లుసాకాలో ఉంటాం. నాకు ముందునుంచీ అందాల పోటీలంటే ఇష్టం. నాకు పదిహేనేళ్లున్నప్పుడు మొదటిసారిగా అందాల పోటీల్లో పాల్గొన్నాను. గెలిచాను కూడా! బ్యూటీ అంటే నా దృష్టిలో ఆత్మవిశ్వాసం. మా దగ్గర బాల్య వివాహాలు ఎక్కువ. నన్నూ బాల్య వివాహానికి సిద్ధం చేసింది మా సమాజం. అయితే బాగా చదువుకుని మా దేశంలోని ఆడపిల్లల తలరాతను మార్చాలి అనుకునేదాన్ని. మా ఆర్థిక పరిస్థితి బాలేనందువల్ల నా పదహారవ ఏట నాకు పెళ్లి చేసేయాలనే ఒత్తిడి తెచ్చారు మా కమ్యూనిటీ పెద్దలు. కానీ నేను తలవంచలేదు. ఆ పెళ్లిని తప్పించుకున్నాను. కష్టపడి మెడిసిన్ చదివాను. అప్పుడు గనుక నేను ఆ తెగువ చూపించక పోయుంటే ఈ రోజు మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. నా ఈ కథను ప్రపంచానికి చెప్పి, ఆడపిల్లలకు మానసిక స్థయిర్యాన్ని, స్ఫూర్తిని పంచడానికి అందాల పోటీలు ఓ వేదికగా కనిపించాయి. మన కథను వినిపించే, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసే అవకాశాన్నిస్తాయి. అందుకే ఎలాగైనా ఈ ప్లాట్‌ఫామ్ దాకా రావాలనుకున్నాను. వచ్చాను.వాయిస్ ఆఫ్ ఫెయిత్ జీవితంలో గెలవడానికి ఉపయోగపడేవి చదువు, నైపుణ్యం మాత్రమే. నా బ్యూటీ విత్ ఎ పర్పస్ కూడా అదే! ‘వాయిస్ ఆఫ్ ఫేత్’ అనే ఫౌండేషన్ ద్వారా అట్టడుగు వర్గాల పిల్లలకు చదువుప్రాధాన్యాన్ని తెలియజెబుతున్నాను. సేంద్రియ సాగు విధానాలను నేర్పి.. వాళ్ల సుస్థిర ప్రగతికి పాటుపడే ప్రయత్నం చేస్తున్నాను. సాంకేతిక రంగంలో వాళ్లు నైపుణ్యం సాధించేలా శిక్షణనిప్పిస్తున్నాను. ఈ పనులన్నీ ఎలా చేస్తున్నానో ‘హెడ్ టు హెడ్ చాలెంజ్ (బ్యూటీ విత్ ఎ పర్పస్)’ రౌండ్లో ప్రెజెంట్ చేశాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, సాంకేతిక రంగాల్లో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతున్నట్టుంది. అధిక జనాభా, తక్కువ భూభాగం లాంటి సవాళ్లతో కూడా ఇండియా సాధించిన ఈ ప్రగతి చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రజల అవసరాల పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి ప్రశంసనీయం. తెలంగాణ సంస్కృతికి, ఆతిథ్యానికీ నేను ఫిదా అయ్యాను. మా దేశం కూడా ఈ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మిస్ జాంబియా ఫేత్ వాలియా.తెలంగాణ మినీ ఇండియా– అనా లీజ్ నాన్సాన్, మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో‘‘మాది పెద్ద కుటుంబం. మేము మొత్తం ఎనిమిది మంది పిల్లలం. అందరిలోకి నేనే పెద్ద. అందుకే అన్ని విషయాల్లో నా తోబుట్టువులకు నేనో మార్గదర్శిగా ఉండాలని కోరుకునేదాన్ని! మా నాన్న ఇంజినీర్, అమ్మ గృహిణి. చదువు విషయంలో నాకు మా నాన్నే స్ఫూర్తి. ఇంగ్లండ్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివాను. ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. పర్యావరణహిత నిర్మాణాలు నా లక్ష్యం. నేను అథ్లెట్ కూడా! ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. బ్యూటీ పాజెంట్‌లో పాల్గొనడానికి నాకు ప్రేరణ.. ఇందులోని ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ సెగ్మెంట్. ఇందులో నేను నమ్మే సుస్థిర అభివృద్ధి, హ్యాపీ లివింగ్ వంటివాటి గురించే చెప్పే అవకాశం దొరుకుతుందని అనుకున్నాను. నా బ్యూటీ విత్ ఎ పర్పస్ కూడా అదే! ‘ద రిపుల్ ఎఫెక్ట్’ అనే సంస్థను స్థాపించాను. స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా సస్టెయినబుల్ కమ్యూనిటీస్‌ని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ముఖ్యంగా నిస్సహాయ మహిళల సాధికారత, పిల్లల చదువు కోసం పనిచేస్తున్నాను. మా దేశానికి వలసలు ఎక్కువ. ఆ పిల్లలకు స్థానిక భాషలు, ఇంగ్లిష్ వంటివి రాక చదువుకు దూరమవుతున్నారు. అందుకే ట్రినిడాడ్‌లోని ‘విస్డమ్ సియోరామ్’ అనే ఓ టెక్నాలజీ కంపెనీ సహాయంతో ఆ పిల్లలకు పలు భాషలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. నేను అథ్లెట్‌ని కూడా కాబట్టి స్పోర్ట్స్ మీదా ఫోకస్ చేస్తున్నాను. ఆటలతో శారీరక దృఢత్వమే కాదు ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా అలవడుతుంది. అందుకే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించే ప్రయత్నమూ చేస్తున్నాను. ముఖ్యంగా స్విమ్మింగ్‌లో. ఎందుకంటే అది లైఫ్ స్కిల్ కాబట్టి. స్థానిక వనరులతో గ్రీన్ బిల్డింగ్ టెక్నిక్స్‌ని చెప్పే పాడ్‌కాస్ట్ చానెల్‌నూ స్టార్ట్ చేశాను. ఇందులో ఇంజినీర్స్, ఆర్కిటెక్ట్స్, పర్యావరణవేత్తలను ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంతేకాదు మొక్కలు నాటే కార్యక్రమాలూ నిర్వహిస్తుంటాను. ఇవన్నీ నా బ్యూటీ విత్ ఎ పర్పస్‌లో భాగాలే!కలర్ఫుల్గా.. ఇండియా గురించి విన్నాను. కానీ తెలంగాణ స్టేట్ గురించి ఎప్పుడూ వినలేదు. తెలంగాణ మినీ ఇండియాలా అనిపించింది. మాలాగే ఇక్కడా భిన్న మతాలు, భిన్న సంస్కృతీసంప్రదాయాలు కనిపించాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడి ఫుడ్ స్పైసీగా ఉన్నప్పటికీ చాలా బాగుంది. సో డిలీషియస్. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనిపించేలా ఉంది తెలంగాణ ఆతిథ్యం! చాలా హ్యాపీ!’’ అన్నారు అనా లీజ్ నాన్సాన్ఇంటర్వ్యూలు: నిర్మలారెడ్డి, సరస్వతి రమ -
హెడ్ టు హెడ్లో విజేతలు వీరే
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో కీలకమైన హెడ్–టు–హెడ్ ఛాలెంజ్ ఫైనల్ హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో పోటాపోటీగా జరిగింది. యూరప్, ఆఫ్రికా, ఆసియా అండ్ ఓషియానియా, అమెరికా అండ్ కరేబియన్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మంది పోటీదారులు సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను, తాము చేస్తున్న కార్యక్రమాలను తమదైన శైలిలో జడ్జిలకు వివరించారు. జడ్జిలు తమకు వేసిన ప్రశ్నలకు వారు జవాబిచ్చారు. వాటి ఆధారంగా నాలుగు ఖండాల నుంచి నాలుగు దేశాలకు చెందిన సుందరీమణులను హెడ్–టు–హెడ్ విజేతలుగా ఎంపిక చేశారు. అమెరికా–కరేబియన్ నుంచి మిస్ ట్రినిడాడ్ హెడ్–టు–హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో భాగంగా అమెరికా–కరేబియన్ ఖండంలోని బ్రెజిల్, సురినామ్, కేమెన్ ఐలాండ్స్, గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి వచ్చిన పోటీదారులకు ‘తెలంగాణలో మహిళా సాధికారత – భద్రత’ పై ప్రపంచానికి మీరు ఏ సందేశాన్ని ఇస్తారనే ప్రశ్న వేశారు. ఈ గ్రూపులో ఉత్తమ జవాబు ఇచ్చిన మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో తుది రౌండ్‌కు ఎంపికయ్యింది. ప్రగతి, సాధికారత ఒకటే. భారత్ ముఖ్యంగా హైదరాబాద్ ఈ దిశగా చేయడుతున్న చర్యలు అభినందనీయం. సగం జనాభా వెనుకబడి ఉంటే విజయం సాధించలేమనే ఉద్దేశంతో మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తెలంగాణ స్ఫూర్తిదాయకం..’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆఫ్రికా నుంచి మిస్ జాంబియా ఆఫ్రికా ఖండానికి సంబంధించి దక్షిణాఫ్రికా, నమీబియా, సోమాలియా, ఉగాండా, జాంబియా పోటీదారులకు..‘సోషల్ మీడియా జీవితంలోని అనేక అంశాలను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేస్తోంది. ఈ విషయంలో మీరు ఎలా ప్రామాణికంగా ఉంటారు’అనే ప్రశ్న వేశారు. ఈ గ్రూపు నుంచి తుది పోరుకు ఎంపికైన మిస్ జాంబియా మాట్లాడుతూ‘ప్రపంచం మారవచ్చు, కానీ మీరు మారాల్సిన అవసరం లేదు. మీరలాగే ఉండండి. ప్రపంచం దాన్ని స్వీకరించనివ్వండి. సమాజం పరిణామం చెందవచ్చు, కానీ మన నిజ స్వభావాన్ని కోల్పోకూడదు’ అని చెప్పారు. యూరప్ నుంచి మిస్ వేల్స్.. యూరప్ గ్రూప్‌లో స్పెయిన్, వేల్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్ దేశాల సుందరీమణులు పాల్గొనగా..‘మీ దేశంలో యువ జీవితాలను మెరుగుపరచడానికి మీరు ఒక మార్పును అమలు చేయగలిగితే అది ఏమిటి? అదే ఎందుకు?’ అనే ప్రశ్న వేయగా.. ఈ బృందంలో ఎంపికైన మిస్ వేల్స్.. ‘ఆరోగ్య సంరక్షణ, విద్య ప్రధానం. మా కుటుంబంలో విశ్వవిద్యాలయానికి వెళ్లిన మొదటి వ్యక్తిని నేనే. ఉగాండా, భారతదేశంలో వైద్య సేవలు, ముఖ్యంగా యాసిడ్ దాడి బాధితుల కథలు, నా లక్ష్యానికి స్ఫూర్తినిచ్చాయి. విద్య అత్యంత శక్తివంతమైన సాధనం..’ అని చెప్పడం ద్వారా విజేతగా నిలిచారు. ఆసియా నుంచి మిస్ టర్కీ ఇక ఆసియా అండ్ ఓషియానియా నుంచి శ్రీలంక, థాయిలాండ్, టర్కీ, లెబనాన్, జపాన్ కంటెస్టెంట్లకు.. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్‌తో పనిచేయడం మీ దృక్పథాన్ని ఎలా మార్చింది?’ అనే ప్రశ్న జడ్జిలు వేశారు. ఈ గ్రూపులో విజేత మిస్ టర్కీ.. ‘నేటి ప్రపంచంలో సాంస్కృతిక వారసత్వం అత్యంత ముఖ్యమైనది. కాన్సులేట్లు, రాయబార కార్యాలయాలు నిర్వహించే అంతర్జాతీయ ఈవెంట్ ద్వారా సంగీతం, కళలు, వంటకాలు, సంప్రదాయాలతో మనం సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటమే కాకుండా, ఐక్యతను పెంపొందించుకోగలం. సాంస్కృతిక తేడాలు అడ్డంకులు కావు.. వంతెనలు..’ అని చెప్పారు.మీరు తెలంగాణను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు? తుది పోరుకు ఎంపికైన మిస్ టర్కీ, వేల్స్, జాంబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలకు జడ్జిలు చివరగా ఒక ప్రశ్న వేశారు. ‘భారతదేశంలోని అతి చిన్న రా ష్ట్రమైన తెలంగాణను సంస్కృతి, వారసత్వం, ఆవిష్కరణల పరంగా ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు?’ అని అడగ్గా.. నలుగురూ జవాబిచ్చారు. ఆవిష్కరణల కేంద్రం తెలంగాణ సాంకేతిక, వైద్య ఆవిష్కరణల కేంద్రం. ఇది ప్రగతిశీల, శక్తివంతమైన రాష్ట్రం, మహిళల హ క్కులు, భద్రత, విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ ప్రపంచానికి ‘సాధికారత, ఆవిష్కరణ, లింగ సమానత్వంతో శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది. – మిస్ టర్కీనా దేశాన్ని ఆహ్వానిస్తా తెలంగాణ గురించి చెప్పడమే కాదు.. ఈ రాష్ట్ర గొప్ప సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించడానికి నా దేశాన్ని ఆహ్వానిస్తాను. – మిస్ వేల్స్ కళలు, సంస్కృతితో మమేకం తెలంగాణ ప్రజలు కళలు, సంస్కృతితో మమేకమైన వారు. నాకు వారి ప్రామాణికతను ప్రతిబింబించే అనేక బహుమతులు లభించాయి. మిస్ వరల్డ్ నినాదం ‘బ్యూటీ విత్ ఎ పర్ప స్’ కాగా.. తెలంగాణ ఆ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో కలిగి ఉంది. – మిస్ జాంబియాదయ, సంస్కృతి నిండిన ప్రజలునా దేశం లార్డ్ అఫ్ ది సన్ దేశంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ సన్ అఫ్ ది లార్డ్. ఇక్కడ ప్రజలు దయ, సంస్కృతితో నిండి ఉన్నారు. – మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో -
రసవత్తరంగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలు
-
మిస్ వరల్డ్ 2025: అందమొక్కటే కాదు..అందమైన మనసు కూడా..
మిస్ వరల్డ్ అంటే అందమొక్కటే కాదు, అందమైన మసను కూడా..!! మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సామాజిక సేవ అంశాన్ని, లక్ష్యాన్ని కొనసాగిస్తున్న వారే. ఇందులో భాగంగానే నగరంలోని సరూర్ నగర్ విక్టోరియా హోమ్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని చేరుకోవడానికి అవసరమైన సూచనలిచ్చారు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీదారులు విక్టోరియా హోమ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 107 మంది పోటీదారులతో పాటు మాజీ మిస్ వరల్డ్ క్రిస్టినా కలసి విక్టోరియా హోమ్‌ను సందర్శించి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. కష్టపడే తత్వం, విజ్ఞాన సముపార్జనతో పాటు విద్యలో రాణిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని చిన్నారులకు వివరించారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే పటిష్టమైన కలలు ఉంటేనే తమ లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. అనంతరం విక్టోరియా హోమ్ విద్యార్థినులకు బహుమతులతో పాటు వారికి నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులను మిస్ వరల్డ్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అలకించి అభినందించారు. అందాల తారలు.. ముచ్చటపడి ఆ చిన్నారులతో కలిసి ఆడారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ చైర్మన్ మోర్లే, పర్యాటక శాఖ డైరెక్టర్ హనుమంతు, రాచకొండ సీపీ, ఎస్సీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: రానూ.. బొంబైకి రానూ.. విభిన్న కళలతో అలరించిన సుందరీమణులు) -
రానూ.. బొంబైకి రానూ.. !
హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికగా గురువారం నిర్వహించిన ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 వేదిక పై మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు విభిన్నకళారూపాలతో ఆకట్టుకున్నారు. ఈ టాలెంట్ కాంపిటీషన్ ఫినాలేలో తెలుగు సాంగ్ రాను బొంబైకి రాను అనే సాంగ్‌తో పలువురు ఉర్రూతలూగించారు. 24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు వారి దేశాలకు చెందిన విభిన్న కళలతో అలరించారు. దీంతో పాటు పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక అంశాలు, ఐస్ స్కేటింగ్, డ్యాన్సింగ్, డీజే ప్లేయింగ్ వంటి ప్రదర్శనలిచ్చారు. ఈ టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్ కామెరూన్ (సింగింగ్) రెండో స్థానంలో, మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు. సంప్రదాయ శ్రీలంక సింహళీ నృత్యంతో అలరించారు మిస్ శ్రీలంక. ఒక్క రోజులో తన కోసం సంప్రదాయ డ్రెస్‌ను తన తల్లి డిజైన్ చేసి ఇచ్చినందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో భారతీయ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్ లీలా సినిమాలోని దోల్ భాజే సాంగ్ ప్రేక్షకులు, జ్యూరీ సభ్యుల ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో నందినీ గుప్తా చేసిన నృత్యం ఆద్యాంతం ఆక్టట్టుకుంది. చివరగా 24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు అద్దాల మేడలున్నవే, రాను బొంబైకి రానూ.. అనే తెలుగు పాటలకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టారు. (చదవండి: అమేజింగ్ అమ్మాయిలు) -
శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)
-
అమేజింగ్ అమ్మాయిలు
ఈమె పేరు.. వలేరియా పేరస్. మిస్ ప్యూర్టో రికో! వృత్తిరీత్యా టీచర్. మిడిల్ స్కూల్ పిల్లలకు సైన్స్ బోధిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు, ఆతిథ్యం గురించి వలేరియా పంచుకున్న విషయాలు... ‘‘మిస్ వరల్డ్ కోసం 119 మంది అమేజింగ్ అమ్మాయిలతో పోటీ వావ్ అనిపిస్తోంది. ఈ పోటీల కోసం ఇండియా.. ఎస్పెషల్లీ హైదరాబాద్ రావడం సూపర్బ్ ఫీలింగ్. ఇక్కడి హాస్పిటాలిటీ నాకు చాలా నచ్చింది. మా ఇంటిని, దేశాన్ని వదిలి ఎక్కడో సుదూర తీరాలకు వచ్చినట్టేమీ అనిపించడం లేదు. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. మేమంతా భిన్న దేశాల నుంచి వచ్చినవాళ్లమనే భావన కలగట్లేదు. చాలా త్వరగా మా మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇనాగ్యురల్ ఫంక్షన్ రోజు.. మేమంతా ఒకరికొకరం మేకప్ చేసుకున్నాం. హెయిర్ స్టయిల్ చేసుకున్నాం. జ్యూవెలరీ కూడా ఎక్సేఛేంజ్ చేసుకున్నాం. అంత అద్భుతమైన సిస్టర్హుడ్ డెవలప్ అయింది మా మధ్య! ఇక్కడికి రావడానికి ముందు కొంచెం భయమేసింది.. ఇక్కడి మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. వాతావరణం ఎలా ఉంటుందో అని! కానీ ల్యాండ్ అయ్యాక.. ఇక్కడి వాళ్ల మర్యాద చూస్తున్నాను కదా.. ట్రెమండస్! పహల్గామ్ ఘటనతో దేశంలో ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి కదా! అది కూడా కొంచెం భయపెట్టింది. ఫార్చునేట్లీ అంతా ప్రశాంతంగానే ఉంది. ఉండాలి కూడా! అయితే ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా మా సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. మాకెలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకుంది. చూసుకుంటోంది. తెలంగాణ కల్చర్, ఆర్ట్.. రిచ్ అండ్ క్రియేటివ్‌గా ఉంది. ఫుడ్ కొంచెం కారంగా ఉన్నా డెలీషియస్‌గా ఉంది. నచ్చింది. నా బ్యూటీ విత్ పర్పస్ విషయానికి వస్తే.. ఆటిజం, డౌన్‌సిండ్రోమ్ పిల్లల కోసం వర్క్ చేస్తున్నాను. అంతేకాదు సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసమూ కృషిచేస్తున్నాను. మనుషులందరూ సమానమే! కాబట్టి అవకాశాలూ సమానంగా ఉండాలి. ఉన్నవాళ్లు, లేనివాళ్లు, జెండర్ విభేదాలు ఉండకూడదు. అంతేకాదు ప్రతివారికీ వారికే ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించి, ఆ దిశగా వాళ్ల ప్రయాణం సాగేందుకు సాయపడుతున్నాను’’ అన్నారు వలేరియా.– రమ సరస్వతిఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్ -
మిస్ ‘కళలు’.. అదుర్స్
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గురువారం రాత్రి నిర్వహించిన ‘టాలెంట్ గ్రాండ్ ఫినాలే విభిన్న కళలతో అలరించింది. 24 దేశాలకు చెందిన పోటీదారులు ఎంపికైన ఈ ఫినాలేలో మిస్ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్ కామెరూన్ (సింగింగ్) రెండవ స్థానంలో, మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు. అద్భుతమైన పియానో సంగీతంతో మిస్ ఇండోనేషియా వేదికను సోల్‌ఫుల్ ఫీల్‌లో ముంచెత్తింది. శ్రావ్యమైన పాశ్చాత్య సంగీత వెల్లువతో ‘గుడ్నెస్ ఆఫ్ గాడ్’ పాట పాడి మిస్ కామెరూన్ ప్యానెలిస్టుల మనసు దోచుకుంది.మిస్ ఇటలీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక విశిష్టతను కలిగిన బ్యాలేను ప్రదర్శించింది. ఇండియన్ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా చేసిన బాలీవుడ్ హిట్ సాంగ్ దోల్ భాజే సాంగ్ వేదికను దద్దరిల్లేలా చేసింది. భారతీయ సంస్కృతిని మిస్ వరల్డ్ వేదికపై ఘనంగా ప్రదర్శించడం సంతోషంగా ఉందని నందినీ గుప్తా తెలిపారు. చివరగా మొత్తం 24 మంది పోటీదారులు రాను బొంబాయికి రాను, అద్దాల మేడలున్నయే అంటూ తెలుగు పాటలకు స్టెప్పులేశారు. కాగా, అత్యవసర సమయాల్లో రోగులను కాపాడే సీసీఆర్ ఎలా చేయాలో వినూత్నంగా ప్రదర్శించి వేల్స్ కంటెస్టెంట్ తన వైద్య వృత్తి గొప్పదనాన్ని చాటారు. సింగరేణి స్టాల్స్‌లో సుందరీమణులు గురువారం సాయంత్రం శిల్పారామాన్ని సందర్శించిన అనంతరం మిస్‌వరల్డ్ పోటీదారులు పక్కనే ఉన్న ఇందిరా మహిళా శక్తి బజారును సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి స్వయం ఉత్పత్తిదారుల వస్తు విక్రయశాలను కూడా వారు తిలకించారు. వివిధ ప్రాంతాల నుంచి సింగరేణి సేవా సమితిలో శిక్షణ పొందిన మహిళలు తయారుచేసిన బ్యాగులు, చేతి పర్సులు, మగ్గం వర్క్ చేసిన దుస్తులను పరిశీలించి, ఇవి చక్కగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు. -
అందాల భామలకు అగ్నిపరీక్ష
సాక్షి, హైదరాబాద్: పది రోజులుగా రాష్ట్రంలోని పలు దర్శనీయ స్థలాలను మండుటెండల్లో చుట్టేసి చెదరని చిరునవ్వు, అందం–అభినయంతో పరవశింపచేసిన సుందరీమణులు ఇప్పుడు చాలెంజ్ రౌండ్లలో దూసుకుపోతూ మిస్ వరల్డ్ పోటీలను రసవత్తరంగా మార్చారు. ఈనెల 10న ప్రారంభోత్సవం మొదలు వివిధ ప్రాంతాలను చుట్టేసిన అందాల భామలు.. ఆటవిడుపునకే పరిమితమయ్యారు. ఇప్పుడు అసలైన పోటీల్లో దిగి రెండు రోజులుగా మేధోసంపత్తితో అలరిస్తున్నారు. ఇప్పటిదాకా ఆటవిడుపుగా సాగిన పోటీలు అభిమానులకు రసవత్తరంగా మారగా, పోటీదారులకు అగి్నపరీక్షగా నిలిచాయి. దీంతో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కీలక అంకంలోకి చేరినట్టయింది. సత్తా చాటిన 24 మంది: టీ–హబ్‌లో రెండు రోజులపాటు జరిగిన హెడ్ టు హెడ్ చాలెంజ్ రౌండ్లో 24 మంది విజయం సాధించి తదుపరి 23న జరిగే కీలక టాలెంట్ పోటీకి ఎంపికయ్యారు. 107 దేశాలకు చెందిన పోటీదారులు ఇందులో పాల్గొనగా, 24 మందిని ఉన్నత ప్రతిభావంతులుగా న్యాయనిర్ణేతలు తేల్చారు. హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో ఇండియా, అమెరికా, పోలండ్, నైజీరియా, ఫిలిప్పీన్స్, మాల్టా, ఇటలీ, ఇండోనేసియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఎస్టోని యా, జర్మనీ, బ్రెజిల్, కేమాన్ ఐలాండ్స్, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, జమైకా, అర్జెంటీనా, ఐర్లాండ్, ఆ్రస్టేలియా, శ్రీలంక, ఇథియోపియా, కామె రూన్, కెన్యా ముద్దుగుమ్మలు విజేతలుగా నిలిచారు. వీరు 23న జరిగే టాలెంట్ కాంపిటీషన్లో తలపడి తమ ఖండంలోని టాప్–10లో భాగమవుతారు. వారికి మళ్లీ సత్తా చాటే చాన్స్: హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో 24 మంది విజేతలుగా నిలిచి సెమీఫైనల్ బెర్తుకు చేరువయ్యారు. ఈ రౌండ్లో ఓడిన వారు ఎలిమినేట్ కారు. వారు పోటీలో ఇతర విభాగాలైన మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్, టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్, జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షోల్లో పాల్గొనవచ్చు. వీటిల్లో మెరుగ్గా రాణిస్తే తదుపరి రౌండ్లకు అర్హత సాధిస్తారు. అయితే, ఆ 24 మందితో పోలిస్తే వీరికి ఎక్కువ సవాళ్లు ఉంటాయి. మిస్ వరల్డ్ పోటీల్లో హెడ్ టు హెడ్ చాలెంజ్‌ను ఫాస్ట్–ట్రాక్ ఈవెంట్‌గా పరిగణిస్తారు. ఇందులో విజేతలు నేరుగా క్వార్టర్–ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. ⇒ మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్: ఈ పోటీ మే 22న శిల్పకళా వేదికలో జరుగుతుంది. ఇందులో పాల్గొనే వారు సంగీతం, నృత్యం, కళలు ఇతర ప్రతిభలను ప్రదర్శిస్తారు. ⇒ టాప్ మోడల్–ఫ్యాషన్ ఫైనల్: ఇది మే 24న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉంటుంది. ⇒ జ్యువెలరీ–పెర్ల్ ఫ్యాషన్ షో: మే 25న హైటెక్స్‌లో జరుగుతుంది, ఇందులో తెలంగాణలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు కూడా హాజరవుతారు. ⇒ ఈ అన్ని పోటీల్లో వడపోత కార్యక్రమం కొనసాగుతుంది. అమెరికా–కరేబియన్, ఆసియా–ఓషియానా, ఆఫ్రికా, యూరప్.. ఈ నాలుగు విభాగాల్లో తొలుత ఒక్కో ఖండం నుంచి 10 మంది ఎంపికవుతారు. తదుపరి రౌండ్లో ఆ సంఖ్య ఐదుకు పరిమితమవుతుంది. ఆ తర్వాత ఇద్దరు చొప్పున ఉంటారు. 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో మొత్తం 8 మంది మిగులుతారు. వారిలో విజేత, రన్నరప్, రెండో రన్నరప్‌ను ఎంపిక చేస్తారు. విజేతకు మిస్‌వరల్డ్–2024 క్రిస్టీనా పిజ్కోవా రూ.6.21 కోట్ల విలువైన కిరీటాన్ని అలంకరింపజేస్తారు. ఈ గ్రాండ్ ఫినాలే ఈనెల 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. -
అందమైన సమాజం!!
హైదరాబాద్‌లోని ట్రై డెంట్ హోటల్లో మిస్ వరల్డ్ 2025 పాజంట్స్ మధ్య కలివిడిగా తిరుగుతున్నారు షానియా బాలెస్టర్. కొత్తగా కనిపించిన వారిని తానే ముందుగా పలకరించి ‘ఐ యామ్ ఫ్రమ్ జిబ్రాల్టర్’ అని పరిచయం చేసుకుంటోంది. దేశం పేరు అడగకుండానే చెబుతోంది, తన పేరు మాత్రం అడిగితే తప్ప చెప్పడం లేదు. ‘భౌగోళికంగా దేశాలుగా విడిపోయిన మనందరిదీ ఒకటే ప్రపంచం’ అన్నారు షానియా బాలెస్టర్. చిన్న దేశం ‘‘మిస్ వరల్డ్ 2025కి క్యాప్షన్ బ్యూటీ విత్ పర్పస్. నాకు సంబంధించినంత వరకు ప్రపంచపటంలో జిబ్రాల్టర్ అనే దేశం ఒకటుందని ప్రపంచానికి తెలియచేసే అరుదైన అవకాశం. జిబ్రాల్టర్ చాలా చిన్నదేశం. జనాభా ముప్ఫై ఐదు వేల లోపే. ప్రపంచంలోని అనేక ఖండాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో మా దేశం రకరకాల సంస్కృతుల నిలయమైంది. దాంతో ఇండియా కూడా నాకు సుపరిచితమైన దేశంలానే అనిపిస్తోంది. హైదరాబాద్ ఆహారం కొంచెం ఘాటుగా అనిపించినప్పటికీ చాలా రుచిగా ఉంది. ప్రపంచానికి పరిచయం నా కెరీర్ మోడలింగ్. నాకు సంతోషాన్నిచ్చే పని చారిటీ. నాలుగేళ్ల నుంచి మోడలింగ్‌కు కొంత విరామం ఇచ్చి బ్యూటీ కాంటెస్ట్ మీద దృష్టి పెట్టాను. మిస్ జిబ్రాల్టర్ కిరీటంతోనే ఆగిపోయి ఉంటే ఆ విజయం నాకు మాత్రమే పరిమితమయ్యేది. నా విజయం నా దేశానికి ఉపయోగపడాలంటే అది ప్రపంచ వేదిక మీదనే సాధ్యమవుతుంది. మాది సార్వభౌమత్వం సాధించాల్సిన దేశం. ఇప్పుడు మాకున్న గుర్తింపు బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీగానే. ఈ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా వందకు పైగా దేశాలకు మా దేశం పరిచయమైంది. అందాల పోటీల ద్వారా దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమవుతాయి. ప్రపంచం అంతా ఒకటేననే భావన పెంపొందుతుంది. రెండు దేశాల మధ్య మాత్రమే కాదు ప్రపంచదేశాలన్నింటి మధ్య సుçహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఒక దేశం చరిత్ర మరొకరికి అర్థమవుతుంది, సాంస్కృతిక గొప్పదనం అవగతమవుతుంది. మనకిప్పటి వరకు తెలియని అనేక దేశాల గురించి తెలుసుకుంటాం. ఒకదేశం ఔన్నత్యం గురించి మరొక దేశంలో సందర్భోచితంగా తెలియచేయగలుగుతాం. అవసరమైన సందర్భంలో సంఘీభావంతో వ్యవహరించగలుగుతాం. అందం మనసుదే మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది. నిజానికి అందం అనేది బాహ్య సౌందర్యం కాదు. దయ, కరుణ, అర్థం చేసుకోవడం. ఎదుటి వారి కష్టాన్ని వారి దృష్టి కోణం నుంచి విశ్లేషించుకుని అర్థం చేసుకోగలిగిన మనసు ఉండడమే నిజమైన అందం. ఈ బ్యూటీ పాజంట్ తర్వాత కూడా నా సర్వీస్‌ని కొనసాగిస్తాను. అయితే భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పుడే చెప్పలేను. నా దేశం సార్వభౌమాధికారం సాధించడానికి నేనేం చేయగలనో అంతా చేస్తాను’’ అన్నారు మిస్ వరల్డ్ జిబ్రాల్టర్ షానియా బాలెస్టర్. మా జిబ్రాల్టర్ చాలా చిన్నదేశమే కానీ సమాజం చాలా అందమైనది. వివక్ష లేని సమాజం మాది. స్త్రీ పురుషుల లిటరసీ రేట్ సమానం అని చెప్పడానికి గర్వంగా ఉంది.– షానియా – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్ ఎస్ ఠాకూర్ -
సామాజిక అంశాలపై స్ఫూర్తినిచ్చేలా..
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచ సుందరి 2025’పోటీల్లో భాగంగా మంగళవారం ‘టీ హబ్’వేదికగా పోటీదారుల నడుమ ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’నిర్వహించారు. అమెరికా, కరీబియన్, ఆఫ్రికా దేశాలకు చెందిన సుమారు 60 మంది పోటీదారులు ఇందులో పాల్గొన్నారు. వీరంతా ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’నినాదంతో వివిధ సామాజిక అంశాలపై తమ మనోగతాన్ని పంచుకున్నారు. మెరుగైన ప్రపంచం కోసం జరగాల్సిన కృషిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.బాలల విద్య, పర్యావరణం, పక్షవాతం, ప్రకృతి, యువతులకు మద్దతు, చిన్న సముదాయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, యుక్త వయసులో ఆందోళన, మానసిక ఆరోగ్యం, ధ్రువీకరణ శక్తి, భాషా సంరక్షణ, బాలలపై హింస, సౌరశక్తి, ప్లాస్టిక్ కాలుష్యం, లింగ ఆధారిత హింస, బాలలపై లైంగిక వేధింపులు, ప్రత్యేక సముదాయాలకు విద్య, ఆర్థిక సంక్షోభాలు, ఆటిజం, మత్తు పదార్థాలు వంటి స్థానిక, అంతర్జాతీయ అంశాలు, సమస్యలపై పోటీదారులు ప్రసంగించారు. తాము ఎంచుకున్న అంశాలపై మాట్లాడుతూ సామాజిక మార్పు అవసరాన్ని నొక్కి చెప్పారు. అందులో తాము భాగస్వాములం అవుతామని ప్రకటించారు. స్ఫూర్తిని రేకెత్తించేలా.. విద్య, ఆరోగ్య సంరక్షణ, వాతావరణం, సామాజిక అభివృద్ధి వంటి అంశాల్లో పోటీదారుల ఆలోచనలను, వారిలో మానవతా విలువలు తదితరాలను ‘హెడ్ టు హెడ్ చాలెంజ్’లో మదింపు చేస్తారు. ఇది పోటీదారుల మధ్య ఒక పోటీ అనేకంటే వారిలోని ధైర్యం, కరుణ తదితరాలను ప్రదర్శించే ఒక కార్యక్రమం లేదా వేడుక లాంటిది. కాగా ఈ చాలెంజ్‌లో పోటీదారులు ప్రస్తావించిన అంశాలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయి. ‘తెలంగాణకు స్ఫూర్తి కేంద్రంగా పేర్కొనే టీ హబ్‌లో ఈ కార్యక్రమం జరగడం హర్షణీయం..’అని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లే అన్నారు. బుధవారం రెండోరోజు టీ హబ్‌లో జరిగే హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో యూరప్, ఆసియా, ఓషియానియా దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటారు. తప్పుకొన్న ఇంగ్లండ్ పోటీదారు మిల్లా మాగీ మిస్ వరల్డ్ పోటీల నుంచి ఇంగ్లండ్ ప్రతినిధి మిల్లా మాగీ అర్థంతరంగా తప్పుకున్నారు. ఆరంభంలో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. వివిధ ప్రాంతాల సందర్శనకు వెళ్లిన సమయంలో తీవ్ర ఎండవేడిమి వల్ల వడదెబ్బకు గురైనట్టు తెలిసింది. రెండు రోజులుగా చికిత్స చేయించుకున్న ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిందని చెబుతున్నారు. ఆమె స్వదేశానికి పయనమవుతున్నట్టు సమాచారం. కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ సెంటర్ సందర్శన బ్రెస్ట్ కేన్సర్‌కు సంబంధించిన వైద్య సేవలను అందజేస్తున్న కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సంస్థ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ పోటీదారులు కిమ్స్‌ను సందర్శించడం సంతోషకరమని, బ్రెస్ట్ కేన్సర్ వైద్యసేవల్లో ఉషాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ రఘురామ్ వందశాతం విజయాలను నమోదు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ జూలియా మోర్లే, నందిని గుప్తా (మిస్ ఇండియా 2025)తో పాటు ఇతర పోటీదారులు, రొమ్ము క్యాన్సర్ ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025– ఫ్రాన్స్), డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్ఏ) తదితరులు పాల్గొని డాక్టర్ రఘురామ్ సేవలను కొనియాడారు. -
కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ సెంటర్‌ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు
హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో సేవలందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు సందర్శించారు.వీరికి కిమ్స్ గ్రూప్ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ, “మా ఆస్పత్రిని సందర్శించిన మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులందరికీ సాదర స్వాగతం. డాక్టర్ రఘు రామ్ చేపట్టిన ప్రతి పని 100% విజయాల రేటుతో చేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆయన్ను నేను దగ్గరగా చూస్తున్నాను. మాతృ ప్రేమ, మాతృభూమి పట్ల ప్రేమ అతనిని యూకే నుంచి భారత్‌కు తిరిగి తీసుకొచ్చింది, అక్కడ ఆయన అనేక ఆవిష్కరణాత్మక కార్యక్రమాల ద్వారా క్యాన్సర్ చికిత్స తీరును సమూలంగా మార్చాలన్న లక్ష్యంతో కృషిచేస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు. దేశానికి ఆయన చేసిన అందమైన సేవలకు మరిన్ని విజయాలు దక్కుతాయి” అని ఆకాంక్షించారు.మిస్ వరల్డ్ 2025 బృందానికి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈఓ మిస్ జూలియా మోర్బీ నేతృత్వం వహించారు. గత 18 సంవత్సరాలలో ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ కిమ్స్ ఆస్పత్రుల ద్వారా చేసిన సేవలను కొనియాడారు. ఇక్కడకు హాజరైన పలువురు వైద్యనిపుణులను ఉద్దేశించి మిస్ జూలియా మోర్బీ మాట్లాడుతూ, “డాక్టర్ రఘు రామ్ హైదరాబాద్‌లో దక్షిణ ఆసియాలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో తన సొంత ఆలోచనలతో రూపొందించిన ఈ అసాధారణ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం ద్వారా అద్భుతమైన నాయకత్వ పటిమను చాటి చూపించారు. త్వరగా గుర్తించడం ద్వారా 18 ఏళ్లు దాటిన అనేక మంది మహిళల ప్రాణాలను కాపాడేందుకు గణనీయమైన కృషిని ఆయన చేశారు. భారతదేశం, బ్రిటన్ల మధ్య సజీవ వంతెనగా అనేక మార్గాల్లో ఆయన నిలిచారు. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సకు అపారమైన సేవలు అందిస్తున్నారు” అని తెలిపారు.నందిని గుప్తా (మిస్ ఇండియా 2025), హన్నా జాన్స్ (మిస్ నార్తరన్ ఐర్లండ్ 2025) ఇస్సీ ప్రిన్సెస్ (మిస్ కామెరూన్- మధ్య ఆఫ్రికా), రొమ్ము క్యాన్సర ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025- ఫ్రాన్స్),డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్ఏ) తదితరులంతా డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసించారు. తన తల్లి డాక్టర్ ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ప్రయాణంతో స్ఫూర్తి పొందిన ఆయన.. ఇలా దేశంలో చాలామందికి అసవరమైన రొమ్ము క్యానన్సర్ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. తమ తమ దేశాల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహనకు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారు. డాక్టర్ రఘురామ్ అద్భుతంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ నుంచి తాము చాలా తెలుసుకున్నామని, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అమలు చేసిన ప్రయత్నాలను తమ స్వదేశంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.ఈ సదర్భంగా కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ, “కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ కేంద్రంలో నాణ్యమైన సమయం గడిపేందుకు ముందుకొచ్చిన మిస్ ఇండియా పోటీదారుఉల, మిస్ జూలియా మార్లీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా పవర్ పాయింట్ ప్రజంటేషన్ గురించి గుండెలకు హత్తుకునేలా చెప్పారు.గత 18 ఏళ్లుగా నేను చేస్తున్న కృషి అందులో ఉంది. మా అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రయాణమే నాకు స్ఫూర్తినిచ్చింది. నా సహోద్యోగులు, స్నేహితులు, ప్రభుత్వం అంతా నాకు ఇంతకాలం కావాల్సిన మద్దతు, మార్గదర్శకత్వం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే చాలా జీవితాలను కాపాడవచ్చు. నా మాతృభూమిలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలను మెరుగుపచాలన్న నా లక్ష్యానికి జీవితాన్ని అంకితం చేస్తున్నాను” అని తెలిపారు.ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, క్యాన్సర్ విజేత డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ మాట్లాడుతూ, “డాక్టర్ రఘురామ్ వద్ద చికిత్స పొందడం నా అదృష్టం. నాకు అందిన అసాధారణ నాణ్యత గల చికిత్స, సానుభూతితో కూడిన సంరక్షణ, చికిత్స కొనసాగినన్నాళ్లు ఆయన నాకు చేసిన కౌన్సెలింగ్ వల్లనే నేను క్యాన్సర్ విజేతగా నిలిచాను. నా ఈ పయనంలో డాక్టర్ రఘురామ్ నాకు స్ఫూర్తినిచ్చి, సానుకూలంగా ఉండేలా చేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది. క్యాన్సర్ రోగుల్లో ఒక ఆశను పాదుకొల్పి, త్వరగా గుర్తించాల్సిన అవసరం గురించి అవగాహన నెలకొల్పి, దాదాపు రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్న డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసిస్తున్నాను”అని చెప్పారు. -
MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి
-
Miss world 2025 బ్యూటీఫుల్ గేమ్స్
మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ టాలెంట్, బ్యూటి విత్ ఎ పర్పస్, బెస్ట్ స్విమ్ సూట్, నైట్ గౌన్, మిస్ ఫొటోజెనిక్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ హెయిర్.. స్కిన్ వంటి రౌండ్స్ ఉన్నట్టే స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. మిస్ వరల్డ్ 2025 పోటీలో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ రౌండ్లో మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా విజయం అందుకున్నారు. మొదటి రన్నరప్‌గా మిస్ మార్టీనిక్ ఆరేలీ జోచిమ్, రెండో రన్నరప్‌గా మిస్ కెనడా మారిసన్ నిలిచారు. వాళ్ల వివరాలు..మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా1999 నుంచి ఇప్పటివరకు ఎస్టోనియా దేశం.. మిస్ వరల్డ్ పోటీల్లో స్పోర్ట్స్ ఈవెంట్లో గెలిచి, ఈ బ్యూటీ పాజెంట్లోని తర్వాత రౌండ్స్‌కి అర్హత పొందడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా.. యూరప్ టాప్ టెన్ ఫైనలిస్ట్స్, టాప్ 40 ఫైనలిస్ట్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఎస్టోనియాలోని కిర్నాకు చెందిన ఎలిస్.. ఐటీ సిస్టమ్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్. సేల్స్ కన్సల్టెంట్‌గా, స్టోర్ మేనేజర్‌గా, రాడిసన్ మెరిటన్ పార్క్ ఇన్ హోటల్లో హోస్టెస్‌గా, జూనియర్ ఐటీ డెవలప్మెంట్ స్పెషలిస్ట్‌గా.. రకరకాల ఉద్యోగాలు చేసింది. మోడలింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ఆన్లైన్ చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె వాటినే తన బ్యూటీ విత్ ఎ పర్పస్‌గా పేర్కొంది. ‘స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్లో స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానో లేదో అనుకున్నా కానీ సులభంగానే గెలిచాను. నిజానికిదో చాలెంజ్.. గొప్ప అనుభవం! జీవితంలోని ఒడిదుడుకులను ఎలా అధిగమించవచ్చో నేర్పే ఈవెంట్ ఇది. లైఫ్‌కి చాలా ఉపయోగపడుతుంది!’ అని ఆ ఈవెంట్ గురించి చెప్పింది ఎలిస్. మిస్ మార్టీనిక్.. ఆరేలీ జోచిమ్..మార్టీనిక్లోని డ్యూకోస్ పట్టణానికి చెందిన ఆరేలీ జోచిమ్.. హైజీన్ సేఫ్టీ ఎన్వైర్మెంట్ స్టడీస్‌లో డి΄్లోమా చేసింది. నిత్యం నవ్వుతూ ఉండే ఆరేలీకి ప్రకృతి అంటేప్రాణం. జీవితాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటా నంటోంది. తన జీవితానుభవాలు, తన భావోద్వేగ ప్రయాణాల స్ఫూర్తితో ‘మెసొన్ లాన్మూర్ (ప్రేమాలయం)’ అనే సంస్థను స్థాపించి మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. దీని గురించే ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్’లో ముచ్చటించనుంది. ‘బాడీ ఫిట్‌గా ఉండాలంటే స్పోర్ట్స్ చాలా అవసరం. ఏప్రొఫెషన్లో ఉన్నా ఆటల పట్ల ఆసక్తి పెంచుకుని ఏదో ఒక స్పోర్ట్‌ని ప్రాక్టీస్ చేస్తే శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. ఇది మన రెగ్యులర్ప్రొఫెషన్లో సక్సెస్‌కి చాలా ఉపయోగపడుతుంది’ అంటుంది ఆరేలీ జోచిమ్.మిస్ కెనడా.. ఎమ్మా మారిసన్.. కెనడా, ఓంటారియోలోని ఓ చిన్న పట్టణం (Chapleau) లో పుట్టి, పెరిగిన ఎమ్మా.. మిస్ కెనడా కిరీటాన్ని ధరించిన స్థానిక ఆదిమ తెగకు చెందిన తొలి యువతి. ఇండిజినస్ ప్రిపరేటరీ స్టడీస్ అండ్ టూరిజంలో డిగ్రీ చేసింది. ఈస్థటిక్స్ అండ్ హెయిర్‌కి సంబంధించిన కోర్స్ కూడా చదివింది. అందాల పోటీ అంటే స్కిన్ షో కాదని, సామాజిక బాధ్యతను గుర్తించే వేదికని తెలిశాక.. ఆ పోటీల పట్ల మక్కువ పెంచుకుంది.బ్యూటీ పాజెంట్స్లో పాల్గొంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనే కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనేది తమ తెగ మహిళలకు సంబంధించిన ఒక సంప్రదాయ నేత. దాన్ని వాళ్లు తమ చరిత్ర, సాంస్కృతిక సంబరాలకు ఒక గుర్తుగా భావిస్తారు. దాన్నే ఆమె తన సామాజిక సేవా కార్యక్రమంగా ఎంచుకుంది. ‘ఎందుకంటే కెనడాలో మైదానప్రాంతపు అమ్మాయిల కన్నా పన్నెండింతలు మా తెగకు చెందిన అమ్మాయిలు అదీ పదిహేనేళ్లలోపే శారీరక, లైంగిక దాడులకు బలవుతున్నారు. ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలుదీన్ని నిలువరించి మా తెగలోని అమ్మాయిలు సాధికారత సాధించేందుకే నేను ‘రిబ్బన్ స్కర్ట్స్’ పేరుతో సామాజిక కార్యక్రమాలను స్టార్ట్ చేశాను. స్వావలంబన తో మావాళ్లను నాగరిక సమాజానికి కనెక్ట్ చేయాలన్నదే నా లక్ష్యం. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్’ అంటుంది ఎమ్మా. మిస్ వరల్డ్ అందాల పోటీలలో సెకండ్ రన్నరప్ గెలుపు గురించి మాట్లాడుతూ ‘గొప్ప ఎక్స్‌పీరియెన్స్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వాళ్లతో పోటీపడి విజేతగా నిలవడం మరచిపోని అనుభూతి. తర్వాత దశకు ఇదొక స్ఫూర్తి. నా బలాబలాలు తెలుసుకోవడానికి ఈ స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ చాలా ఉపయోగపడింది. దీంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని చెప్పింది. చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే! -
తెలంగాణ సెక్రటేరియట్ లో మిస్ వరల్డ్ సుందరీమణులు
-
మెరిసిన చేనేత.. మురిసిన భామలు
పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఇక్కత్ వస్త్రాలు, విశ్వవ్యాప్తంగా తరలివచ్చిన సుందరాంగుల మనసు దోచుకున్నాయి. చేనేత కళాకారుల వస్త్ర డిజైన్లను చూసి వారు ముగ్ధులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ సిల్క్ సిటీ భూదాన్ పోచంపల్లిలో.. ప్రపంచ సుందరీమణుల పోటీదారుల పర్యటనలో అడుగడుగునా చేనేత వస్త్ర కళా వైభవం కళ్లకు కట్టింది. చేనేత చీరలు, వస్త్రాలను చూసి విదేశీ వనితలు మురిసిపోయారు. ఈ సందర్భంగా కొన్ని వస్త్రాలను ధరించి ఇక్కత్ చీరల తయారీ ప్రక్రియ, డిజైన్ల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి మరోసారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. తెలంగాణ పర్యాటక శాఖ.. చేనేతను మరింత ప్రచారంలోకి తీసుకురావడంలో విజయవంతమైంది.అందగత్తెలతో ప్రపంచం దృష్టికి..పోచంపల్లిలో అందాల భామల పర్యటనతో చేనేత, ఇక్కత్ వస్త్రాలు ప్రపంచానికి మరోసారి పరిచయమైనట్లయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చేనేత కళాకారుల ప్రతిభకు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం కృషి చేసింది. పోచంపల్లికి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు.. పోచంపల్లి చీరల తయారీ, డిజైన్, అద్దకం ఇక్కత్ వస్త్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క చీర తయారీకి కళాకారులు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత.. పోటీదారుల మనస్సును హత్తుకున్నాయి. చీరలపై భిన్న డిజైన్లను తిలకించిన అందగత్తెలు పరవశించిపోయారు. రంగు రంగుల డిజైన్లతో ఉన్న ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరలు, శాలువాలు, డ్రెస్ మెటీరియల్, కాటన్, పట్టు చీరలను చేతితో తడిమి మరీ చూశారు. పోచంపల్లి, వెంకటగిరి ,గొల్లభామ, నారాయణపేట చీరలు, వస్త్రాల ప్రదర్శన సుందరీమణులను ఆకట్టుకుంది.ర్యాంప్ వాక్‌తో మెరుగులు దిద్ది..అందగత్తెలకే అసూయ పుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో.. పోచంపల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ అందగత్తెలే అచ్చెరువొందేలా హైదరాబాద్, ఢిల్లీకి చెందిన భారతీయ మోడల్స్.. ఇక్కత్ చీరలు, వస్త్రాల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది. సంప్రదాయం, ఆధునికత ఉట్టిపడేలా రూపొందించిన డిజైన్లు ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో యువతీ యువకులు ప్రపంచానికి ఆధునికత జోడించిన చేనేత దుస్తులను పరిచయం చేశారు. ర్యాంప్‌వాక్ అదుర్స్ర్యాంప్వాక్లో చేనేత డిజైన్లతో మోడల్స్ ధరించిన దుస్తులను..ప్రపంచ అందగత్తెలు కళ్లార్పకుండా చూ స్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రపంచ సుందరీమణులు, స్థానిక మోడల్స్ ధరించిన చేనేత వస్త్రాలతో వేదిక చేనేతను విశ్వవ్యాప్తం చేసింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పోచంపల్లి టైఅండ్‌డై ఇక్కత్ చేనేత కళారంగం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పడింది. మొదటిసారిగా పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరిలు నిలువు, పేక పద్ధతిలో సహజరంగులతో పట్టు చీరలను నేశారు. నాటి నుంచి ఎందరో చేనేత కళాకారులు ప్రయోగాలు చేస్తూ నూతన డిజైన్లు సృష్టిస్తూ చేనేత కళను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రపంచాధినేతల ఆకట్టుకునేలా ఇక్కత్ వస్త్రాలుపోచంపల్లి ఇక్కత్ కళ ప్రపంచ వ్యాప్తమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగ్గేట్టే మెక్రాన్‌కు.. ఇక్కడి నేతన్నలు నేసిన ఇక్కత్ చీరను బహూకరించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ పర్యాటక సంస్థ.. 2021లో పోచంపల్లికి ‘అంతర్జాతీయ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు’ బహూకరించడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చేనేత కుటీర పరిశ్రమ ద్వారా సంప్రదాయ వృత్తి, వారసత్వ సంపదను కాపాడుకుంటూనే పలువురు ఉపా«ధి పొందుతున్నందుకు ఈ గుర్తింపు ఇచ్చారు. పోచంపల్లి వస్త్రాలు తప్పనిసరి.. దేశ, విదేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో అతిథులకు పోచంపల్లి శాలువాను కప్పడం సంప్రదాయంగా మారింది. ఇక్కత్ చేనేత వస్త్రాలను సిల్క్, కాటన్, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కార్ప్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టెన్లు, పిల్లో కవర్లు తదితర వెరైటీలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్, అమెరికాలకు వెళ్తున్నాయి. ముస్లిం దేశాలలో మహిళలు ముఖానికి ధరించే స్కార్ఫ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక అపెరల్ ఫ్యాబ్రిక్, హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్‌ను యూరప్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.పేటెంట్ హక్కులతో ముందుకు..పోచంపల్లి వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2003లో కేంద్ర ప్రభుత్వం జియొగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్) సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక్కత్ కళ దేశంలో మరెక్కడా లేదు. మారుతున్న కాలానుగుణంగా ఇక్కడి చేనేత కళాకారులు పోచంపల్లి ఇక్కత్ డిజైన్లలో గద్వాల, కంచి, ధర్మవరంతో పాటు కొత్త కొత్త డిజైన్లు వచ్చేలా వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. కాగా పేటెంట్ హక్కులు పొందినప్పటికీ.. నకిలీ వస్త్రాల తయారీ చేనేత వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇక్కత్ యూనివర్సల్ బ్రాండ్ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పోచంపల్లి టై అండ్ డైలోనే ఇక్కత్ ఉంది. ఇక్కత్ అనేది ఒక యూనివర్సల్ బ్రాండ్. చేనేత చీరలు పూర్తిగా చేతితో మగ్గంపై ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సంప్రదాయ కళ. నూలు ఉడకబెట్టడం, రంగుల అద్దకం వంటి చేతి వృత్తి. ఎంతో మంది మహిళలు ఇక్కత్ చీరల పనితో జీవనోపాధి పొందుతున్నారు. పోచంపల్లి చీరల డిజైన్ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయి. – ఎం.హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లాచేనేతకు ప్రభుత్వం చేయూత తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందాల భామలు పోచంపల్లి చీరలు, వస్త్రాలకు ముగ్ధులయ్యారు. ప్రపంచ పటంలో పోచంపల్లి కళాకారులు రూపొందించిన వస్త్రం సంపద వెల కట్టలేనిది. సీఎం రేవంత్ అధ్వర్యంలోని ప్రభుత్వం చేనేతకు చేయూత నిస్తోంది. – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి(చదవండి: మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా! ) -
తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు
-
తెలంగాణ సచివాలయంలో ప్రపంచ సుందరీమణుల సందడి
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన ప్రపంచ దేశాల అందాల భామలు.. ఇవాళ తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం బ్యాక్ డ్రాప్లో గ్రూప్ ఫోటో దిగిన సుందరీమణులు.. తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించారు. అత్యంత విశాలంగా.. అద్భుతమైన సెక్రటేరియట్‌ను చూసి ఆశ్చర్య వ్యక్తం చేసిన కంటెస్టెంట్లు.. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. తెలంగాణ తల్లి ముందు ర్యాంప్ వాక్ చేశారు.సెక్రటేరియట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఏర్పాట్లు చేసిన హైటీలో సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి, సెక్రటేరియట్ నిర్మాణం, పథకాలను ఉద్దేశించి సీఎస్ ప్రసంగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం క్రీడ కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గత నాలుగు రోజులుగా ప్రపంచ అందగత్తెలు తిలకించారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణకు తెచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని జూపల్లి కృష్ణారావు అన్నారు.కాగా, కంటెస్టెంట్లు ప్రయాణించే రహదారులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో అలకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా అందాల భామలు సందర్శించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో, బడా గణేష్ నిమజ్జనం జరిగే చోట తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఎన్టీఆర్ మార్గ్‌లో రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణజింకతో ఏర్పాటు చేసిన ఆర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
హలో వరల్డ్.. మిస్ కావొద్దు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల ద్వారా తెలంగాణకు, హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం లభిస్తోంది. పోటీలకు వచ్చిన ప్రతినిధులు వివిధ మీడియా సంస్థలకు, మిస్ వరల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో హైదరాబాద్, తెలంగాణ గురించి గొప్పగా వర్ణిస్తున్నారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిన ఆధునిక నగరమని, తెలంగాణ తనదైన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆకట్టుకుంటోందని ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారమవుతున్నాయి. ఒక్కో ప్రపంచ సుందరి పోటీదారుకు సోషల్‌మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వీరి వీడియోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. అలా హైదరాబాద్, తెలంగాణకు మంచి ప్రచారం లభిస్తోంది.3,300 విదేశీ ఛానల్స్‌కు సమాచారం..మిస్ వరల్డ్ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా సంస్థల ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నారని, దాదాపు మూడున్నర వేల మంది విదేశీ జర్నలిస్టులు పోటీలయ్యేవరకు హైదరాబాద్‌లో ఉండి ఆయా దేశాలకు ఇక్కడి పరిస్థితులపై సానుకూల సంకేతాలను పంపుతారని ప్రభుత్వం పలు సందర్భాల్లో తెలిపింది. కానీ, ఈ పోటీల కవరేజీకి వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులు 20 మంది వరకు మాత్రమే. దీంతో ప్రభుత్వ అంచనా తప్పిందన్న భావన వ్యక్తమైంది.అయితే, మిస్ వరల్డ్ లిమిటెడ్ ఈ పోటీల ప్రచారం కోసం బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేసి, పోటీలకు సంబంధించి సమగ్ర వివరాలను 3,300 విదేశీ టీవీ ఛానల్స్‌కు అందిస్తున్నారు. పోటీలో ఉన్న 113 దేశాలకే కాకుండా, పోటీల్లో లేని దేశాలకు చెందిన టీవీ ఛానల్స్ కూడా ఆ జాబితాలో ఉన్నాయని మిస్ వరల్డ్ ప్రతినిధులు తెలిపారు. దీంతో తెలంగాణకు ప్రపంచం నలుమూలలా ప్రచారం లభిస్తోంది.భిన్న సంస్కృతుల కేంద్రం ఆశ్చర్యపరిచే భిన్న సంస్కృతులకు కేంద్రం తెలంగాణ. విద్య, వైద్య పరంగా ఇక్కడ గొప్ప వసతున్నాయి. మా దేశం నుంచి ఎంతోమంది ఇక్కడ చదువుకునేందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి వసతులను ప్రత్యక్షంగా చూస్తున్నాను –అయోమ్ టీటో మటీస్, సౌత్ సూడాన్.సొంత ప్రాంతంలో ఉన్నట్లుంది ఆఫ్రికా ఖండంలో సంస్కృతికి గొప్పగా ఉంటుంది. తెలంగాణను చూసిన తర్వాత మాలాగే ఇక్కడి ప్రజలు సంస్కృతిని కాపాడుకుంటూ కొనసాగిస్తున్న తీరు అబ్బురపరిచింది. నాకు సొంత ప్రాంతంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. –జైనబ్, సొమాలియాఇక్కడి అభివృద్ధి ఆశ్చర్యకరం మా దేశంలో చాలా మందిలో ఇండియా అభివృద్ధి చెందని దేశం అన్న భావన ఉంది. కానీ, హైదరాబాద్‌ను చూసిన తర్వాత ఇక్కడి ఆధునిక పోకడలు, తక్కువ సమయంలో అభివృద్ధి చెందిన తీరు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. – అతెన్నా క్రోస్బీ, అమెరికాఇదెంతో సురక్షిత ప్రాంతం ఇక్కడికి రావటం సురక్షితం కాదని, విదేశీ యువతులను రేప్ చేసి చంపేస్తారని నేను ఇక్కడికి వచ్చేముందు కొందరు సలహా ఇచ్చారు. కానీ, ఇక్కడికి వచ్చాక తెలిసింది.. ఈ ప్రాంతం చాలా సురక్షితమని. ఇప్పుడు హైదరాబాద్ విషయంలో నా ధృక్కోణం పూర్తిగా మారింది. –నటాషా న్యోన్యోజీ, ఉగాండా. ఇక్కడ బౌద్ధానికిస్తున్న ప్రాధాన్యం ఆశ్చర్యపరిచింది భారతీయ సంప్రదాయాలంటే జపనీయులకు ఎంతో ఇష్టం. వాటిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి పులకిస్తున్నాను. ఈ ప్రాంతంలో బౌద్ధానికి ప్రాధాన్యం ఇస్తున్న తీరు చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. నాకు ఇండియా సినిమాలంటే చాలా ఇష్టం. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు మా దేశంలో యువత రీల్స్ రూపొందించారు. ఆ పాటలో నటించిన తెలుగు నటుల సొంత ప్రాంతంలో ఇప్పుడు నేనున్నానన్న అనుభూతి గొప్పగా ఉంది. –కియానా తుమీత, జపాన్. -
Miss World 2025 : రామోజీఫిల్మ్ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)
-
Miss World 2025: అందాల భామల ఆటవిడుపు (ఫోటోలు)
-
Athenna Crosby: 20 ఏళ్ల కిందటే నేను మిస్ వరల్డ్ కావాలని ఫిక్స్ అయ్యాను
-
Miss world 2025 హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపు
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటం విదితమే. అయితే మిస్ వరల్డ్ అనేది ఒక ప్రముఖ అంతర్జాతీయ వేదిక. ఈ వేడుక ఎక్కడ జరిగినా దీనికి గ్లోబల్ వేదికగా ప్రచారం, స్పందన ఉండటం సర్వసాధారణం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఈసారి స్పందన మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా వస్తోంది. దీనికి తోడు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అంతా ఒక్కో రోజు ఒక్కో ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం మొత్తం సోషల్ యాప్స్‌లో వైరల్‌గా మారుతోంది. ఈ తరుణంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించిన నగరంలోని, రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ అంతర్జాతీయ ఆన్లైన్ వేదికగా మరింత గుర్తింపు పొందుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరానికి గ్లోబల్ గుర్తింపును తీసుకొచ్చింది. ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులు, వివాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఈవెంట్‌ను మరింత విశేషంగా మార్చాయి. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ పోటీలు కీలక పాత్ర పోషించాయి. ఈ వేడుక కేవలం అందాల పండుగగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అంశాల్లో దేశవ్యాప్తంగ చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ పోటీల నేపథ్యంలో ప్రముఖ సినీ తారలు, క్రీడా ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చేస్తున్న పోస్టులు, వ్యాఖ్యలు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్‌ను మరింత విశేషంగా మార్చుతున్నాయి. క్రిస్టినా పిస్కోవాతో మొదలు.. ఈ నెల్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాకముందే మాజీ మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మొదట ఆన్లైన్, సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. ‘ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం’ అంటూ ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌కు విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలుచార్మినార్, లాడ్ బజార్, ఎక్స్పీరియం పార్క్, రామప్ప ఆలయం వంటి ప్రదేశాల్లో కంటెస్టెంట్స్ తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ముఖ్యంగా వందల ఏళ్ల హైదరాబాద్ చరిత్రకు నిదర్శనంగా నిలిచిన చార్మినార్ వద్ద 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారల సందడికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. అంతేకాదు.. ప్రత్యేకంగా రామప్ప ఆలయంలో మహిళలు కంటెస్టెంట్స్ పాదాలను కడుగుతున్న వీడియో వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై మహిళా హక్కుల సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు.రాజకీయ స్పందనలు.. బీఆర్ఎస్ నేత కేటీఆర్, మిస్ వరల్డ్ ఈవెంట్‌కు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించి, వాస్తవ ఖర్చు రూ.27 కోట్లు మాత్రమేనని, దానిలో మిగతా భాగం స్పాన్సర్‌షిప్‌ల ద్వారా సమకూర్చబడిందని సంబంధిత అధికారులు, ప్రతినిధులు తెలిపారు. ఆధ్యాత్మికతకు అద్భుత స్పందన.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేయి స్తంభాల దేవాలయం, రామప్ప ఆలయాల సందర్శనతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు భారత ఆధ్యాతి్మకతపై ప్రత్యేక అనుభూతి కలిగింది. శిల్ప కళ, గోపురాల లోతైన అర్థాల్ని వారు గౌరవంతో స్వీకరించడం గమనార్హం. రామప్ప ఆలయం వద్ద వారు యోగా మరియు ధ్యానం చేసిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా సంచలనం.. ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రం సాంస్కృతికంగా ఎంత విస్తృతమైందో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ నెటిజన్ల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ మీదే. ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ అంతా ఈ కంటెస్టెంట్స్ లొకల్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఫొటోలు, వీడియోలతో కళకళలాడుతోంది. స్థానికులు తమ సంప్రదాయాన్ని అంతర్జాతీయ వేదికపై చూసి గర్వపడుతున్నారు. పర్యాటక అభివృద్ధికి బలమైన వేదిక.. ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖకు ఒక బలమైన ప్రచార మాధ్యమంగా మారింది. ఇప్పటికే విదేశాల నుంచి ‘తెలంగాణ టూరిజం’ వెబ్సైట్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగిందని సమాచారం. యాదాద్రి దేవాలయం యొక్క ఆధునీకరణ, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వంటి అంశాలు ప్రపంచం ముందు నిలబెట్టే ఈ సందర్భం, రాష్ట్ర అభివృద్ధికి బంగారు అవకాశంగా మారుతోంది. మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందానికి మాత్రమే కాదు.. సంస్కృతి, చైతన్యం, స్త్రీ శక్తిని ప్రదర్శించడానికి మార్గంగా మారింది.. ఈసారి హైదరాబాదులో జరిగిన ఈవెంట్ భారత్‌ను, ముఖ్యంగా తెలంగాణను గ్లోబల్ మాప్‌పై మరింత ప్రకాశింపజేసింది. ఇది దేశానికి గర్వకారణమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అంతర్జాతీయ కంటెస్టెంట్స్.. తెలంగాణ సంస్కృతిపై మక్కువతో మిస్ వరల్డ్ యుఎస్ఏ, మిస్ వరల్డ్ దక్షిణాఫ్రికా, మిస్ వరల్డ్ శ్రీలంక వంటి కంటెస్టెంట్స్, తెలంగాణ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలపై తమ మక్కువను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ‘ఇండియాలోని వైవిధ్యాన్ని అనుభవించడం గొప్ప అనుభూతి’ అంటూ వారు పేర్కొన్నారు. పీవీ సింధు, నిఖత్ జరీన్ : తెలంగాణకు స్వాగతం తెలంగాణకు చెందిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌లు తమ సోషల్ మీడియా ద్వారా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు స్వాగతం పలికారు. ‘తెలంగాణ సంస్కృతిని అనుభవించండి’ అంటూ వారు చేసిన వీడియోలు, పోస్ట్‌లు యువతలో ఉత్సాహాన్ని పెంచాయి. -
#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)
-
అందాల పోటీ అంటే..మనల్ని మనం తెలుసుకోవడమే..!
హైదరాబాద్‌లో జరిగే 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో చెక్ రిపబ్లిక్కు ప్రాతినిధ్యం వహిస్తుంది అడెలా స్ట్రొఫెకోవా.21 ఏళ్ల ఈ బ్యూటీ మోడల్, ఫిట్నెస్ ట్రైనర్, ఈవెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తోంది. కనెక్టింగ్ హార్ట్స్ అక్రాస్ జనరేషన్స్ పేరుతో రెండు, మూడు తరాల వారిని ఒకచోట చేర్చడం, ప్రేమ, దయ, స్నేహపూరిత వాతావరణాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెడుతుంది. ఏదైనా సాధించాలనుకోవడానికి ముందు తమకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవడం ముఖ్యం’ అంటూ తన గురించి తెలియజేసింది. ‘‘అందాల కిరీటం అనేది ఒక ఏడాది వరకే. కానీ, చాలామందితో కనెక్ట్ అవ్వచ్చు. నా కల ఒక్కటే! మిస్ వరల్డ్‌గా నన్ను నేను చూసుకోవాలి. నా చిన్నప్పటి నుంచే ఈ ఆలోచన ఉండేది. మా అమ్మ మేకప్ వస్తువులన్నీ నేనే వాడేసేదాన్ని. అమ్మ డ్రెస్సులు, హీల్స్ వేసుకొని ఇంట్లో తిరిగేదాన్ని. పదిహేనేళ్ల వయసు నుంచి అందాల పోటీలలో పాల్గొంటూ వచ్చాను. పదిహేడేళ్ల వయసులో మొదటి సారి ప్రపంచ పోటీలో పాల్గొన్నాను.ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్విజయసాధనకు..బ్యూటీ కాంటెస్ట్‌లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వివిధ రంగాలలో మమ్మల్ని పరీక్షిస్తారు. వాటిలో పాల్గొన్నప్పుడు కొంత ఆందోళనగా కూడా ఉంటుంది. కానీ, నన్ను నేను నిరూపించుకోవడానికి ముఖ్యమైన సమయం అదే. మిస్ బ్యూటీ కావాలని కలలు కనే యువతులు అనుకరించడం కాదు. ముందు తామేం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం. నిజంగా ఏదైనా కోరుకుంటే 200 శాతం ప్రయత్నించాలి. అప్పుడే విజయం సాధించగలం. ఒక్క మిస్ విషయమే కాదు నేను ఏదైనా కోరుకున్నప్పుడు విజయం కోసం నా వంతుగా మొత్తం ప్రాణం పెట్టేస్తాను. అలాగే, విజయాలూ సాధించాను. కోరుకున్నది పొందాలంటే సరైన సమయం, శక్తి, దృష్టి పెడితే అదే మనకు అదృష్టంగా మారుతుంది. అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ఫిట్నెస్ ట్రైనర్ నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. స్విమ్, రన్నింగ్, హార్స్ రైడింగ్ చేస్తాను. మోడలింగ్ నా కెరియర్. జీవనాధారం కూడా అదే. ఫిట్నెస్ ట్రైనర్‌గా కోచింగ్ ఇస్తాను. ఆ సమయంలో చాలా ఆనందిస్తాను. ఫిట్నెస్ గురించి నేను చెప్పే విషయాలు వినడమే కాదు, వాళ్లు ఆచరణలో పెడతారు. ఓ గొప్ప సమాజమే నాతోపాటు ఉందనిపిస్తుంది. వారితో నా అనుభవాలను పంచుకోవడం కూడా నాకు చాలా ఇష్టం. వారానికి కనీసం రెండుసార్లు ఫిట్నెస్ గ్రూప్‌లకు కోచ్‌గా పనిచేస్తాను. నాకు ప్రస్తుతం ఉన్న క్షణం చాలా ముఖ్యమైనది. అందుకే ఈ క్షణంలో మాత్రమే జీవిస్తాను. సాధ్యమైనంత వరకు ప్రపంచాన్ని తెలుసుకోవాలి అనుకుంటాను.ఫ్యాషన్ గురించి ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తను ధరించే దుస్తుల ద్వారానే వ్యక్తపరచగలడు. మేం చెక్ రిపబ్లిక్లో స్థిరపడినా వివిధ దేశాలకు సంబంధించిన దుస్తుల్లో నన్ను నేను చూసుకుంటాను’’ అని వివరించారీ బ్యూటీ.అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే-అడెలా స్ట్రొఫెకోవా, చెక్ రిపబ్లిక్ – నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)
-
స్వేచ్ఛగా .. రెక్కలు విప్పేలా...
అమ్మాయిలకు చదువు కాదుకదా.. కనీసం వ్యక్తిగత శుభ్రత పాటించే వెసులుబాటు కూడా లేని చోట అందాల పోటీలంటే ఆనందంగా సాగనంపుతారా? పంపరు! అయోమ్ టీటో మతీజ్‌కు కూడా తీవ్ర నిరసన ఎదురైంది! అయినా వెనకడుగు వేయకుండా అందాల పోటీలకు అటెండ్ అయింది.. మిస్ సౌత్ సుడాన్‌గా కిరీటం ధరించి మిస్ వరల్డ్‌కి పోటీపడ్డానికి హైదరాబాద్ చేరుకుంది. తన దేశ పరిస్థితులు, వ్యక్తిగత వివరాలు, తన లక్ష్యం వగైరా ఆమె మాటల్లోనే...‘‘లా చదివాను. లీగల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. సౌత్ సుడాన్లో పుట్టాను. కానీ అక్కడి రాజకీయ అనిశ్చితి వల్ల మా అమ్మ మమ్మల్ని తీసుకుని కెనడాకు వలస వచ్చేసింది. అందుకే నేను అక్కడే పెరిగాను. మా నాన్న, ఆయన తరపు, అమ్మ తరపు బంధువులంతా సౌత్ సుడాన్‌లోనే ఉండిపోయారు. మా అమ్మ కెనడాలో టీచర్‌గా ట్రైన్ అయ్యి, మా సొంత దేశంలోని పిల్లలకు మంచి స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి తిరిగి సుడాన్ వచ్చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2019లో నేను మా కుటుంబాన్ని చూడ్డానికి నా సొంత దేశానికి వెళ్లాను. ఎమోషనలే కాదు.. కొంచెం షాక్ కూడా అయ్యాను. కెనడాలో నేను ఆస్వాదించిన జీవితం, సౌత్ సుడాన్లో మా వాళ్లంతా అనుభవిస్తున్న జీవితాన్ని బేరీజు వేసుకుని. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నా దేశ ప్రజలకూ ఉన్నత ప్రమాణాల జీవితం అందేలా కృషి చేయాలని! కోవిడ్ తర్వాత వచ్చేశాను. సర్వీస్ మొదలుపెట్టాను. నా బ్యూటీ విత్ పర్పస్ అదే!అందాల పోటీలకు వ్యతిరేకంఅందాల పోటీల పట్ల సౌత్ సుడాన్లో చాలా వ్యతిరేకత ఉంది. నేను మిస్ సౌత్ సుడాన్ పాజెంట్‌లో పాల్గొంటున్నప్పుడు, ఇప్పుడు కూడా నిరసన ఎదురైంది. కానీ నా దృష్టిలో ఈ పోటీలు స్కిన్ షో కాదు. వైవిధ్యమైన సంస్కృతులు, భాషలు, జీవనశైలులను పరిశీలించే, అధ్యయనం చేసే అవకాశాన్నిచ్చే వేదిక. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సర్దుబాటు, సహనాన్ని నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా నా సామాజిక బాధ్యతను మెరుగ్గా నిర్వర్తించేందుకు తోడ్పడతాయి. అందుకే నిరసనను ఎదుర్కొని మరీ ఈ పోటీకి వచ్చాను. అంతేకాదు ఈ పోటీలు ఒకరినొకరు తెలుసుకుని, అర్థం చేసుకుని, ఒకరికొకరు సాయం అందించుకునే స్ఫూర్తినీ పంచుతాయి. మహిళలకు అలాంటి స్ఫూర్తి, ప్రేరణ అవసరం. దానికి అందాల పోటీలే కావాలా అంటారేమో! స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయి.. అది స్త్రీల సహజ లక్షణమనే అభిప్రాయమూ అంతే లోతుగా నాటుకుపోయింది. దాన్ని అబద్ధమని నిరూపిస్తున్నాయి ఈ పోటీలు! కొన్ని దేశాల పేర్లే తెలియవు నేనీ కంటెస్ట్‌కి వచ్చేదాకా! అందుకే పట్టుబట్టి మరీ ఈ పోటీకి వచ్చాను. ఇక్కడి వైవిధ్యత, ఆధ్యాత్మికత నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఈ దేశంలోని వాళ్లను చూస్తే నాకు ఫారినర్స్‌గా అనిపించరు. మా వాళ్లలాగే అనిపిస్తారు. ఎప్పుడో ఎక్కడో తప్పిపోయి.. ఇప్పుడు కలుసుకుంటున్నామేమో అనిపిస్తోంది! తెలంగాణ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడి ఎడ్యుకేషన్, మెడికల్ కేర్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రపంచ ప్రమాణాలతో పోటీపడుతున్నాయి. సౌత్ సుడాన్ యువత తమ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కే వస్తోంది. మా దేశంలోని చాలామంది ప్రజలు ఆరోగ్య అవసరాల కోసం ఇక్కడి హాస్పిటల్స్‌నే ఆశ్రయిస్తున్నారు.బాల్య వివాహాలు.. బలవంతపు పెళ్లిళ్లుప్రపంచంలోని అనేక దేశాల్లాగే సౌత్ సుడాన్‌లోనూ పురుషాధిపత్యమే! కొడుకుకేప్రాధాన్యం. అమ్మాయికి వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ ఆర్థికపరమైన వెసులుబాటు ఉండదు. బాల్యవివాహాలు, బలంతపు పెళ్లిళ్లు కామన్. ఇక చదువుకునే అవకాశమెక్కడిది? నేను ఇక్కడిదాకా రాగలిగాను అంటే మా అమ్మే కారణం. మమ్మల్ని ఆమె కెనడా గనుక తీసుకువెళ్లకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో (ఈ మాట చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు). నాకింకా గుర్తు.. ఆమె లగేజ్ సర్దుతుంటే ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ అని అడిగాను. ‘మీరు స్వేచ్ఛగా మీకు నచ్చింది చదువుకునే చాన్స్ ఉన్నచోటికి’ అని చెప్పింది! మేం నలుగురు అక్కచెల్లెళ్లం. మాకొక తమ్ముడు. అందరినీ సింగిల్ పేరెంట్‌గానే పెంచింది అమ్మ. ఎలాంటి అవకాశాల కోసం అమ్మ మమ్మల్ని కెనడాకు తీసుకెళ్లిందో అలాంటి అవకాశాలనే సౌత్ సుడాన్‌లోని అమ్మాయిలకూ కల్పిస్తోంది తాను నడిపిస్తున్న స్కూల్ ద్వారా! ఆమె చేస్తున్న ఆ సర్వీస్‌కి నేనూ శాయశక్తుల సాయపడుతున్నాను. మా దేశంలోని యంగ్ గర్ల్స్‌కి నేను మెంటర్‌గా ఉండాలి! వాళ్ల కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్లకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. సాధికారతకు, సామాజిక బాధ్యతకు ఐకాన్స్‌గా ఉండి, తర్వాత తరాలను ఇన్స్పైర్ చేసేలా వాళ్లను తీర్చిదిద్దాలి. ఇదంత సులువైన జర్నీ కాదు. అయినా ప్రయత్నం వీడను!’’ అంటూ తన జర్నీ గురించి చెప్పారు మిస్ సౌత్ సూడాన్.మా దేశంలోని యంగ్ గర్ల్స్‌కి నేను మెంటర్‌గా ఉండాలి! వాళ్లు కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్ళకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. – సరస్వతి రమఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
ఏంట్రీ.. 700 ఏళ్లా..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, హైదరాబాద్/శంకర్పల్లి: రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీదారులు శుక్రవారం పలు పర్యాటక, వైజ్ఞానిక ప్రాంతాలను సందర్శించి సందడి చేశారు. పోటీదారుల్లోని ఒక బృందం శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పిల్లల మర్రిని సందర్శించింది. మరికొందరు హైదరాబాద్ శివార్లలోని ఎక్స్పీరియం ఎకో పార్క్‌తోపాటు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల మర్రికి ఫిదా: పాలమూరులోని ప్రఖ్యాత పిల్లలమర్రి వృక్షాన్ని చూసి మిస్ వరల్డ్ పోటీదారులు ఫిదా అ య్యారు. మహా వృక్ష చరిత్ర, పునరుజ్జీవం గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోటీదారుల్లో గ్రూప్–2లో ని 23 మంది శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. వీరికి బంజారాల నృత్యాలు, డోలు వాయిద్యాల మధ్య కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా నమస్కారం తెలంగాణ, తెలంగాణ.. జరూర్ ఆనా అంటూ సుందరీమణులు నినాదా లు చేశారు. ముందుగా 16వ శతాబ్దానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం పురావస్తు ప్రదర్శనశాలకు చేరుకుని చారిత్రక శిల్పాలు, పురాతన కళాఖండాలను తిలకించారు.ప్రత్యేక గైడ్ శివనాగిరెడ్డి వాటి విశిష్టతను వివరించారు. ఆ తర్వాత పిల్లల మర్రి మహావృక్షాన్ని సందర్శించారు. దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తరించిన 700 సంవత్సరాల వయసు కలిగిన మహావృక్షం మానులు, ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బోనాలు, బతుకమ్మ ఆటపాటలు విదేశీ వనితలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీదారులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం గురుకుల విద్యార్థులతో ముచ్చటించారు. పోటీదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు చేనేత కారి్మకులు తయారు చేసిన చేనేత పట్టు వ్రస్తాలు అందజేశారు. మనసు దోచుకున్న ఎక్స్పీరియం.. హైదరాబాద్ శివారులోని ఎక్స్పీరియం ఎకో పార్క్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించి సందడి చేశారు. మిస్ వరల్డ్ –2024 విజేత క్రిస్టినా పిషో్కవాతోపాటు అమెరికా ఖండ ఓషియానా విభాగంలోని దేశాలకు చెందిన 23 మంది ఇందులో పాల్గొన్నారు. డోలు వాయిద్యాలకు అనుగుణంగా పోటీదారులు ఉత్సాహంగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఎక్స్పీరియం ఎకో పార్క్‌లో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి అధికారులు వారికి వివరించారు. చిన్నారులతో కలిసి పోటీదారులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మిస్ కెనడా ఎమ్మా మోరిసన్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది. నా తల్లిదండ్రులను త్వరలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఈ అందాలను చూపిస్తా’అని తెలిపారు. మిస్ యూఎస్ అథెనా క్రాస్బీ.. ‘భూమిని రక్షించడం మన బాధ్యత. ఎక్స్పీరియం, సృజనాత్మక డిజైన్‌తో ప్రకృతితో ఎలా సామరస్యంగా జీవించవచ్చో చూపిస్తుంది’అని పేర్కొన్నారు. ‘మా దేశంలో కూడా ఇలాంటి పర్యావరణ అద్భుతాలను సృష్టించాలని ఉంది’అని మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో తెలిపారు. కుటుంబ ఆరోగ్యం మహిళ చేతిలోనే.. తల్లిగా, సోదరిగా, కుమార్తెగా, ఆరోగ్య సంరక్షణ కార్మికురాలిగా, వృత్తి నిపుణురాలిగా, నాయకురాలిగా మహిళలు ప్రపంచంలో అనేక పాత్రలు పోషిస్తున్నారని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా అన్నారు. శుక్రవారం మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఫలితంగా కుటుంబం, సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గొప్ప వైద్యులు, శాస్త్రవేత్తలు గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలపై మాత్రమే దృష్టి సారించేవారని.. ఇప్పుడు ఆ కోణం మారిందని అన్నారు. -
అందాల పోటీలు.. అధికారుల సిగపట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీలను ఘనంగా నిర్వహించి చూపాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంటే, ఆ పనిని సక్రమంగా నిర్వహించాల్సిన అధికారులు మాత్రం కీచులాటలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడి చివరకు ప్రభుత్వానికే తలవంపులు తెచ్చేలా మారింది. ఈ పోటీల నిర్వహణలో ప్రధాన భూమిక పర్యాటక శాఖదే. అందులో అంతర్భాగమైన తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో ఈడీ స్థాయి అధికారిని పోటీలు కొనసాగుతుండగానే మాతృ సంస్థకు పంపటం వెనుక అధికారుల మధ్య వివాదాలే కారణమన్న చర్చ జరుగుతోంది. స్పాన్సర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్.. పోటీల నిర్వహణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం–మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా చెరిసగం భరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్వహణ ఖర్చుల అంచనా రూ.57 కోట్లని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. దాదాపు రూ.25 కోట్లను మించి స్పాన్సర్షిప్ మొత్తం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయని సమాచారం. పోటీలు ప్రారంభం కాకముందే స్పాన్సర్‌గా ఉండేందుకు ఓ పెద్ద బ్యాంకు ముందుకొచి్చ, ప్రభుత్వం ఆశించిన మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, ఒక్క బ్యాంకుకే మొత్తం స్పాన్సర్షిప్ ఇవ్వలేమని, మరికొన్ని సంస్థలతో కలిపి ఇస్తామని ఓ ఉన్నతాధికారి ఆ బ్యాంకు ప్రతినిధులతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ బ్యాంకు వెనక్కు వెళ్లిపోయినట్లు సమాచారం.ఆ తర్వాత కొన్ని సంస్థలు ముందుకొచి్చనా.. వాటితో ఓ ఉన్నతాధికారి సరిగా వ్యవహరించకపోవటంతో అవి కూడా వెనుదిరిగాయని చెబుతున్నారు. సదరు సంస్థలతో అధికారులు సరిగా డీల్ చేసి ఉంటే ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన మొత్తానికి మించి ఆదాయం సమకూరి ఉండేదని అంటున్నారు. మరోవైపు ఒకరిద్దరు అధికారులు ఈ స్పాన్సర్షిప్ వ్యవహారాన్ని సొంత లబి్ధకి వాడే ప్రయత్నం చేశారని, దానిపై విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. వెరసి కీలక స్పాన్సర్షిప్స్ వ్యవహారంలో యంత్రాంగం వైఫల్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారుల మధ్య కీచులాటలు.. ప్రపంచ సుందరి పోటీల ఏర్పాట్లను ప్రారంభంలో అప్పటి పర్యాటకశాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్ పర్యవేక్షించారు. ప్రభుత్వం ఆమెను బదిలీ చేసి ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు అప్పగించింది. ఆ సమయంలో సీఎంతో జరిగిన ఓ సమావేశంలోనే ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం మొదలైనట్లు తెలిసింది. ఈ పోటీల్లోని కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను కూడా అనుమతించాలని ఆ సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి ప్రతిపాదించారు. అప్పుడే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జయేశ్‌రంజన్‌కు దీనిపై సమాచారం లేదు.చివరకు కొన్ని కార్యక్రమాలకు సాధారణ ప్రజలను అనుమతించాలని సీఎం ఆదేశించారు. ఇంతటి కీలక నిర్ణయం తనకు తెలియకుండా తీసుకోవటమేంటని ప్రకాశ్‌రెడ్డిని జయేశ్‌రంజన్ ప్రశ్నించినట్టు సమాచారం. ఈ ఘటన ఆ ఇద్దరు అధికారుల మధ్య కొంత అగాధానికి కారణమైందని పర్యాటక శాఖలో ప్రచారం జరుగుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, ఈడీ విజయ్ మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే విజయ్‌ని ఉన్నఫలంగా మాతృసంస్థకు పంపారని అంటున్నారు. కాళ్లు కడిగించారనే అపవాదు.. ఇటీవల వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లినప్పుడు ఆలయాల్లోకి వెళ్లేముందు మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగిన ఘట్టం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అక్కడ సాధారణ భక్తులు కాళ్లు కడుక్కున్నట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉంటే సరిపోయేది. కానీ, పోటీదారులను కుర్చిల్లో కూర్చోబెట్టి కాళ్ల కింద కొత్త పళ్లాలు ఉంచి, చెంబులతో నీళ్లు పోసి సిబ్బందితో కాళ్లు కడిగించారు. కొందరు సిబ్బంది టవల్‌తో కాళ్లను తుడిచారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. అసలు ఇలా పళ్లాల్లో కాళ్లుంచి కడిగించే ఆలోచన ఎవరు చేశారంటూ తర్వాత పర్యాటక శాఖ మంత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)
-
మెక్సికన్ 'మే'నూ..! ఫుడ్ లవర్స్‌కు పసందు..
వేసవి సెలవుల్లో అలా విదేశాలు తిరుగుతూ మెక్సికన్ ఫుడ్ తినాలనుకుంటున్నారా..! అవసరం లేదు, తామే మెక్సికన్ రుచులను నగరానికి తీసుకొస్తున్నామని ప్రముఖ చెఫ్ అమన్నా రాజు అంటున్నారు. మే నెల వేసవిలో వారాంతాలను అలా మెక్సికన్ స్మోకీ మెరినేడ్ రుచులను ఆస్వాదించాలనే వారికి తాము ప్రత్యేక వంటలను అందిస్తున్నట్లు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని నోవోటెల్ ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. మెక్సికోలోని ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన విభిన్న రుచులను మెక్సికన్ గ్రిల్ నైట్స్‌తో నగరానికి పరిచయం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతి శనివారం ఈ మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ అలరించనుంది. ఓ వైపు భాగ్యనగరం వేదికగా ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మెక్సికన్ ఫుడ్ వెరైటీలు నగర వాసులను, నగరానికి విచ్చేస్తున్న విదేశీ అతిథులను ఆతీ్మయ విందుకు ఆహ్వానిస్తోంది. అంతేకాకుండా ఈ ఫెస్ట్ నగరంలోని ఆహార వైవిధ్యానికి, విభిన్న సంస్కృతులకు చెందిన రుచుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని నోవోటెల్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ సుఖ్బీర్ సింగ్ పేర్కొన్నారు. గ్యాస్ట్రోనమిక్ సంతృప్తి.. అంతర్జాతీయంగా మెక్సికన్ వంటలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఫ్లేమ్–గ్రిల్డ్ మాంసాహారాలు, స్మోకీ మెరినేడ్లు, అరుదైన సుగంధ ద్రవ్యాల కలయికే ఈ వంటల ప్రత్యేకత. ఈ గ్యాస్ట్రోనమిక్ రుచుల వైవిధ్యాన్ని వేసవి ప్రత్యేకంగా నగరంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ ఫుడ్ ఫెస్ట్‌లో అతిథులు వెజిటబుల్ బౌల్, బీన్ ఎన్చిలాడా సూప్‌తో ప్రారంభిస్తారు. అనంతరం మినీ కార్న్ డాగ్స్ వంటి ఆహ్లాదకరమైన స్టార్టర్స్‌ను పచ్చి మిరపకాయ, ఆవాలు, రుచికరమైన గుమ్మడికాయ ఎంపనాడాస్తో కలిపి వడ్డిస్తారు. ప్రత్యేకంగా అందించే సలాడ్ టెక్స్చర్స్, వినూత్న రుచుల మిశ్రమంతో అలరిస్తుంది. ప్రత్యేక దినుసులు.. ఫెస్ట్‌లో భాగంగా సీఫుడ్ సెవిచే, శ్రీరాచా డ్రెస్సింగ్‌తో స్పైసీ మెక్సికన్ చికెన్ సలాడ్, చిపోటిల్ డ్రెస్సింగ్‌లో కలిపి కాల్చిన బెల్ పెప్పర్ సలాడ్ జిహ్వకు సరికొత్త రుచిని అందిస్తుంది. గ్వాకామోల్, పైనాపిల్ సల్సా, టొమాటో సల్సా వంటి క్లాసిక్ మెక్సికన్ రుచులు ఈ మెనూలో మరో ప్రత్యేకం. మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని మసాలాలు దక్షిణాది మసాల రుచులకు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. చికెన్ క్యూసాడిల్లాస్, కాలాబాసిటాస్ కాన్ క్వెసో – చీజ్, వెజిటబుల్ చీజ్ ఎన్చిలాడాస్తో వండిన గుమ్మడికాయ, రుచికరమైన మొక్కజొన్న మిశ్రమాల్లో మసాల పరిమళం నగరవాసులను ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాలకు తీసుకెళుతుంది. సీ ఫుడ్ లవర్స్ కోసం మెక్సికన్ రొయ్యలు, చేపల బిస్క్యూ పిసికాడో, కామరాన్ పోజోల్ను ఆస్వాదిస్తారు. (చదవండి: మిస్ వరల్డ్ మధురమైన పాట) -
మిస్ వరల్డ్ మధురమైన పాట
అందంలోనే కాదు అద్భుతమైన గానంలోనూ ‘భేష్’ అనిపించుకున్నారు మిస్ వరల్డ్ అందాల తారలు...మిస్ వరల్డ్ (2019) టోని–అన్ సింగ్, వైట్నీ హ్యూస్టన్ పాట ‘ఐ హ్యావ్ నథింగ్’ను మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్లో అద్భుతంగా ఆలపించింది.మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా తన సినిమాల్లోని పాటలను మ్యూజిక్ లేకుండానే పాడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.మిస్ వరల్డ్(1997) డయాన హేడెన్ ప్రొఫెషనల్ సింగర్. కాలేజీ రోజుల్లో ఎన్నో పోటీల్లో పాల్గొంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేసింది.మిస్ వరల్డ్ (1999) యుక్తా ముఖీ మోడలింగ్, నటనలోనే కాదు గానంలోనూ ‘భేష్’ అనిపించుకుంది. హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్‌లో మూడు సంవత్సరాల కోర్సు చేసింది.మిస్ వరల్డ్ (2017) మానుషి చిల్లర్ కూచిపూడి డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా.మిస్ వరల్డ్ (1994) ఐశ్వర్య రాయ్ టెలివిజన్ షోలతో సహా ఎన్నో కార్యక్రమాలలో తన మధుర గాత్రాన్ని వినిపించింది. (చదవండి: ఎవరీ అవధేష్ కుమార్ భారతి? ఏకంగా రాష్ట్రపతి ఆయన సేవలకు..) -
సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)
-
Miss World Zimbabwe మెంటల్ హెల్త్ పై సైలెన్స్ వద్దు
‘‘ప్రస్తుతం నేను ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి వేదిక పైన నిల్చున్నాను. కానీ మన ప్రపంచం అంత అందంగా లేదు.., ఎన్నో సామాజిక వైరుధ్యాలున్నాయ’ని మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న మిస్ జింబాబ్వే కోర్ట్న జాంగ్వే తెలిపింది. 2023 నాటికి ప్రపంచ సామాజిక వైకల్యానికి మానసిక ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణంగా నిలువనున్నాయని, ఇది తన మాట కాదు.. ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించిందని గుర్తు చేసింది. ముఖ్యంగా తమ ఆఫ్రికన్ దేశాల్లో ఈ మానసిక ఆరోగ్య (మెంటల్ హెల్త్) సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీని గురించి ఎవరూ అంతగా మాట్లాడట్లేదని జాంగ్వే ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వేళ తాను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే ఈ సమస్యపై కొనసాగుతున్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి తన కిరీటాన్ని, కీర్తిని వినియోగిస్తానని ఉద్వేగంగా ప్రకటించింది. మిస్ వరల్డ్ 2025 నేపథ్యంలో కోర్ట్న జాంగ్వే ప్రత్యేకంగా ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకుంది. మిస్ వరల్డ్ అనేది మహిళా సాధికారత పై దృష్టి సారించే అంతర్జాతీయ వేదిక. ఈ గుర్తింపు మహిళా సాధికారత, ఇతర సమస్యలపైన పోరాడటానికి మద్దతిస్తుందని నమ్ముతాను. నా దృష్టిలో నిజమైన అందం బాహ్య రూపాన్ని అధిగమిస్తుంది. నిజమైన సౌందర్యం మనల్ని వ్యక్తపరిచే వ్యక్తిత్వం, చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎలా దోహదపడతారనే బాధ్యత.అందుకే సోషల్ మెంటల్ హెల్త్‌ను నా భద్యతగా తీసుకున్నాను. డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో పోరాడుతున్న సమాజంలో పెరిగాను. ఇలాంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను దగ్గరగా చూశాను. నా పాఠశాలలో నా స్నేహితులు డ్రగ్స్‌కు బానిసలైన సంఘటనలు చూస్తూ పెరిగాను. ఈ సమస్యలకు మా మూలాల్లో కారణాలు ఎన్నైనా ఉండొచ్చు.., కానీ వాటిని మార్చాల్సిన బాధ్యత నా పైన ఉంది. జింబాబ్వే వంటి మా ఆఫ్రికన్ దేశాల్లో పలు సామాజిక రుగ్మతలున్నాయి. ఇలా మాట్లాడితే అది మా మూలాలకు కళంకం కావొచ్చు. కానీ నేను దీని పైన అవగాహన కల్పించాలని నిశ్చయించుకున్నాను. ఇది మా ఒక్కరి సమస్య కాదు.. ప్రపంచ సమస్య. మిస్ జింబాబ్వేగా నిలిచిన తరువాత నా ప్రయత్నం వల్ల చాలా మార్పును చూశాను. అందుకే నేను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే నా ప్రయత్నాన్ని విశ్వవ్యాప్తం చేస్తాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జింబాబ్వేలో చేపట్టిన నాప్రాజెక్ట్ను ప్రపంచంలోని వివిధప్రాంతాలకు తీసుకెళ్తాను. డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించడానికి నాకున్న పలుకుబడితో అవగాహన కల్పిస్తాను. ఆకలి, పేదరికం, కనీస వసతులు లేని వారి గొంతుకగా మారతాను. అంతర్జాతీయంగా ఫ్యాషన్ రంగంలో మా కళకు, డిజైనింగ్‌కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఒక మోడల్‌గా ఈ విషయంలో నేను గర్వపడతాను. మాది చాలా కష్టపడే వ్యక్తిత్వం. జింబాబ్వే గురించి నాకు చాలా నచ్చిన ఒక విషయం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మాప్రామాణికతను కోల్పోము. అందుకే విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యం, సమ్మేళనం మనమందరమెంత విభిన్నమో దానిని అంతే అందంగా చూపిస్తుంది’’ అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు జాంగ్వే.– హనుమాద్రి శ్రీకాంత్ -
మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా!
కుతూహలం, జిజ్ఞాస, ప్రతిభ, సామాజిక బాధ్యత, లాస్ బట్ నాట్ లీస్ట్ అందం.. అన్నిటికీ పర్యాయ పదం! నటాషా పరిచయం ఆమె మాటల్లోనే...నేను పుట్టి,పెరిగింది యుగాండాలో! అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ గ్రాడ్యుయేషన్ కోసం యూకే వెళ్లి, చదువు పూర్తవగానే తిరిగి నా దేశానికి వచ్చేశాను. వృత్తిరీత్యా అకౌంటెంట్ని, ఆంట్రప్రెన్యూర్‌ని కూడా. కంపాలాలో నాకో బ్యూటీ స్టోర్ ఉంది. స్కిన్ కేర్, మేకప్, యాక్సెసరీస్ లాంటివంటే నాకు చాలా ఆసక్తి. అదే నన్ను ఈ పాజెంట్ వైపు లాక్కొచ్చిందని చెప్పొచ్చు. మా దగ్గర కూడా అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య వివక్ష చాలా! కానీ అదృష్టవశాత్తు మా ఇంట్లో లేదు. మమ్మల్నందరినీ సమానంగా పెంచారు.బ్యూటీ విత్ పర్పస్మా తమ్ముడికి ఆటిజం. యుగాండాలో స్పెషల్ నీడ్స్ పిల్లలకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్లనెలా పెంచాలో కూడా తెలియదు. తమ్ముడి కోసం అమ్మ ట్రైన్ అయింది. అమ్మ నడిపే స్కూల్లోనే స్పెషల్ నీడ్ చిల్డ్రన్ కోసం కూడా ఓ సెక్షన్ పెట్టింది. పిల్లల పేరెంట్స్‌కి అవేర్నెస్ కల్పిస్తోంది. అందులో నేనూ పాలు పంచుకుంటున్నాను. స్పెషల్ నీడ్ పిల్లల కోసం హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నా బ్యూటీ విత్ పర్పస్ అదే! అలాగే టాలెంట్ రౌండ్లో నేను పియానో ప్లే చేయబోతున్నాను. స్పోర్ట్స్ రౌండ్లో స్విమ్మింగ్. స్విమింగ్ ఈజ్ మై ఫేవరిట్ స్పోర్ట్.మర్యాద, మాట తీరు..రిచ్ కల్చర్, ట్రెడిషన్ వంటి విషయాల్లో మా దేశానికి, ఇండియాకు చాలా పోలిక ఉంది. ఇక్కడి రైస్, స్పైసీ ఫుడ్ నాకు చాలా నచ్చాయి. కొత్త వాతావరణంలో.. కొత్త మనుషుల మధ్య ఉన్నామన్న ఫీలింగే లేదు. అందరికీ అందరం ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టుగానే ఉంది. కొత్త కొత్త భాషల్లో రోజూ కనీసం ఒక వర్డ్ అయినా నేర్చుకుంటున్నాను. అలాగే మా భాషనూ నా తోటి కంటెస్టెంట్స్‌కి నేర్పేందుకు ట్రై చేస్తున్నాను. ఐకమత్యం అసాధ్యాలను సుసాధ్యం చేయగలదని అర్థమైంది. వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా ప్రయాణించాలి. కానీ సుదీర్ఘ దూరాలకు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా గుంపుగా ప్రయాణించాలి’’ అంటూ చెపాపు నటాషా. అందుకే కనెక్ట్ అయ్యాను.. నాకు ఇక్కడి చీరలు చాలా నచ్చాయి. కొనుక్కెళ్లాలనుకుంటున్నాను. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు బిగ్ ఫ్యాన్‌ని. ఆమె నటించిన బర్ఫీ సినిమా చాలాసార్లు చూశాను. అందులో ఆమె ఆటిజం అమ్మాయిగా అద్భుతంగా నటించింది. మా తమ్ముడికీ ఆటిజం కదా! అందుకే కనెక్ట్ అయ్యాను. విమెన్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే.. ప్రతి అమ్మాయి తన శక్తిని నమ్ముకోవాలి. ఎవరైనా వెనక్కి లాగితే రెట్టింపు ఉత్సాహంతో అడుగులు వేయాలి. మన సంకల్పం గట్టిగా ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు! – నటాషా న్యో న్యో జీ – యుగాండా– సరస్వతి రమ -
Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్ వరల్డ్ బ్యూటీస్ సందడి (ఫొటోలు)
-
Miss World 2025: అందం అంటే..!
-
‘ఇది తెలంగాణ ఆడబిడ్డలకు అత్యంత తీవ్రమైన అవమానం’
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన విదేశీ వనితలకు తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్లు కడిగించడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల అభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగిస్తారా? అంటూ ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు కిషన్‌రెడ్డి. ‘ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి.. వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. 72వ మిస్‌వరల్డ్ పోటీల్లో భాగంగా.. కల్చరల్, స్పిరిచువల్ టూర్లో పాల్గొనేందుకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ అందగత్తెలు వచ్చిన సందర్భంలో.. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం. మహిళా సాధికారతకు, మహిళల ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరం.సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఢిల్లీలోని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలను సంతృప్తి పరిచేందుకే రాహుల్ గాంధీ.. భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాళ్లు కడిగించారు.‘అతిథి దేవో భవ’ మన విధానం.. కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదు. విదేశీ అందగత్తెలముందు మన గౌరవాన్ని పెంచేలా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ మన గౌరవాన్ని దిగజార్చింది. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత కానీ.. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు.ఇందుకుగానూ.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి.. భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
Miss World 2025: యాదగిరిగుట్టలో ప్రపంచ అందగత్తెలు
యాదాద్రి: ప్రపంచ హెరిటేజ్ విలేజ్ భూదాన్ పోచంపల్లి, ఆధ్మాతిక క్షేత్రమైన యాదగిరిగుట్టలో ఇవాళ ప్రపంచ సుందరీమణులు పర్యటించారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా పోచంపల్లిలో చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరల తయారీ, పుట్టపాక తేలియా రుమాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట, గద్వాల చీరలు, వస్త్రాలను పరిశీలించారు. ఇందు కోసం 13 స్టాళ్లను ఏర్పాటు చేశారు.చేనేత విశిష్టతను వివిధ దేశాల అందగత్తెలకు వివరించారు. మరోవైపు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణశిలతో నిర్మితమైన యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ విశిష్టతను ప్రపంచ సుందరీమణులకు వివరించారు.కాగా, పట్టు పరికిణీలు, చీరలు కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా తిలకం దిద్దుకున్న ప్రపంచ దేశాల సుందరీమణులు నిన్న(బుధవారం) ఓరుగల్లు పర్యటనలో జిగేల్మన్నారు. హెరిటేజ్ వాక్‌లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 57 మంది సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ కోట సందర్శనలో 22 మంది బుధవారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్నారు. మరో బృందం ములుగు జిల్లా రామప్పలో సందడి చేసింది.సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు. అనంతరం సంప్రదాయ ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలోని చెంబులో ఉన్న నీళ్లతో సుందరీమణులు కాళ్లను కడుక్కున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫొటో షూట్లో పాల్గొన్నారు.అనంతరం కల్యాణ మంటపాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు వరంగల్ కోటను సందర్శించి అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను చూసి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుని డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. ములుగు జిల్లా రామప్ప ఆలయం వద్ద ప్రపంచ సుందరీమణులకు గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పురాతన కట్టడం, వారసత్వ సంపద.. రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. -
మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గేర్ హార్డ్ తో సాక్షి ఎక్స్ క్లూజివ్
-
Miss World 2025 నమస్తే నేర్చుకున్నాను : లెబనాన్ బ్యూటీ నద
నద... అంటే అరబిక్ భాషలో పిల్లల స్వచ్ఛమైన మనసు, ఉషోదయపు మంచు బిందువులు అని అర్థం. మిస్ వరల్డ్ లెబనాన్2025 పేరు నద (Nada Koussa). మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీల కోసం హైదరాబాద్‌కి వచ్చిన నద తన పేరుకు అర్థం చెప్పుకుంటూ తమ దేశంలో పిల్లల బాల్యం, యువత భావోద్వేగాలు అంత స్వచ్ఛంగా ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యూటీ పాజంట్ కావాలనే కోరిక కలగడానికి కారణం తెలియదు కానీ బాల్యం నుంచి తనతోపాటు పెరిగి పెద్దయిందన్నారామె.ఈ అవకాశం కోసం ఎదురు చూశాను!‘‘ఎనిమిదేళ్ల వయసు నుంచి నాకు జ్ఞాపకం ఉంది. నా ఆకాంక్ష తీరడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ బ్యాచులర్స్ పూర్తయింది. మాస్టర్స్ ఇన్ సైకాలజీ కూడా పూర్తయింది. క్లినికల్ సైకాలజిస్టుగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను సందర్శిస్తూ పిల్లలకు, యువతకు మనోధైర్యాన్నిస్తున్నాను. అంతర్యుద్ధంతో అట్టుడిగిన దేశం మాది. అలాగే ఇరుగు పొరుగు యుద్ధాల తాకిడి కూడా దేశాన్ని కుదిపేసింది. అలాంటి దేశంలో మానసిక స్థైర్యం కల్పించడం చాలా అవసరం. ఇందుకోసం నేను ఐదు ఎన్జీవోలతో కలిసి పని చేస్తున్నాను.మహిళలు నలిగిపోతున్నారు!మా దేశంలో సగటు మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక దేశం ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటోందీ అంటే ఆ పరిణామాలకు క్షేత్రస్థాయిలో నేరుగా బాధితులయ్యేది మహిళలే. విద్య, ఉద్యోగం, పిల్లలను చక్కబెట్టుకుంటూ, ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకుంటూ కుటుంబాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను తమ భుజాల మీద మోస్తున్నారు మా దేశంలో మహిళలు.ఎక్కడో ఒకరిద్దరు కాదు, దాదాపుగా ప్రతి మహిళా వీటన్నింటినీ భరిస్తోంది. వీటికితోడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజులు గడపడం అనేది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఎయిర్ క్రాఫ్ట్‌లు మన తల మీద నుంచి వెళ్తున్నట్లే ఉంటాయి. రోజూ ఒకదాని తర్వాత ఒకటిగా యుద్ధవిమానాలు ఇళ్ల మీద నుంచి వెళ్తుంటే వచ్చే ‘ఉమ్మ్మ్’ అనే శబ్దం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎంత చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడుతుంటారు. రాత్రిళ్లయితే టేబుల్ మీద నుంచి పుస్తకం కింద పడిన శబ్దం వచ్చినా సరే గుండె వేగం పెరిగిపోతుంటుంది. ఇంట్లో అందరినీ ఒకసారి కలయచూసుకుని ‘హమ్మయ్య ఏమీ కాలేదు, అందరూ క్షేమం’ అని ఊపిరి పీల్చుకోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో జీవించడం వల్ల వారిని మెంటల్ ట్రామా పీడిస్తోంది. ఇది ఏ ఒకరిద్దరిదో, ఒకటి-రెండు ప్రదేశాలదో కాదు. దేశమంతటా ఇదే పరిస్థితి. వారిలో మానసికాందోళనలు పోగొట్టి ధైర్యం, మానసిక ప్రశాంతత నెలకొల్పడానికి పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ కలెక్టివ్ ట్రామాను తొలగించడానికి కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాను. ఇన్నింటి మధ్య కొనసాగుతూ కూడా బ్యూటీ పాజంట్ కావాలనే కోరికను మాత్రం పక్కన పెట్టలేదు. సమాజం కోసం చేయాల్సిన కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే బ్యూటీ కాంటెస్ట్ విజేతనయ్యాను. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీ కోసం మీ ముందుకు వచ్చాను. బ్యూటీ విత్ పర్పస్ థీమ్‌లో భాగంగా... నా విజయంతో నా దేశంలో ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. శాంతి కోసం పని చేయడానికి బ్యూటీ పాజంట్ గుర్తింపు ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకేనమస్తే నేర్చుకున్నాను!బ్యూటీ పాజంట్ పోటీల కోసం వచ్చేటప్పుడు ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకున్నాను. నమస్తే చెప్పడం నేర్చుకున్నాను. హైదరాబాద్ నగరం చాలా నచ్చింది. కలర్ఫుల్గా, వైబ్రెంట్‌గా ఉంది. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. చౌమొహల్లా ప్యాలెస్ ఒక అద్భుతం. నిర్మాణంలో సునిశితమైన క్రాఫ్ట్మన్షిప్కి ఫిదా అయ్యాను. ప్రతి అంగుళాన్ని వదలకుండా ఫొటోలు తీసుకున్నాను. ఆ కట్టడం గొప్ప చారిత్రక వారసత్వం, అలాగే హైదరాబాద్ మెహందీ కూడా’’ అంటూ మంగళవారం నాడు చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ సందర్శన సమయంలో పెట్టించుకున్న మెహందీని చూపించారు నద కౌస్సా.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా? – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు : ఎస్.ఎస్. ఠాకూర్ -
అతడు.. ఆమె... మిస్ వరల్డ్
ఆ భార్యాభర్తల పేర్లు ‘మిస్ వరల్డ్’తో ముడిపడి ఉన్నాయి. భర్త ‘మిస్ వరల్డ్ పోటీల సృష్టికర్త, భార్య ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ నినాదంతో ‘మిస్ వరల్డ్’ను దాతృత్వ దారిలోకి తీసుకువచ్చింది. మిస్ వరల్డ్ చైర్పర్సన్, సీయివో జూలియా మోర్లే వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. మాజీ మోడల్. మిస్ వరల్డ్‌ను తొలిసారిగా ప్రారంభించిన ఎరిక్ మోర్లే ఆమె భర్త. 2000 సంవత్సరంలో భర్త చనిపోయిన తరువాత ‘మిస్ వరల్డ్’ ఛైర్పర్సన్ అయింది జూలియ.1972లో ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ నినాదాన్ని తెర మీదికి తీసుకువచ్చింది. ఈ నినాదంలో భాగంగా సామాజిక సేవాకార్యక్రమాల కోసం డబ్బు సేకరించడానికి శ్రీకారం చుట్టారు. 2009లో ‘ఛారిటీ డిన్నర్’ నిర్వహించడం ద్వారా వచ్చిన నిధులతో ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్’ ఏర్పాటు చేసింది. ‘సేవ్ ది చిల్డ్రన్’ క్యాంపెయిన్కుగానూ ‘ప్రియదర్శిని’ అవార్డు అందుకుంది.(చదవండి: Miss World 2025: సర్వాంగ సుందరంగా రామప్ప ఆలయం..) -
#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)
-
సాంస్కృతిక సమ్మేళనం.. అందాల సోయగం..
హైదరాబాద్: నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌కి మరింత వన్నె తీసుకొస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ వ్రస్తాలతో అందాల తారలు హొయలు పోయారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రత్యేకతలను తెలుసుకునేందుకు పోటీదారులు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా తమ తమ దేశాల వస్త్రధారణతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది అధునాత సాంస్కృతిక సమ్మేళనంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడి అధునాతన జీవనశైలి, ముఖ్యంగా ఆహారం తమకు ఎంతగానో నచ్చిందని పలువురు తారలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్న మిస్ వరల్డ్ పోటీల కోసం నిత్యనూతనంగా సన్నద్ధమవుతున్నట్లు వారు పేర్కొన్నారు. -
వరంగల్ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)
-
ఇది తినండి.. ఇలా ఉండండి!
ఏం తినాలో వారే చెప్తారు... ఎప్పుడు తినాలో సూచిస్తారు.. దగ్గినా తుమ్మినా పరిగెత్తుకొస్తారు. నలతగా ఉందంటే క్షణాల్లో వాలిపోతారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 24 గంటల మెడికల్ కేర్, న్యూట్రీషినిస్టుల సేవలు, నెలసరి సమస్యలు చికాకు పెట్టకుండా అందుబాటులో మహిళా సిబ్బంది.. ఇలా మిస్‌వరల్డ్ పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరీమణుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. – సాక్షి, హైదరాబాద్ఐదారేళ్ల శ్రమ..ప్రపంచ సుందరి కావాలన్న కల చాలామంది యువతుల్లో ఉంటుంది. అందం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, ఆకట్టుకునే తెలివితేటలు.. కలబోసిన సంపూర్ణ వ్యక్తిత్వం.. ఈ లక్షణాలున్నవారు ప్రపంచ సుందరి కిరీటం కోసం ఆరాటపడటం సహజం. దీనిని సాధించుకునే లక్ష్యంతో చాలామంది కఠోర దీక్షగా సాగుతారు. ఎంతో ఇష్టమైన పదార్థాలున్నా ముట్టకుండా దూరంగా ఉంటారు. నిరంతరం కఠినమైన వ్యాయామం చేస్తారు. బద్ధకానికి అందనంత దూరంగా ఉండేందుకు నిరంతరం చలాకీతనం తొణికిసలాడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవన్నీ ఆచరణలో పెట్టేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తారు. దాదాపు ఏడెనిమిది ఏళ్లపాటు దీక్షగా ముందుకు సాగుతారు. ఇన్నేళ్ల పట్టుదల, శ్రమ.. పోటీలయ్యేవరకు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి సొంత ప్రాంతంలో దీన్ని నిలబెట్టుకున్నా, పోటీల కోసం మరో తరహా వాతావరణం ఉండే ప్రాంతానికి వెళ్లి దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితిలో వారు దాన్ని కొనసాగించటం పెద్ద సవాలే. అక్కడి వాతావరణం, పరిస్థితులు, ఆహారంలో మార్పు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే పోటీలు జరిగే ప్రాంతంలో దాదాపు రెండు నెలల ముందు నుంచి అక్కడి యంత్రాంగాన్ని మిస్‌వరల్డ్ లిమిటెడ్ అప్రమత్తం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో మార్చి మొదటి వారంలోనే మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే అప్రమత్తం చేశారు. మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితులు పరిశీలించి, పోటీకి అనువైన వాతావరణం ఉందని తేల్చుకున్నాక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఈ విషయంపై చర్చించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మెడికల్ టూరిజంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నందున, అక్కడ ప్రపంచ స్థాయి వైద్య వసతులున్నాయని, ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. టాప్ ఆస్పత్రితో ఒప్పందం..ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రితో మిస్ వరల్డ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న యువతులు బస చేసిన ట్రైడెంట్ హోట ల్లో ఆ ఆస్పత్రి ఓ ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో షిఫ్టుల వారీగా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. నర్సులు, పారామెడికల్ సిబ్బంది, న్యూట్రిషనిస్టులు సహాయకంగా ఉంటారు.» పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల్లో దాదాపు అన్ని ఖండాలకు చెందిన వారున్నారు. వారి శరీరానికి సరిపడే ఆహార పదార్థాలేమిటో తెలిపే జాబితాను మిస్‌వరల్డ్ ప్రతినిధులు ముందుగానే స్థానిక యంత్రాంగానికి అందజేశారు. ఆయా పదార్థాలు నిత్యం హోటల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.» మంగళవారం చౌమహల్లా ప్యాలెస్‌లో వెల్కం డిన్నర్లో హైబరాబాద్ బిర్యానీని ప్రత్యేకంగా వడ్డించారు. కానీ, ఈ బిర్యానీని మసాలా తక్కువగా, మధ్య రకంగా, పూర్తిస్థాయి మసాలాతో.. ఇలా మూడు రకాలుగా తయారు చేసి ఉంచారు. యూరప్, అమెరికా తదితర ప్రాంతాలకు చెందిన వారిని తక్కువ మసాలా ఉన్న బిర్యానీ తీసుకోవాల్సిందిగా సూచించటం విశేషం.»చాలా ఆరోగ్య సమస్యలు మంచినీటితోనే వస్తాయి. అందుకే సాధారణ నీళ్లు కాకుండా, ప్రస్తుతం సుందరీమణులకు లీటరు రూ.800 ఖరీదు చేసే ప్రత్యేక బ్రాండ్ మంచినీటిని అందిస్తున్నట్టు తెలిసింది.»ప్రస్తుతం హోటల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో దాదాపు 80 రకాల ఇంటర్ కాంటినెంటల్ వంటకాలను బఫేలో ఉంచుతున్నారు. తమకు ఏది సరిపోతుందో ఆ ఆహారా పదార్థాలను సుందరీమణులు ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.» మిస్‌వరల్డ్ తరపున వచ్చిన న్యూట్రిషనిస్టులు సూచించిన ఆహారాన్నే సుందరీమణులు స్వీకరిస్తున్నారు.»రాష్ట్ర పర్యటనలకు వెళుతున్నప్పుడు కూడా ముందుగానే భోజన వివరాలను తెలిపి, స్టార్ హోటల్లో వండించి మరీ సిద్ధం చేస్తున్నారు.»సుందరీమణులు ఎక్కడకు వెళ్లినా పూర్తి ఎమర్జెన్సీ వైద్య వసతులతో కూడిన అంబులెన్సు ఫాలో అవుతోంది. అందులో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉంటున్నారు -
తెలుగు అమ్మాయిల్లా..
సాక్షి ప్రతినిధి, వరంగల్: పట్టు పరికిణీలు, చీరలు కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా తిలకం దిద్దుకున్న ప్రపంచ దేశాల సుందరీమణులు ఓరుగల్లు పర్యటనలో జిగేల్మన్నారు. హెరిటేజ్ వాక్‌లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 57 మంది సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ కోట సందర్శనలో 22 మంది బుధవారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్నారు. మరో బృందం ములుగు జిల్లా రామప్పలో సందడి చేసింది. సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు. అనంతరం సంప్రదాయ ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలోని చెంబులో ఉన్న నీళ్లతో సుందరీమణులు కాళ్లను కడుక్కున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫొటో షూట్లో పాల్గొన్నారు. అనంతరం కల్యాణ మంటపాన్ని దర్శించారు. అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు వరంగల్ కోటను సందర్శించి అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను చూసి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుని డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. ములుగు జిల్లా రామప్ప ఆలయం వద్ద ప్రపంచ సుందరీమణులకు గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆతీ్మయ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పురాతన కట్టడం, వారసత్వ సంపద.. రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఆలయ తీరుతెన్నులను తనివితీరా తిలకించి ఫిదా అయ్యారు. రామప్ప గార్డెన్లో అలేఖ్య పుంజాల శాస్త్రీయ నత్యం, రంజిత్ బృందం పేరిణి ప్రదర్శనలను వీక్షించిన అనంతరం..ఇంటర్‌ప్రిటిషన్ సెంటర్లో డిన్నర్ చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. అతిథులకు మంత్రుల సన్మానం వరంగల్ కోటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ సుందరీమణులకు స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ఓరుగల్లు నిలువెత్తు నిదర్శనమన్నారు. రామప్ప గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ సాంస్కృతిక చారిత్రక కట్టడాలకు నిలయం ములుగు ప్రాంతమని, ఇక్కడకు సుందరీమణులు రావడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ పర్యటన ఎప్పటికీ గుర్తుంటుంది చారిత్రక సంపదకు నెలవైన వరంగల్ పర్యటన మాకు జీవితాంతం గుర్తుండే అనుభూతి. కాకతీయులు నిర్మించిన వరంగల్ కోట అద్భుతంగా ఉంది. మాటల్లో దీన్ని వర్ణించలేం. రాణిరుద్రమదేవి గొప్పతనం ఇక్కడ కళ్లకు కట్టినట్టు కనిపించింది. కాకతీయుల పాలన గురించి తెలిపే సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శన మాకెంతో అవగాహన కలిగించింది. ఇక్కడి ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోంది. చేనేత కలంకారి డ్రెస్ చూస్తే ఇక్కడి గొప్పతనం తెలుస్తోంది. చపాట మిర్చి చూసేందుకు బాగా ఉంది. ఇంకా టేస్ట్ కూడా ఆ రేంజ్‌లోనే ఉందనుకుంటున్నాం. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని మా దేశంలో వినిపిస్తాం. –మిస్ వరల్డ్ పోటీదారులు -
Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
-
Miss World Contestants: ఇండియాకు రావటం అదృష్టంగా భావిస్తున్నా
-
రామప్ప ఆలయంలో ప్రపంచ సుందరీమణులు
-
Nandini Gupta: తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే..
-
మిస్ వరల్డ్ పోటిలో తళుక్కుమన్న ఎమ్మా కథ ఇదే!
-
అందాల నారీమణులతో ‘శారీ’గమలు
సాక్షి, యాదాద్రి: చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయడమే ప్రథమ లక్ష్యంగా.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెల ముందు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే అందగత్తెలు ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లిలోని రూరల్ టూరిజం రిసార్టుకు ప్రపంచ సుందరీమణులు 25 మంది రానున్నారు. వీరి రాక సందర్భంగా ఇక్కడి ఇక్కత్ చీరల ప్రాధాన్యాన్ని వారికి తెలియజేస్తారు.ఇందువల్ల స్థానిక చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నమిది. ఈ సందర్భంగా యాదగిరిగుట్టకు కూడా సుందరీమణులు రానున్నారు. కొండపైన స్వామి వారి దర్శనం అనంతరం.. కొండ కింద ఫొటో సెషన్ ఉంటుంది.చేనేత కళాకారులతో మాటామంతీమిస్ వరల్డ్ పోటీదారులు (Miss World 2025 contestants) స్థానికంగా చేనేత కళాకారులతో ముచ్చటిస్తారు. చీరల తయారీకి వాడే దారం పుట్టుక నుంచి.. వస్త్రం తయారీ వరకు.. పలు అంచెల్లో వస్త్రాల తయారీని ఎలా రూపొందిస్తారో వారు అడిగి తెలుసుకుంటారు.యాంఫీ థియేటర్లో ప్రదర్శనపోచంపల్లిలోని టూరిజం సెంటర్ యాంఫీ థియే టర్లో విభిన్నమైన చేనేత వస్త్రాల ప్రదర్శన ఉంటుంది. చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాల్.. ఇలా పలు రకాల వస్త్రాల ప్రదర్శన ద్వారా సంప్ర దాయ, ఆధునికత కలిసిన నూతన ప్యాషన్ వస్త్రాలను ప్రదర్శిస్తారు. దీనిద్వారా సంప్రదాయం, ఆధునికత కలిసి నూతన ప్యాషన్ అనే మాటకు చిరునామా కాబోతున్నాయి. ఇందువల్ల దేశ విదేశాల యువతలో చేనేతకు గౌరవం లభిస్తుంది. ప్రముఖులు ఇప్పటికే పొచంపల్లి వస్త్రాలను ధరించడం ప్యాషన్‌గా మారింది. స్టాళ్లలో ప్రదర్శనలు పూర్తిగా గ్రామీణ వాతావరణం కల్పించేందుకు టూరిజం పార్క్‌ను సిద్ధం చేశారు. సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట, గద్వాల చీరలు, పోచంపల్లి, పుట్టపాక, సిరిపురాలలో తయారయ్యే వస్త్రాలను ప్రదర్శిస్తారు. వీటిని స్థానిక మహిళలు ధరిస్తారు. సంప్రదాయంగా వచ్చిన వస్త్రాలను ఆధునిక ప్యాషన్ డిజైనర్లతో కొత్త రకంగా వస్త్రాలను రూపొందించి అందగత్తెల ముందు ప్రదర్శిస్తారు. ఇక్కత్ డిజైన్లతో తయారవుతున్న తేలియా రుమాల్, సిల్క్, కాటన్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కాప్స్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టన్స్, పిల్లో కవర్స్ తదితర వెరైటీలను ప్రదర్శించనున్నారు. చదవండి: సరసర్వతి నది పుష్కరాలకు నీళ్లు వచ్చాయి -
Miss World Contestants: రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన
-
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శన నేడిలా!
మిస్ వరల్డ్ పోటీదారుల సందర్శనతో ఈ చారిత్రక కట్టడాలకు ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం లభించనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ సందర్శనను తెలంగాణ పర్యాటక ప్రాచుర్యంలో భాగంగా నిర్వహిస్తోంది. తెలంగాణ సంప్రదాయ శిల్పకళ, చరిత్ర, చారిత్రక వైభవం నేటి యువతకు అంతర్జాతీయ వేదికలకు పరిచయం కావడం ఆహ్వానించదగ్గ పరిణామం.రామప్ప దేవాలయం, వేయి స్థంభాల గుడిమిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం తెలంగాణలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు – రామప్ప దేవాలయం, వేయి స్థంభాల గుడిని సందర్శించనున్నారు. ఈ సందర్శనతో తెలంగాణ సంస్కృతి, శిల్పకళకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు లభించే అవకాశం ఏర్పడింది.రామప్ప దేవాలయం.. శిల్పకళకు నిలయం..వరంగల్ జిల్లా ములుగు సమీపంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన గొప్ప కట్టడం. కాకతీయ రాజవంశానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ దేవాలయం, మృదువైన రాతితో రూపొందించిన శిల్పాలతో విశేషంగా ప్రసిద్ధి చెందింది. గత 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం, చిరకాలం నిలిచే తేలికపాటి ఇటుకలతో నిర్మితమై, శిల్పకళ, శాస్త్రీయ నిర్మాణ కౌశలానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.వేయి స్థంభాల గుడి – శిలాశిల్పాల సమ్మేళనంహనుమకొండలోని వేయి స్థంభాల గుడి అనేది 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన మరొక అద్భుత శిల్పకళా చరిత్ర. ఈ ఆలయం శైవ సంప్రదాయానికి చెందినది. వేలాది రాతి స్తంభాలతో కట్టబడి, ప్రతీ స్తంభం ప్రత్యేక శిల్పంతో కళాత్మకంగా రూపొందింది. ముఖ్యంగా అక్కడి ఉత్కృష్టమైన నృత్యశిల్పాలు, సంగీతాన్ని ప్రతిబింబించే శిలాచిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటుంటాయి.వరంగల్ కోటలోసందడి పేరిణి నృత్యాన్ని ఆస్వాదించనున్న అందాల రాణులుతెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే మరో ఘట్టానికి బుధవారం తెర లేవనుంది వరంగల్. బుధవారం మిస్ వరల్డ్ పోటీదారులు చారిత్రక వరంగల్ కోటను సందర్శించి, అక్కడి ప్రాచీన కళారూపమైన పేరిణి శివతాండవ నృత్యంను తిలకిస్తారు. ఈ సందర్శనలో పోటీదారులు కాకతీయుల ఘన వారసత్వానికి, తెలంగాణ సంప్రదాయాలను తెలుసుకోనున్నారు.వరంగల్ కోట – కాకతీయ వైభవానికి ప్రతీకవరంగల్ కోట.. ఎకోశిలా తోరణంలతో ప్రసిద్ధిగాంచిన ఈ కోట, 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. రుద్రమదేవి, వంటి శక్తిమంతుల పాలనకు సాక్షిగా నిలిచిన ఈ కోట శిల్పకళ, ప్రాకారాల నిర్మాణ శైలి, ద్వారతోరణాల తో విశిష్టత అందుకుంది. కోట ప్రాంగణంలోని రాతి శిల్పాలు కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి.పేరిణి నాట్యం – శక్తి, శివభక్తి సమ్మేళనంపేరిణి శివతాండవం అనేది పురాతన పురుషుల నృత్యరూపం. ఇది యుద్ధానికి ముందు వీరులు శక్తిని ప్రేరేపించుకునేందుకు చేసే తాండవ నృత్యంగా పేరు గాంచింది. శివుని ఆరాధనగా చేసే ఈ నృత్యం, ఉగ్రత, శక్తి, శ్రద్ధల సమన్వయంతో భక్తుల మనస్సులను హత్తుకుంటుంది.పేరిణి నృత్యాన్ని అంతరించి పోతున్న కళారూపంగా భావించి, ప్రముఖ నృత్య విద్యావేత్త పద్మశ్రీ డాక్టర్ నాట్యాచార్య నటరాజ రామకృష్ణ తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రస్తుతం ఇది తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా పరిగణించబడుతోంది.ప్రపంచ వేదికపై తెలంగాణ కళల వెలుగుఈ సందర్శనలో మిస్ వరల్డ్ పోటీదారులు కోటలోని తూర్పు గోపురాన్ని, రాతిశిలల కట్టడాలను, తూర్పు ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన పేరిణి నృత్య ప్రదర్శనను తిలకించనున్నారు మిస్ వరల్డ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, సంప్రదాయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇది తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక రంగానికి ఊతమిచ్చే గొప్ప అవకాశం. -
Miss World 2025 అందాల నారీమణులతో ‘శారీ’గమలు
సాక్షి, యాదాద్రి: చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయడమే ప్రథమ లక్ష్యంగా.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెల ముందు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ (Miss World 2025 ) పోటీలకు వచ్చే అందగత్తెలు ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లిలోని రూరల్ టూరిజం రిసార్టుకు ప్రపంచ సుందరీమణులు 25 మంది రానున్నారు. వీరి రాక సందర్భంగా ఇక్కడి ఇక్కత్ చీరల ప్రాధాన్యాన్ని వారికి తెలియజేస్తారు. ఇందువల్ల స్థానిక చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నమిది. ఈ సందర్భంగా యాదగిరి గుట్టకు కూడా సుందరీమణులు రానున్నారు. కొండపైన స్వామి వారి దర్శనం అనంతరం.. కొండ కింద ఫొటో సెషన్ ఉంటుంది. ఇదీ చదవండి: కేన్స్‌లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?చేనేత కళాకారులతో మాటామంతీమిస్ వరల్డ్ పోటీదారులు స్థానికంగా చేనేత కళాకారులతో ముచ్చటిస్తారు. చీరల తయారీకి వాడే దారం పుట్టుక నుంచి.. వస్త్రం తయారీ వరకు.. పలు అంచెల్లో వస్త్రాల తయారీని ఎలా రూపొందిస్తారో వారు అడిగి తెలుసుకుంటారు. యాంఫీ థియేటర్లో ప్రదర్శనపోచంపల్లిలోని టూరిజం సెంటర్ యాంఫీ థియే టర్లో విభిన్నమైన చేనేత వస్త్రాల ప్రదర్శన ఉంటుంది. చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాల్.. ఇలా పలు రకాల వస్త్రాల ప్రదర్శన ద్వారా సంప్ర దాయ, ఆధునికత కలిసిన నూతన ప్యాషన్ వస్త్రాలను ప్రదర్శిస్తారు. దీనిద్వారా సంప్రదాయం, ఆధునికత కలిసి నూతన ప్యాషన్ అనే మాటకు చిరునామా కాబోతున్నాయి. ఇందువల్ల దేశ విదేశాల యువతలో చేనేతకు గౌరవం లభిస్తుంది. ప్రముఖులు ఇప్పటికే పొచంపల్లి వస్త్రాలను ధరించడం ప్యాషన్‌గా మారింది. స్టాళ్లలో ప్రదర్శనలు పూర్తిగా గ్రామీణ వాతావరణం కల్పించేందుకు టూరిజం పార్క్‌ను సిద్ధం చేశారు. సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట, గద్వాల చీరలు, పోచంపల్లి, పుట్టపాక, సిరిపురాలలో తయారయ్యే వస్త్రాలను ప్రదర్శిస్తారు. వీటిని స్థానిక మహిళలు ధరిస్తారు. సంప్రదాయంగా వచ్చిన వస్త్రాలను ఆధునిక ప్యాషన్ డిజైనర్లతో కొత్త రకంగా వస్త్రాలను రూపొందించి అందగత్తెల ముందు ప్రదర్శిస్తారు. ఇక్కత్ డిజైన్లతో తయారవుతున్న తేలియా రుమాల్, సిల్క్, కాటన్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కాప్స్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టన్స్, పిల్లో కవర్స్ తదితర వెరైటీలను ప్రదర్శించనున్నారు. -
‘మిస్ ఇండియా’ను తీర్చిదిద్దుతున్న సౌందర్య శిల్పులు
మిస్ వరల్డ్ వేదికపై భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ నందిని గుప్తా ధరించిన ప్రారంభోత్సవ దుస్తులు అహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీటిని డిజైన్ చేసింది నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్ గౌరంగ్ షా కావడం గమనార్హం. ఈ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా, ఉత్సవ వేదికపై మన జాతీయ వస్త్రధారణను, అదే విధంగా ఒక అపూర్వ వారసత్వాన్ని, కళను, శిల్పాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. భారత జానపద వస్త్ర సంపదకు చిహ్నంలా రూపుదిద్దుకున్న ఈ వైవిధ్యభరిత డిజైన్లలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన జాందాని చేనేతల అందం ప్రస్ఫుటమవుతుంది. దుస్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతోపాటు బాంగ్డీ మోర్ మోటీఫ్ నాట్యం చేస్తూ మెరిసే నాలుగు నెమళ్లు. ఈ మోటీఫ్ కేవలం అలంకారమే కాదు, భారతదేశ హస్తకళా సంపదకు చిహ్నమని చాటి చెప్పాయి. ఆభరణ ‘భాగ్యమూ’ మనదే.. ఈ దుస్తుల వైభవాన్ని మరింతగా పెంచింది నగరానికి చెందిన కిషన్ దాస్ జ్యువెలరీ బ్రాండ్. 1870 నుంచి ఆభరణాల రంగంలో ఉన్న ఈ సంస్థ అందిస్తున్న ఆభరణాలు ప్రత్యేక సందర్భాల్లో నందిని గుప్తాకి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. చాంద్ సూరజ్ హారం, పెద్ద పావురాల ఆకృతులతో రూపొందించిన మరో హారం, బర్మా రూబీలు, బస్రా ముత్యాలు, అన్‌కట్ డైమండ్లతో మినుకు రాజవంశాల వైభవాన్ని ప్రతిబింబించే ఆభరణాలను ఆమె ధరిస్తున్నారు. అపు‘రూపం’.. కేశ సౌందర్యం.. మిస్ ఇండియా నందిని గుప్తా తన ప్రత్యేకమైన డ్రెస్‌లు, మేకప్, హెయిర్‌స్టైల్స్‌తో ఆకట్టుకోవడం వెనుక ఫెమినా మిస్ ఇండియా సంస్థ ఆమె కోసం ఎంపిక చేసిన నిపుణుల కృషి కనిపిస్తుంది. ఆమె మేకప్ డిజైన్ కోచ్‌గా ఆయేషా సేత్‌ను ఫెమినా నియమించినట్లు తెలుస్తోంది. నందినికి ఆమె ప్రత్యేక శిక్షణను అందించి, ఆమె అందానికి వన్నెలు అద్దుతున్నారు. ఈ శిక్షణ, నందినికి వివిధ సందర్భాలకు అనుగుణంగా మేకప్ శైలిని అభ్యసించేందుకు సహాయపడుతోంది. అదే విధంగా నందిని గుప్తా హెయిర్‌స్టైలింగ్ బాధ్యతను సుమితా థిల్లాన్ పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. నందిని ధరిస్తున్న ప్రతి డ్రెస్‌కు అనుగుణంగా ఆమె హెయిర్‌స్టైల్‌ను మార్పు చేర్పులు చేస్తూ ఆకట్టుకునేలా రూపొందిస్తూ తన వంతుగా ఆమెని మెరిపిస్తున్నారు.. పోటీల ప్రారం¿ోత్సవంలో నేషనల్ కాస్ట్యూమ్‌గా గౌరంగ్ షా డిజైన్ చేసిన జామ్దాని లెహంగాను నందిని ధరించగా, ఆమెకు వస్త్రధారణ, స్టైల్స్‌లో సేవలు అందిస్తున్న ఇతర డిజైనర్లలో అమృత్‌రాజ్ బోరా, సామంత్ చౌహాన్, నికితా మహిసాల్కర్లు ఉన్నారని సమాచారం. దీర్ఘకాల కృషి ఫలితం.. మిస్ వరల్డ్ పోటీలో దుస్తుల కోసం నందిని బృందం నన్ను సంప్రదించినప్పుడు, నాలో వెంటనే ఈ ఆర్ట్ పీస్ కళ్లలో మెదిలింది. కాలాతీత భారతీయ హస్తకళను ప్రతిబింబిస్తూ ఇది అంతర్జాతీయ వేదికకు సరిగ్గా సరిపోతుందని భావించాను. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి 8 మంది పేరొందిన కళాకారులు అంకితభావంతో కూడిన బృందం ఈ కళాత్మక డిజైన్లకు జీవం పోయడానికి సహకరించింది. నెలల తరబడి కృషి ఫలితంగా ఈ కళాత్మక మాస్టర్ పీస్ ఆవిర్భవించింది. – గౌరంగ్ షా, నగర డిజైనర్ -
#MissWorld2025: బ్యూటీ విత్ ఫన్..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)
-
Miss World 2025: బ్యూటీ విత్ ఫన్..
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ –2025 పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరం అందాల మగువల శోభను అలంకిరించుకుంది. హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా వసతి పొందుతున్న ఈ సుందరాంగులు ఏ మాత్రం సమయం దొరికినా ఫన్ యాక్టివిటీస్‌తో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలుగు సినీ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా.. నన్ను చుట్టూకుంటివే’ అనే పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ పాటకు అనుగుణంగా మిస్ డెన్మార్క్, మిస్ చెక్ రిపబ్లిక్, మిస్ జెర్మనీ సుందరాంగులు ఒరిజినల్ స్టెప్పులేశారు. మరి కొందరు తారలు సోషల్ మీడియా యాప్స్ కోసం సెల్ఫీ మోడ్‌లో రీల్స్ చేస్తూ సందడి చేశారు. మిస్ వరల్డ్ పోటీలతో పాటు వినోదం కోసం చేస్తున్న ఈ రీల్స్, ఫొటో షూట్లను ఎప్పటికప్పుడు వారి ఇన్‌స్టా, ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మిస్ ఇండియా నందినీ గుప్తా అందమైన అధునాతన–సంప్రదాయ సమ్మిళిత దుస్తుల్లో హోటల్లోని స్విమ్మింగ్ ఫూల్ పరిసరాల్లో చేసిన క్యాట్ వాక్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా బ్రెజిల్, బోత్వానా, ఘనా, ఎల్ సెల్వడోర్ వంటి దేశాలకు చెందిన మిస్ వరల్డ్ తారలు ఒకరినొకరు తమ మొబైల్స్‌లో ఫొటోలు తీస్తూ సందడి చేశారు. -
ఓరుగల్లుకు ప్రపంచ సుందరీమణులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: చారిత్రక నగరం ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణులు బుధవారం పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వరంగల్ నగరంలో నాలుగున్నర గంటలు గడపనున్నారు. రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోటను వారు సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4:35 గంటలకు 22 మంది బృందం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటుంది. సాయంత్రం 5:45 గంటలకు చారిత్రక వేయి స్తంభాల దేవాలయానికి చేరుకుని అక్కడి కార్యక్రమాల అనంతరం 6:40 గంటలకు వరంగల్ కోటకు చేరుకొని శిల్పాలను సందర్శించి వాటి విశిష్టతలను తెలుసుకుంటారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. రామప్పకు మరో బృందం: 35 మంది సుందరీమణుల మరో బృందం సాయంత్రం 5:15 గంటలకు ములుగు జిల్లా రామప్పకు చేరుకుని అక్కడి హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరి సంప్రదాయ దుస్తులతో రామప్ప ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాశస్త్యం, కాకతీయుల చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ పోలీస్ కమిషనర్లు ప్రావీణ్య, సత్యశారద, సన్‌ప్రీత్‌సింగ్‌లు, వివిధ శాఖల అధికారులు వారం రోజులుగా సమీక్ష లు, ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్‌లు రామప్పలో ఏర్పాట్లు పరిశీలించారు. సుమారు మూడు వేల మంది పోలీసులు మూడంచెల బందోబస్తులో పాల్గొంటున్నారు. -
అందం కాదు బంధం
ఇప్పుడు అందాలపోటీలు చాలా మారాయి. రంగు, రూపు, ఆకృతి లాంటివాటికి అంత ప్రాధాన్యం ఉండట్లేదు. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యాన్నే ఆరాధిస్తున్నారు. అందుకే అందాలపోటీల్లో ఇన్‌క్లూజివిటీ పెరిగింది. మేని ఛాయ, ఆకృతి ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అని చెబుతున్న మిస్ సోమాలియా జైనబ్(Zainab Jama) బాలీవుడ్ సినిమాలు చాలా చూస్తారట. షారూఖ్ ఖాన్, కరీనా కపూర్ తన ఫేవరెట్ యాక్టర్స్ అని చెబుతున్నారు. ఆమె ఇంకా ఎన్నో విషయాలను ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు.నేను ఎఫ్‌జీఎమ్ (ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్) సర్వైవర్‌ని. సోమాలియాలో ఉన్న కామన్ హార్మ్‌ఫుల్ ప్రాక్టీస్ ఇది. మా దేశంలోని దాదాపు 98 శాతం మహిళలు దీన్ని అనుభవించినవారే! ఇప్పుడున్న ఆడపిల్లల్లో 30 శాతం మంది ఈ ఆచారం బారినపడే వయసుకు చేరుకున్నారు. అంటే ఏడేళ్లకు ఎఫ్‌జీఎమ్ చేస్తారు. ఎఫ్‌జీఎమ్ అంటే మహిళల సెక్సువల్ ఆర్గాన్ని కత్తిరించడం. యవ్వనంలో ఆమెకు లైంగికేచ్ఛ లేకుండా చేయడం. లైంగికేచ్ఛ లేకపోతే ఏ మగవాడి ఆకర్షణకు లోనుకారనే ఒక ప్రమాదకర, మూఢ విశ్వాసమన్నమాట.ఇది ఒక్క సోమాలియాలోనే కాదు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇప్పటికీ ప్రాక్టీస్‌లో ఉంది. ఈ అనాచారం వల్ల మా దేశంలో చాలామంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతోమంది అధికరక్తస్రావంతో దాదాపు చావు అంచులదాకా వెళ్లారు. నేను కూడా దీన్నుంచి కోలుకుని.. ఈ కథను షేర్ చేయడానికి చాలా కాలమే పట్టింది. నా కథ విని.. ఇలాంటి దుర్మార్గమైన ఆచారాన్ని రూపుమాపడానికి తగిన స్పందన, సహాయం అందుతుందని ఒకే ఒక ఆశతో నా ఈ కథను నాకు దొరికిన వేదిక మీదల్లా పంచుకోవడం మొదలుపెట్టాను. ఈ బ్యూటీపాజెంట్లో కూడా నా తోటి కంటెస్టెంట్స్‌కి చె΄్పాను. ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి దురాచారం ఒకటుందని ఈ కంటెస్టెంట్స్‌లో చాలా మందికి తెలియదు. నా కథ విని చలించిపోయారు.ఫిమో ఇనిషియేటెడ్ ఫౌండేషన్‌ను స్టార్ట్ చేసి, ఆ దురాచారానికి వ్యతిరేకంగాపోరాడుతున్నానని తెలిసి.. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. నాలో భరోసా నింపారు. బ్యూటీపాజెంట్ అంటే కేవలం స్కిన్ షో మాత్రమే అనుకునేవారు ఈ విషయం విని తమ అభి్రపాయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కంటెస్టెంట్స్‌లో ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రగుల్. అందరం అన్నీ షేర్ చేసుకుంటున్నాం. దానివల్ల వ్యక్తిగత సమస్యలు,పోరాటాలు చిన్నవిగా తోస్తున్నాయి. ఎదుర్కోవడానికి బోలెడంత అండ దొరికిన ఫీలింగ్ కలుగుతోంది. సిస్టర్హుడ్ డెవలప్ అవుతోంది. ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సరికొత్త ప్రయత్నాలకు ప్రేరణనిస్తున్నారు.పాజెంట్ తర్వాత కూడా ఈ బాండింగ్ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను.కొత్తగా అనిపించడం లేదు.. ఇండియా, ఆఫ్రికా సంస్కృతి, ఆహారపు అలవాట్లకు వస్తే.. ఇక్కడ నాకేమీ కొత్తగా అనిపించట్లేదు. నేను ప్యూర్ వెజిటేరియన్‌ని. సో ఇక్కడి భోజనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తెలంగాణ నా సొంతింటిని మరిపిస్తోంది. ఈపాజెంట్, కంటెస్టెంట్స్‌తో బాండింగ్, కొత్త భాషలు, కొత్త కల్చర్స్ తెలుసుకోవడం.. ఇవన్నీ నిజంగా వండర్ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. తిరుగు ప్రయాణంలో ఆ ఎక్స్పీరియెన్సెస్ని, ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానాన్ని తీసుకెళ్దామనుకుంటున్నాను. – సరస్వతి రమమండేలా స్ఫూర్తి నాకు ఏడేళ్లున్నప్పుడు జెనిటల్ మ్యుటిలేషన్ జరిగింది. అదొక పెయిన్ఫుల్æట్రామా. దానినుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. నాలా ఇంకే అమ్మాయికీ జరగొద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా తొమ్మిదేళ్ల వయసులో మా కుటుంబం యూకేకి మైగ్రేట్ అయింది రెఫ్యూజీగా. అక్కడే ఏవియేషన్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్మెంట్ చేశాను. ప్రయాణాలన్నా.. ఏరోప్లేన్స్ అన్నా చాలా ఇష్టం. అందుకే అందులోనే చదువు పూర్తి చేశాను. ఒక్క ఎఫ్‌జీఎమ్ కోసమే కాదు.. ఇలాంటి ఇంకెన్నో దురాచారాలు, హింస మీద అమ్మాయిలు, మహిళలకు చైతన్యం కలిగించే ఎన్నో ఫౌండేషన్స్‌తో కలిసి పనిచేస్తున్నాను.అమ్మాయిల చదువు కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలతోనూ అసోసియేట్ అయి ఉన్నాను. మహిళలందరినీ ఏకం చేసి వారి మధ్య సిస్టర్‌హుడ్‌ను పెంచడానికీ ప్రయత్నిస్తున్నాను. నా మాతృదేశానికి వెళ్లిపోయి.. యుగాలుగా నాటుకుని ఉన్న ఈ అనాచారాన్ని రూపుమాపడమే నా లక్ష్యం. ఇదొక్క సోమాలియాకే పరిమితమైన సమస్య కాదు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఉంది. మార్పు కోసం అన్ని దేశాల్లోనూ వర్క్ చేస్తాను. అయితే ఇది నేనిప్పుడు మీతో చెబుతున్నంత ఈజీ కాదని తెలుసు. మా ట్రెడిషన్ గురించి ప్రపంచానికి చెబుతున్నానని, ధిక్కరిస్తున్నానని బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. వెనకడుగు వేసేది లేదు. ఈ విషయంలో నాకు నెల్సన్ మండేలా స్ఫూర్తి. – ‘మిస్ సోమాలియా’ జైనబ్ -
రైతు కూతురి కలల సేద్యం
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా(Nandini Gupta) రాజస్థాన్‌లోని ఓ పల్లెటూరిలో రైతు కుటుంబంలో జన్మించింది. ‘అందరికీ నమస్కారం.. నేను మీ నందిని..’ అంటూ తెలుగులో చిరునవ్వుతో పలకరించిన ఈ బ్యూటీ మిస్ వరల్డ్పోటీలోపాల్గొనేంతగా తనను తాను ఎలా నిర్మించుకుందో వివరించింది. ‘ఎక్కడ నుంచి వచ్చాం అన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్లాం.. అన్నదే ముఖ్యం’ అన్న ఆత్మవిశ్వాసంతోపాటు భవిష్యత్తు ప్రణాళికలనూ మన ముందుంచింది మిస్ వరల్డ్– 2025 కాంటెస్ట్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా.‘‘అమ్మానాన్నలకు నేను, చెల్లి సంతానం. స్కూల్లో చదివేటప్పుడే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు ఆమెను చాలా మంది అభినందించడం, కెమెరా ఫ్లాష్ లైట్లలో వెలిగిపోతుండటం టీవీలో చూసి... ‘ఆమె ఎవరు?’ అని అమ్మను అడిగాను. ‘ఆమె మిస్ వరల్డ్, నటి’ అని చెప్పింది అమ్మ. నా మనసులో ఆనాటి సంఘటన బలంగా ముద్రించుకుపోయింది. అప్పటినుంచి అందంగా ఉండటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. మంచి డ్రెస్సులు వేసుకునేదాన్ని, మేకప్ చేసుకునేదాన్ని, హెయిర్‌స్టైల్స్ మార్చేదాన్ని. అందాలపోటీలోపాల్గొనడానికి ఏమేం చేయాలో తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఓ రైతు కూతురు కలలు కనే ధైర్యం చేయవచ్చా! అనే ఆలోచన లేకుండా నా ప్రయాణాన్ని కొనసాగించాను. నా ఆసక్తులు గమనించిన అమ్మానాన్నలు ఆ తర్వాత మా కుటుంబాన్ని ముంబయ్‌కి షిఫ్ట్ చేశారు. ఆ విధంగా ఆవాలు పండే పోలాల మధ్య పెరిగిన నేను ముంబయ్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను.మాట్లాడాలంటే బెరుకుపోటీలలోపాల్గొనే కొత్తలో వేదికలపైన నా గురించి నేను చెప్పుకోవడానికి, మైక్ ముందు మాట్లాడటానికి సిగ్గుపడేదాన్ని. ఏదో తెలియని బెరుకు ఉండేది. ఇలా అయితే రాణించలేను అనుకున్నాను. నా శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నించాను. నన్ను నేను కొత్తగా నిర్మించుకోవడంలో ఎలా ఉన్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను అనే విషయాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నా డ్రెస్, మేకప్, నా మాట, చూపు అన్నీ సమర్థంగా ఉన్నప్పుడు దేనికీ వెనకంజ వేయనక్కర్లేదు అని తెలుసుకున్నాను. ఆ ఆత్మవిశ్వాసమే ఈ రోజు ఇలా మీ ముందుకు తీసుకువచ్చింది.మార్పునకు శ్రీకారంఅందాలపోటీలవైపు వెళ్లేటప్పుడు మొదట్లో తటపటాయించినప్పటికీ మిస్ రాజస్థాన్ టైటిల్ గెలిచాక నా ఇష్టానికి మద్దతు ఇచ్చారు మా నాన్న. ఫెమినా మిస్ ఇండియాపోటీల్లో గెలిచాక అయితే ఆయన చాలా ఉద్వేగానికి గురయ్యారు. ఆ క్షణాలు ఎప్పటికీ మరవలేను. చదువంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్న కోరిక మేరకు బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అమ్మాయిలు తల మీదుగా ముసుగు ధరించాలి, వారికి పెద్దగా చదువు అక్కర్లేదు, త్వరగా పెళ్లి చేయాలనే ఆలోచన అక్కడి తల్లిదండ్రుల్లో ఉండేది. ఇప్పుడు అక్కడా బ్యూటీ కాంటెస్ట్‌లకు ట్రైనింVŠ ఇచ్చే అకాడమీలు పెరిగాయి. తల్లిదండ్రులు కూడా తమ కూతుళ్లను బ్యూటీ కాంటెస్ట్లోపాల్గొనడానికి పోత్సహిస్తున్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.దివ్యాంగుల సాధికారత కోసం..దివ్యాంగులను సమాజంలో ఒక భాగం చేయడం కోసం పనిచేయడమే నా లక్ష్యం. మా మేనమామ పుట్టుకతోనే దివ్యాంగుడు. సరిగా మాట్లాడలేరు. కానీ, ఎప్పుడూ మానసిక స్థైర్యంతో ఉంటారు. చిన్నప్పటి నుంచి అతని కళ్ల నుంచి ప్రపంచాన్ని చూశాను. కనిపించని బాధ ఏదో మోస్తున్నట్టుగా అతనిలో నాకు కనిపించేది. అలాంటి వాళ్లు పడుతున్న బాధలు స్వయంగా చూశాను. వికలాంగుల గాధలు చాలా బాధనిపించేవి. మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచాక ‘ఏక్తా ప్రాజెక్టు’లో భాగంగా అనేక మంది దివ్యాంగులతో కలిసి పలు కార్యక్రమాల్లోపాల్గొన్నా. వారి కలల సాకారానికి కృషి చేయాలనుకున్నాను. భవిష్యత్తు ప్రణాళికలుఇప్పటికే మోడల్‌గా ప్రకటనలలో యాక్ట్ చేస్తున్నాను. తెలుగు సినిమాలు, డ్యాన్స్‌లు అంటే చాలా ఇష్టం. మహేష్‌బాబు నటించిన సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి .. ’సాంగ్ మరీ మరీ ఇష్టం. ఆపాట విన్నప్పుడల్లా డ్యాన్స్ చేస్తుంటా. నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది’’ అంటూ వివరించింది ఈ బ్యూటీ. – నిర్మలారెడ్డిరాజస్థాన్లోని కోటాకు దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరులో రైతు కుటుంబంలో పుట్టి పెరిగింది నందిని గుప్తా. స్థానిక హస్తకళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోటా డోరియా వస్త్రాల ప్రాచుర్యానికి కృషి చేస్తోంది. ఫ్యాషన్‌లోనూ తన మూలాలను చూపించేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శైలినిపాటిస్తోంది. యోగా, డ్యాన్స్, హెల్తీ డైట్నుపాటించడమే తన బ్యూటీ సీక్రెట్ అని తెలిపింది. -
చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)
-
చార్మినార్ దగ్గర మిస్ వరల్డ్ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)
-
చౌమహల్లా ప్యాలెస్‌లో సుందరీమణులు
'మిస్ వరల్డ్ 2025' పోటీలలో భాగంగా ఈ రోజు (మంగళవారం).. 120 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. చుడీ బజార్లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేశారు. ఆ తరువాత చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకున్నారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కుటుంబ సమేతంగా చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఇక్కడే మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లకు డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా తెలంగాణ పర్యాటక ప్రాంతం గురించి తెలిపే ఫోటో గ్యాలరీ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.చౌముల్లా ప్యాలెస్ అద్భుతంగా ఉందని, హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోందని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తమ సంతోషన్ని వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. తెలంగాణ జరూర్ ఆనా నినాదం మా దేశాల్లో వినిపిస్తామని వారు అన్నారు. -
చార్మినార్ దగ్గర సందడి చేసిన అందాల భామలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మిస్ వరల్డ్ 2025' పోటీలలో భాగంగా ఈ రోజు (మంగళవారం).. 190 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. ఇక్కడి (చార్మినార్) నుంచి వీరు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.రాత్రికి చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు వీరు చుడీ బజార్లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేయనున్నారు. అంతే కాకూండా వీరికి మెహందీ పెట్టడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఏమిటీ హెరిటేజ్ వాక్? హైదరాబాద్ నగరం, చారిత్రక నేపధ్యం, సాంస్కృతిక వైవిధ్యం, శిల్పకళా సంపదకు ప్రసిద్ధి చెందింది. నగరంలోని వారసత్వ కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి, ‘ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్‘ సంస్థ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నగరంలోని చారిత్రక కట్టడాలను సందర్శించి, వాటి వెనుక ఉన్న చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. హెరిటేజ్ వాక్‌లో భాగంగా, పాల్గొనేవారు సందర్శించే ప్రముఖ చారిత్రక కట్టడాలలో చార్మినార్, మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్, బద్షాహీ అషూర్ఖానా, ఖిల్వత్ ముబారక్, లాడ్ బజార్ వంటివి ఉన్నాయి. ఇవి హైదరాబాద్ నగర చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.సందర్శకులకు స్థానిక గైడ్ల ద్వారా ప్రతి కట్టడానికి సంబంధించిన చరిత్ర, శిల్పకళా విశేషాలు వివరిస్తారు. -
రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న సుందరీమణులు
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు బుధవారం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి వస్తుండడంతో ప్రభుత్వం, టూరిజం శాఖ అధికారులు ఆ బృందానికి స్వాగతం పలుకుతూ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఇటీవల మిస్ ఇండియా నందిని గుప్తా రామప్ప ఆలయాన్ని సందర్శించి ఫొటో షూట్ చేశారు. ఆమె ఆలయం చుట్టూ తిరుగుతూ శిల్పాకళా సంపదను తనివితీరా చూస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. నిమిషం నిడివి ఉన్న ఒక వీడియో, 38 సెకన్లు ఉన్న మరో వీడియోను రూపొందించి విడుదల చేశారు. ఆలయ శిల్ప కళా సంపద, చరిత్రను వివరిస్తూ ప్రపంచ సుందరీమణులకు స్వాగతం పలుకుతూ చేసిన ఈ ఆహ్వాన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా, హైదరాబాద్‌నుంచి సుందరీమణులు మన బ్రాండ్ ప్రపంచమంతా తెలిసేలా ‘తెలంగాణ జరూర్ ఆనా’ పేరుతో ఉన్న ఏసీ బస్సులో రానున్నారు.3డీ మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై –రెజల్యూషన్ ప్రొజెక్టర్లుప్రపంచ సుందరీమణులు రాక సందర్భంగా ఖిలావరంగల్ కోటలోని కట్టడాలు, శిల్ప కళా సంపద విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. కట్టడాలు మరింత ఆకర్శణీయంగా కనిపించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ 3డీ మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై –రెజల్యూషన్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ వంటి అధునాతన సాంకేతికతను వినియోగించారు. బంగారు, తెలుపు వర్ణం కాంతుల్లో శిల్పాలు మెరిసిపోతున్నాయి. దీనికితోడు ఫ్లడ్‌లైట్లు, ఎల్ఈడీ(వామ్) లైట్ల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by Telangana Tourism (@tstdc.official) (చదవండి: ఒత్తిడిని దూరం చేసే చిట్టిపొట్టి చేపలు..!) -
'మిస్ వరల్డ్'లో మన స్థానం ఎంత.. కిరీటం అందుకున్న బ్యూటీస్ ఎందరు..?
ప్రపంచ సుందరి- 2025 (Miss World Competitions 2025) పోటీలు హైదరాబాద్‌లో అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ ఏడాది కిరీటాన్ని అందుకునే అందాల రాశి ఎవరా? అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మిస్ వరల్డ్ అవ్వాలనే ఆశయంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటికి పైగానే అమ్మాయిలు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకుంటారు. 160కంటే ఎక్కువ దేశాలే ఈ పోటీల్లో పాల్గొంటాయి. అందుకే బ్యూటీ వరల్డ్‌లో ఈ పోటీలకు అంత ప్రత్యేకత ఉంటుంది. ఇంతటి ప్రతిష్టాత్మకత కలిగిన ఈ పోటీలలో గెలుపొందిన మన భారతీయ సుందరిలు ఆరుగురు ఉన్నారు.భారత్ నుంచి ఆరుగురు అందాల భామలు ఈ కిరీటాన్ని అందుకున్నారు. మొట్టమొదటిసారి ముంబైకి చెందిన రీటా ఫరియా (1966)లో ఈ కిరిటాన్ని దక్కించుకుంది. మిస్ వరల్డ్‌గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్ కూడా ఆమె కావడం విశేషం. గెలిచిన తర్వాత సినిమాల్లో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె తన డాక్టర్ వృత్తిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధిక కిరీటాలు (6) గెలిచిన దేశాల జాబితాలో భారత్‌తో పాటు వెనిజులా ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యంగా 2000సంవత్సరంలో భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ ఏడాదిలో ప్రియాంక చోప్రా(మిస్ వరల్డ్), లారా దత్తా (మిస్ యూనివర్స్) దియా మిర్జా (మిస్ ఆసియా పసిఫిక్)గా గెలవడంతో ఒకే ఏడాది మూడు ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్ టైటిళ్లు సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది. అలా బ్యూటీ వరల్డ్‌లో భారత్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. -
జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాలనుంది అంటున్న బ్యూటీ!
ఇదివరకైతే ఇలాంటి పోటీల్లో నిర్ణీత కొలతల్లో శరీరాకృతి ఉండాలనే నియమం ఉండేది. కానీ ఇప్పుడు వీరందరినీ చూస్తుంటే అలా అనిపించట్లేదు. అయిదున్నర అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వాళ్లున్నారు.. ఆరడుగులు ఎత్తు దాటిన వారూ ఉన్నారు. సన్నజాజి తీగను మరిపించే వారున్నారు, బలిష్టమైన శరీరాకృతితో మెరిసి΄ోతున్న వాళ్లూ ఉన్నారు. ఇంచుమించు అందరివీ వైవిధ్యభరితమైన నేపథ్యాలు, ఎన్నో పోరాటాలు, ఎదురీతలు... దాదాపు 120 దేశాల సుందరీమణులు. రకరకాల దేశాల శీతోష్ణస్థితులు... రకరకాల స్కిన్టోన్లు. వివిధ రకాల ఆకృతులు. వారందరికీ ఒక్కొక్కరిది ఒక్కో కథ! ఆత్మవిశ్వాసమే ఆభరణంగా.. ప్రతిభ, బ్యూటీ విత్ పర్సస్ ప్రధాన అర్హతలుగా తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆ సుందరీమణుల్లో రొజుకొకరి పరిచయం ఇక్కడ. ఈరోజు మిస్ జపాన్ కియానా తుమీత గురించి ఆమె మాటల్లోనే..నేను ప్రకృతి వైపరీత్యాల మీద పీహెచ్డీ చేస్తున్నాను. అంతకుముందు కేంబ్రిడ్జ్, ఎడింబరో యూనివర్సిటీల్లో విమెన్ లీడర్ షిప్ మాస్టర్ డిగ్రీ చేశాను. ఒక బిజినెస్ చానల్లోఎకనమిక్ న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నాను. నా టాలెంట్ విషయాలకు వస్తే నేను జపనీస్ కాలిగ్రాఫర్ని. అందులో నాకు మంచి పేరుంది. ఎలక్ట్రిక్ ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఈ పోటీల్లో టాలెంట్ రౌండ్లో ఎలక్ట్రిక్ ఫ్లూట్నే పెర్ఫార్మ్ చేయబోతున్నాను. ప్రకృతి గౌరవిస్తూ వైపరీత్యాలు రాకుండా జాగ్రత్తపడటం, ఒకవేళ ప్రకృతివైపరీత్యాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. నా అందంతో ఈ ప్రయోజనాన్ని సాధించాలనుకుంటున్నా! ప్రకృతి వైపరీత్యాల పట్ల పిల్లలకు అవేర్నెస్ కల్పించడం! స్త్రీ, పురుష వివక్ష విషయానికి వస్తే.. దానికి జపాన్ కూడా అతీతమేమీ కాదు. చదువుకు సంబంధించి అమ్మాయి, అబ్బాయిలకు సమాన అవకాశాలున్నప్పటికీ.. లీడర్షిప్ విషయంలో మాత్రం పురుషులదే ఆధిపత్యం. ఆ అంతరం చాలా ఎక్కువ. వేతనాల్లో కూడా ఆ గ్యాప్ కనపడుతుంది. సమానమైన పనికి మహిళలకన్నా పురుషులకే వేతనాలు ఎక్కువ. డిసిప్లిన్, పని విషయాల్లో ప్రపంచంలోని ప్రతిదేశం జపాన్ వైపు చూస్తుందేమో కానీ.. టెక్నికల్ జాబ్స్ విషయంలో మాత్రం మేము ఇండియాను అప్రిషియేట్ చేస్తాం. కొత్తగా వచ్చిన ఏ టెక్నికల్ చేంజ్‌ను అయినా ఇట్టే గ్రహించి, అడాప్ట్ చేసుకుని రాణిస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న క్రైమ్ గురించి వార్తల్లో విన్నప్పుడు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కానీ ఈ పోటీల కోసం ఇక్కడ ల్యాండ్ అయ్యి, ఇక్కడి మనుషులు, వాళ్లిచ్చే మర్యాద అవన్నీ చూశాక ఆ నెర్వస్నెస్, భయాలు అన్నీ పటాపంచలయ్యాయి. ఇక్కడికి రావడానికి నాకు దుబాయ్‌లో కనెక్టింగ్ ఫ్లయిట్ ఉండింది. అక్కడ బోర్డింగ్‌లో నా లగేజ్‌తో అవస్థపడుతుంటే ఒక ఇండియన్ జెంటిల్మన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడే నాకు ఇండియా మీద గౌరవం రెట్టింపయింది. ఈ దేశానికి సంబంధించి నాకు ఇష్టమైన మరోవిషయం.. ఎర్రటి బొట్టు. ఈ పోటీలో ఒకరోజు నేను చీర కట్టుకుని, ఎర్రటి బిందీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇండియాకు, జ΄ాన్కున్న మరో సామ్యం.. బౌద్ధం. మేము ఫాలో అవుతున్న బౌద్ధానికి, ఇక్కడికి వ్యత్యాసమున్నప్పటికీ బౌద్ధం ఈ దేశంతో మాకో కనెక్టివిటీని పెంచింది. ఇక్కడి ఆధ్యాత్మికతకు నేను ఫిదా అయ్యాను. బ్యూటీ పాజెంట్ విషయానికి వస్తే చాలా దేశాల్లో ఉన్నట్టే జపాన్‌లోనూ.. అందాల పోటీలు అంటే స్కిన్ షో తప్ప మరోటి కాదనే అభిప్రాయం, అపోహా ఉన్నాయి. కానీ బ్యూటీ విత్ పర్పస్ అనే ఐడియా నాకు నచ్చి.. పోటీల్లోపాల్గొంటున్నాను. సిస్టర్హుడ్ క్రియేట్ చేయడానికి ఇదొక వేదిక. సన్నగా ఉన్నామా.. లావుగా ఉన్నామా.. తెల్లగా ఉన్నామా.. నల్లగా ఉన్నామా అని కాదు.. అదసలు విషయమే కాదు. డజంట్ మ్యాటర్. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నదే మ్యాటర్. అందుకే నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం!ఇదీ చదవండి: Operation Sindoor: 17 మంది బంగారు తల్లులు, అదో భావోద్వేగం! జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాలనుంది..నాటు నాటు పాట జపాన్‌లో చాలా ఫేమస్. ఆ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించడానికి నేను సిద్ధం. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా షారూఖ్ ఖాన్‌కి వీర ఫ్యాన్‌ని. ఇండియాది రిచ్ కల్చర్. ఇక్కడి రైతా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. – కియానా తుమీతచదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర– సరస్వతి రమ -
పానీ పూరీ తినడం నేర్చుకున్న అందాల సుందరి ఎవరంటే..!
అందం అంటే స్వతహాగా మనం ఉండే విధానమే. అందానికి సూత్రాలేం లేవు. దేనినైనా స్వతహాగా ఆస్వాదించడమే అందం. ఇదే ప్రపంచంలోని అందమైన వైవిధ్యం అన్నారు హూన్ త్రాన్ నీ. తెలంగాణ (హైదరాబాద్) వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025పోటీల నేపథ్యంలో మిస్ వరల్డ్ వియత్నామ్ హూన్ త్రా నీ ‘సాక్షి’ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. భారతీయతను, మానవత్వాన్ని, భిన్న సంస్కృతుల అద్భుత సమ్మేళనాన్ని గొప్పగా వర్ణించిన హూన్ త్రాన్ సాక్షి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే..!!ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే బొట్టు పెట్టి నన్ను ఆహ్వానించిన విధానం, ఇక్కడి సంస్కృతిలోని ఆప్యాయత నాకెంతో నచ్చింది. తెలంగాణ స్థానిక సంస్కృతిలో ప్రదర్శించిన నృత్యాలు నన్ను అబ్బుర పరిచాయి. ఇక్కడి కళాకారుల్లో ఒక వైవిధ్యముంది. ఇక్కడి ఆతిథ్యం నాకు మరో ఇంటిని తలపిస్తోంది. నేను బస చేస్తున్న హోటల్ సిబ్బంది నా కోసం పర్యావరణహితమైన పదార్థాలతో తయారు చేసిన అందమైన బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు. మరో సిబ్బంది నా కోసం వియత్నామీస్ భాషలో రాసిచ్చిన లేఖ నన్ను హత్తుకుంది. ఇంటికి దూరంగా ఉన్న నాకు ఈ లేఖ ఎంతో సాంత్వనను అందించింది. ఇవన్నీ ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమానురాగాలకు ప్రతీకలు. హైదరాబాద్‌లో నాకు బాగా నచ్చిన అంశం పానీ పూరీ. వియత్నాం, నేను చదువుకునే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పుడూ ఇంత రుచికరమైనది తినలేదు. మిస్ ఇండియా నందినీ గుప్తా పానీ పూరీ ఎలా తినాలో నేర్చించింది. నా దేశం అందమైన, సాంస్కృతికమైన దేశం. మిస్ వరల్డ్ అంటే.. తమ దేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. వ్యక్తిగత విశిష్టత గురించి గొప్పగా ప్రదర్శించే ప్రపంచ వేదిక. ఈ స్ఫూర్తితోనే నేను వియత్నామీస్ ఆత్మస్థైర్యం, సామాజిక బాధ్యత గల అమ్మాయిగా మిస్ వరల్డ్ వేదిక పైన సగర్వంగా నిలుచున్నాను. మిస్ థాయ్‌లాండ్ ఓపాల్, మరో దేశ వనిత సోమ నాకు స్ఫూర్తినిచ్చారు. సామాజికంగా ఎదురయ్యే కొన్ని అడ్డంకులు, అవరోధాలను ఎలా ఎదుర్కోవాలో వారి కథలు విని నేర్చుకున్నాను.ఎన్నో స్కూల్స్‌ను పునరుద్ధరించానువిద్య–విఙ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడి జీవితాలు బాగుంటాయని నమ్ముతాను. అందుకే మా దేశంలో ‘హర్టీ హెల్ప్’ అనే ప్రాజెక్ట్ చేపట్టాను. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్ థీమ్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎన్నో స్కూల్స్‌ను పునరుద్ధరించాను, అక్కడి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించడానికి బుక్ రూంలను ఏర్పాటు చేశాను. నేను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేస్తున్నాను.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీరపుస్తకాలే నాకు సాంత్వన నా ఫ్యాషన్ మోడలింగ్‌లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. దానిని అధిగమించడానికి నాకు తోడుగా నిలిచింది పుస్తకాలు మాత్రమే. పుస్తకాలే నాకు గురువులు, స్నేహితులు, సాంత్వన. వ్యక్తులు, వ్యక్తిత్వాలు, సామాజిక అంశాలను రచయితలు ఎంతో హృద్యంగా మనకు చేరవేస్తారు. ‘ఎలయర్’ అనే పుస్తకం నాకెంతో నేర్పించింది. ఎప్పుడైనా సరే ఇతరుల విజయాన్ని చూసి మనల్ని పోల్చుకోవద్దు. వారి విజయాలకు కారణాలు వేరు. మన వాస్తవ పరిస్థితులు వేరు. ప్రతీ ఒక్కరికి ఒక వినూత్నమైన దారి ఉంటుంది, ఒక అందమైన ప్రయాణముంటుంది. అందరినీ గౌరవించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఛాలెంజెస్ ఉంటాయి. నేనూ వాటిని దాటుకునే వచ్చిన దానినే. ఈ సందర్భంగా నేనొక విషయం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి విషయంలో దయతో ఉండండి. ఎవరినీ తక్కువ చేసి చూడొద్దు, సామాజిక అసమానతలు, అస్పశ్యతలు నాలాంటి అమ్మాయిలను వేదనకు గురి చేస్తాయి. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ వేదికపైన చెప్పాలనుకున్నాను.. కానీ ‘సాక్షి’ దీనిపై నన్ను స్పందన కోరడంతో ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరిని గౌరవించండి, వారి ఆలోచనలకు విలువ ఇవ్వండి. – హూన్ త్రాన్ – హనుమాద్రి శ్రీకాంత్ ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో -
సాయంకాలాన.. సాగరతీరాన.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల సందడి..!
సాయంకాలాన.. సాగర తీరాన.. అని ఇటీవల ఓ చిత్రంలోని పాట గుర్తొచ్చేలా.. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసిన వివిధ దేశాలకు చెందిన పోటీదారులు సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో సందడి చేశారు. ఇందులో భాగంగా కొందరు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించి తెలంగాణ విశిష్టతలను తెలుసుకున్నారు. ఇక్కడ నిర్మితమైన చారిత్రక కట్టడాల తిలకించి వాటి ప్రత్యేకతలను ఆరాతీశారు. భాగ్యనగరం అంటేనే ఓ చారిత్రక నేపథ్యం ఉన్న నగరం.. ఇక్కడ విభిన్న రకాల సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిసి ఉంటాయి. అలాంటి సమ్మిళితమైన జీవనశైలి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. అలాగే మిస్ వరల్డ్ పోటీదారులను నగర సంస్కృతి ఆకట్టుకుంటోంది. మిస్ వరల్డ్ పోటల్లో పాల్గొంటున్న ఆయా దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంలో పాలుపంచుకుంటూ నగరంలో సందడి చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు ఆహ్వానం మొదలు గచ్చిబౌలి ప్రారంభ వేడుకల వరకూ నగర ప్రత్యేకతలను ఆశ్చర్యంగా ఆరా తీస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆయా చారిత్రక, ప్రత్యేక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎక్స్పీరియం పార్క్‌ను సందర్శించి అక్కడ ప్రత్యేకంగా నిర్వహించిన టమాటోరినా ఫెస్ట్‌లో పాల్గొన్నారు. ఇక మంగళవారం చారిత్రాత్మక లాడ్ బజార్లో, చార్మీనార్ వీధుల్లో సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం మిస్ వరల్డ్ నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిథులు సన్నహాలు పూర్తి చేశారు. మిస్ థాయ్‌లాండ్ ఓపాల్ సుచేత వంటి పలువురు తారలు ఇప్పటికే తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పలు వేదికల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్న మిస్ వరల్డ్పోటీల నేపథ్యంలో ముందస్తుగా రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా నగరంలోని మరికొన్ని సందర్శనీయ ప్రదేశాల్లో, ఇతర కార్యక్రమాక్లూ పాల్గోనున్నారు. (చదవండి: ఓల్డ్ సిటీ.. న్యూ బ్యూటీ) -
ఓల్డ్ సిటీ.. న్యూ బ్యూటీ
హైదరాబాద్: మిస్ వరల్డ్–2025 పోటీదారులతో చార్మినార్నుంచి లాడ్ బజార్ వరకు మంగళవారం నిర్వహించనున్న హెరిటేజ్ వాక్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పాతబస్తీలో కొన్ని ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే చిరు వ్యాపారులను కట్టడి చేసే దిశగా అందరికీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఒకరోజు తమ వ్యాపారాలకు సెలవు ఇవ్వాలని సూచించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. చార్మినార్‌కు నాలుగు వైపులా ఉన్న దారుల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అణువణువూ తనిఖీ చేసిన అనంతరమే చార్మినార్ (Charminar) వరకు అనుమతించనున్నారు. ఇప్పటికే బాంబు, డాగ్ స్క్వాడ్లతో చార్మినార్, లాడ్ బజార్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ రూట్లో రహదారులను అందంగా తీర్చిదిద్ది..ఇరువైపులా తాత్కాలిక విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. చార్మినార్నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ అనంతరం అందాల పోటీదారులు ఇక్కడ షాపింగ్ చేయనున్నారు. అంతరం అక్కడి నుంచి వాహనాల ద్వారా చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకొని డిన్నర్ చేయనున్నారు. ఈ డిన్నర్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొననున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్‌లో పాల్గొననున్నారు. చార్మినా ర్నుంచి లాడ్ బజార్ వరకు నిర్వహించే వాక్‌లో ప్రపంచ సుందరాంగులు పాల్గొని ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటారు. అనంతరం షాపింగ్ చేయనున్నారు. తెలంగాణ జరూర్ ఆనా.. అనే టైటిల్‌తో చూడముచ్చటగా తయారు చేయించిన ప్రత్యేక ఏసీ బస్సులో మిస్ వరల్డ్ పోటీదారులు పాతబస్తీకి వస్తారు. శివారు ప్రాంతమైన ఆరాంఘర్ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లై ఓవర్ ద్వారా పాతబస్తీలోకి ప్రవేశిస్తారు. అనంతరం బహదూర్‌పురా, పురానాపూల్, పేట్లబురుజు, మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ మీదుగా చారి్మనార్‌కు చేరుకుంటారు. డిన్నర్ (Dinner) అనంతరం తిరిగివచ్చిన రూట్లోనే వెళ్లనున్నారు. హెరిటేజ్ వాక్ (Heritage Walk) కోసం పాతబస్తీలో దాదాపు 10 కిలో మీటర్ల రేడియస్‌లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని జీహెచ్ఎంసీ (GHMC) చార్మినార్ జోనల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. వీధి దీపాల ఏర్పాటుతో పాటు తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ, బీటీ రోడ్లు, డివైడర్ల మరమ్మతులు చేయించామన్నారు. దాదాపు 250 మంది కారి్మకులు పారిశుధ్య పనుల్లో పాలుపంచుకున్నారని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. మదీనా నుండి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ, శాలిబండ (రాజేష్ మెడికల్ హాల్) నుండి వోల్గా జంక్షన్, వోల్గా జంక్షన్ నుండి మూసబౌలి వయా ఖిల్వత్ రోడ్డుకు వెళ్లే రోడ్లలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకల్ని నియంత్రించనున్నారు. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు నగర పోలీస్ (ట్రాఫిక్) జాయింట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మదీనా జంక్షన్: నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు. హిమ్మత్‌పుర: నాగల్‌చింత/శాలిబండ ప్రాంతాల నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమ్మత్‌పురా జంక్షన్, హరి బౌలి మరియు వోల్గా జంక్షన్ వైపు ఫతే దర్వాజా రోడ్డు వరకు తరలిస్తారు.వోల్గా జంక్షన్: హిమ్మత్‌పురా నుండి వచ్చే ట్రాఫిక్‌ను చౌమొహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు. వీటిని వోల్గా జంక్షన్ ఫతే దర్వాజా వైపు మళ్లిస్తారు. ఫతే దర్వాజా నుండి వచ్చే ట్రాఫిక్‌ను హిమ్మిత్పురా వైపు మళ్లిస్తారు. మూసబౌలి: పురానాపూల్ (గుడ్ విల్ కేఫ్) నుండి వచ్చే ట్రాఫిక్‌ను చారి్మనార్/చౌమహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు మరియు మూసబౌలి వద్ద సిటీ కాలేజ్ మరియు ఫతే దర్వాజా వైపు దూద్‌బౌలి ద్వారా మళ్లిస్తారు. చౌక్ మైదాన్ కమాన్: చౌక్ మైదాన్ నుండి చార్మినార్వైపు వచ్చే ట్రాఫిక్‌ను చౌక్ మైదాన్ వద్ద కోట్ల అలిజా లేదా మొఘల్‌పురా వైపు మళ్లిస్తారు. ఎతేబార్ చౌక్: ఎతేబార్ చౌక్ ప్రాంతం నుండి గుల్జార్‌హౌస్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎతేబార్ చౌక్ వద్ద మండి మిరాలం మార్కెట్ లేదా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. షేర్ ఎ బైతుల్ కమాన్: మిట్టి కా షేర్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను గుల్జార్ హౌస్ వైపు అనుమతించరు మరియు మిట్టి–కే–షేర్ జంక్షన్ వద్ద ఘాన్సీ బజార్ వైపు మళ్లించి హైకోర్టు రోడ్డుకు చేరుకుంటారు. లక్కడ్ కోట్ (పాత సీపీ ఆఫీస్ జంక్షన్): అపాట్ వైపు నుండి చార్మినార్వైపు వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్ కోట్ వద్ద (ఓల్డ్ సీపీ ఆఫీస్ లేన్) మరియు మిరాలం మండి మార్కెట్ వైపు మళ్లిస్తారు (అవసరమైతే) ఈ పరిమితులు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి. -
72nd Miss World: మీకూ మాకూ సామ్యం.. బౌద్ధం!
దాదాపు 120 దేశాల సుందరీమణులు. రకరకాల దేశాల శీతోష్ణస్థితులు... రకరకాల స్కిన్టోన్లు. వివిధ రకాల ఆకృతులు. వారందరికీ ఒక్కొక్కరిది ఒక్కో కథ! ఆత్మవిశ్వాసమే ఆభరణంగా.. ప్రతిభ, బ్యూటీ విత్ పర్సస్ ప్రధాన అర్హతలుగా తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆ సుందరీమణుల్లో రొజుకొకరి పరిచయం ఇక్కడ. ఈరోజు మిస్ జపాన్ కియానా తుమీత గురించి ఆమె మాటల్లోనే..నేను ప్రకృతి వైపరీత్యాల మీద పీహెచ్డీ చేస్తున్నాను. అంతకుముందు కేంబ్రిడ్జ్, ఎడింబరో యూనివర్సిటీల్లో విమెన్ లీడర్ షిప్ మాస్టర్ డిగ్రీ చేశాను. ఒక బిజినెస్ చానల్లోఎకనమిక్ న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నాను. నా టాలెంట్ విషయాలకు వస్తే నేను జపనీస్ కాలిగ్రాఫర్ని. అందులో నాకు మంచి పేరుంది. ఎలక్ట్రిక్ ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఈ పోటీల్లో టాలెంట్ రౌండ్లో ఎలక్ట్రిక్ ఫ్లూట్నే పెర్ఫార్మ్ చేయబోతున్నాను. ప్రకృతి గౌరవిస్తూ వైపరీత్యాలు రాకుండా జాగ్రత్తపడటం, ఒకవేళ ప్రకృతివైపరీత్యాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. నా అందంతో ఈ ప్రయోజనాన్ని సాధించాలనుకుంటున్నా! ప్రకృతి వైపరీత్యాల పట్ల పిల్లలకు అవేర్నెస్ కల్పించడం! స్త్రీ, పురుష వివక్ష విషయానికి వస్తే.. దానికి జపాన్ కూడా అతీతమేమీ కాదు. చదువుకు సంబంధించి అమ్మాయి, అబ్బాయిలకు సమాన అవకాశాలున్నప్పటికీ.. లీడర్షిప్ విషయంలో మాత్రం పురుషులదే ఆధిపత్యం. ఆ అంతరం చాలా ఎక్కువ. వేతనాల్లో కూడా ఆ గ్యాప్ కనపడుతుంది. సమానమైన పనికి మహిళలకన్నా పురుషులకే వేతనాలు ఎక్కువ. డిసిప్లిన్, పని విషయాల్లో ప్రపంచంలోని ప్రతిదేశం జపాన్ వైపు చూస్తుందేమో కానీ.. టెక్నికల్ జాబ్స్ విషయంలో మాత్రం మేము ఇండియాను అప్రిషియేట్ చేస్తాం. కొత్తగా వచ్చిన ఏ టెక్నికల్ చేంజ్‌ను అయినా ఇట్టే గ్రహించి, అడాప్ట్ చేసుకుని రాణిస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న క్రైమ్ గురించి వార్తల్లో విన్నప్పుడు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కానీ ఈ పోటీల కోసం ఇక్కడ ల్యాండ్ అయ్యి, ఇక్కడి మనుషులు, వాళ్లిచ్చే మర్యాద అవన్నీ చూశాక ఆ నెర్వస్నెస్, భయాలు అన్నీ పటాపంచలయ్యాయి. ఇక్కడికి రావడానికి నాకు దుబాయ్‌లో కనెక్టింగ్ ఫ్లయిట్ ఉండింది. అక్కడ బోర్డింగ్‌లో నా లగేజ్‌తో అవస్థపడుతుంటే ఒక ఇండియన్ జెంటిల్మన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడే నాకు ఇండియా మీద గౌరవం రెట్టింపయింది. ఈ దేశానికి సంబంధించి నాకు ఇష్టమైన మరోవిషయం.. ఎర్రటి బొట్టు. ఈ పాజెంట్‌లో ఒకరోజు నేను చీర కట్టుకుని, ఎర్రటి బిందీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇండియాకు, జపాన్‌కున్న మరో సామ్యం.. బౌద్ధం. మేము ఫాలో అవుతున్న బౌద్ధానికి, ఇక్కడికి వ్యత్యాసమున్నప్పటికీ బౌద్ధం ఈ దేశంతో మాకో కనెక్టివిటీని పెంచింది. ఇక్కడి ఆధ్యాత్మికతకు నేను ఫిదా అయ్యాను. బ్యూటీ పాజెంట్ విషయానికి వస్తే చాలా దేశాల్లో ఉన్నట్టే జపాన్‌లోనూ.. అందాల పోటీలు అంటే స్కిన్ షో తప్ప మరోటి కాదనే అభిప్రాయం, అపోహా ఉన్నాయి. కానీ బ్యూటీ విత్ పర్పస్ అనే ఐడియా నాకు నచ్చి.. పోటీల్లో పాల్గొంటున్నాను. సిస్టర్హుడ్ క్రియేట్ చేయడానికి ఇదొక వేదిక. సన్నగా ఉన్నామా.. లావుగా ఉన్నామా.. తెల్లగా ఉన్నామా.. నల్లగా ఉన్నామా అని కాదు.. అదసలు విషయమే కాదు. డజంట్ మ్యాటర్. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నదే మ్యాటర్. అందుకే నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం! జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాలనుంది..నాటు నాటు పాట జపాన్‌లో చాలా ఫేమస్. ఆ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించడానికి నేను సిద్ధం. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్‌కి వీర ఫ్యాన్‌ని. ఇండియాది రిచ్ కల్చర్. ఇక్కడి రైతా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. – కియానా తుమీత– సరస్వతి రమ -
బుద్ధవనంలో సౌందర్య ధ్యానం..
నాగార్జునసాగర్: ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు సోమవారం నాగార్జునసాగర్‌లో సందడి చేశారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సోమవారం నిర్వహించిన బుద్ధ పూర్ణిమ వేడుకలకు మిస్ వరల్డ్ ఓసియానా గ్రూప్–4లోని 22 దేశాల సుందరీమణులు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్నారు. వారికి పర్యాటక శాఖ, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. విజయవిహార్ వెనుకభాగంలోని పార్కులో ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీపర్వతారామంలోని బుద్ధవనానికి చేరుకున్నారు. ముందుగా బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించి పూజలు చేశారు. మహాస్తూపం వద్ద వీరికి తెలంగాణ గిరిజన మహిళలు నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. 6.42 గంటలకు వారికి శిల్పాలను చూపిస్తూ ఆర్కియాలజిస్టు శివనాగిరెడ్డి బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు, తెలంగాణకు బౌద్ధమతంతో గల సంబంధం తదితర అంశాలను వివరించారు. మహాస్తూపంలోని పంచ ధ్యానబుద్ధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే కొద్దిసేపు ధ్యానం చేశారు. రాత్రి 7.08 గంటలకు బుద్ధ జయంతి కార్యక్రమాలలో భాగంగా బౌద్ధ భిక్షవులు నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం జాతకవనంలో కళాకారులు బుద్ధుడి చరిత్రను తెలియజేసే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డిన్నర్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంసీ.కోటిరెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఐఏఎస్ అధికారి లక్ష్మి, మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎస్పీలు రమేశ్, మౌనిక, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
Miss World 2025: నాగార్జున సాగర్ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)
-
నాగార్జున సాగర్‌లో మిస్ వరల్డ్ భామల సందడి
సాక్షి, నల్గొండ: ఇరవై రెండు దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో సందడి చేశారు. వారికి జానపద, గిరిజన నృత్య కళాకారులతో సుందరీమణులకు స్వాగతం పలికారు. బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని అందగత్తెలు సందర్శించారు. బుద్ధ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. నాగార్జున సాగర్ వాటర్ బ్యాక్ గ్రౌండ్లో స్పెషల్ ఫోటో షూట్లో కూడా పాల్గొననున్నారు. నాగార్జున సాగర్‌లో సుమారు నాలుగు గంటల పాటు పర్యటించనున్నారు. విందు అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.కాగా, రేపు(మంగళవారం) సాయంత్రం పోటీదారులు చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్ చేస్తారు. చార్మినార్ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్‌లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్ కీ ఘోష్, పనీర్ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్ జామూన్ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు.ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్ స్టార్ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్‌కు ఆర్డర్ ఇచ్చారు.ఆసియా వంటకాలలో సుషీ (జపాన్), డిమ్సమ్ (చైనా), థాయ్ గ్రీన్ కర్రీ (థాయ్‌లాండ్) వంటివి, యూరోపియన్ వంటకాలైన ఇటాలియన్ పాస్తా, ఫ్రెంచ్ రాటటౌలీ, స్పానిష్ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్ టాకోస్, బ్రెజిలియన్ ఫెయిజోడా, అమెరికన్ బార్బెక్యూ రిబ్స్ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ డోరో వాట్, మొరాకన్ టాగిన్, హమ్ముస్‌తో పాటు మెడిటరేనియన్ ఫలాఫెల్, క్వినోవా సలాడ్ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్ వరల్డ్ లిమిటెడ్ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్‌లో జరిగే గలా డిన్నర్ సందర్భంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. -
Miss World 2025: హెరిటేజ్ వాక్కు సర్వం సిద్ధం..
చార్మినార్: పాతబస్తీలో మిస్ వరల్డ్ సుందరాంగులు సందడి చేయనున్నారు. నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్–2025లో పాల్గొంటున్న పోటీదారులతో ఈ నెల 13న చారి్మనార్‌లో హెరిటేజ్ వాక్ జరగనుంది. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్‌లో పాల్గోనున్నారు. చారి్మనార్ నుంచి లాడ్ బజార్ వరకూ నిర్వహించే వాక్‌లో కంటెస్టెంట్స్ ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోనున్నారు. పాతబస్తీ చారిత్రక కట్టడాల విశేషాలతో పాటు లాడ్ బజార్‌లోని గాజుల తయారీ కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. హెరిటేజ్ వాక్ సందర్భంగా పాతబస్తీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే చారి్మనార్ కట్టడాన్ని మువ్వన్నెల జెండా రంగుల్లో విద్యుత్ దీపాలంకరణ చేశారు. పర్యాటకులు చారి్మనార్ వద్ద సెల్పీలు దిగుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, డివైడర్లకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అఫ్జల్‌గంజ్ ద్వారా పాతబస్తీకి ప్రవేశించే నయాపూల్ బ్రిడ్జిపై కొత్తగా మొక్కలతో అలంకరించారు. రిహార్సల్స్ పూర్తి.. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో దక్షిణ మండలం డీసీపీ స్నేహా మెహ్రా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకూ హెరిటేజ్ వాక్ రిహార్సల్స్ జరిగాయి. పోలీసు, పర్యాటక, విద్యుత్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఆర్కియాలజీ, జలమండలి.. ఇలా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. తెలంగాణ జరూర్ ఆనా..అనే టైటిల్‌తో రూపొందించిన ఏసీ బస్సులో మిస్ వరల్డ్–2025 అభ్యర్థులను తరలించనున్నారు. శివారు ప్రాంతమైన ఆరంఘర్ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ద్వారా పాతబస్తీకి ప్రవేశించి బహదూర్‌పురా, పురానాపూల్, పేట్లబురుజు, మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ ద్వారా చారి్మనార్‌కు చేరుకోనుంది. -
మిస్ వరల్డ్ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)
-
జుగల్బందీ సూపర్ హిట్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల ప్రారంభోత్సవంలో ఈసారి మిస్ వరల్డ్ లిమిటెడ్ చేసిన కొత్త ప్రయోగం బాగా ఆకట్టుకుంది. వాస్తవానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ ఈ ప్రతిపాదన చేసింది. దీనిపై తొలుత కాస్త విముఖత ప్రదర్శించిన మిస్ వరల్డ్ సంస్థ తర్వాత ఆమోదించింది. చివరకది మిస్ వరల్డ్ బృందాన్నే బాగా ఆకట్టుకోవడంతో పాటు అనూహ్య స్పందన లభించింది. ఏ నగరంలో జరిగినా.. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో స్థానిక సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటం సహజం.ఇదే తరహాలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రారంభోత్సవంలో 250 మంది కళాకారులతో తెలంగాణ సంప్రదాయ పేరిణి నృత్య విన్యాసాన్ని ప్రదర్శించారు. ఇంతవరకు ఎప్పుడూ జరిగే తంతే. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత, మిస్ వరల్డ్ పోటీదారులను వేదిక మీదకు ఆహ్వానించి పరిచయం చేస్తారు. కానీ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పరిచయ భాగాన్ని ఒకింత కొత్తగా డిజైన్ చేశారు. పోటీదారులను ఖండాల వారీగా నాలుగు బృందాలుగా విభజించి, ఒక్కో బృందం పరిచయానికి పైలట్ తరహాలో ఒక్కో సంప్రదాయ నృత్యరీతిని ప్రదర్శించేలా రూపకల్పన చేశారు. గుస్సాడీ, ఒగ్గు డోలు, లంబాడీ, కొమ్ము కోయ నృత్య కళాకారులను నాలుగు బృందాలుగా చేసి, ఒక్కో ఖండం పోటీదారులను కళాకారులు తమ విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ఆహ్వానించే తరహాలో రూపొందించారు. దీనికి పాశ్చాత్య సంగీతాన్ని కూడా జోడించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ వీక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందాల పోటీకి తగ్గట్టుగా ప్రత్యేకంగా పేరిణి గీతం 250 మంది కళాకారులతో సంప్రదాయ పేరిణి నృత్యం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు వినియోగించిన గీతాన్ని అందాల పోటీలను దృష్టిలో ఉంచుకుని రాయించటం విశేషం. ‘అతివల హంస నడకలతో అందమే సాగెనే..లలిత శృతుల గతుల లయల హొయల..అరవిరిసిన కన్నులకు అభినయాల వందనం.. అతి కోమల అధరాలకు అతి సుందర వందనం.. మనసెరిగిన మగువలకు మయూరాల వందనం..’అంటూ సాగిన గీతానికి తగ్గట్టుగా కళాకారులు నర్తించి ఆకట్టుకున్నారు. ఈ విధంగా సంప్రదాయ నృత్యాలతో పోటీదారులను స్వాగతించి పరిచయం చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామని, పేరిణి సందీప్, ఫణి నారాయణ, శ్రీరాంభట్ల ఆదిత్య శర్మలు శ్లోకంతో కూడిన గీతాలను రచించారని సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. -
యువతకు మెంటల్ హెల్తే ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: ‘ఈ తరం యువతపైన అత్యంత సున్నితమైన సామాజిక బాధ్యతలున్నాయి. వీటిని నెరవేర్చడానికి వారిలో మానసిక పరిపక్వత కీలక అంశం’అని మిస్ బంగ్లాదేశ్ అక్లిమా అతికాకొనికా(Aklima Atika Konika) అన్నారు. ప్రస్తుతమున్న పలు సామాజిక సమస్యలకు పరిష్కారాలన్నీ యూత్ మెంటల్హెల్త్ పైనే ఆధారపడి ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మిస్‌వర్డల్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అతికా ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే..ఏ సహజత్వమే సౌందర్యం కొన్ని సంవత్సరాల క్రితం వరకూ నాకు ఫ్యాషన్ అంటేనే సరిగ్గా తెలియదు. కంఫర్ట్‌గా అనిపించే దుస్తులు వేసుకోవడం, ఎవరైనా పలకరించినా స్పందించలేని మొహమాటం ఉండేది. ఎలాంటి ఫ్యాషన్ సెన్స్ లేదు. అలాంటిది అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి వచ్చి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా దృష్టిలో బ్యూటీ అంటే సహజత్వం. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే వారి సౌందర్యానికి మెరుగులద్దుతుంది. అత్యంత సహజత్వమే సౌందర్యంగా కనిపిస్తుందని నేను నమ్ముతా.ఏ భారత్‌లో సాంస్కృతిక వైవిధ్యం భారత్ ఒక అద్భుత సాంస్కృతిక సమ్మేళనం. ఢిల్లీ వెళితే ఒకలా, చెన్నై, లడక్ వెళితే మరోలా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంస్కృతిక వైవిధ్యం. భారత్ మొత్తం తిరిగితే చాలు ప్రపంచం తిరిగినట్టే. కోల్‌కతా (బెంగాల్) వెళితే మా దేశ మూలాలు ఆత్మీయంగా పలకరిస్తాయి. హైదరాబాద్ (Hyderabad) అయితే మినీ ఇండియా. దేశంలోని ప్రత్యేకతలన్నీ ఇక్కడే ఆతిథ్యమిస్తాయి. నాకు మరో ఇల్లులా అనిపిస్తుంది హైదరాబాద్. తెలంగాణ ప్రజల ఆతీ్మయత నా మనసు దోచుకుంది. నేను మంచి భోజన ప్రియురాలిని. నాకు నచి్చనట్టు ఇక్కడ స్పైసీ ఫుడ్ లభిస్తుంది. ఇక్కడి వారసత్వ వంటకాలు చాలా బాగున్నాయి. ఏ యంగ్ మైండ్ మ్యాటర్స్ మానసిక ఆరోగ్యం.. మానసిక పరిపక్వత ఈ తరం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఇందులో భాగంగానే యువత మెంటల్ హెల్త్‌పై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ‘యంగ్ మైండ్ మ్యాటర్స్’ అనే ప్రాజెక్ట్ చేపట్టా. భారత్‌లో పరిస్థితులు చెప్పలేను కానీ.. ఆసియా దేశాల్లో యువత మానసిక అస్థిరత, మెంటల్ హెల్త్ గురించి ఎవరూ అంతగా ప్రస్తావించట్లేదు. దీనితో ముడిపడి ఎన్నో సామాజిక సమస్యలున్నాయి. తమపైన తమకు విశ్వాసం ఉన్నప్పుడే మిగతా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. నేను ప్రపంచ సుందరి విజేతగా నిలిస్తే.. నా గుర్తింపు, ప్రశస్తిని అంతర్జాతీయంగా యూత్ మెంటల్ హెల్త్‌పై అవగాహన కల్పించడానికి, దానితో ముడిపడి ఉన్న అంశాల కార్యాచరణకు వినియోగిస్తాను. ఏ అపురూప స్నేహం భారత్–బంగ్లా మా దేశ యువతలో నైపుణ్యాలకు కొదువ లేదు. ఎన్నో విషయాలను బయటికొచ్చి నేర్చుకుంటున్నాం. గతేడాది మా దేశ యువత చేపట్టిన స్టూడెంట్ రెవల్యూషన్ నాకు స్ఫూర్తి. ఒక బంగ్లా అమ్మాయిగా మా యువత తరఫున ప్రపంచానికి మా ప్రశస్తిని చూపించే బాధ్యత నాపై ఉంది. ఆ ఆశయంతోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నాను. వినయం లేకుండా విజయం ఉండదని గట్టిగా నమ్ముతాను. భారత్–బంగ్లాదేశ్లది స్నేహపూర్వక సంబంధం. రాజకీయంగా, ఆర్థిక పరమైన అంశాల్లో అనుబంధంతో ముందుకు సాగుతున్నాం. ఇక్కడి ప్రజల ప్రేమ నాకెప్పుడూ గుర్తుండిపోతుంది. ఏ ఎన్నో దాటుకొని వచ్చాను నేనూ ఒక మనిషినే. అందరిలానే విభిన్న అనుభవాలు, బాధాకరమైన సందర్భాలను దాటుకొని వచ్చాను. నన్ను నేను సముదాయించుకోవడానికి, ఒత్తిడి పోగొట్టుకోవడానికి ధ్యానం చేస్తాను. ప్రకృతి ప్రేమికురాలిని. ప్రకృతికి మన మానసిక అనిశి్చతి, అస్థిరత్వాన్ని తొలగించే శక్తి ఉంది. నాకు ఏ మాత్రం బాగాలేకున్నా ప్రకృతిలోకి వెళతాను. నాకు నేను సమయం ఇచ్చుకుంటా. సాధారణంగా మాట్లాడటమే నాకున్న పెద్ద చాలెంజ్. అలాంటిది ఇప్పుడు మిస్‌వరల్డ్ వేదికపైన మాట్లాడగలుగుతున్నానంటే అది నా పరిణామ క్రమమే. మహిళలు బయటికెళ్లి ఉద్యోగం, వ్యాపారం ఇంకేదైనా చేయడమే సాధికారత అని అనుకోను. ఒక మహిళ తనకు నచి్చన రంగంలో తన అభిరుచులకు అనుగుణంగా రాణించడమే సాధికారత అని నమ్ముతాను. -
మహాద్భుతం.. బుద్ధవనం
రెండు వేల సంవత్సరాల క్రితం ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయం, ఇక్కడ విలసిల్లిన బౌద్ధమత ప్రాచుర్యం ఆధారంగా కృష్ణా తీరంలో (నాగార్జునసాగర్ తీరంలో) బుద్ధిస్టు హెరిటేజ్ థీం పార్కును బుద్ధవనం (Buddhavanam) ప్రాజెక్టుగా మహాద్భుతంగా తీర్చిదిద్దారు. అభినవ బుద్ధుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల ఇది. ఆ చరిత్ర ఆధారంగానే సాగర్ తీరంలో 274 ఎకరాల్లో బుద్ధవనం (శ్రీపర్వతారామం), 30 ఎకరాల్లో విపశ్యన కేంద్రం నిర్మించారు. అష్టాంగ విభాగాలుగా దీని నిర్మాణం చేశారు. ఆసియా ఖండంలోనే సిమెంట్‌తో నిర్మించిన అతిపెద్ద మహాసూ్థపం బుద్ధవనం.ఈ నెల 12వ తేదీన బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలు దేరి వెల్లంకిలో కొంతసేపు సేద దీరి, నాగార్జునసాగర్‌కు చేరుకుంటారు. విజయవిహార్ అతిథిగృహంలో వారికి స్వాగత ఏర్పాట్లు చేశారు. విజయవిహార్ ముందు ఏర్పాటు చేసిన ఫొటో సెషన్లో పాల్గొంటారు. అనంతరం విజయవిహార్ వెనుకభాగంలో, సాగర్ తీరాన పచ్చిక బయళ్లలో వారు ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. ఆ తరువాత బుద్ధవనం చేరుకుంటారు. బుద్ధుని పాదుకల వద్ద 25 మంది బౌద్ధ సన్యాసులు నిర్వహించే బౌలికుప్ప మహాబోధి పూజల్లో పాల్గొంటారు. అక్కడినుంచి మహాసూ్థపం వద్దకు చేరుకొని, వెనుక భాగాన ఉన్న మెట్ల ద్వారా పైకి ఎక్కుతారు. దానికి వంద అడుగుల దూరంలో ఏర్పాటు చేసిన గిరిజన సంప్రదాయ నృత్యాన్ని తిలకిస్తారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలో అష్టబుద్ధుల వద్దకు చేరుకొని అక్కడ కొవ్వొత్తులు వెలిగించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా బౌద్ధమత గురువు నిర్వహించే 5 నిమిషాల ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం రెండు నిమిషాల పాటు «ధ్యానం చేస్తారు. అక్కడి నుంచి మహాస్థూపం చూట్టూ ఉన్న 2,500 విగ్రహాల గురించి పర్యాటక శాఖ ప్రతినిధి శివనాగిరెడ్డి వివరిస్తారు. అనంతరం జాతకవనంలోకి వెళతారు. అక్కడ వారికి బుద్ధవనం, తెలంగాణలో బౌద్ధ చరిత్ర ప్రాధాన్యత గురించి పర్యాటక శాఖ ప్రతినిధి వివరిస్తారు. బుద్ధుని పుట్టుక నుంచి నిర్యాణం వరకు ప్రత్యేక డ్రామాను ప్రదర్శిస్తారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండబుద్ధుని జీవిత విశేషాలు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2003లో దీనిని ప్రారంభించింది. సిద్ధార్థ గౌతముని జీవితంలోని ప్రధాన ఘట్టాలను వర్ణించే అనేక నేపథ్య విభాగాలతో కూడినదే బుద్ధవనం. ఆయన పూర్వ జన్మ కథలను చిత్రీకరించిన జాతక పార్క్, సూక్ష్మ స్థూపాలతో కూడిన స్థూపపార్క్, మహాసూ్థపం, బౌద్ధ హెరిటేజ్ మ్యూజియం, మహాసూ్థపం గ్రౌండ్ ఫ్లోర్లో ఆచార్య నాగార్జున విగ్రహం, 27 అడుగుల బుద్ధ విగ్రహం ఇందులో ఏర్పాటు చేశారు. ధమ్మ గంటను శ్రీలంక ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. దేశంలోనే ఇది మొదటిది.ప్రవేశ వేదిక ప్రవేశ వేదిక అష్టమంగళ (ఎనిమిది శుభ) చిహ్నలు, ఐకానిక్ రూపంలో బుద్ధుడు, జంతువులు, పక్షులు, బోధి వృక్షం, మిథునాలు (రసిక జంటలు), బుద్ధపాదాలు వంటివి ఇక్కడ ఉంటాయి. ప్రధాన ఇతివత్తాలు, సిద్ధార్థుని కిరీటం (జుట్టు) మోస్తున్న అగ్ని స్తంభం, నాగముచిలింద, పవిత్ర అవశేషాల ఆరాధన, మధ్యలో అశోక ధర్మ చక్రం స్తంభంతో శక్తివంతమైన విల్లును మోస్తున్న సిద్ధార్థుడు వంటి శిల్పాలు ఉంటాయి. బుద్ధ చరిత్రవనం సిద్ధార్థ గౌతమ జీవితంలో ఐదు ప్రధాన సంఘటనలు ఉన్నాయి. అవి జననం, నాలుగు సమావేశాలు, మహా నిష్క్రమణ, జ్ఞానోదయం. బుద్ధుని మొదటి ఉపన్యాసం, మహాపరినిర్వాణం వంటి అంశాలపై చిత్రాలను కాంస్యంతో చేశారు. పల్నాడు సున్నపు రాయిలో చెక్కబడిన బుద్ధపాద స్లాబ్ అష్టమంగళ (ఎనిమిది శుభ) చిహ్నాలు ఉద్యానవన ప్రవేశ ద్వారం వద్ద ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. జాతక వనం (బోధిసత్వ పార్క్) బోధిసత్వుడు బుద్ధుడిగా మారటానికి ముందు పది పరిపూర్ణతలను ఆచరిస్తూ జీవితాన్ని గడుపుతాడు. వాటినే దశపారమిత అంటారు. అవి దాన (ఉదారత), శీల (ధర్మం), శాంతి (సహనం), వీర్య (ధైర్యం), ధ్యాన (ఏకాగ్రత), ప్రజ్ఞ (జ్ఞానం), త్యాగ (త్యజించడం), సత్య (సత్యం), కరుణ (ప్రేమపూర్వక దయ), సమత (సమానత్వం). 547 జాతక కథలలో 40 జాతక కథలు అమరావతి, ఫణిగిరి, నాగర్జునకొండ, గోలి, జగ్గయ్యపేట, చందవరం బౌద్ధ క్షేత్రాలలోని అసలు శిల్పకళా ఫలకాల ఆధారంగా పల్నాడు లైమ్ స్టోన్లో చిత్రీకరించారు. ధ్యానవనం (మెడిటేషన్ పార్క్) 27 అడుగుల అవుకాన బుద్ధను ధ్యానవనంలో ఏర్పా టు చేశారు. దీనిని శ్రీలంక ప్రభుత్వం అందజేసింది. స్తూపవనం (మినియేచర్ స్తూప పార్క్) కర్లా, అజంతా (మహారాష్ట్ర), సాంచి (మధ్యప్రదేశ్), సారనాథ్ (ఉత్తరప్రదేశ్), మంకియాలా, (పంజాబ్– పాకిస్తాన్), అనురాధపుర, శ్రీలంక, కహు–జో–దారో, మిర్పూర్ ఖాస్, పాకిస్తాన్, బౌధానాత్, మహాత్రాస్తాన్, నేపాల్‌లోని స్థూపాల ప్రతిరూపాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. థాయ్‌లాండ్, పార్డో కాలింగ్ చోర్టెన్ టిబెట్, శ్వేసాండావ్– మయన్మార్, గ్యాంగ్జు, దక్షిణ కొరియా, భారతదేశం, ఆగ్నేయాసియాలోని బౌద్ధ స్థూప నిర్మాణాల రూపాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. మహాస్తూపం బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణ మహాస్తూపం. అమరావతిలోని అసలు స్థూపం కొలతలు, వాస్తుశిల్పం ప్రకారం దీనిని నిర్మించారు. దాని పైభాగంలో వేదిక (డ్రమ్), గోపురం (అండ), హారి్మక ఉన్నాయి. 42 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల ఎత్తుతో దాని డ్రమ్, గోపురం భాగాలపై బౌద్ధ ఇతివృత్తాల శిల్ప ఫలకాలతో ఏర్పాటు చేశారు. మహాస్తూపం చుట్టూ గోడపై బుద్ధుని జీవితంలోని ముఖ్యమైన రాజులు, ధర్మ పోషకుల దశ్యాలు ఉంటాయి. గోపుర భాగంపై వజ్రాసన, బోధి వక్షం, అగ్ని స్తంభం, జాతక కథలు, బుద్ధుని జీవితంలోని సంఘటనలు వంటి బౌద్ధ చిహ్నలను వర్ణించే శిల్పాలు చెక్కారు. స్థూపం గ్రౌండ్ ఫ్లోర్లో ఆచార్య నాగార్జున విగ్రహం ఉంటుంది. మహాస్థూపం లోపల వర్చువల్ ఆకాశ దృశ్యం మహాసూ్థపం లోపల 25 అడుగుల ఎత్తులో పంచధ్యాన బుద్ధులను ఏర్పాటు చేశారు. మహాస్తూపం పైకప్పు ఆకాశాన్ని తలిపిస్తూ తామరపువ్వు రేకుల ఆకారంలో ఉంటుంది. పైకప్పు లోపలి భాగం చిల్లులు గల ట్రాపెజోయిడల్ ప్యానెల్లతో ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కటి మరొకదానికి భిన్నంగా 2.5 మీటర్ల పరిమాణంలో, కాంతి థర్మోడైనమిక్స్, ప్రత్యేక ప్రకాశాన్ని జోడించేలా ఉంటాయి. ఇందులో లోటస్ రేకులు (960), స్కై ప్యానెల్లు (528) ఉంటాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఉపయోగించిన జర్మన్ టెక్నాలజీతో వీటిని ఏర్పాటు చేశారు. బుద్ధవనానికి అవార్డులు విశిష్ట ఆకర్షణలతో కూడిన ఈ ప్రాజెక్టుకు అనేక అవార్డులు లభించాయి. పర్యాటకులకు ఉత్తమ పౌర సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను అందించినందుకు తెలంగాణ పర్యాటక శాఖ 2022లో అవార్డును అందజేసింది. దీనిపై నిర్మించిన డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం అవార్డును అందుకుంది. 2022లో కోల్‌కతాలో బౌద్ధ టూర్ ఆపరేటర్ల సంఘం ‘భూటాన్ బంగ్లాదేశ్ ఇండియా అండ్ నేపాల్ టూరిజం మిత్ర అవార్డు’ను కూడా అందుకుంది. బౌద్ధ వారసత్వ ప్రాంగణం బుద్ధవనం తెలంగాణలో బౌద్ధమతం ఆగమనం బుద్ధుని జీవితకాలం నాటిది. సుత్తనిపాత పారాయణవగ్గ ప్రకారం ‘కవిట్టవనమిష్టి గోదావరి రివేరిన్’అనే బ్రాహ్మణ ఋషి బుద్ధుని బోధనలను వినడానికి తన 16 మంది శిష్యులను మగధకు పంపాడు. బుద్ధుని అనుచరులుగా మారిన పింగియా.. బుద్ధుని బోధనలను తీసుకువచ్చారు. అప్పటినుంచి నుంచి తెలంగాణలో థేరవాద, మహాయాన, వజ్రయాన బౌద్ధ శాఖలు విస్తరించాయి. అస్సీఘాట్, కోటిలింగాల, కంబాలపల్లి, పాశిగావ్, ధూళికట్ట, ఫణిగిరి, తిరుమలగిరి, వర్ధమానుకోట, గాజులబండ, నేలకొండపల్లి, శ్రీపర్వతం ప్రాంతాల్లో (నాగార్జునసాగర్ ప్రాంతం) బౌద్ధమతం మూడు దశల్లో పరిఢవిల్లింది. -
నేడు సాగర్.. రేపు చార్మినార్..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా తలపెట్టిన కార్యక్రమాలను ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం, పోటీదారుల భద్రత నేపథ్యంలో కొన్ని కార్యక్రమాల నిర్వహణపై నిర్వాహకులు తొలుత సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, అనంతరం పాత నగరంలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు కార్యక్రమాలు రద్దు చేసే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇప్పుడు వాటిని యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దులో ఉద్రిక్తతలు కొంత తగ్గిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించనున్నారు. స్వాగత విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక సోమవారం సాయంత్రం పోటీదారులు, విదేశీ ప్రతినిధులు నాగార్జున సాగర్ (Nagarjunasagar) సమీపంలోని బుద్ధవనం పర్యటనకు వెళ్లనున్నారు. బుద్ధ జయంతి సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అక్కడే రాత్రి విందు అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరతారు. చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకు నడక మంగళవారం సాయంత్రం పోటీదారులు చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్ చేస్తారు. చార్మినార్ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్‌లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో ఇంటర్ కాంటినెంటల్, తెలంగాణ వంటకాలు విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ (Hyderabad) ధమ్ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్ కీ ఘోష్, పనీర్ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్ జామూన్ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్ స్టార్ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్‌కు ఆర్డర్ ఇచ్చారు. ఆసియా వంటకాలలో సుషీ (జపాన్), డిమ్సమ్ (చైనా), థాయ్ గ్రీన్ కర్రీ (థాయ్‌లాండ్) వంటివి, యూరోపియన్ వంటకాలైన ఇటాలియన్ పాస్తా, ఫ్రెంచ్ రాటటౌలీ, స్పానిష్ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్ టాకోస్, బ్రెజిలియన్ ఫెయిజోడా, అమెరికన్ బార్బెక్యూ రిబ్స్ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ డోరో వాట్, మొరాకన్ టాగిన్, హమ్ముస్‌తో పాటు మెడిటరేనియన్ ఫలాఫెల్, క్వినోవా సలాడ్ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్ వరల్డ్ లిమిటెడ్ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్‌లో జరిగే గలా డిన్నర్ సందర్భంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. -
కొన్ని చేమంతులమ్మా!
‘వాన కురిసినప్పుడే గదెయ్ నువు జడేసేది’ అంటుంది నామిని సుబ్రహ్మణ్యం నాయుడు కథల్లో ఒక పాత్ర మరో పాత్రతో. వాన కురిసినప్పుడు జడ వేయడం ఏమిటి? అనంటే అసలు ఆ పాత్రకు జడేసుకునే టైమే ఉండదన్నమాట. నూనె రాసుకోవడం ఇంకా పెద్దమాట. తైల సంస్కారం లేక కేశ పోషణ పట్టించుకోక చిక్కిరి బిక్కిరి జుట్టుతో బతకడమే పెద్దపనిగా ఉన్న ఆ పాత్ర మీద దయతో వాన కురిస్తే, జుట్టును పూర్తిగా తడిపితే, అప్పుడామె ఇదే అదననుకొని ఆ తడి మీద దువ్వెనతో జడను సవరించుకుంటుంది. బహుశా అప్పుడామె అద్దంలో చూసుకోవచ్చు. ఆ పెదాలకు నవ్వుంటుందని గుర్తు చేసుకోవచ్చు.చిన్నారి పిల్ల దుర్గ తనకు తానే గొప్ప బంగారు బొమ్మే! ఆ పిల్ల ఒంటి మీద ఏముందని? పట్టు వస్త్రాలా? బంగారు ఆభరణాలా? బొట్టు బిళ్లలా? జడ కుప్పెలా? ముతక వస్త్రాన్ని చుట్టుకుని బుజ్జి తమ్ముణ్ణి వెంటేసుకుని తుంగ పొదల మైదానాల్లో వనకన్యలా తిరుగుతూ ఉంటుంది. కాస్త అలంకరించుకుందామని అనుకుందేమో... పక్కింటిలో పూసలదండ దొంగిలిస్తుంది. ఆ చిన్నాచితక దండకు పెద్ద రాద్ధాంతం. చివరకు దుర్గ ఆ దండ వేసుకోనే వేసుకోదు. వానలో తడిసి జబ్బు చేసి చనిపోతుంది. ఆమెను దాచి పెట్టిన నేల మీద అందమైన గడ్డిపూలు పూసే ఉంటాయి– ‘పథేర్ పాంచాలి’ నవలలో!యానాదుల ఆడపిల్లలు మన ఆడపిల్లలకు సమానమా? యానాదులు అనేవారు మన లెక్కన మనుషులేనా? నువ్వేమనుకుంటే వాళ్లకేంటోయ్! వాళ్లకూ ఉంటాయి కలలూ కనుకొలకలూ. మూడేళ్ల చిట్టి కుమార్తెను చూసుకుని ఆ యానాది తల్లికి ఎంత మురిపెమో. చింకి పాతల్లో ఉంటేనేం... బంగారు భరిణె. వైడూర్యాల రాశి. ఒకరోజు తంగేడుపూలు తెచ్చి కూతురి చెవులకు జూకాలుగా చేస్తుంది. మరోరోజు పచ్చగన్నేరుపూల మాల వేస్తుంది. ఓయమ్మా... ఎంత బాగుందో నా బంగారు కూతురు. వీటికే ఇంత బాగుంటే బంగారు నగ వేస్తే ఇంకెంత బాగుంటుందో! పక్కనే షావుకారు ఇల్లు. అక్కడే మెడలో కంటెతో ఆడుకుంటున్న షావుకారు కూతురు. ఆ పిల్ల మెడలోని కంటె తీసి తన కూతురి మెడలో వేసి ఒక నిమిషం చూసుకుంటుంది. పాపం... యానాది తల్లి. కూతురితో సహా జైల్లో పడుతుంది. దొంగతనం చేసినందుకని జనం అనుకున్నారు. కూతురికి ముస్తాబు చేసినందుకు అని యానాది అనుకుంది. చింతాదీక్షితులు– ‘అభిప్రాయభేదం’ కథలో.ఉన్నవి పన్నెండు రూపాయలు. చీరేమో ఇరవై రెండు రూపాయలకు తక్కువ రావడం లేదు. ‘కొంచెం... కొంచెమైనా తగ్గదంటారా’.... ‘ఇదేం శుక్రవారం సంత కాదు బేరాలాడ్డానికి’.... ఆ అవమానానికి తండ్రి లోలోపల నెత్తురు కక్కాడు. కూతురు భూమిని చీల్చుకు కూరుకుపోవాలనుకుంది. ఏమడిగిందని... జరీ అంచు తెల్లచీర. ఆరో ఏట నుంచి ఆశ పడుతుంటే పదహారో ఏటకు తండ్రి ఎల్లాగో పన్నెండు రూపాయలు సంపాదించి షాపుకు తీసుకెళితే మెడకు బిగ వేసుకునే రేటు. ‘ఇంతుంటుందని తెలియదమ్మా’... ‘పర్లేదు పోదాం పద నాన్నా’.... ఇప్పుడు కాకపోతే మరోసారి... ఇరవై రెండు రూపాయలు సంపాదించి వెళ్లి కొనుక్కోవాలి... పిచ్చిదానా... అప్పటికా చీర అరవై ఆరు రూపాయలు ఉంటుందే! రావిశాస్త్రి కథ కదూ ఇది.ఎవరి ముస్తాబులు వారికి ఉంటాయి. అందుకు పాకులాడటమూ ఉంటుంది. చక్కదనం ప్రతిజీవి ప్రాథమిక లక్షణం. చక్కదిద్దుకోవాలనుకోవడం స్వాభావికం. అయితే మనిషికి తప్ప ఇతర జాతుల అంతర్ కొలతల్లో అందమూ, అంద వికారమూ ఉండదు. చిలుకల అందం చిలుకలది. కోయిలల అందం కోయిలలది. అలాగే సిరిగల వారి అందం సిరిగల వారిదైతే సాదాసీదా గడపల్లోని ముగ్గుల, మందారాల అందం వాటిదీనూ! ఏ సింగారమూ లేకపోయినా పెరట్లో కాసిన్ని చేమంతులు పూయకపోవు. ముడిచి మెరవగలరు తళుక్కున.వారేనా? ఎర్ర ఇటుకలు తల మీద ఉన్నప్పుడు, నల్ల నీటికడవ నడుమున మోస్తున్నప్పుడు, కాలే ఇనుముపై సమ్మెట పోటు వేసే సమయాన గాజులు గలగలలాడుతున్నప్పుడు, నారు గుచ్చుతున్నప్పుడు, పిల్లలు కోరిన చెట్టుకాయను పకపకా నవ్వుతూ దోటీతో రాలుస్తున్నప్పుడు, బాబును స్కూల్లో దింపి ఆఫీసుకు వెళ్లే తొందరలో పౌడర్ రాసుకోనప్పుడు, గట్టిగా అరుస్తున్నప్పుడు, మెత్తగా మాట్లాడుతున్నప్పుడు, ఒక రాత్రి స్నానమాడి ముస్తాబైనపుడు, పురుడుకని పుట్టింటికి చేరినప్పుడు... ఉంటాయి అందమైన సమయాలు ప్రతి ఒక్కరికీ! అందం లేనిదెవ్వరికి?‘నిను చూసి కోరునేమో ప్రతి కన్నూ... ప్రియా... వారికి నా దృష్టి ఎక్కడ?’ అన్నాడొక కవి. చూపు వేరు. దృష్టి వేరు. సౌందర్య దృష్టిని కనుగొనేవారు ప్రతి సందర్భంలో, ప్రతి సాధారణతలోనూ కనుగొంటారు. గరిక పచ్చ మైదానాలదే రంగైతే... తుపానులు రేగే ఎడారుల బంగారు వర్ణాన్ని ఏమనాలి? ఉన్నది ఉంటుంది. ఉన్నది ఏదైనా అది బాగుంటుంది. ప్రపంచ అందాల పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. వేడుకల కళ వేడుకలది. ఇదే సమయంలో పోషక ఆహారం, తగిన విశ్రాంతి, ఆర్థిక స్వాతంత్య్రం, మాటకు విలువ, సంపదలో అధికారంలో సమ భాగస్వామ్యం కలిగిన ఆత్మగౌరవ జీవన సౌందర్యం ప్రతి మహిళకూ హక్కుగా ఉండాలని కోరుకోవడం సముచితమే! అది దృష్టి. -
Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!
-
మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్ ఎట్రాక్షన్‌గా నందిని గుప్తా (ఫొటోలు)
-
హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు
-
Miss World 2025 : ఘనంగా హైదరాబాద్‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)
-
Miss World2025: మిస్ వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగా మహిళల ధర్నా
హైదరాబాద్: పాశ్చాత్య సంస్కృతి అయిన మిస్ వరల్డ్ పోటీలను నిరసిస్తూ వివిధ మహిళా సంఘాల నేతలు గచ్చిబౌలి స్టేడియం వద్ద శనివారం సాయంత్రం మెరుపు ధర్నా నిర్వహించారు. మిస్ వరల్డ్ వేడుకల ప్రారంభోత్సవం సమయంలో భారీ బందోబస్తు ఉన్నా పోలీసుల కళ్లు గప్పి స్టేడియం ప్రధాన ద్వారం సమీపంలోని ప్రధాన రహదారి వద్దకు చేరుకోవడం గమనార్హం. గచ్చిబౌలి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా రోప్‌తో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని వాహనంలో మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉద్విగ్న భరిమైన పరిస్థితుల్లో అందాల పోటీలను నిర్వహించడమేంటని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని చెబుతూనే రూ.200 కోట్లు ఖర్చుపెట్టి మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నేతలు వి.సంధ్య, ఝాన్సీ, అనురాధ, ఐఎఫ్టీయూ అరుణ, మహేష్, నాగరాజు, వివిధ మహిళా సంఘాల నేతలు ఎడ్ల జయ, రాణి, జయసుధ, సావిత్రి, సవిత, శ్రీఏదేవితోపాటు సింహద్రి, రవి పాల్గొన్నారు. -
Miss World 2025: అదిగో.. అందాల లోకం!
హైదరాబాద్: దివిలో తారకలు భువిపైకి దిగి వచ్చాయా? సౌందర్య లోకం అవనిపైకి నడిచి వచ్చిందా? అనే తీరుగా ప్రపంచ సుందరీమణులు తళుక్కున మెరిశారు. తమ అందచందాలతో, చందన మందగమనంతో మురిశారు. భాగ్యనగర ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఆలాపనతో 72వ మిస్ వరల్డ్ పోటీలు వివిధ దేశాలకు చెందిన జాతీయ పతాకాలు, విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో అట్టహాసంగా ఆవిష్కృతమయ్యాయి. సంస్కృతి, సౌందర్యం మేళవింపుగా ప్రపంచ సుందరి– 2025 ప్రారంభ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రారంభ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే, మాజీ మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా, సీఎస్ రామకృష్ణారావు, నగర మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అందం.. ఆత్మవిశ్వాసం
సాక్షి, హైదరాబాద్: శనివారం సాయంత్రం.. భాగ్యనగరం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం.. అందం.. ఆత్మవిశ్వాసం.. అభినయం.. కలిసి కవాతు చేశాయి..ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ వేడుకలను సప్తవర్ణ శోభితం చేశాయి. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి 109 దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన పోటీదారులైన అందగత్తెలు లయబద్ధమైన పాశ్చాత్య సంగీత హోరుకు తగ్గట్టుగా అభినయిస్తూ తమను తాము పరిచయం చేసుకోగా, ఆయా సుందరీమణుల బృందాన్ని తెలంగాణ సంప్రదాయ కళాకారుల బృందం నర్తిస్తూ వేదిక మీదకు స్వాగతించింది. ఒకవైపు పాశ్చాత్య సంగీతం.. మరోవైపు తెలంగాణ సంప్రదాయ కళా బృందాల విన్యాసం.. వెరసి ఓ జుగల్బందీగా ఆహూతులను మంత్ర ముగ్ధులను చేశాయి. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం ప్రేక్షకులను ఆసాంతం అలరించింది. జయ జయహే తెలంగాణ ఆలాపనతో.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పరిమిత సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల మధ్య ప్రపంచ సుందరి పోటీల పరిచయ కార్యక్రమం కొనసాగింది. సాయంత్రం ఆరున్నరకు తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ ఆలాపనతో కార్యక్రమం మొదలైంది. గాయకుడు సంగీత శిక్షకుడు రామాచారి శిష్యులు 50 మంది ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించి ఆకట్టుకున్నారు. ఆ వెంటనే రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన సంగీత శిక్షణ కేంద్రాల కళాకారిణులు 250 మంది పేరిణి నృత్య రూపాన్ని ప్రదర్శించారు. ‘హంస నడకలతో అందమే సాగెనే... అరవిరిసిన..’ అంటూ ప్రపంచ సుందరి పోటీలకు సరిపోయే గీతాన్ని ఎంచుకున్న తీరు ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగా కళాకారిణులు నర్తించి పరవశింపజేశారు. అంత పెద్ద సంఖ్యలో కళాకారిణులు స్టేడియం మొత్తం కలిగి తిరుగుతూ నర్తించటం, మధ్యలో సీతాకోకచిలుక, నక్షత్రం, మిస్ వరల్డ్ లోగో ఆకృతిని ఆవిష్కరించడం అబ్బురపరిచింది. దాదాపు 10 నిమిషాల పాటు సాగిన ఈ నృత్య కార్యక్రమానికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహించగా, ఫణి నారాయణ స్వరాలు సమకూర్చారు. ఖండాల వారీగా నాలుగు బృందాలుగా.. ప్రారంభ వేడుకల్లో 109 దేశాల సుందరీమణులు పాల్గొన్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వీరిని ఖండాల వారీగా నాలుగు బృందాలుగా విభజించారు. తొలుత తెలంగాణకు చెందిన ఒక్కో సంప్రదాయ కళా బృందం ప్రదర్శన ఇవ్వగా, ఆ వెంటనే ఒక్కో బృందం చొప్పున సుందరీమణులు స్టేడియంలోకి వచ్చి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రామకృష్ణ ఆధ్వర్యంలో కొమ్ము కోయ బృందం కోయ డప్పు నృత్యం ప్రదర్శించారు. ఆ వెంటనే అమెరికా–కరేబియన్ దేశాలకు చెందిన తొలి సుందరీమణుల బృందం వచ్చింది. నిర్వాహకులు దేశాల వారీగా పిలవగానే ఆయా దేశాల ప్రతినిధులు ఒక్కొక్కరు పాశ్చాత్య బీట్‌కు తగ్గట్టుగా నర్తిస్తూ అభివాదం చేసుకుంటూ పరిచయం చేసుకున్నారు. తొలుత అర్జెంటీనా సుందరీమణి రాగా, చివరగా వెనిజువెలా అందెగత్తె వచ్చింది. అనంతరం గోండు గుస్సాడీ కళాకారులు శ్రీధర్ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే ఆప్రికా ఖండానికి చెందిన దేశాల సుందరీమణులు వచ్చి పరిచయం చేసుకున్నారు. అంగోలా సుందరీమణి ముందు రాగా, చివరగా జింబాబ్వే దేశానికి చెందిన పోటీదారు వచ్చింది. అనంతరం 14 మంది లంబాడీ డప్పు కళాకారులు స్వప్న, అందె భాస్కర్ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే యూరప్ ఖండానికి చెందిన దేశాల పోటీదారులు వచ్చి పరిచయం చేసుకున్నారు. చివరగా ఒగ్గు డోలు బృందం కళాకారులు 18 మంది ఒగ్గు రవికుమార్ ఆధ్వర్యంలో కళారూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్బంగా హ్యూమన్ పిరమిడ్ ఏర్పాటు చేసి పైకి ఎక్కిన కళాకారుడు జాతీయ జెండాను రెపరెపలాడేలా చేసిన తీరు ఆకట్టుకుంది. అనంతరం ఆసియా–ఓíÙయానా దేశాల ప్రతినిధులు స్టేడియంలోకి వచ్చి పరిచయం చేసుకున్నారు. మిస్ ఇండియా నందినీ గుప్తా రాగానే మార్మోగిన స్టేడియం.. చివరి బృందంలో భాగంగా మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా వచ్చినప్పుడు స్డేడియం చప్పట్లు, ఈలలు, కేరింతలతో మార్మోగింది. గోకులంలో గోపిక వస్త్రధారణతో నందినీ గుప్తా స్టేడియంలోకి వచ్చారు. వేషధారణకు తగ్గట్టు తన పరిచయంలో భాగంగా ఆమె కవ్వంతో వెన్న చిలికే అభినయంతో రావటం విశేషం. నేపాల్‌కు చెందిన సుందరీమణి గులాబీ డిజైన్, అదే రంగు రవికతో తెలుపు రంగు చీరకట్టుతో రావటం ఆకట్టుకుంది. బంగ్లాదేశ్, టర్కీ దేశాల ప్రతినిధులు కూడా హాజరుకాగా.. థాయిలాండ్ సుందరీమణి చీరకట్టును పోలిన వస్త్రధారణతో వచ్చింది. శ్రీలంక యువతి నమస్కార ముద్రతో పరిచయం చేసుకుంది. చివరలో వచ్చిన వియత్నాం సుందరి వేగంగా నర్తిస్తూ ఆకట్టుకుంది. ఆ్రస్టేలియా యువతి కౌబాయ్ గెటప్‌లో వచ్చింది. పోటీలు ప్రారంభమైనట్టు ప్రకటించిన సీఎం పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవాలు పరిచయం చేసుకుని కరచాలనం చేశారు. అనంతరం ఆ ఇద్దరితో కలిసి ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహూతులు, పోటీదారుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత పోటీదారులు అందరూ స్టేడియంలోకి వారివారి జాతీయ జెండాలు చేతపట్టుకుని ఊపుతూ వచ్చారు. చివరగా భారత పతాకాన్ని చేతబూని మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా వచ్చారు. అప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. అంతా ప్రపంచ శాంతిని కాంక్షించే మిస్ వరల్డ్ గీతాన్ని బృంద గానంగా ఆలపించారు. – భారత దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అసమాన ప్రదర్శన చాటిన సైనికులకు వందనం సమరి్పస్తున్నట్టు వ్యాఖ్యాత ప్రకటించినప్పుడు ‘జైహింద్’ నినాదాలతో స్టేడియం మార్మోగింది. చివరకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ప్రారంభ వేడుకల్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, నగర మేయర్ విజయలక్ష్మిమ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప నగరంలో ఉన్నందుకు పులకిస్తున్నాం: మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా ‘నమస్తే హైదరాబాద్.. నమస్తే తెలంగాణ. ఈ అద్భుతమైన నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో మీ అందరితో కలిసి పాల్గొనటం నాకు గర్వంగా ఉంది. ఈ అద్భుత దేశం, గొప్ప సాంస్కృతిక కేంద్రంలో మేము ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే అద్భుత కార్యక్రమంలో ఐక్యతను చాటుతూ పాల్గొంటున్నాం. తెలంగాణ సంప్రదాయాలు, గొప్ప చరిత్ర, అద్భుత ఆతిథ్యం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మిస్ వరల్డ్ అనేది కేవలం అందం గురించి మాత్రమే కాదు. ఇది ప్రపంచంలో ఓ మార్పును తీసుకువచ్చే లక్ష్యంతో సాగుతుంది. విద్య, సాధికారత, సమాజ సేవ ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచడం ఇందులో భాగం. 109 దేశాల నుంచి వచ్చిన మహిళలు గొప్ప లక్ష్యంతో ఒక్కటిగా ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇప్పుడు హైదరాబాద్ సరైన వేదికగా నిలి చింది. ఈ నగరంలో సంప్రదాయం–ఆధునికత ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఇక్కడి ఆతిథ్యానికి, ,హృదయపూర్వక స్వాగతానికి ధన్యవాదాలు..’ అని మిస్ వరల్డ్ క్రిస్టీనా పిస్కోవా అన్నారు. -
హైదరాబాద్‌లో ఘనంగా మిస్ వరల్డ్ పోటీలు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ పోటీలు ఆరంభమయ్యాయి. అందె శ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమమమయ్యాయి. మిస్ వరల్డ్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
అందాలతో అలరిస్తూ.. వ్యాపారాలు పెంచుతూ..
తెలంగాణ రాష్ట్రం 2025 సంవత్సరానికిగాను మిస్ వరల్డ్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుంది. మే 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. కేవలం ఇది ఒక ప్రతిష్ఠాత్మక అందాల పోటీ మాత్రమే కాదు. స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడే కార్యక్రమం. వినోదం, స్పాన్సర్‌షిప్‌లు, పర్యాటకం, డొనేషన్స్‌ను సమ్మిళితం చేసే శక్తివంతమైన ప్రపంచ వ్యాపార నమూనా. 130కిపైగా దేశాల నుంచి అందగత్తెలు, జడ్జీలు, కార్యక్రమాన్ని ఎండార్స్ చేసే కంపెనీల ప్రతినిధులు విచ్చేస్తారు. ఈ ఈవెంట్ చుట్టూ జరిగే వ్యాపార ధోరణులను విశ్లేషిద్దాం.స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ భాగస్వామ్యాలుఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ కంపెనీలతో సహా ప్రధాన బ్రాండ్లు గ్లోబల్ విజిబిలిటీ కోసం ఈ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ప్రఖ్యాత కాస్మెటిక్ దిగ్గజాలు, ఆభరణాల డిజైనర్లు, లగ్జరీ ఫ్యాషన్ హౌజ్‌ల పోటీదారులు ఈవెంట్ సెగ్మెంట్లను స్పాన్సర్ చేస్తూ హై-ప్రొఫైల్ మార్కెటింగ్ అవకాశాన్ని అందుకోవచ్చు.బ్రాడ్‌కాస్టింగ్, మీడియా హక్కులుఈ అందాల పోటీని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసేందుకు ప్రత్యేక ప్రసార హక్కుల కోసం నెట్వర్క్ సంస్థలు పోటీ పడుతుంటాయి. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, పే-పర్-వ్యూ మోడల్స్, ప్రకటనలు, స్పాన్సర్షిప్ ఇంటిగ్రేషన్ల ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చు.పర్యాటకంఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇతర దేశాల ప్రముఖులు హైదరాబాద్ రానున్నారు. దాంతో స్థానికంగా ఆతిథ్య రంగం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా సేవలు, స్థానిక వ్యాపారాలు గణనీయంగా ప్రయోజనం పొందుతాయి. స్థానిక పర్యాటకం, సాంస్కృతిక సంపదను అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఈ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటారు.టికెట్ అమ్మకాలు, వీఐపీ ప్యాకేజీలుప్రీమియం సీటింగ్, లగ్జరీ అనుభవాలు, గాలా డిన్నర్లతో మిస్ వరల్డ్ ఈవెంట్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇది టికెట్ ఆదాయానికి దోహదం చేస్తుంది. వీఐపీలు, స్పాన్సర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై భారీ జరిమానాబ్రాండ్ ప్రమోషన్మిస్ వరల్డ్ ఈవెంట్లో సుందరీమణులు ధరించే బ్రాండెడ్ దుస్తులు, యాక్సెసరీల ద్వారా కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కో-బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు ఈ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటారు. -
యుద్ధ సమయంలో అందాల పోటీలు అవసరమా?
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్, భారత్ యుద్ధం కొనసాగుతుండగా హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ (John Wesley) అన్నారు. వెంటనే ఈ పోటీలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాద చర్యలను సీపీఎం ఖండిస్తుందన్నారు. హిట్లర్ ఫాసిజంపై నాటి సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం విజయం సాధించి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ప్రపంచదేశాలను అక్రమించుకోవాలన్న కుట్ర, కుతంత్రాలతో నియంత హిట్లర్ సాగించిన దూకుడుకు ఎర్రజెండా అడ్డుకట్టవేసిందన్నారు. ఒక్కో దేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తూ రష్యాను సైతం ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నానికి 1945లో కమ్యూనిస్టు సైన్యం అడ్డుకట్టవేసి సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు నాయకత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోందని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, సామేల్, జగదీశ్, ఈ.నర్సింహ, జగన్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. 500 మంది పోలీసులతో బందోబస్తు: మాదాపూర్ డీసీపీమిస్ వరల్డ్ పోటీలకు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ తెలిపారు. శుక్రవారం ఆయన గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించి, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. మాదాపూర్ జోన్లో నిర్వహించే మిస్ వరల్డ్ ఈవెంట్‌కు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఏర్పాట్లు ఉంటాయన్నారు. దాదాపు 500 మంది పోలీసులతో వివిధ చోట్ల బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. భారత్, పాక్ సరిహద్దులో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ‘మిస్ వరల్డ్’ పోటీల ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ: జీహెచ్ఎంసీ కమిషనర్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని, వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మిస్ వరల్డ్ కార్యక్రమం నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గచ్చిబౌలి స్టేడియం, పరిసరాల్లో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్టేడియం చుట్టూ పోటీలకు సంబంధించిన వివరాలు తెలిసేలా ప్రచార సామగ్రిని పెట్టించాలని అడ్వర్జైట్మెంట్ అదనపు కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. కమిషనర్ వెంట వెస్ట్‌జోన్ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోఖడే హేమంత్ సహదేవ్‌రావు, అడ్వరై్టజ్‌మెంట్ అదనపు కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తదితరులుతున్నారు. చదవండి: మానవత్వానికి పట్టం.. సేవకు కిరీటం.. -
Miss World 2025: నల్గొండకు సుందరాంగులొస్తారని..
నల్గొండ: ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు శనివారం నుంచి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. వారు బృందాలుగా ఏర్పడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 12 నాగార్జునసాగర్, 15న యాదగిరి క్షేత్రాన్ని, భూదాన్పోచంపల్లిలోపర్యటిస్తారు. వీరి రాకకోసం ఆయా చోట్ల పర్యాటకశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.నేటి నుంచి హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించనున్న పోటీదారులు12న నాగార్జునసాగర్, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రాకమూడు ప్రాంతాలకు మూడు బృందాలుగా..విస్తృత ఏర్పాట్లు చేస్తున్న పర్యాటక శాఖబుద్ధుడి చెంతకు..నాగార్జునసాగర్ : ప్రపంచ సుందరీమణులు ఈనెల 12వ తేదీన నాగార్జునసాగర్‌కు రానున్నారు.మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి చింతపల్లి సమీపంలోని వెంకటంపేట స్టేజీ వద్దనున్న వెల్లంకి అతిథి గృహం వద్ద 15 నుంచి 30 నిమిషాలు గడపనున్నారు. అక్కడి నుంచి నాగార్జునసాగర్ విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని.. వారికి కేటాయించిన గదుల్లో ముస్తాబవుతారు.విజయ విహార్ ఎదుట ఈవెంట్ మేనేజర్ సూచనల మేరకు మీడియా కోసం ఫొటోలు దిగుతారు. ఆ తర్వాత విజయ విహార్ వెనకభాగంలో సాగర తీరాన 30 నిమిషాల పాటు ఫొటో షూట్ ఉంటుంది. అక్కడి నుంచి వారు వచ్చిన బస్సుల్లోనే బయలుదేరి బుద్ధవనం చేరుకుంటారు. 12న బుద్దపూర్ణిమ కావడంతో బుద్ధుడి పాదుకల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మహాసూ్థపం వద్దకు వెళ్తారు. చివరి మెట్ల మీదునుంచి పైకెక్కి ఫొటో షూట్లో పాల్గొంటారు. వారినుంచి వంద అడుగుల దూరంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన గిరిజనుల నృత్యం ఉంటుంది. మహాస్థూపం చుట్టూ ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఎంపిక చేసిన వాటి గురించి టూర్ గైడ్ శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. మహాసూ్తపంలోని అష్టబుద్ధుల వద్ద క్యాండిల్స్ వెలిగిస్తారు. అక్కడే వారికి కేటాయించిన సీట్లలో కూర్చుని మూడు నిమిషాలు ధ్యానం చేస్తారు. అక్కడే మరో ఐదు నిమిషాల పాటు మాంగ్స్ చాటింగ్‌లో పాల్గొంటారు. ఐదు నిమిషాల పాటు బుద్ధజయంతి గురించి తెలుసుకుంటారు.అక్కడి నుంచి మెట్లు దిగి జాతక పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆసీనులవుతారు. బుద్ధుడి చరిత్ర, తెలంగాణ బుద్ధిజం, బౌద్ధ విశేషాలు తెలుసుకుంటారు. అక్కడే బుద్ధచరితపై డ్రామా ఉంటుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన డిన్నర్లో పాల్గొని హైదరాబాద్ బయలు దేరతారు. వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే భోజనాలను తీసుకురానున్నారు.పోచంపల్లిలో ‘ఇక్కత్ థీమ్’భూదాన్‌పోచంపల్లి : ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, ఉత్తమ పర్యాటక గ్రామంగా యునెస్కో అనుబంధ సంస్థచే అంతర్జాతీయ అవార్డు పొందిన భూదాన్‌పోచంపల్లికి ఈనెల 15న మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారు. వారి రాకకోసం స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టూరిజం బస్సులో 25 మంది సుందరీమణుల బృందం సా యంత్రం 6 గంటలకు పోచంపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ రెండు గంటల గడిపి తిరిగి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వెళ్తారు. అడుగడుగునా ఇక్కత్ థీమ్ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లకు టూరిజం ప్రధాన ద్వారం నుంచి లోపలి మ్యూజియం వరకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలుకుతారు. వారికి బొట్టుపెట్టి, పూలమాలలు వేసి సత్కరిస్తారు. టూరిజం లోపలి ద్వారం వద్ద ముగ్గుల్లో అలంకరించే టెర్రాకోట్ కుండలను ముద్దుగుమ్మలు పరిశీలిస్తారు. లోపలి గచ్చు ప్రాంతంలో మెహందీ వేయడాన్ని తిలకిస్తారు. అందాలభామలు కోరితే వారికి కూడా మెహందీ వేస్తారు. ఇక్కడే లైవ్ మ్యూజికల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మ్యూజియంలోకి వెళ్తారు.మ్యూజియం లోపల ఏర్పాటు చేసిన మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఇందుకోసం రెండు మగ్గాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి కాన్ఫరెన్స్ హాల్లో స్నాక్ రిఫ్రెష్మెంట్ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి మ్యూజియం బయటికి వస్తూ టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిని తిలకిస్తారు. మరోపక్క తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన మన బతుకమ్మను తిలకిస్తారు. ఇక్కడే కొందరూ మహిళలు బతుకమ్మను పేర్చుతూ పాటలు పాడుతారు.అక్కడ నుంచి హంపి థియేటర్‌కు చేరుకుంటారు. అక్కడ వీవీఐపీలతో పాటు సుందరీమణులు సోఫాల్లో కూర్చుని కార్యక్రమాలను అరగంటపాటు తిలకిస్తారు. ఇక్కడ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వాతిచే రూపొందించిన ఇండో – వెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలతో మోడల్స్ నిర్వహించే ర్యాంప్‌వాక్‌ను తిలకిస్తారు. తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, పోచంపల్లి ఇక్కత్ ప్రాముఖ్యతను ఏవీ ప్రదర్శనను సైతం తిలకిస్తారు. అవసరం అనుకొంటే మిస్‌వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఫొటోలు కూడా దిగుతారు. టూరిజం ప్రాంగణం ఇరువైపులా పల్లె వాతావరణం ప్రతిబింబించే గుడిసెల సెట్లో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్‌ను పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్న 10 స్టాల్స్‌లో పోచంపల్లి ఇక్కత్ స్టాల్స్ ఏడు, మిగతావి గద్వాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కొకూన్స్ నుంచి వస్త్రం వరకు ఎలా తయారవుతుందో చేనేత మహిళలు వీరికి వివరిస్తారు.రెండో ప్రధాన ద్వారం వద్ద పూలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాబ్స్ అలంకరణను తిలకిస్తారు. అక్కడి నుంచి తిరిగి బస్సులో హైదరాబాద్ వెళ్తారు.యాదగిరీశుడి దర్శనంయాదగిరిగుట్ట : మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4గంటలకు యాదగిరి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి 10 మంది సుందరీమణుల బృందం ప్రత్యేక వాహనాల్లో కొండపైన గల అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ కలెక్టర్, ఆలయ ఈఓ వారికి స్వాగతం పలుకుతారు. అతిథి గృహం నుంచి బ్యాటరీ వాహనాల్లో తూర్పు మాఢవీధిలో ఉన్న అఖండ దీపారాధన చెంతకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి భజన, కోలాట బృందాలు వారి ముందు నడుస్తాయి. కూచిపూడి, భరట నాట్యం కళాకారుల స్వాగతం నడుమ వారు తూర్పు ద్వారం నుంచి తిరువీధుల్లో వెళ్తారు. అక్కడ ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలుకుతారు. త్రితల ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి మొదటగా ఆంజనేయస్వామిని, అక్కడే ఉన్న గండబేరుండ నరసింహస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి, గర్భాలయంలో శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. గర్భాలయం నుంచి పక్కనే ఉన్న ఆండాళ్ అమ్మవారిని దర్శించుకొని, ముఖ మండపంలోకి వస్తారు. అక్కడ సువర్ణ పుష్పార్చన ఉత్సవ మూర్తుల చెంత అష్టోత్తర పూజల్లో పాల్గొంటారు. ముఖమండపంలోనే సుందరీమణులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేస్తారు. పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాకార మండపాలు, మాఢ వీధులను చూసి, అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకొని, తిరిగి అతిథి గృహానికి వస్తారు.సుందరీమణులకు ప్రత్యేక ప్రసాదంయాదగిరిశుడిని దర్శించుకునేందుకు వస్తున్న సుందరీమణుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేయించనున్నారు. శ్రీస్వామి వారి లడ్డూ, పులిహోర ప్రసాదంతో పాటు సిర, కట్టె పొంగలి వంటి ప్రసాదాలను తయారు చేయించనున్నారు. ప్రసాదాలను అతిథి గృహంలోనే సుందరీమణులకు అందిస్తారు. అరటి, మామిడి తోరణాలతో..ప్రపంచ సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానాలయ ముఖమండపం, తూర్పు రాజగోపురం వద్ద రంగురంగుల పూలు, అరటి, మామిడి తోరణాలతో అలంకరించనున్నారు. రాత్రి సమయంలో శ్రీస్వామి వారి ఆలయం అద్భుతంగా కనిపించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్, డీసీపీలు ఈఓతో చర్చించారు. ఇక పాక్ – ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతతల నేపథ్యంలో సుందరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. -
Miss World 2025 : బ్రేవ్ మిస్ వరల్డ్ గురించి తెలుసా?
ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తొలి మిస్ జిబ్రాల్టర్‌గా డిసెంబర్ 2009లో కైనే అల్డోరినో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ తరువాత మిస్ వరల్డ్ బీచ్ బ్యూటీ టైటిల్‌ను కూడా గెలుచుకుంది, ఇది ఆమెను మిస్ వరల్డ్ పోటీలో సెమీఫైనల్‌కు వెళ్ళిన మొదటి జిబ్రాల్టేరియన్ రాజకీయాల్లోకి వచ్చిన కైనే డిప్యూటీ మేయర్‌గా, మేయర్‌గా పని చేసింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నుంచి అందుకున్న 10,000 డాలర్లను దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన లినోర్ అబార్గిల్ 1998లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ‘మిస్ వరల్డ్’ గెలిచిన తరువాత లినోర్ మోడలింగ్‌ను కొనసాగించింది. కొన్ని చిత్రాల్లో నటించింది. కొంత కాలం తరువాత మోడలింగ్‌ను విడిచిపెట్టి లా స్కూల్లో చేరింది. అబార్గిల్ లైంగిక హింసకు వ్యతిరేకంగా ఒక న్యాయవాదిగా కూడా పనిచేస్తుంది. ప్రకారం, ఫిబ్రవరి 17, 1980న ఆమె జన్మించింది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని గెలుచుకోవడానికి ముందు లినోర్ అత్యాచారానికి గురైంది. అప్పటి నుంచి ఆమె లైంగిక హింసపై వ్యతిరేక పోరాటంలో భాగంగా గ్లోబల్ అడ్వకెట్‌గా మారింది. తనపై జరిగిన అత్యాచారం, ఆ తరువాత జరిగిన పరిణామాలపై ‘బ్రేవ్ మిస్‌వరల్డ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసింది.ఇదీ చదవండి: ఇషా అంబానీ డైమండ్ నెక్లెస్ రూ. 1,267 కోట్లా? నెయిల్ ఆర్ట్ స్పెషల్ ఏంటి?నైజీరియన్ ‘అగ్బానీ’ డారేగో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి బ్లాక్ ఆఫ్రికన్ మహిళ. కిరీటాన్ని గెలవడానికి ముందు తరువాత కూడా మోడలింగ్ చేసింది. ‘మిస్ వరల్డ్–2014’తో పాటు ఎన్నో అందాల పోటీలకు జడ్జీగా వ్యవహరించింది. నైజీరియన్ టెలివిజన్‌లో ‘స్టైలోజెనిక్’ పేరుతో రియాలిటీ షో చేసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా రాణించింది. -
Miss World 2025: గ్రాండ్ ఫ్యాషన్ ఫెస్ట్..
చరిత్రలో మరో అద్భుత మైలురాయికి నేడు భాగ్యనగర నాంది పలుకనుంది. నగరంలో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకూ పలు అంతర్జాతీయ క్రీడా పోటీలు, విదేశాంగ సమావేశాలు, అంతర్జాతీయ శాస్త్ర–సాంకేతిక సమావేశాల వంటివి జరిగాయి. కానీ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటం ఇదే ప్రథమం. గతేడాది 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబై వేదికగా నిర్వహించగా, వెనువెంటనే దేశంలో మరోసారి నిర్వహించడం.. దీనికి భాగ్యనగరం ప్రాతినిథ్యం వహించడం విశేషం. ఇప్పటికే నగరానికి ప్రపంచవ్యాప్తంగా 111 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు చేరుకోగా నేడు మరో ఇద్దరు, ముగ్గురు వచ్చే అవకాశముంది. ఈ మిస్ వరల్డ్ నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన విషయం విధితమే. నేడు ప్రారంభం కానున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఈ పోటీలను తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ టూరిజం, తెలంగాణ గ్రోత్ స్టోరీ ఇతర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ హెరిటేజ్ వాక్, మెడికల్ టూరిజం ఈవెంట్, సేఫ్టీ టూరిజం ఇనీషియేటివ్, తెలంగాణ ఆర్ట్స్, క్రాఫ్టŠస్ వర్క్ షాప్ వంటి విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జూన్ 2 వరకూ.. ఈ సారి మిస్ వరల్డ్‌లో భారత్‌తో పాటు అమెరికా, కెనడా, వెనిజులా, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, వంటి దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మారి్టనిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి అభ్యర్థులు పాల్గొంటున్నారు. ఈ నెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. జూన్ 2న ప్రతిషష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల వరకూ విజేతగా నిలిచిన మిస్ వరల్డ్ నగరంలో ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. -
మానవత్వానికి పట్టం.. సేవకు కీరీటం..
హైదరాబాద్: నగర వేదికగా జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటం తర్వాత దాదాపు దీంతో సమానంగా అత్యంత గౌరవనీయమైన టైటిల్స్‌లో ఒకటి ‘బ్యూటీ విత్ పర్పస్’. ఈ పురస్కారం మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థుల్లో సామాజిక సేవాపరమైన కార్యక్రమాల్లో స్ఫూర్తిదాయకంగా పనిచేసిన వారికి అందిస్తారు. ఈసారి జరిగే పోటీల్లో ఈ కిరీటం ఎవరిని వరించనుందోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు.. అందమైన రూపంతో పాటు హృదయం, సేవాభావం కలిగి ఉండే అభ్యర్థిని గుర్తించి అందించే ఈ టైటిల్‌ను 1972లో నిర్వాహకులు పరిచయం చేశారు. ఈ పోటీకి ప్రాణం పోసిన వ్యక్తి భార్య జూలియా మోర్లే ఆలోచనలతో దీన్ని రూపకల్పన చేశారు. మిస్ వరల్డ్ పోటీల్లో అందం ఒక్కటే కీలకంగా మారుతోందని గుర్తించి అది సరికాదని, సమాజానికి సేవ చేసే లక్షణాలు ఉన్నవారిని కూడా గౌరవించాలనే ఆలోచనతో ఆమె ఈ అవార్డును ప్రారంభించారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో అభ్యర్థుల స్వచ్ఛంద సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తారు. ఈ పురస్కార విజేతలు తమ దేశాల్లోనే కాక, అంతర్జాతీయంగా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అంతేకాకుండా ఈ అవార్డు గెలుచుకున్న అభ్యర్థులకు మిస్ వరల్డ్ టైటిల్ (Miss World Title) గెలిచే అవకాశాలు మెరుగవుతాయి.పలు దేశాల్ని వరించిన టైటిల్.. ఇప్పటి వరకూ ఈ టైటిల్ గెలిచిన వారిలో మన దేశానికి చెందిన ఇషా గుప్తా ఒకరు. విద్యను ప్రోత్సహించే సేవా కార్యక్రమాల ద్వారా ఆమె గుర్తింపు పొందారు. అదే విధంగా మన దేశపు సుందరి మానుషి చిల్లర్ సైతం మహిళల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టి 2017లో బ్యూటీ విత్ పర్పస్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆమె ఆ ఏడాది మిస్ వరల్డ్ టైటిల్ కూడా గెలిచారు. ఆదివాసీల అభివృద్ధి కోసం పనిచేసిన మెక్సికన్ బ్యూటీ వనేసా పోన్ డీ లియోన్ 2018లో ‘బ్యూటీ విత్ పర్పస్’గా నిలిచారు. జమైకాకు చెందిన టోనీ–అన్ సింగ్ 2019లో మహిళా సాధికారతపై కార్యకలాపాలతో ఈ టైటిల్‌కి ఎంపికయ్యారు. అదే విధంగా పేద బాలికల విద్యను ప్రోత్సహించడానికి చేసిన కృషికి గాను సౌత్ఆఫ్రికాకు చెందిన సునేషా బుక్సన్ 2023లో టైటిల్ దక్కించుకున్నారు.అద్భుత అవకాశం.. సేవా ప్రకాశం.. ఈ టైటిల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవతా కార్యక్రమాల్లో పాల్గొనగల అవకాశాలు వస్తాయి. అభ్యరి్థని అంతర్జాతీయ వేదికలపై పరిచయం చేస్తారు. ఈ టైటిల్ గెలిచిన అభ్యర్థి చేపట్టిన సేవా ప్రాజెక్టులకు మిస్ వరల్డ్ సంస్థ నుంచి ఆర్థికంగా సహాయం అందుతుంది. ఇది ప్రాజెక్టును విస్తరించేందుకు ఉపయోగపడుతుంది. మిస్ వరల్డ్ ఫౌండేషన్ చేపట్టే ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా ఆహా్వనిస్తారు. వివిధ దేశాలకు వెళ్లి అక్కడి సేవా సంస్థలతో కలసి పని చేయడం జరుగుతుంది. మానుషి ఏర్పాటు చేసిన ‘ప్రాజెక్ట్ శక్తి’ ప్రాజెక్ట్‌కు హర్యాణా ప్రభుత్వం రూ.18 కోట్లు మంజూరు చేసింది. ఇది ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత శానిటరీ న్యాప్కిన్లను అందించేందుకు ఉపయోగపడింది. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ టూర్లో భాగంగా ఆమె కోల్‌కతా, ముంబైతో పాటు మన హైదరాబాద్‌లోనూ మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.విద్య, ఆరోగ్య సమస్యలపై.. దక్షిణాఫ్రికాకు చెదిన బ్యూటీ విత్ పర్పస్ విజేత షుడుఫడ్జో ముసిడా తన ప్రాజెక్ట్ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. దక్షిణాఫ్రికాలో మానసిక ఆరోగ్య సమస్యలపై ఆమె చర్చలు నిర్వహించి, ప్రజల్లో అవగాహన పెంచేందుకు పనిచేశారు. నేపాల్‌కు చెందిన ఇదే టైటిల్ విజేత శృంఖలా ఖతివాడ తన ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, శుభ్రత, ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టారు. మన దేశానికి చెందిన బ్యూటీ విత్ పర్పస్ (Beauty with Purpose) విజేత మానసా వరణాసి బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాకు చెందిన బ్యూటీ విత్ పర్పస్ విజేత శ్రీ సైనీ తన ప్రాజెక్ట్ ద్వారా గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. గుండె ఆరోగ్యంపై చర్చలు నిర్వహించి, ప్రజల్లో ఆరోగ్యపరమైన జీవనశైలిని ప్రోత్సహించారు. -
హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)
-
Miss World 2025: అందాల పండగ నేడే షురూ
సాక్షి, హైదరాబాద్: అందాల పండుగకు అంతా సిద్ధమైంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచసుందరి పోటీలు శనివారం ప్రారంభం కాబోతున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్.. తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. పోటీల్లో 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటారని భావించగా, ఇప్పటివరకు 111 మంది నగరానికి చేరుకున్నారు. శనివారం మరికొందరు వస్తారని అంచనా వేస్తున్నారు. ‘మిస్ వరల్డ్’కనుసన్నల్లో కార్యక్రమాలు మిస్ వరల్డ్ లిమిటెడ్ కనుసన్నల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం గత రెండు నెలల్లో పలుమార్లు నగరానికి వచ్చి ఇక్కడి పరిస్థితులు, వసతులను పరిశీలించిన మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే, పోటీల నిర్వహణపై సానుకూలంగా స్పందించారు. ఈ నెల 2న తేదీన.. నగరానికి చేరుకున్న ఆమె బృందం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో కార్యాలయాన్ని ప్రారంభించి.. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రారంభ వేడుకలకు సీఎం అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగుతున్నా, పోటీ దారులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పొల్గొనేందుకు నగరానికి చేరుకోవటం విశేషం. పదో తేదీతో ప్రారంభమయ్యే పోటీలు ఈనెల 31 వరకు కొనసాగనున్నాయి. 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. మొదటి 3, 4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో కూడా పాల్గొంటారా, లేదా.. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే ఎట్‌హోమ్ వరకే పరిమితమవుతారా అన్నది తేలాల్సి ఉంది. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ (2024) ఫైనల్ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి పోటీలు ఇండియాలోనే జరుగుతుండటం విశేషం. రాష్ట్ర గీతం ఆలాపనతో.. రాష్ట్ర గీతం ఆలాపనతో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కొమాండూరి రామాచారి శిష్య బృందం 50 మంది బృంద గీతంగా దీన్ని ప్రత్యక్షంగా ఆలపిస్తారు. అనంతరం కాకతీయుల కాలంలో రూపొందిందిన సంప్రదాయ నృత్యరీతి పేరిణి నాట్య ప్రదర్శన ఉంటుంది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. దీనికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఫణి నారాయణ స్వరాలు సమకూర్చనున్నారు. పది నిమిషాల పాటు ఈ నృత్య కార్యక్రమం కొనసాగనుంది. కళాకారులు అందరూ కలిసి తమ విన్యాసాలలో భాగంగా నక్షత్రం, సీతాకోకచిలుక, మిస్ వరల్డ్ లోగో ఆకృతులను ప్రదర్శిస్తారు. కళారూపాల ప్రదర్శనతో కంటెస్టెంట్ల పరిచయం ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమం ఖండాల వారీగా నిర్వహిస్తారు. ఆ సమయంలో తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత భద్రాచలం గోదావరి పరీవాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు రామకృష్ణ బృందం ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత కత్లే శ్రీధర్ బృందం నేతృత్వంలో ఆదిలాబాద్ గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడీ కళా ప్రదర్శన ఉంటుంది. అప్పుడు మరొక ఖండానికి సంబంధించిన సుందరీమణులు వేదిక పైకి వస్తారు.తెలంగాణ జానపద సంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే డప్పు వాయిద్య కార్యక్రమాన్ని ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత అందె భాస్కర్ బృందం, తెలంగాణ గిరిజన వైభవానికి ప్రతీకగా నిలిచే బంజారా మహిళల విన్యాసాలను స్వప్న బృందం ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కూడా పోటీదారులను పరిచయం చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గుడోలు కళా విన్యాసాలు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత చౌదరపల్లి రవి కుమార్ బృందం ఆధ్వర్యంలో ప్రదర్శిస్తారు. ఈ కళారూపాల అన్నింటి మేళవింపుతో ముగింపు ఉంటుంది. సంప్రదాయ స్వాగతానికి మురిసిపోతూ.. ఈనెల మూడో తేదీ మొదలు నిత్యం సుందరీమ ణులు నగరానికి వస్తూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ తిలకం దిద్ది, హారతి ఇస్తూ, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, కథక్ నృత్యరీతులు ప్రదర్శిస్తూ.. డప్పు వాయిద్యాలు, బాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాలతో కూడిన బృందాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈకార్యక్రమాలు 24 గంటల పాటు కొనసాగుతున్నాయి. దీనిని విదేశీ అతిథులు సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తుండటం గమనార్హం. -
మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని, ఐపీఎల్‌ను వాయిదా వేసినట్లుగానే మిస్ వరల్డ్ పోటీలను కూడా వాయిదా వేయాలని కోరారు. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా, భారత సైన్యానికి సంఘీభావంగా శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు జరిగిన ర్యాలీకి కవిత నాయకత్వం వహించారు.సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని కవిత ప్రశంసించారు. పాకిస్తాన్ మన దేశంలోని ఎయిర్‌పోర్టులను టార్గెట్ చేసుకొని చేసిన దాడులను భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని, ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీఎంకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం రాకపోతే పదవి నుంచి తప్పుకోవాలన్నారు. పరిపాలన చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలి’ సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని ఏఐఎంఎస్ఎస్, ఏఐడీఎస్వో, ఏఐడీవైవో సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళల ఆత్మగౌరవం, వ్యక్తిత్వాన్ని కించపరిచే, మహిళలను మార్కెట్లో ఒక వస్తువుగా దిగజార్చే అందాల పోటీలను వెంటనే ఆపాలని ఒక ప్రకటనలో కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డికి ఈ మూడు సంఘాల నేతలు హేమలత, జ్యోతి, నితీశ్, నాగరాజు, తేజ, దేవరాజులు వినతిపత్రం అందించారు. -
Miss World 2025: అందమూ.. అంతకుమించి...
‘దేవుదే దిగొచ్చి మిమ్మల్నేమైనా కోరుకోమంటే ఏం కోరుకుంటారు?’ ‘పిల్లలు అమాయకులు.. పువ్వులాంటి వారు. దేవుడికి అత్యంత ఇష్టమైన వారు. అందుకే సమాజం చేసే తప్పులకు వాళ్లు బలి కాకూడదు.. వాళ్లు మంచి వాతావరణంలోనే పెరగాలని కోరుతాను!’ అని సమాధానమిచ్చింది కె. అభిమానికా యాదవ్! ఈ జవాబుతో ఆమె ‘2016 మిసెస్ ఇండియా’ పోటీలో నెగ్గారు. తర్వాత మిసెస్ ఆసియా పసిఫిక్ యూనివర్స్ కిరీటాన్ని పొందారు. ‘2017.. మిసెస్ యూనివర్స్ పోటీ’కీ వెళ్లారు. అక్కడ ఆమెను జడ్జెస్ మూడు నిమిషాల్లో డొమెస్టిక్ వయొలెన్స్ గురించి మాట్లాడమన్నారు. దానిమీద మూడు నిమిషాల్లో ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషనే ఇచ్చారు. జడ్జెస్ ఇంప్రెస్ అయ్యి.. ‘2017.. మిసెస్ యూనివర్స్ ఇంటెలిజెన్స్’ సబ్టైటిల్నిచ్చారు. హైదరాబాద్ వాసి అయిన ఆమె.. సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్, పాజెంట్ గ్రూమర్, మోటివేషనల్ స్పీకర్, ఫ్యాషన్ స్టయిలిస్ట్! ఇప్పుడు తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో అసలు బ్యూటీ పాజెంట్స్ ఎలా జరుగుతాయి, ఎలాంటి రౌండ్స్ ఉంటాయి, ఎలా గ్రూమ్ అవుతారు వంటి విషయాలను ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు.‘2016లో జరిగిన మిసెస్ ఇండియా పోటీల టైమ్‌కి నేను డివోర్సీని. అప్పుడు మా బాబుకు అయిదేళ్లు. నా పెంపకంలోనే ఉన్నాడు. బీటెక్ చదివి, కొన్నాళ్లు కార్పొరేట్ జాబ్ చేసి వదిలేసి.. జుంబా ట్రైనర్‌గా మారాను. క్లాసికల్ డాన్సర్ (ఆంధ్రనాట్యం)ని కూడా! ఫిట్‌నెస్‌లోనూ ట్రైనింగ్ తీసుకుని ఫిట్నెస్ కోచ్‌గానూ ఉన్నాను. డివోర్స్ మీద సమాజంలో ఉన్న అప్రకటిత నిషేధాలు, సంకోచాలను కాదని దానిమీద చాలా మాట్లాడేదాన్ని, విరివిగా చర్చించి దాన్ని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించాను. దాంతో అందరికీ సుపరిచితురా లనయ్యా. బ్యూటీ పాజెంట్‌లో పాల్గొనాలనేది మాత్రం అప్పటికప్పుడు తీసుకున్న డెసిషనే. దీనికి సంబంధించి అప్పుడిక్కడ గ్రూమింగ్ సెంటర్స్ లేవు. ముంబై, లేదంటే ఢిల్లీ వెళ్లాలి. నేను ఢిల్లీ వెళ్లాను. లక్కీగా మంచి కోచ్ దొరికారు. కాన్ఫిడెంట్‌గా నన్ను నేను ప్రెజెంట్ చేసుకున్నాను. టైటిల్ గెలుచుకున్నాను. ఆ ఉత్సాహంతోనే మిసెస్ యూనివర్స్ పాజెంట్కీ వెళ్లాను. అయితే మిసెస్ ఇండియా, మిసెస్ యూనివర్స్ పాజెంట్స్ మధ్య సంవత్సరం టైమ్ ఉండింది. అయినా గ్రూమింగ్ కోసం బాబును వదిలిపెట్టి వేరే సిటీకి వెళ్లే పరిస్థితి లేదు. దాంతో అంతకుముందు కోచ్ దగ్గర్నుంచే కొన్ని టిప్స్, యూట్యూబ్‌లో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పాజెంట్స్‌కి సంబంధించిన వీడియోలు, అందులోని పార్టిసిపెంట్స్ ఇంటర్వ్యూలు చూసి నన్ను నేను గ్రూమ్ చేసుకున్నాను.→ ఆ పోటీలు ఎలా ఉంటాయంటే.. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిసెస్ యూనివర్స్.. ఇలా ఏ అందాల పోటీలైనా దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. నెల రోజులు జరుగుతాయి. అయితే నెలంతా పోటీలుండవు. ఈ పోటీలను ఏ దేశం హోస్ట్ చేసినా దాని ప్రధాన లక్ష్యం.. అక్కడి టూరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే! సో.. మా పోటీలు దక్షిణాఫ్రికాలో జరిగాయి. 86 దేశాల నుంచి కంటెస్టెంట్స్ వచ్చారు. పోటీల షెడ్యూల్ అంతా కంటెస్టెంట్స్‌కి ముందే ఇచ్చేస్తారు. పోటీలు లేని రోజుల్లో ఆ దేశంలోని చారిత్రక ప్రాంతాల పర్యటన ఉంటుంది. వాళ్లు ఫుడ్, కల్చర్‌ను తెలుసుకునే పర్యటనలుంటాయి. పోటీల విషయానికి వస్తే.. ఏ రోజు ఏ ఈవెంట్ ఉంటుందో దానికి సంబంధించిన కాస్ట్యూమ్ ఉంటుంది. ఈ కాస్ట్యూమ్స్ కోసం కొంతమంది కంటెస్టెంట్స్ స్పాన్సర్స్‌ని వెదుక్కుంటారు. స్విమ్ వేర్ రౌండ్ ఉంటుంది. స్విమ్ సూట్‌తో స్టేజ్ మీద కనిపించాలి. దానికి ఫొటో షూట్ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ని మనమెంత కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తున్నాం, బాడీలాంగ్వేజ్ వంటివన్నీ అసెస్ చేస్తారు. ఇంటెలిజెన్స్ రౌండ్ ఉంటుంది. ఇందులో క్విజ్ ఉండొచ్చు, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద చర్చలు, మహిళల సమస్యలకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. వాళ్లిచ్చిన టాపిక్‌ని వాళ్లిచ్చిన వ్యవధిలో ఎంత చక్కగా మాట్లాడామనేది చూస్తారు. బ్యూటీ విత్ పర్పస్ రౌండ్ ఉంటుంది. కంటెస్టెంట్స్ ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగస్వాములై ఉండాలి. ఆ పోటీ కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు అందులో దానిగురించి పొందుపరచాలి. ఈ రౌండ్లో దాని గురించి అడుగుతారు. మనం చేసిన పనిని ఎంత స్మార్ట్‌గా ప్రెజెంట్ చేశామనేదాన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. దీనిమీద ఆన్లైన్ ఓటింగ్ ఉంటుంది. మాగ్జిమమ్ ఓట్లు వచ్చిన వాళ్లకు మిస్ పాపులర్ అనే సబ్ టైటిల్ ఇస్తారు. ఫిట్నెస్ రౌండ్ ఉంటుంది. అలాగే టాలెంట్ రౌండ్ ఉంటుంది. మనకొచ్చిన కళలను ప్రదర్శించాలి. ఇందులో ది బెస్ట్ పెర్ఫార్మర్కు మిస్ టాలెంటెడ్ సబ్ టైటిల్ ఇస్తారు. ట్రెడిషనల్ రౌండ్ కూడా ఉంటుంది. ఇందులో మనం దేన్ని, ఎంత క్రియేటివ్‌గా రిప్రెజెంట్ చేస్తున్నామనేది ఫోకస్ అవుతుంది. → తలపై బోనంతో....నేను లంగా, ఓణీ వేసుకుని, తల మీద బోనం పెట్టుకుని ర్యాంప్ వాక్ చేసి, బోనం గురించి వర్ణించాను! గౌన్ రౌండ్, ఇంట్రడక్షన్ రౌండ్, వన్ టు వన్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్, ప్రిలిమినరీ రౌండ్స్ ఉంటాయి. ఇవేకాక ఫినాలే రోజు.. టైమ్ లేకుంటే అంతకంటే ముందు రోజు మిస్ బ్యూటిఫుల్ స్కిన్,హెయిర్, ఫొటోజెనిక్, స్మైల్, బెస్ట్ స్విమ్ సూట్ లాంటి సబ్టైటిల్స్నిస్తారు. ర్యాంప్ వాక్ ఉంటుంది. ఫినాలే రోజు అందరూ తప్పకుండా గౌనే వేసుకోవాలి. కొన్నిసార్లు ఏ దేశం హోస్ట్ చేస్తుందో ఆ దేశానికి సంబంధించిన ట్రెడిషనల్ వేర్ని ఇస్తారు. మాకు సౌత్ ఆఫ్రికన్ ప్రింట్స్, యాక్ససరీస్‌తో డిఫరెంట్ అవుట్‌ఫిట్స్ ఇచ్చారు. కిందటిసారి ముంబైలో జరిగిన మిస్‌వరల్డ్ పోటీల్లో అందరికీ లెహెంగాలు ఇచ్చారు. ఫినాలే రోజు టాప్ టెన్, లేదా టాప్ ఫైవ్ స్టేజ్ మీద ఉంటారు. వాళ్లందరికీ ఒక క్వశ్చన్ ఇస్తారు. ఒకవేళ మల్టిపుల్ జడ్జెస్ ఉంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఎంత వేగంగా స్పందించి.. ఎంత కాన్ఫిడెంట్‌గా.. ఎంత కూల్‌గా ఆన్సర్ చేస్తారో దాన్ని బట్టి టైటిల్ విన్నర్‌ని, ఫస్ట్ అండ్ సెకండ్ రన్నరప్స్ని అనౌన్స్ చేస్తారు.→ కొరియోగ్రఫీ..గ్రూమింగ్ అవుతున్నప్పుడు ఆర్గనైజర్స్ వస్తారు.. ఎవరు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారో చూస్తుంటారు. ఈ పోటీలకు కొరియోగ్రఫీ ఉంటుంది. ఎవరు ఎక్కడ నిలబడాలి, ఎలా నడవాలి.. ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి వంటివన్నీ ట్రైన్ చేస్తారు. దీనికి పాజెంట్ కోచ్ ఉంటారు. వాళ్లే నేర్పిస్తారు. మిసెస్ ఇండియా మొదలు మిసెస్ యూనివర్స్ వరకు గ్రూమింగ్‌కి కాస్ట్యూమ్స్, ఫుట్‌వేర్,యాక్ససరీస్ సహా నాకు రూ. 12 లక్షల వరకు ఖర్చయింది. పాజెంట్‌లో పార్టిసిపేట్ అవడమనేది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఏమైనా నాకు ఫిట్నెస్ కోచ్‌గా కొనసాగడమే ఇష్టం. పదేళ్లుగా అదే రంగంలో కొనసాగుతున్నాను. పాజెంట్స్‌కి సంబంధించి వర్క్‌షాప్స్ పెట్టాను. త్వరలోనే ఇక్కడొక గ్రూమింగ్ సెంటర్ పెట్టాలని ΄్లాన్ చేస్తున్నాను. – సరస్వతి రమ -
Miss world 2025: అందరి చూపు.. భాగ్యనగరం వైపు..
ప్రస్తుతం ప్రపంచమంతా హైదరాబాద్ నగరం వైపే చూస్తోంది. దాదాపు 120 దేశాలకు పైగా ఆయా దేశ అధికార ప్రతినిథులు, ప్రముఖులు నగరానికి గగనతల ప్రయాణం చేస్తున్నారు. నగర వేదికగా ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతి రోజూ వివిధ దేశాలకు చెందిన సుందరీమణులతో కళకళలాడుతోంది. అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనే 109 దేశాలకు చెందిన పోటీదారులు ఇప్పటికే నగరానికి చేరుకోగా మరికొన్ని దేశాలకు చెందిన వారు శుక్రవారం రానున్నారు. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ ఘన వేదికగా మారిన విషయం విధితమే.. ఇందులో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే ప్రీ ట్రయల్స్‌లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెనా క్రాస్బీ (అమెరికా), ఎమ్మా మోరిసన్ (కెనడా), వాలేరియా కాన్యావో (వెనిజులా) వంటి తారలు మిస్ వరల్డ్ వేదిక పై ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. అంతేకాకుండా అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా 72వ మిస్ వరల్డ్ పోటీల్లో అభ్యర్థులు పాల్గోనుండడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో వరల్డ్ టాప్ మోడల్స్‌తో పాటు విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు, ఆరి్టస్టులు, విభిన్న రంగాలకు చెందిన ఉద్యమకారులు తమ దేశాల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పోటీపడుతుండటం మరో విశేషం. దేశవ్యాప్తంగా డిజిటల్ వెల్కమ్.. పోటీదారులు దాదాపు నెల రోజులపాటు తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించనున్నారు. గతేడాది ముంబయిలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరగగా, ఈ ఏడాది మే 31న హైదరాబాద్, హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరగనుంది. మిస్ వరల్డ్ పోటీలను వరుసగా రెండేళ్ల పాటు భారత్‌లో నిర్వహించడం తొలిసారి. ఈ అరుదైన గౌరవం దేశానికి మాత్రమే కాదు, తెలంగాణకు కూడా విశ్వవేదికపై విశిష్ట గుర్తింపునిస్తుంది. ఈ విశిష్ట కార్యక్రమానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ వెల్కమ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోటీలను తిలకించడానికి సామాన్యులకు సైతం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో వివిధ నగరాల నుంచి ఫ్యాషన్ ఔత్సాహికులు నగరానికి రావడానికి సన్నద్ధమవుతున్నారు. (చదవండి: Miss World 2025: అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు') -
మిస్ వరల్డ్ 2025 : అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు'
ఆ రంగులు, పువ్వులు, పక్షులు, జంతువుల జ్యామెట్రీ నమూనా డిజైన్లు నేత శైలి చూడగానే పోచంపల్లి ప్రత్యేకత ఇట్టే తెలిసిపోతుంది. మన దేశీయ సాంస్కృతిక, వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. మిస్ వరల్డ్ 2025 కాంటెస్ట్ ఈవెంట్లో భాగంగా ఈ నెల 15న ఒక బృందం ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామమైన పోచంపల్లి(Pochampally )ని సందర్శించనుంది. దీంతో దేశంలో అత్యంత ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇకత్ ఫ్యాషన్ మరోమారు ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి దాని సంక్లిష్టమైన ఇకత్ నేత పద్ధతులు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. యునెస్కో ‘ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామం’గా పోచంపల్లి ప్రశంసలు అందుకుంది. చేతిపనులు, సంస్కృతి, వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచి ఈ చేనేతలో అబ్బురపరిచే డైయింగ్ టెక్నిక్స్‌ను ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్‌లో సంప్రదాయ చిలుక, ఏనుగు, వజ్రం, పూల మోటిఫ్లతోపాటు ఇప్పుడు వందల రకాల డిజైన్లు సృష్టిస్తున్నారు వీవర్స్. హుందాతనాన్ని చాటేలా! పోచంపల్లి ఇకత్ కాటన్‌తో ఎన్నో మోడల్స్ యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కుర్తా పైజామాలు, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్, ఫ్రాక్స్, జంప్‌సూట్స్, లెహంగాలు.. ఇండో–వెస్ట్రన్ డిజైన్స్ ఆధునికతను చాటుతున్నాయి. సౌకర్యంతోపాటు క్యాజువల్, అఫిషియల్ అండ్ పార్టీవేర్‌గానూ హుందాతనాన్ని చూపుతున్నాయి.పట్టు ప్రత్యేకత బ్రైట్ కలర్స్, సంప్రదాయ డిజైన్లు, జరీ మెరుపులు చూపు తిప్పుకోనివ్వవు. కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్‌లు, క్రాప్టాప్స్తో ఈ చీరలను జత చేసి మరిన్ని స్టైల్స్ తీసుకువస్తున్నారు. ఇతర అలంకారాలుచీర కట్టు, టెంపుల్ జ్యువెలరీతో సంప్రదాయ శైలిని తీసుకువస్తే ఫ్యాబ్రిక్ లేదా సిల్వర్ జ్యువెలరీతో వెస్ట్రన్ స్టైల్‌ని మెరిపించవచ్చు. ఏ జ్యువెలరీ, కేశాలంకరణ స్టైల్స్ లేక΄ోయినా ఫ్యాబ్రిక్‌నే అలంకారంగా ధరించవచ్చు. దేశభక్తి చాటేలా! పోచంపల్లి, ఇకత్లో యువతను ఆకట్టుకునేలా నేస్తున్న డిజైన్స్ గురించి స్టేట్ అవార్డ్ గ్రహీత వీవర్ బోగ సరస్వతి మాటల్లో.. ‘‘నేను పాతికేళ్లుగా, మావారు బోగ బాలయ్య యాభై ఏళ్లుగా ఈ చేనేత వస్త్రాలను నేస్తున్నాం. కొత్త కొత్త డిజైన్స్‌ను తయారు చేస్తున్నాం. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని, వారి ఆధునిక వస్త్రాలకు తగినట్టుగా, హుందాగా ఉండే డిజైన్స్ రూపకల్పనలో కృషి చేస్తున్నాం. ఇటీవల ఆజాదీ కా అమృత మహోత్సవాలను పురస్కరించుకుని దేశభక్తి చాటేలా ఇండియా మ్యాప్ మధ్యన చరఖా రాట్నం వచ్చేలా స్కార్ఫ్ నేశాం. ఎకో ఫ్రెండ్లీ రంగులను ఉపయోగించాం. 2023 డిసెంబర్లో డబుల్ ఇకత్లో చరకా వచ్చేలా స్కార్ఫ్ డిజైన్ చేసి, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కానుకగా ఇచ్చాం. 121 కలర్స్‌లో 121 మోటిఫ్స్‌తో చీర తయారుచేశాం. 2021లో 100 అడ్డు చిటికీలు 100 నిలువు చిటికీలు రూపొందించి 100*100 అంటే 10,000 షేడ్ వచ్చేలా చీరలు రూపొందించాం. ఆ కృషికి గుర్తింపుగా స్టేట్ అవార్డు వరించింది. బెస్ట్ వీవర్ అప్రిసియేషన్, బెస్ట్ వీవర్ అవార్డ్ సర్టిఫికెట్ లభించింది. మహిళా దినోత్సవం సందర్భంగా బెస్ట్ వీవర్‌గా ప్రశంసలు అందుకున్నాను. కొంగొత్త డిజైన్లుమా కృషి, దృష్టి అంతా అనుకున్న డిజైన్లు, డైయింగ్, టైయింగ్, మోటిఫ్స్, షేడ్స్, వీవింVŠ పైన ఉంటుంది. నచ్చిన డిజైన్లకు ఎక్కువ మొత్తంలో కోరితే డిమాండ్‌ను బట్టి బయట ఆర్డర్ ఇస్తాం. సంప్రదాయ ఏనుగులు, పక్షులు మాత్రమే కాకుండా మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి డిజైన్ చేస్తున్నాం. రాజకీయ నాయకులు, ప్రముఖులు మా వద్ద నుంచి చీరలు తీసుకెళతారు. బాలీవుడ్ నటి జయాబచ్చన్, ఇన్ఫోసిస్ సుధామూర్తికి కూడా మా చీరలు వెళ్లాయి. పదివేల షేడ్స్‌తో తయారుచేసిన ఇకత్ స్పార్ఫ్కు మంచి గుర్తింపు లభించింది. జాతీయస్థాయి మా డిజైన్స్ గుర్తింపు సాధించాలని కృషి చేస్తున్నాం.– బోగ సరస్వతి, పోచంపల్లి ఇకత్ వీవింగ్ డిజైనర్ (చదవండి: Miss World 2025: ఆ దేశాలు డుమ్మా..! ఆఖరి నిమిషంలో..) -
సుందరీమణులు సిద్ధం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలకు సమయం ఆసన్నమైంది. శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. మిస్ వరల్డ్ సంస్థతో కలిసి ప్రభుత్వం.. ఈ పోటీలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంపై ప్రత్యేక స్థానం పొందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. విదేశీ ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ దేశాల సుందరీమణులతో పాటు అంతర్జాతీయ మీడియా సైతం రానుండటంతో రాష్ట్ర రాజధాని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ధింది. పటిష్ట భద్రత సహా అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయినట్లు అధికరావర్గాలు వెల్లడించాయి. పలు దఫాలుగా సీఎం సమీక్షలురాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు, పెట్టుబడుల ఆకర్షణకు అందాల పోటీలను వినియోగించుకోవాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే పలు దఫాలుగా సమీ క్షలు నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు, కార్యక్రమా లు జరిగే ప్రదేశాలను కూడా సందర్శించారు. కంటెస్ట్లతోనూ ఒకసారి భేటీ అయ్యారు. పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రకృతి, పర్యా వరణ పరంగా అన్ని హంగులు ఉన్నా, తెలంగాణ ఆ రంగంలో వెనుకబడిందని భావిస్తున్న ప్రభుత్వం.. ఇకపై ‘తెలంగాణ జరూర్ ఆనా’(తప్పకుండా తెలంగాణ రండి) అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయా లని నిర్ణయించింది. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తోంది. సర్వాంగ సుందరంగా నగరంఈ పోటీల్లో పాల్గొనడానికి దాదాపు 100 మందికి పైగా సుందరీమణులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. నిర్వహణ సంస్థ మిస్ వరల్డ్ లిమిటెడ్‌కు చెందిన 28 మంది ప్రతినిధులు, మరో 17 మంది సహాయకులు కూడా వచ్చేశారు. రానున్న రెండురోజుల్లో మరికొంత మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి వస్తారని నిర్వాహకులు తెలిపారు. అధికారులు నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా.. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విమానాశ్రయాల్లో కూడా ప్రపంచ సుందరి పోటీలకు వచ్చే వారికి ఆహ్వానం పలుకుతూ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయించింది. గత వారం రోజులుగా వస్తున్న అతిథులు అందరికీ తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతున్న పర్యాటక శాఖ, వారి బసకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రైడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.అలరించిన రిహార్సల్స్ప్రపంచ సుందరి పోటీల కోసం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం రిహార్సల్స్ ఉత్సాహంగా కొనసాగాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న వివిధ దేశాల పోటీదారులు ఆకర్షణీయమైన వ్రస్తాలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. తమ ప్రతిభకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకుని ప్రాక్టీస్ చేశారు. ఇక సమయాను కూలంగా స్టేజ్ ఎంట్రీలు, గ్రూప్ మూవ్మెంట్స్, లైటింగ్, మ్యూజిక్ సెట్ అప్ తదితర అంశాలను నిర్వాహకులు పరిశీలించారు. ప్రధాన కార్యక్రమానికి ముందస్తుగా ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తూ రిహార్సల్స్ పూర్తిచేశారు.సామాన్యులకూ వీక్షించే చాన్స్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెలా ఖరు వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పరిమిత సంఖ్యలో సామాన్యులకూ కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టూరిజం వెబ్సైట్ ( https://tourism.telangana.gov. in/events&single/miss& world& event)లో రిజిస్టర్ చేసుకున్న వారికి పోటీలు జరిగే ఒక్కో కేంద్రంలో వెయ్యి మంది చొప్పున మొత్తం 5 కేంద్రాల్లో 5వేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. -
Sushmita Sen: పోటీనుంచి తప్పుకుందాం అనుకున్నా!
అందాల పోటీల విషయానికి వస్తే1994 దేశానికి ముఖ్యమైన సంవత్సరం! ఆ ఏడే తొలి మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. ఆ ఏడే మిస్ వరల్డ్ క్రౌన్ కూడా వచ్చింది.. 28 ఏళ్ల తర్వాత.. రీటా ఫారియా పావెల్ తర్వాత! ఈ రెండు ఘనతల్లో మొదటిది సుష్మితా సేన్ సాధిస్తే రెండవది ఐశ్వర్య రాయ్ అచీవ్ చేసింది. ఇప్పుడు సుష్మితా సేన్ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం..!సుస్మితా సేన్.. ఢిల్లీ పుట్టి, పెరిగిన బెంగాలీ! అడపాదడపా మోడలింగ్‌లో అవకాశాలతో సాగుతున్న ఆమె సరదాగా మిస్ ఇండియా పోటీలకు దరఖాస్తు చేసుకుంది. అయితే తర్వాత తెలిసింది ఆ పోటీలో ఐశ్వర్య రాయ్ కూడా పాల్గొననుందని. అంతే ఆమె కాన్ఫిడెన్స్ అంతా కరిగిపోయింది. అప్పటికే ఐశ్వర్యకున్న నేమ్ అండ్ ఫేమ్, ఆమె అందం, ఆత్మవిశ్వాసం గురించి సుస్మితాకు తెలుసు. ఆ పోటీలో గెలుపు ఆమెదే అని అర్థమైంది! అందుకే ఆ పోటీ నుంచి తప్పుకోవాలనుకుంది. అమ్మతో, అప్పటి సుస్మితా బాయ్ ఫ్రెండ్ రజత్ తారాతోనూ అదే మాట చెప్పింది. అప్పుడు వాళ్ల అమ్మ, రజత్ ఇద్దరూ ధైర్యం చెప్పడంతో ఆ పోటీలో పాల్గొంది. ఐశ్వర్య అతి విశ్వాసం వల్ల ఆ కిరీటం కోల్పోయి సుస్మితాకు దక్కిందని నాటి మిస్ ఇండియా పోటీ సమీక్షకుల మాట.విశ్వసుందరిగా.. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుని మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనే అవకాశం అందుకుంది సుస్మితా. దానికోసం ముంబైలో ట్రైన్ అవ్వాలి. అప్పుడూ అంతే.. ఒంటరిగా ముంబైలో ఉండలేను మొర్రో అని భయపడింది. ఆ సమయంలోనూ ఆమె వెన్నంటి ఉంది సుస్మిత బాయ్ ఫ్రెండ్ రజతే! అందుకోసం తాను పనిచేస్తున్న కంపెనీలో ఒక నెల రోజులు సెలవు అడిగాడు. వాళ్లు కుదరదనడంతో రాజీనామా చేసి సుస్మిత వెంట ముంబైకి ప్రయాణం అయ్యాడు. శిక్షణ ఆసాంతం ఆమె వెన్నంటే ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా దృఢం కావడానికి సుస్మిత నాన్చాక్లో శిక్షణ తీసుకుంది. మిస్ యూనివర్స్ పోటీల కోసం వేల రూపాయలతో డిజైనర్ వేర్‌ను కొనేంత ఆర్థిక స్తోమత లేదు. ఢిల్లీ లోకల్ మార్కెట్లో గుడ్డ కొనుక్కుని.. గౌను కుట్టించుకుంది. కొత్త సాక్స్‌ను వాళ్లమ్మ చక్కటి గ్లోవ్స్గా కుట్టి, ఇచ్చింది. వీటితోనే మిస్ యూనివర్స్ పోటీలు జరిగిన మనీలా (ఫిలిప్పీన్స్)కి బయలుదేరింది. ఫైనల్ రౌండ్లో ఆ గౌను, ఆ గ్లోవ్స్‌తోనే అప్పియర్ అయింది సుస్మిత. ఆమె ఆ అటైర్కి అందరూ ఫిదా అయ్యారు. వాటికన్నా.. ఫైనల్ రౌండ్‌లోని ఆమె సమాధానం అందరినీ ఇంప్రెస్ చేసింది. ‘మహిళకు మీరిచ్చే నిర్వచనం ఏంటీ?’ అని జడ్జి అడిగిన ప్రశ్నకు ‘మహిళ.. ఆ దేవుడు భువికి పంపిన కానుక. కొత్త ప్రాణానికి ఊపిరిపోసే జనని మహిళ! ప్రేమానురాగాలు అంటే ఏంటో పురుషుడికి చూపించేది మహిళ!’ అని ఆమె జవాబు చెబుతుంటే ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. విశ్వ సుందరి కిరీటం ఆమెను వరించింది. తర్వాత..సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. 24వ ఏట రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకుంది. ఆ దత్తత కోసం అప్పుడున్న నియమ నిబంధనల ప్రకారం చాలానే ఇబ్బంది పడింది. అయినా వెనకడుగు వేయలేదు. ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు.. సుభ్రా సేన్ (జ్యువెలరీ డిజైనర్), సుబీర్ సేన్ (రిటైర్డ్ వింగ్ కమాండర్) ఆమెకు కొండంత అండ. వాళ్ల నాన్న అయితే దత్తత ఇచ్చే అధికారుల నమ్మకం కోసం తన కష్టార్జితంలోని పెద్ద మొత్తాన్ని రెనీ పేరు మీదకి మార్చాడట. అంత మద్దతు ఉంది కాబట్టే కొన్నాళ్లకు ఇంకో బిడ్డ (అలీసా)నూ దత్తత తీసుకుంది. ‘అందరు అమ్మలు తమ పిల్లల్ని పొట్టలో మోస్తారు. కానీ నా పిల్లల్ని నేను నా గుండెలో మోశాను. అందుకే ఆ బిడ్డలు నాకు స్పెషల్!’ అని చెబుతుంది సుస్మితా సేన్! ఇలా పిల్లల్ని దత్తత తీసుకుని తన తల్లి హృదయాన్ని, మహిళగా తాను నిలబడ్డ మహోన్నత స్థానాన్ని ప్రపంచానికి చాటి .. సుస్మితా అంటే మాటలే కాదు చేతలు కూడా అని నిరూపించింది.మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఏషియా పసిఫిక్ పోటీలుంటాయి. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న వారు ‘మిస్ యూనివర్స్’పోటీలకు అర్హులు. మిస్ ఇండియా పోటీలో ఫస్ట్ రన్నరప్ అయిన వారు ‘మిస్ వరల్డ్’పోటీలకు వెళ్తారు. సెకండ్ రన్నరప్ ‘మిస్ ఏషియా పసిఫిక్’లో పాల్గొంటారు. ఇదికాక పర్యావరణ స్పృహ, కార్యాచరణకు సంబంధించి ‘మిస్ అర్త్’ అనే పోటీ కూడా ఉంటుంది. -
మిస్ వరల్డ్ 2025.. హైదరాబాద్‌లో సందడి
ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి భాగ్యనగరంలో అడుగుపెట్టిన అందాల భామలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే ఫిలిప్పీన్స్, మయన్మార్, వియత్నాం, అమెరికా, అర్మెనియాతో పాటు మొత్తం యాభైకి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో పాటు మరో 25 మందికి పైగా విదేశీ ప్రతినిధులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం (Welcome) పలికింది. స్వాగత సమయంలో కొత్త అనుభూతికి లోనవుతున్న విదేశీ అందగత్తెలు స్వాగతం పలికే నృత్యకారులతో పాటు స్టెప్పులేశారు. 13న మిస్ వరల్డ్ పోటీదారులతో హెరిటేజ్ వాక్ తెలంగాణ ఖ్యాతిని విశ్వమంతటా పరిచయం చేసేందుకు ఉపయోగపడే మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు పర్యాటక శాఖ సంచాలకులు జెడ్.హనుమంతు కొండిబా, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 13న చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్‌తోపాటు, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్ సందర్శన వంటి కార్యక్రమాలను పురస్కరించుకొని చేయాల్సిన ఏర్పాట్ల కోసం బుధవారం పాతబస్తీలో పర్యటించారు. బందోబస్తుతోపాటు ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాల యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 13న మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్ పాతబస్తీని సందర్శించి చారి్మనార్ వద్ద హెరిటేజ్ వాక్‌తోపాటు లాడ్ బజారు, చౌమహల్ల ప్యాలెస్‌ను సందర్శించనున్నారని తెలిపారు. పాతబస్తీతోపాటు తెలంగాణ తల్లి, సెక్రెటేరియట్, రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారని అన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటరమణ, పర్యాటక శాఖ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చదవండి: మిస్ వరల్డ్ 2025.. ఆ దేశాలు డుమ్మా -
మిస్ వరల్డ్ పోటీల్లో ఆ దేశాలు డుమ్మా..!
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీకి అధికారికంగా తెర లేచింది. మరో 3 వారాల పాటు నగరవాసులకు వైవిధ్యభరిత అనుభూతులను అందించనున్న ఈ పోటీలో మొత్తం 109 దేశాలు పాల్గొంటున్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. అయితే రకరకాల కారణాలతో పలు దేశాలు తమ ప్రతినిధులను పంపలేకపోయాయి. దాంతో తొలి అంచనాలతో పోలిస్తే 30దేశాలు తగ్గినట్లయ్యింది. మిస్ వరల్డ్ 2025(Miss World 2025) పోటీకి ప్రారంభంలో 140 దేశాలు పాల్గొననున్నట్లు ప్రకటించారు. అయితే తర్వాత ఈ సంఖ్యను 116కు కుదించారు. మొత్తం మీద చూస్తే.. తాజా సమాచారం ప్రకారం, ఈ పోటీలో 109 దేశాలకు చెందిన సుందరీమణులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇది గత మిస్ వరల్డ్ 2023 పోటీలో పాల్గొన్న 112 దేశాల కంటే కూడా తక్కువ కావడం గమనార్హం. పోటీలో పాల్గొనని దేశాల్లో.. కోస్టారికా, ఇరాక్, లెసోతో, లైబీరియా, గినియాబిస్సావు, లైబీరియా, మకావ్, మొరాకో, నార్వే, స్లోవేకియా, టాంజానియా, ఉరుగ్వే తదితర దేశాలు ఉన్నాయి. స్పాన్సర్షిప్ లేక.. తమ దేశాల్లో జాతీయ స్థాయి పోటీలు సరిగా నిర్వహించలేకపోవడం, ప్రతినిధులను నియమించలేకపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల పోటీలో అవి పాల్గొనడంలేదు. లెసోథోకు చెందిన లెరాటో మాసిలా, టాంజానియాకు చెందిన ట్రేసీ నబుకీరా పంపించేందుకు స్పాన్సర్షిప్ లేక పోటీల నుంచి తప్పుకున్నారు. గినియా–బిస్సా, ఇరాక్, మాకావ్, ఉరుగ్వే దేశాలు తమ జాతీయ ఫ్రాంచైజ్ సమస్యల వల్ల ప్రాతినిధ్యం వహించలేకపోయాయి. నార్వేకి చెందిన నికోలిన్ ఆండర్సన్, తాను వ్యక్తిగత ప్రాజెక్టుల వల్ల మిస్ వరల్డ్‌కు హాజరుకాకపోవడంతో, ఆమెను మిస్ ఇంటర్నేషనల్‌కు పంపించారు. సరైన ప్రోత్సాహం, ఆర్థిక పరమైన మద్దతు లేకపోవడంతో మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ టాంజానియా ట్రేసీ నబుకీరా వైదొలిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చాలా పరిశీలించి ఆలోచించిన తర్వాత, మిస్ వరల్డ్ 2025లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు, కానీ.. కావాల్సిన మద్దతు దొరకకపోవడం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం బాధ్యత వహించాల్సిన సంస్థ నుంచి తగినంత సన్నద్ధత లేని కారణంగా, ప్రపంచ వేదికపై టాంజానియాకు ప్రాతినిధ్యం వహించలేనని భావిస్తున్నా. మిస్ టాంజానియా టైటిల్ పట్ల ఇప్పటికీ చాలా గర్వపడుతున్నాను. నా ప్రాజెక్ట్, స్టెప్ బై స్టెప్ ద్వారా నా వంతు సామాజిక సేవ చేయడానికి నా గుర్తింపును ఉపయోగించుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో ఓపికగా, మద్దతుగా నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అన్నారు.ఆఖరి నిమిషం వరకు ఆ దేశాలు..కొన్ని దేశాలు చివరి క్షణం వరకూ మార్పు చేర్పులు చేస్తూనే ఉన్నాయి. తమ అసలు పోటీదారులకు బదులుగా ఇతరులను పంపుతున్నాయి. చెక్ రిపబ్లిక్కు చెందిన జస్టినా జెడ్నికోవా స్థానంలో అడేలా స్ట్రోఫెకొవా ఎంపికయ్యారు. ట్యూనీషియాకు చెందిన అమీరా అఫ్లీకి బదులుగా లామిస్ రెడిసి పోటీలో పాల్గొననున్నారు. బెలీజ్‌కు చెందిన నొయెలియా హెర్నాండెజ్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో షయారి మోరటాయా ఎంపికయ్యారు. కొట్ డి ఇవోరికి చెందిన మారీ ఎమ్మానుయేల్ డైమాలా స్థానంలో ఫటౌమటా కూలిబాలీ వస్తున్నారు. నమీబియాకు చెందిన అల్బర్టినా హైంబలా స్థానంలో సెల్మా కామాన్యా భర్తీ అయ్యారు. కంబోడియాకు చెందిన మానితా హాంగ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో జూలియా రస్సెల్ ఎంపికయ్యారు. మాల్డోవాకు చెందిన మికాయెలా నికోలాలేవ్ను ఏంజెలినా చిటైకా భర్తీ చేశారు. కొంతకాలం విరామం తర్వాత ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలో తిరిగి పాల్గొంటున్న దేశాల్లో స్విట్జర్లాండ్, అల్బేనియా, ఆర్మేనియా, ఈక్వటోరియల్ గినియా, కిర్గిజిస్తాన్, లాట్వియా, నార్త్ మాసిడోనియా, సూరినామ్, బ్రిటిష్ వెర్జిన్ ఐలాండ్స్, జాంబియాలు ఉన్నాయి. (చదవండి: మిస్ వరల్డ్ ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్.) -
Reita Faria: తొలి అందాల డాక్టర్ రీటా ఫారియా
రీటా ఫారియా.. అందాల పోటీలను ఫాలో అయ్యేవారెప్పటికీ మరచిపోని పేరు! మిస్ వరల్డ్‌గా ఎంపికైన తొలి ఇండియనే కాదు తొలి ఏషియన్ కూడా! అంతేకాదు మిస్ వరల్డ్‌గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్! ఇన్ని ఫస్ట్‌లను ప్రీఫిక్స్గా పెట్టుకున్న రీటా నిజంగానే ప్రత్యేకమైన మహిళ! ఇప్పుడామెకు 82 ఏళ్లు. ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ వెల్‌ను పెళ్లి చేసుకుని ఐర్లండ్‌లో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లూ డాక్టర్లే, అమ్మలాగే వాళ్లూ స్పోర్ట్స్ పర్సన్సే గోల్ఫ్‌లో! రీటా 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుండటం వల్ల స్కూల్లో, కాలేజీలో ఆమెను ‘మమ్మీ లాంగ్ లెగ్స్’ అంటూ ఆటపట్టించేవాళ్లట. అయితే ఆమె దాన్ని అవకాశంగా మలచుకుంది. పొడుగు కాళ్లతో స్పోర్ట్స్‌లో బాగా రాణించవచ్చని గ్రహించి.. త్రోబాల్, నెట్‌బాల్, బాడ్మింటన్ నుంచి హాకీ దాకా అన్ని ఆటలూ ఆడారు. పెయింటింగ్ వేస్తారు. డాక్టర్ అయ్యి.. మంచి ఫిజీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు. అసలు మిస్ వరల్డ్ కోసం ప్రయాణం... రీటా ఫారియా స్వస్థలం ముంబై. తాతల కాలంలోనే గోవా నుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన ఓ సామాన్య కుటుంబం. నాన్న.. జాన్, ఒక మినరల్ ఫ్యాక్టరీలో పనిచేస్తే.. అమ్మ.. ఆంటోయినెట్, బ్యూటీ పార్లర్ నడిపేవారు. రీటా అక్క ఫిలోమెనా. రీటా మిస్ వరల్డ్ దాకా వెళ్లడానికి ప్రోత్సహించింది ఆమే! రీటా మెడిసిన్ ఫైనలియర్లో ఉన్నప్పుడే (1966) మిస్ బాంబే పోటీల్లో పాల్గొంది. టైటిల్ సొంతం చేసుకుంది. తర్వాత వాళ్ల సోదరి ‘మిస్ ఇండియా కోసమూ పోటీ పడు’ అంటూ వెన్ను తటింది. అక్కడా టైటిల్ ఆమెనే వరించింది. తర్వాత మిస్ వరల్డ్ వైపూ తోసింది. ఇంచక్కా వేరే దేశం చూడొచ్చన్న ఆశతో తన 23వ ఏట, చేతిలో కేవలం పది పౌండ్ల (అప్పుడు మన దేశ ఫారెక్స్ నిబంధనలు కఠినంగా ఉండేవి అందుకే పది పండ్లు)తో ఆ ΄ోటీల కోసం ఫ్లయిట్ ఎక్కారు. మిస్ వరల్డ్ పాజెంట్ కోసం కూతురు ఒంటరిగా లండన్ వెళ్లడం వాళ్లమ్మను కలవరపరచింది. ఆమె తిరిగొచ్చే వరకూ ఆందోళనతోనే ఉన్నారట. మినిస్టర్ కూతురు చీర.. సేల్స్‌లో హీల్స్.. మిస్ట్ వరల్డ్ పోటీల మీద సరైన అవగాహన, పోటీల్లో ఈవినింగ్ వేర్, గౌన్, పర్సనాలిటీ చాలెంజ్, మిస్ వరల్డ్ నైట్.. లాంటి ముఖ్యమైన ఘట్టాలకు సూట్ అయే దుస్తులూ లేకుండానే పీల్గొంది రీటా. ఈవెనింగ్ వేర్లో చీరే కట్టుకోవాలని నిశ్చయించుకుంది. ఎందుకంటే తన దగ్గర చీర మాత్రమే ఉంది. చీరను ఇండియన్ ట్రెడిషనల్ వేర్‌గానూ ప్రెజెంట్ చేయొచ్చు అనుకుంది. ఆ చీర కూడా అప్పటి మిస్ ఇండియా ఏజెంట్ ఆర్గనైజేషన్‌తో అనుబంధం ఉన్న మహారాష్ట్ర నాటి మినిస్టర్ పాజ్పేయి కూతురి పెళ్లి చీర. నగలు కూడా అరువు తీసుకున్నవే! ఆర్గనైజర్స్ ఆమె వార్డ్ రోబ్ చూసి అవాక్కయ్యారట. ఏమీ లేకుండా ఎలా పాల్గొనబోతోందీ అమ్మాయి అని! ఆమె పొడగరి కావడం వల్ల ఆమెకిచ్చిన స్విమ్ సూట్ కురచదైపోయిందట. తన దగ్గరున్న హీల్స్ ఆ పోటీలకు కావల్సిన ఎత్తు కన్నా తక్కువ ఎత్తున్నవి. ఏం చేయాలో పాలుపోక.. ఒకరోజు తన దగ్గరున్న పది పౌండ్లతో ఎక్కడ దొరుకుతాయో వెదుక్కోసాగింది. అదృష్టవశాత్తు ఒక షాపులో మూడు డ్లకు మంచి స్విమ్ సూట్, అర పౌండ్‌కి కావల్సిన హీల్స్ దొరికాయి ఆమెకు. వాటితోనే పోటీలకు తలపడింది. విశేషమేమంటే ఆ రౌండ్లో ఆమెకు ‘బెస్ట్ స్విమ్‌సూట్’ సబ్ టైటిల్ దక్కింది. అంతేకాదు ఈవెనింగ్ వేర్ ఈవెంట్లో శారీతో ప్రత్యక్షమై ‘బెస్ట్ ఈవెనింగ్ వేర్’ సబ్ టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఫైనల్ ఈవెంట్లో కూడా జడ్జెస్ అడిగిన ప్రశ్నలుకు చక్కటి సమాధానంతో 51 కంటెస్టెంట్లతో పోటీపడి ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని అందుకుంది. ఇక వాళ్లమ్మ సంతోషానికి అవధుల్లేవట! ‘అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. కిరీటం గెలుచుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. నాకున్న అరకొర ఏర్పాట్లతో దీన్నెలా సాధించగలిగానా అని ఆశ్చర్యం వేసింది. ఇప్పటివాళ్లలాగా అప్పట్లో ఏడాది ముందు నుంచే ప్రిపరేషన్లు ఉండేవి కావు. ఇప్పటి వాళ్లు స్పష్టమైన లక్ష్యంతో దానికోసం ట్రైన్ అవుతున్నారు’ అని చెబుతారు రీటా ఫారియా పావెల్. గెలిచాక.. రీటా ఫారియాకు మోడలింగ్‌లో, సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తన డాక్టర్ వృత్తిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే వాటన్నిటికీ నో చెప్పారు. అంతేకాదు మిస్ట్ వరల్డ్‌గా వేదికల మీద పర్సనల్ అపియరెన్స్ ఇచ్చానే తప్ప ఎలాంటి కమర్షియల్స్‌కి అడ్వర్టయిజ్ చేయలేదు. ఆమె కమిట్మెంట్కు ముచ్చటపడ్డ లండన్‌లోని ప్రిస్టేజియస్ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బంది తమ కాలేజీలో చదువు కొనసాగించమని ఆహ్వానించారు. అక్కడే డాక్టర్ యురోపియన్ డేవిడ్ పావెల్ ఈ డస్కీ బ్యూటీ రిటాను కలుసుకున్నాడు. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు అయిదురుగు మనవలు, మనవరాళ్లు. ఇప్పటికీ రీటా అంతే బిజీగా, అంతే ఉత్సాహంగా ఉంటారు. గోల్ఫ్ ఆడుతారు. గార్డెనింగ్ చేస్తారు. ఇంటి పనీ, వంట పనీ చేస్తారు. భార్యాభర్తలిద్దరూ క్లాసికల్ మ్యూజిక్ క్లాసెస్‌కూ వెళ్తారు.– సరస్వతి రమ(చదవండి: అందాల పోటీలకూ నియమ నిబంధనలు ఉంటాయి) -
స్కిన్ షో నుంచి స్కిల్ షోగా..
బ్యూటీ విత్ ఏ పర్పస్ (ఓ ప్రయోజనంతో కూడిన సౌందర్యం).. హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించి నిర్వాహకులు పదేపదే చెబుతున్న మాట. ఎక్కడా అందాల పోటీలు అనే మాటే లేదు. 1951లో యూకేలో ఎరిక్ మోర్లే మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభించినప్పుడు కేవలం శరీర సౌందర్యాన్ని ప్రదర్శించటానికే అవి పరిమితమయ్యాయి. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలపాటు అదే పంథా కొనసాగగా, ఇప్పుడు పోటీల తీరు సమూలంగా మారిపోయింది. పోటీదారులను అన్నివిధాలా పరిశీలించే, పరీక్షించే విధానం వచ్చింది.ఇక సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చే మన దేశంలో పోటీలనేసరికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది ముంబైలో నిర్వహించినప్పుడు ‘ఒళ్లు’దగ్గర పెట్టుకుని వ్యవహరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటుండటం విశేషం. ‘అందమే’ప్రదాన అంశంగా ఉన్నా.. అది అంతర్లీనంగా మాత్రమే ఉండేలా చూస్తున్నారు. సామాజిక బాధ్యత, మహిళా సాధికారత, వ్యక్తిగత ప్రతిభలే ప్రధాన అంశాలుగా పోటీలకు రూపకల్పన చేశారు. -సాక్షి, హైదరాబాద్ఇప్పుడు ప్రతిభకే పట్టం..బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యం ముఖ్యం అనే అంశం జనంలోకి వెళ్లేలా ఇప్పుడు కార్యక్రమాలను డిజైన్ చేశారు. పోటీదారులు సృజనాత్మక, కళాత్మక నైపుణ్యాలను, సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించేందుకు వీలుగా ప్రధాన రౌండ్‌ను రూపొందించారు. టాలెంట్ షోలో నృత్యం, గానం, వాయిద్య ప్రదర్శన, నాటకం, కవిత్వం, ఇతర సృజనాత్మక కళలు చేర్చారు. మే 22న శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే నిర్వహిస్తున్నారు. దాదాపు 115 మంది పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. దీనితో పాటు వారి మేధో సంపత్తి, ప్రపంచ విషయాలపై పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తారు. 1996 ప్రపంచ సుందరి పోటీలువేదిక: బెంగళూరు ‘మహిళను అంగడి బొమ్మగా చూపే పోటీలు వద్దు.. మహిళంటే శరీర ప్రదర్శన కాదు..’అంటూ మహిళా సంఘాలు, రైతు సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. పోలీసులు అడ్డుకునే సమయంలో కొందరు ఆత్మహత్యకు యత్నించగా ఒకరు చనిపోయారు. ఈ ఘటనలు పోటీలపై పెద్ద దుమారమే రేపాయి. చివరకు భారీ సంఖ్యలో పోలీసు పహారా ఏర్పాటు చేసి పోటీలను నిర్వహించాల్సి వచ్చింది. 2025 ప్రపంచ సుందరి పోటీలువేదిక: హైదరాబాద్అక్కడక్కడా కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు తప్ప, ఎక్కడా నిరసన ప్రదర్శనలు లేవు. పైగా ఈ పోటీలు రాష్ట్రానికి మేలు చేస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. అందాల పోటీల నిర్వహణ తీరులో వచ్చినమార్పే... ప్రజల ఆలోచన విధానంలో ఇలాంటి మార్పు తీసుకొచ్చిoది. ఆ పోటీలు వద్దేవద్దు అన్న తీరు నుంచి, వాటిని ఓ వేడుకలాగా నిర్వహించే స్థాయికి చేరింది.స్పోర్ట్స్ చాలెంజ్.. అందం కంటే ఆరోగ్యం ముఖ్యమన్న సంకేతం ఇస్తూ ఈ రౌండ్‌ను డిజైన్ చేశారు. ఆరోగ్యం బాగుండాలంటే శారీరక దృఢత్వం ఉండాలి, అది సమకూరాలంటే ఆటలు ఆడగలగాలి, ఈ ఆటల్లో ముందున్న పోటీదారులు మంచి మార్కులు తమ ఖాతాలో వేసుకుంటారు. ఆటలతో పాటు నాయకత్వ లక్షణమనే మరో కీలక విషయాన్ని ఇందులో ప్రదర్శించాల్సి ఉంటుంది. యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఇది ప్రేరణగా నిలు స్తుందని మిస్ వరల్డ్ లిమిటెడ్ చెబుతోంది. స్పోర్ట్స్ చాలెంజ్‌లో రన్నిoగ్, రిలే రేస్‌లు, ఫిట్నెస్ టెస్ట్‌లు ఉంటాయి. మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ ఫినాలే పోటీలు జరగనున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలు.. మిస్ వరల్డ్ సంస్థ ‘బ్యూటీ విత్ ఏ పర్పస్‘ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. పోటీదారులు తమ దేశాలలో సామాజిక సమస్యలపై తాము చేపట్టిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. రొమ్ము క్యాన్సర్‌పై సమాజంలో అవగాహన కల్పించటమే కాకుండా, బాధిత పేద మహిళలకు చికిత్స అందించేందుకు కృషి చేస్తున్న నటుడు సోనూసూద్‌ను పోటీల వేదికపై ఘనంగా సన్మానించేందుకు మిస్‌వరల్డ్ లిమిటెడ్ ఏర్పాట్లు చేస్తోంది. సామాజిక సేవలో మిస్ వరల్డ్ లిమిటెడ్ మహిళల అందాన్ని ఆదాయంగా మార్చుకుంటోందన్న విమర్శను దూరం చేసుకునేందుకు మిస్ వరల్డ్ సంస్థ గట్టిగా కృషి చేస్తోంది. ప్రస్తుతం దానికి చైర్ పర్సన్‌గా ఉన్న 86 ఏళ్ల జూలియా మార్లే ఈ విషయంలో పట్టుదలగా పనిచేస్తున్నారు. మిస్ వరల్డ్ సంస్థ దాదాపు 100 దేశాలలో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం, యుద్ధ బాధితులకు చేయూత, విపత్తు నివారణ, ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంక్షేమం, బాలికా విద్య వంటి అంశాలు వీటిల్లో ఉన్నాయి. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని పేద దేశాలలో విద్యా కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, శుభ్రమైన నీటి సరఫరా వంటి ప్రాజెక్టులు చేపట్టింది. నైజీరియా, ఘనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలలో సేవలందిస్తోంది. -
Miss World 2025: సుందరీమణులకు స్వాగతం
-
Hyderabad: ప్రపంచ సుందరీ పోటీలతో ప్రత్యేక వాతావరణం
సాక్షి, సిటీబ్యూరో: మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం కొత్త తళులకులు అద్దుకుంటోంది. దాదాపు 120 దేశాల సుందరీమణులతో పాటు ఎందరెందరో వస్తున్న తరుణంలో నగరంలో రహదారులు మెరవాలని, రాత్రుళ్లు విద్యుత్ ధగధగలతో సిటీ మెరిసిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. రోడ్లకు మరమ్మతులు, తుది మెరుగులతోపాటు డివైడర్లపై పేరుకుపోయిన దుమ్ము దులిపి రంగులు వేస్తున్నారు. లేన్ మార్కింగ్లతో పాటు కాలినడకల బాటలను రంగులతో ముస్తాబు చేస్తున్నారు.రోడ్లకిరువైపులా పచ్చదనం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. విమానాశ్రయం నుంచి మొదలు పెడితే, పోటీలను నిర్వహించే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు వెళ్లే రహదారులను, అతిథులు బస చేసే హోటళ్ల మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. ఫ్లై ఓవర్ల క్రాష్ బారియర్స్‌కు, జంక్షన్లు, రోడ్ల వెంబడి కెర్బ్లకు పెయింట్స్ వేస్తున్నారు. రాత్రుళ్లు ప్రత్యేకంగా కనిపించేందుకు వివిధ రకాల విద్యుల్లతలతో ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జంక్షన్లు, పోటీదారులు సందర్శించే ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లోనూ ప్రత్యేక అలంకరణలు (Special Decoration) చేస్తున్నారు. 50 మార్గాల్లో పనులు గ్రేటర్‌లోని దాదాపు 50 మార్గాలు ఈ పనులతో ప్రత్యేకంగా కనిపించనున్నాయి. సాధారణ రోజుల్లో జరగని పనులు ఈ సందర్భంగానైనా జరుగుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇవాంకా ట్రంప్ నగరానికి వచ్చిన సందర్భంగా పలు రోడ్లు అద్దాల్లా మారడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చార్మినార్, లాడ్‌బజార్, ఫలక్‌నుమా ప్యాలెస్, మదీనా, సిటీ కాలేజీ, నయాపూల్, ఆరాంఘర్, మాసాబ్‌ట్యాంక్, గన్‌పార్క్, రేతిబౌలి జంక్షన్, ఐమ్యాక్స్ సర్కిల్, నెక్లెస్ రోడ్, సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్, తాజ్‌కృష్ణ, నాగార్జున సర్కిల్, కేబుల్ బ్రిడ్జి, ఓయూ కాలనీ క్రాస్‌రోడ్స్, ఐకియా జంక్షన్, టీహబ్, హైటెక్ సిటీ జంక్షన్, శిల్పారామం, బయో డైవర్సిటీ జంక్షన్, ఏఐజీ హాస్పిటల్ తదితర ప్రాంతాలు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. స్పెషల్ డెకరేటివ్ లైటింగ్‌లో భాగంగా ఎల్ఈడీ పవర్ క్యాన్స్, స్ట్రిప్లైట్స్, సిరీస్ లైట్స్ తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో 300 మీటర్ల మేర ప్రత్యేక లాంతర్లతో స్ట్రీట్ లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్ల ఆర్చ్‌లు ఏర్పాటు, ఎల్ఈడీలతో క్రౌన్, ‘ఫెయిరీ క్వీన్’ తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు.చదవండి: నాటి బికినీల పోటీ.. మిస్ వరల్డ్! చెత్తా చెదారం.. దోమలు లేకుండా చెత్త కనిపించకుండా వీధులు శుభ్రం చేసే కార్యక్రమాలు పెంచుతున్నారు. దోమలు లేకుండా నిల్వ నీరు లేకుండా చూడటంతో పాటు యాంటీలార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ ముమ్మరం చేశారు. రాత్రివేళ దోమలు కుట్టకుండా ప్రత్యేకంగా రెపెల్లెంట్ క్యాండిల్స్ తెప్పిస్తున్నారు. చార్మినార్– చౌమహల్లా ప్యా లెస్ మార్గంలో హెరిటేజ్ వాక్కు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
బ్యూటీ విత్ పర్పస్..
నగర వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల గురించి విధితమే. అయితే ప్రతి అంశానికి, కార్యక్రమానికి విధిగా నియమావళి ఉన్నట్లే మిస్ వరల్డ్ పోటీలకు సైతం నియమాలు, అర్హతలు, తదితర అంతర్జాతీయ అంశాలు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఈ పోటీలకు సంబంధించిన నియమాలు, పోటీల్లో పాల్గొనే వారి అర్హతలు తదితర అంశాల గురించి ఆరా తీస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాల కోసం గూగుల్‌ను సైతం ఆశ్రయిస్తున్నారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన నియమావళి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక అందగత్తెల పోటీగా మిస్ వరల్డ్ పరిచయమైంది. మిస్ వరల్డ్ పోటీ అనేది కేవలం అందాన్ని ఆరాధించడమే కాక, వ్యక్తిత్వం, సామాజిక బాధ్యతలు, సామాజిక చైతన్యాన్ని కూడా ప్రోత్సహించే గొప్ప వేదిక. ఇది ప్రతి మహిళకూ తన ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు ఒక గొప్ప అవకాశం కలి్పస్తుంది. 1951లో ప్రారంభమైన ఈ పోటీ ద్వారా.. ప్రతి యేటా వివిధ దేశాల మహిళలు తమ అందం, ప్రతిభ, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వం ఆధారంగా ప్రపంచానికి పరిచయమవుతారు. మిస్ వరల్డ్ పోటీని నిర్వహించే ప్రతిపాదనలు, నియమాలు, అర్హతలు, అంతర్జాతీయ అంశాలు విస్తృతంగా ఉంటాయి. నియమాలు, నిబంధనలు.. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయి. మొత్తం 140కు పైగా దేశాలు ఈ పోటీలో ప్రతినిధులను పంపిస్తాయి. ఇందులో ప్రతి దేశం తమ దేశంలో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది, విజేతలు ఎంట్రీ పాసులు పొందుతారు. పోటీలో పాల్గొనడానికి మహిళలు వారి వయసు కనీసం 18 సంవత్సరాలు పూర్తయ్యి ఉండాలి. గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు, అంటే 27వ సంవత్సరంలోకి ప్రవేశించే వారు పోటీలో పాల్గొనలేరు.ఇవే అర్హతలు.. జాతీయత : ప్రతి దేశం తన తరపున ఒక్క మహిళను పంపిస్తుంది. ఆ మహిళ ఆ దేశం సిటిజన్‌గా ఉండాలి. భాష : అభ్యర్థులు ఆంగ్ల భాషలో మాట్లాడగలిగితే అది వారి పోటీ కోసం అనుకూలంగా ఉంటాయి. విద్య, సామాజిక బాధ్యత : మహిళలకు సాధారణంగా మంచి విద్య ఉండాలి. అలాగే వారి సామాజిక బాధ్యతలు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ముఖ్యం.అంతర్జాతీయ అంశాలు.. మిస్ వరల్డ్ పోటీ కేవలం అందం మాత్రమే కాక, సామాజిక, సాంస్కృతిక, శక్తివంతమైన అంశాలపై దృష్టి సారిస్తుంది. ప్రతి ఏడాది పోటీ ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే థీమ్ ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో అభ్యర్థులు ప్రపంచవ్యాప్తంగా తమ కమ్యూనిటీలకు సహాయం చేసే విధంగా వనరులను ఉపయోగిస్తారు. వాటిలో విద్య, ఆరోగ్యం, మహిళల హక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ముఖ్యంగా ఉంటాయి.ప్రత్యేక అంశాలు.. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడం స్నేహపూర్వక పోటీ మాత్రమే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పరిచయమవ్వడానికి కూడా ఒక మార్గం. అభ్యర్థులు వివిధ ప్రదర్శనల్లో పాల్గొని, ప్రపంచంలోని వివిధ సాంస్కృతిక నేపథ్యాలను అంగీకరిస్తారు. ఇదే కాకుండా, వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, సాంకేతికంగా కూడా సమాజానికి అవసరమైన మార్పు తీసుకురావడంలో శక్తిమంతంగా వ్యవహరిస్తారు. -
మిస్ వరల్డ్ పోటీలు.. ఉచితంగానే ఇక్కడ ఎంట్రీ పాసులు
హైదరాబాద్ వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రపంచ సుందరి అందాల పోటీలను మీరు కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. మిస్ వరల్డ్ అవ్వాలనే కోరికతో జాతీయ స్థాయిలోనే ఏటా పదిలక్షలకు పైగా అమ్మాయిలు దరఖాస్తు చేసుకుంటారు. ఈ పోటీల కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా 150కంటే ఎక్కువ దేశాలే ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఇలా ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ పోటీలు ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతుండటంతో ప్రత్యక్షంగా చూడాలని చాలామందిలో ఆసక్తి పెరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను అందించనున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖ(Telangana Tourism) పేర్కొంది. అందాల పోటీలను చూడాలని ఆసక్తి ఉన్నవారు టూరిజం శాఖ అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఒక మెయిల్ పంపుతామని వారు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://tourism.telangana.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. అందుకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, బుక్‌మైషో ద్వారా డబ్బుల చెల్లించి ఎంట్రీ పాసులు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంది. -
మిస్ వరల్డ్ పోటీల విలేకరుల సమావేశంలో నందినీ గుప్తా, సోనూసూద్ (ఫొటోలు)
-
నాటి బికినీల పోటీ.. నేటి మిస్ వరల్డ్!
‘అద్భుతాలు కేవలం అనుకుంటే జరగవు. పరిస్థితులే వాటిని సృష్టిస్తాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ... మిస్ వరల్డ్పోటీలు. బికినీలపోటీ కాస్తా ‘మిస్ వరల్డ్’ పోటీ అయింది. ‘అనూహ్యమైన స్పందన ఒకవైపు–వివాదాలు ఒకవైపు’... ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది...రెండవ ప్రపంచ యుద్ధం (World War II) తరువాత యూరప్ మెల్లగా కోలుకొని పుంజుకోవడం మొదలైంది. బ్రిటన్‌లో ప్రజలు సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. 1851 నాటి గ్రేట్ ఎగ్జిబిషన్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళిక తయారైంది.1951లో...‘ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్’ ఉత్సవాల్లో భాగంగా బ్రిటిష్ టెలివిజన్ ప్రెజెంటర్ ఎరిక్ మోర్లే ‘బికినీ కంటెస్ట్’ నిర్వహణ బాధ్యతను తలకెత్తుకున్నాడు. సైన్యంలో పనిచేసిన మోర్లే ఆ తరువాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. పోటీకోసం డజన్ దేశాలకు ఆహ్వానం పంపాడు. ఉత్తరాలు రాశాడు. ఫోన్ కాల్స్ చేశాడు. అయితే అయిదు దేశాల నుంచి మాత్రమే మోర్లేకు ‘ఓకే’ అంటూ జవాబు వచ్చింది.అప్పటికే సమయం మించిపోయింది. మోర్లే ఎదుర్కొన్న ప్రధాన అభ్యంతరాలలో ఒకటి బికినీలు ధరించడం గురించి.పోటీలోపాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు. బరిలోకి దిగేవారు అవివాహితులు కావచ్చు. వివాహితులు కావచ్చు. విడాకులు తీసుకొని ఉండవచ్చు. పిల్లలు ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు!కుదరదంతే...పోటీలోపాల్గొన్నప్పటికీ తమ భర్తల అభ్యంతరం కారణంగా పర పురుషుల ముందు బికినీలలో కనిపించడానికి ముగ్గురు మహిళలు నిరాకరించారు. వీరి నిరాకరణ మాట ఎలా ఉన్నా.. లండన్‌లోని లైసియం బాల్రూమ్లో జరిగిన ఫైనల్ క్వాలిఫికేషన్ కోసం జడ్జీల ముందు 27 మంది మహిళలు బికినీలతో పోటీలో పాల్గొన్నారు.పేరు మారిందోచ్!బికినీల పోటీ బ్రిటిష్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈపోటీ అధికారిక పేరు ‘ఫెస్టివల్ బికినీ కంటెస్ట్’ అయినప్పటికీ మీడియా ఈపోటీకి ‘మిస్ వరల్డ్’ అని నామకరణం చేసింది. ‘ఫెస్టివల్ బికినీ కంటెస్ట్’ కాస్తా ‘మిస్ వరల్డ్’గా రీబ్రాండింగ్ అయింది. అప్పట్లో బికినీని అమానవీయంగా భావించేవారు. ‘ఇలాంటి పోటీలు ఏంటీ!’ అని విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల సంగతి ఎలా ఉన్నా... ఈపోటీలో స్వీడన్‌కు చెందిన ‘కికి’ కెర్స్టిన్ హకాన్సన్ (Kiki Haakinson) విజేతగా నిలిచింది. ఆమె మొదటి మిస్ వరల్డ్.అలా మొదలైంది...ఈ పోటీని మొదట వన్–టైమ్ ఈవెంట్‌గా అనుకున్నప్పటికీ అనూహ్యమైన స్పందన చూసిన తరువాత దీనిని వార్షిక పోటీగా చేయాలని నిర్ణయించుకున్నారు.కొద్దికాలం తరువాత మిస్ వరల్డ్ ట్రేడ్‌మార్క్ అయింది. ‘బికినీ రౌండ్’ కారణంగా కొన్ని దేశాలు ఈ పోటీలోపాల్గొనడానికి నిరాకరించాయి. ఒకవైపు ఈపోటీకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగింది. మరోవైపు వివాదాలు అదే స్థాయిలో పెరిగాయి. వివాదాలు లేకుండా ఈ పోటీ జరగడం అనేది అసాధ్యం అయింది.మిస్ వరల్డ్ వేదిక... ఉత్తుత్తి బాంబుల మోత!1970లో జరిగిన ‘మిస్ వరల్డ్’ పోటీ సంచలనాత్మకంగా మారింది. పోటీ ఫైనల్లో ఫెమినిస్ట్ కార్యకర్తల నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. లండన్ రాయల్ ఆల్బర్ట్‌లో జరిగిన లైవ్ ఈవెంట్లో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కుళ్లిపోయిన పండ్లు, కూరగాయలే కాదు ఫ్లోర్ బాంబులు వచ్చిపడ్డాయి. ‘మాకు కోపంగా ఉంది’ అని అరిచి, రకరకాల నినాదాలు ఇచ్చారు ఫెమినిస్ట్ కార్యకర్తలు.ఫస్ట్ మిస్ వరల్డ్... హకాన్సన్ఫస్ట్ మిస్ వరల్డ్ ‘కికి’ హకాన్సన్ గత సంవత్సరం కాలిఫోర్నియాలో మరణించింది. అప్పటికి ఆమె వయసు 94 సంవత్సరాలు. స్వీడన్లో పుట్టిన హకాన్సన్ 1951లో ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. హకాన్సన్ బికినీ ధరించడాన్నిపోప్ ఖండించారు. యూరప్‌లో మోడలింగ్ వృత్తిని కొనసాగించిన హకాన్సన్ ఎన్నో అందాల పోటీలకు జడ్జీగా వ్యవహరించింది. అమెరికన్ శిల్పి డల్లాస్ అండర్సన్‌ను పెళ్లి చేసుకుంది. కోపెన్ హాగన్‌లో తొమ్మిది సంవత్సరాలు ఉన్న తరువాత వారు యూనైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. మిస్ వరల్డ్‌కు ముందు ‘ది ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ స్వీడన్’ టైటిల్ గెలుచుకుంది. -
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం
-
16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..
హైదరాబాద్ వేదికగా మరికొద్ది రోజుల్లో 72వ మిస్ వరల్డ్ – 2025 పోటీలు జరగనుండటం విధితమే. దీనిలో దాదాపు 120 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంటులు భాగస్వాములు కానున్నారు. ఇందులో భాగంగా నగరానికి చేరుకున్న మిస్ వరల్డ్ థాయిలాండ్ 2025 ‘ఓపాల్ సుచాత చువాంగ్ శ్రీ’ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో సోమవారం సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని సింఘానియాస్ వస్త్ర దుకాణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న ‘ఓపాల్ ఫర్ హర్’కు మద్దతుగా సింఘానియాస్ చీరలు, లెహంగాలను ధరించారు. తన ఫ్యాషన్ ప్రయాణంతో పాటు తన వ్యక్తిగత విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!! గ్లోబల్ వేదికగా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో థాయిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషంగా ఉంది. అనూహ్యంగా.. మిస్ థాయ్లాండ్గా మిస్ వరల్డ్ వేదికకు సిద్ధం కావడానికి కేవలం 15 రోజులు మాత్రమే పట్టింది. నా జీవితంలో ఇదొక మిరాకిల్. తక్కువ సమయంలో ఈ అవకాశం రావడం నా అదృష్టం. ప్రోత్సాహాన్ని అందించిన థాయ్ ప్రజలకు, అంతర్జాతీయ అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ వేదికపై విజేతగా నిలవడమే నా దేశానికిచ్చే రిటర్న్ గిఫ్ట్. పుట్టి పెరిగిందంతా థాయ్‌లాండ్ ఫుకెట్‌లో. విద్యాభ్యాసం అక్కడే చేశాను. ఉన్నత చదువులకు బ్యాంకాక్ వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్యాషన్ ప్రయాణం మొదలైంది. ఆ బాధ నాకు తెలుసు.. సామాజిక బాధ్యతలో భాగంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాను. 16 ఏళ్ల వయసులో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. ఇందులో భాగంగా నాన్ క్యాన్సరస్ లంప్‌ను తీసేశారు. ఆ అవస్థలు, వేదన నాకు భాగా తెలుసు. అందుకే.. రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటాను. ముందస్తు చికిత్స–గుర్తింపు అవసరముంది. మహమ్మారిపైన అవగాహన కల్పించడమే జీవిత లక్ష్యం. మిస్ థాయ్లాండ్గా నా స్వరాన్ని వినిపిస్తున్నాను. ఇలాంటి సామాజిక బాధ్యతల్లో భాగంగా ‘ఓపాల్ ఫర్ హర్’లో పాలుపంచుకున్నా. థాయ్ ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. ప్రపంచానికి సేవచేస్తాను. ఈ విషయాల్లో మా అమ్మే నాకు స్ఫూర్తి. ఆతిథ్యం అదుర్స్.. ఎయిర్ పోర్ట్‌లో లభించిన స్వాగతం సత్కారాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇంతటి ఘనమైన ఆతిథ్యం జీవితంలో ఇదే మొదటిసారి. హైదరాబాద్ విశిష్టతల గురించి విన్నాను.. ఇది పెరల్ సిటీ అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. నాకు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీ వెళ్లి ఆభరణాలు కొనుక్కుంటాను. చార్మినార్, పెద్దమ్మతల్లి టెంపుల్‌కు కూడా వెళతాను. (చదవండి: 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..! తండ్రి ఫెయిలైనా..తనయ సాధించింది..!) -
చిన్నలోపం కూడా ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీలను చిన్నపాటి లోటుపాట్లు కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10 నుంచి 31 వరకు జరిగే ప్రపంచస్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఉపకరించే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. పోటీదారులతోపాటు దేశ, విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు 3 వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలన్నారు. మిస్‌వరల్డ్– 2025 ఏర్పాట్లపై సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్షించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ జి.సుదీర్‌బాబు, ఏడీజీపీ స్టీఫెన్ రవీంద్రతోపాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.పోటీల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలని సీఎం సూచించారు. మే 10వ తేదీన సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో జరిగే ప్రారంబోత్సవం నుంచి... 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. చార్మినార్, లాడ్‌బజార్, సచివాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు, భద్రత కల్పించాలన్నారు. అనుకోని అవాంతరాలు ఎదురైతే.. అనుకోని అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా, వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ ప్రణాళికలను అధికారులు రూపొందించుకోవాలని ఆదేశించారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతోపాటు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతోపాటు గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సచివాలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున ప్రారంబోత్సవానికి ఆహ్వనించాలని సూచించారు. -
అందం.. సామాజిక బంధం
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడనున్న సుందరీమణులు సౌందర్యోపాసనకే పరిమితం కావడంలేదు. భావి ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నారు. వారిలో ఎందరో వైద్యులు, దౌత్యవేత్తలు, డిజైనర్లు, పైలట్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎంచుకున్న రంగంలో బిజీగా ఉంటూనే మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కోసం హైదరాబాద్ వస్తున్న 110 దేశాల సుందరీమణులు వృత్తి–ప్రవృత్తి పరంగా భిన్న రంగాల్లో ప్రావీణ్యం సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. సమాజానికి మంచి చేసేందుకు.. ⇒ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందినీ గుప్తా బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చదువుతోంది. రాజస్తాన్‌లోని కోటా నగరానికి చెందిన ఆమె 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. భవిష్యత్తు వాణిజ్య సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని తపిస్తూనే ‘ప్రాజెక్ట్ ఏకతా‘ద్వారా వికలాంగులకు మంచి జీవితం అందించేందుకు కృషి చేస్తోంది. ⇒ మిస్ నమీబియా సెల్మా కమన్య ఓ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త. నమీబియాలో మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తోంది. ⇒ టర్కీ సుందరీమణి ఇడిల్ బిల్జెన్, ఉక్రెయిన్‌లో యుద్ధ బాధితులకు చికిత్స చేస్తూ సామాజిక సేవారంగంలో ముందుకు సాగుతున్నారు. ⇒ ఫ్రాన్స్ సుందరి అగాథే కాయెట్, నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన హన్నా జాన్సన్, గయానాకు చెందిన జలికా సామ్యూల్స్ వైద్యులకు అండగా ఆసుపత్రుల్లో రోగులకు సేవలందిస్తున్నారు. ⇒ నేపాల్ భామ స్రీచ్చా ప్రధాన్ పర్యావరణం మెరుగుపరిచేందుకు పనిచేస్తోంది. ⇒ కిర్గిజ్స్తాన్కు చెందిన ఐజాన్ చనచేవా, సెర్బియా సుందరి అలెగ్జాండ్రా రుటోవిక్ హోటల్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు. ⇒ మిస్ కొలంబియా కాటలినా క్వింటెరో వ్యాపారంపై దృష్టి పెట్టింది. ⇒ అంగోలాకు చెందిన నూరియా అస్సిస్, వ్యాపారం, మార్కెటింగ్‌లో డిగ్రీలు కలిగిన పాప్ స్టార్ గాయని. బీట్లను బోర్డ్ రూమ్‌లతో మిళితం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ⇒ ఫిన్లాండ్ నుంచి పోటీలో నిలిచిన సోఫియా సింగ్ పీఆర్, మార్కెటింగ్ నిపుణురాలు. ⇒ మిస్ హంగరీ ఆండ్రియా కాట్జెన్బాచ్ మార్కెటింగ్ క్యాంపెయిన్లను నైపుణ్యంతో సమన్వయం చేçస్తున్నారు. ⇒ గ్రీస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టెల్లా మిచైలిడౌ, హైతీకి చెందిన క్రిస్టీ గురాండ్, మిస్ వియత్నాం హుయిన్ ట్రాన్యినీ భవిష్యత్తులో గొప్ప వ్యాపార సంస్థలకు సీఈఓలు అయ్యేందుకు బాటలు వేసుకుంటున్నారు. ⇒ దక్షిణాఫ్రికాకు చెందిన జోలైజ్ జాన్సెన్ వాన్ రెసబర్గ్ కేవలం 18 ఏళ్ల వయసులోనే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రొఫెషనల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ⇒ థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాట, గ్లోబల్ అఫైర్స్ గ్రాడ్యుయేట్. ఆగ్నేయాసియా దేశాల మధ్య సంబంధాలపై అధ్యయనం చేస్తున్నారు. ⇒ మిస్ శ్రీలంక అనుది గుణసేకర, మిస్ కొరియా మిన్ జంగ్, పనామాకు చెందిన కరోల్ రోడ్రిగెజ్లు కూడా అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై అధ్యయనంలో బిజీగా ఉన్నారు. ⇒ కేమన్ ఐలాండ్స్కు చెందిన జాడా రమూన్ తన స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి పనిచేçస్తున్నారు. ⇒ గ్వాడెలూప్నకు చెందిన నోమీ మిల్నే వైద్యురాలిగా రాణిస్తూనే రచయిత్రిగా కూడా ప్రతిభ చాటుకుంటున్నారు. ⇒ వేల్స్‌కు చెందిన మిల్లీ–మే ఆడమ్స్, బోస్నియాకు చెందిన ఎనా అడ్రోవిక్ వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. ⇒ ప్యూర్టోరికోకు చెందిన వలేరియా పెరెజ్ మెడికల్ టెక్నాలజీలో మాస్టర్స్ గ్రాడ్యుయేట్. ⇒ బెల్జియంకు చెందిన కరెన్ జాన్సెన్, గ్వాటెమాలా నుంచి పోటీపడుతున్న జైమీ ఎస్కోబెడో, లెబనాన్‌కు చెందిన నాదా కౌస్సా, మలేసియాకు చెందిన సరూప్ రోషి, పోలాండ్‌కు చెందిన మాజా క్లాజ్డాలు మానసిక వైద్యులుగా ఎదిగేందుకు కసరత్తు చేస్తున్నారు. ⇒ ఇంగ్లాండ్‌కు చెందిన మిల్లా మాగీ లైఫ్‌గార్డ్, సీపీఆర్ ప్రచారకర్త. ⇒ బ్రెజిల్‌కు చెందిన జెస్సికా పెడ్రోసో, అర్జెంటీనాకు చెందిన గ్వాడలూపే అలోమర్, ఆ్రస్టేలియా ప్రతినిధి జాస్మిన్ స్ట్రింగర్లు ఉపాధ్యాయ వృత్తిలో ముందుకు సాగుతున్నారు. ⇒ మెక్సికో భామ మేరిలీ లీల్ విద్యా కార్యక్రమాలను నడుపుతున్నారు. ⇒ చిలీకి చెందిన ఫ్రాన్సిస్కా లవాండెరో కమర్షియల్ పైలట్‌గా రాణిస్తుండగా సొమాలియాకు చెందిన జైనబ్ జమా ఏవియేషన్ అధ్యయనంలో ఉన్నారు. ⇒ అర్మేనియా సుందరి అడ్రిన్ అట్షెమ్యాన్ అర్మేనియా టీవీలో ప్రసారమయ్యే అత్యధిక రేటింగ్ టీవీ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి. ⇒ అమెరికా తరఫున పోటీలో ఉన్న అథెన్నా క్రాస్బీ టీవీ తెరను ఏలుతోంది. ⇒ డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మైరా డెల్గాడో స్వదేశంతోపాటు అమెరికా, ఇత ర లాటిన్ అమెరికన్ దేశాల్లో యూనివిజన్ కోసం రిపోర్టర్‌గా పనిచేస్తోంది. ⇒ ఎస్టోనియాకు చెందిన ఎలీస్ రాండ్మా సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఎదుగుతోంది. -
Miss World 2025: కాస్ట్లీ కాంటెస్ట్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రపంచ సుందరి అందాల పోటీల మొత్తం విలువ రూ.700 కోట్లపైనే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా వాణిజ్య, వ్యాపార, ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాల ద్వారా మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థకు రూ. 400–500 కోట్ల మేర ఆదాయం వస్తుందనేది అనధికార అంచనా. పోటీల నిర్వహణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తున్నప్పటికీ స్పాన్సర్షిప్ ఆదాయంలో మాత్రం 90 శాతానికిపైగా ఆదాయం మిస్ వరల్డ్ సంస్థకే చెందనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రూ. 57 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ లిమిటెడ్ చెరి సగం చొప్పున భరిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండా స్పాన్సర్షిప్స్ ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేసుకుంటామని.. కేవలం రూ. 2 కోట్ల వరకే ఖజానాపై భారం పడుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో పేర్కొన్నారు. ఈ లెక్కన స్పాన్సర్షిప్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్ల మేర సమకూరుతోందన్నది దాని సారాంశం. ప్రసార హక్కులు, టికెట్ల విక్రయాలతోనూ.. మిస్ వరల్డ్ అందాల పోటీలను 150కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వాటి ప్రసార హక్కుల కోసం పలు చానళ్లు ఇప్పటికే మిస్ వరల్డ్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంతో ఈ రూపంలోనూ ఆ సంస్థకు భారీ మొత్తం సమకూరనుంది. అలాగే పోటీలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఉండే టికెట్ల (హైదరాబాద్ పోటీల విషయంలో ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు) విక్రయాల రూపంలో సైతం ఆ సంస్థకు ఆదాయం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఉండే ఒప్పందం మేరకు ఇందులో వాటా ఇస్తుంది. డిజిటల్, సోషల్ మీడియా హక్కులు ప్రధాన మీడియా చానళ్లలోనే కాకుండా కొన్ని డిజిటల్, సోషల్ మీడియా చానళ్లలోనూ మిస్ వరల్డ్ పోటీల ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. అలాంటి సంస్థలకు కూడా హక్కులు విక్రయించడం ద్వారా మిస్ వరల్డ్ సంస్థ ఆదాయం పొందనుంది. యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వాణిజ్య ప్రకటనల ప్రసారం ద్వారా కూడా ఆదాయంలో మిస్ వరల్డ్ సంస్థ వాటా పొందుతున్నట్లు సమాచారం. ఆదాయ వివరాల్లో గోప్యత.. ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు సంబంధించిన ఖర్చు వివరాలు మాత్రమే వెల్లడవుతుండగా ఆదాయ వివరాలను మాత్రం మిస్ వరల్డ్ సంస్థ గోప్యంగా ఉంచుతోంది. ఇతర అంతర్జాతీయ కార్యక్రమాలు, క్రీడా పోటీల ద్వారా స్పాన్సర్షిప్స్ ఆదాయంపై కొంత స్పష్టత ఉంటున్నా అందాల పోటీల విషయంలో మాత్రం సంపూర్ణ గోప్యతే కొనసాగుతోంది. పోటీల నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోలిస్తే 10 నుంచి 15 రెట్ల ఆదాయం ఉంటుందని తెలుస్తోంది. భారత్‌లోనే ఖర్చు తక్కువ.. 2023లో మిస్ వరల్డ్ పోటీలకు తొలుత యూఏఈని ఎంపిక చేశారు. ఆ సమయంలో పోటీల నిర్వహణ బడ్జెట్‌ను రూ. 250 కోట్లుగా అంచనా వేశారు. కానీ అనివార్య కారణాలతో పోటీలు ముంబైకి మారాయి. ముంబైలో పోటీలకు చేసిన ఖర్చు, యూఏఈ అంచనాలో కేవలం 35 శాతంగా ఉన్నట్లు సమాచారం. రూ. 100 కోట్లలోపు ఖర్చుతోనే పోటీలను ముగించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో అంతకంటే తక్కువ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. అయితే నగర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు దీనికి అదనం. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అయితే స్పాన్సర్షిప్స్, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మిస్ వరల్డ్ సంస్థ చెల్లించనుందని సమాచారం. కానీ ఇందులో స్పష్టత లేదు.విజేతకు వజ్రాల కిరీటం..ప్రపంచ సుందరి విజేతకు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ధరింపచేస్తారు. గతేడాది ముంబైలోజరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టీనా పిజ్కోవాకు అందించిన కిరీటం విలువ రూ. 6.21 కోట్లని తెలుస్తోంది. ఈసారి విజేతకు ప్రైజ్‌మనీగా రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. -
మిస్ వరల్డ్‌తో మోక్షం.!
బంజారాహిల్స్: ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబవుతోంది. మే 7 నుంచి 31 వరకు హైటెక్స్‌లో జరిగే పోటీల కోసం సుందరాంగులు నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించే దిశలో వివిధ శాఖలు సమన్వయంతో ముందుకుసాగుతున్నాయి. ముఖ్యంగా అందగత్తెలు రాకపోకలు సాగించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన ట్రాన్స్ఫార్మర్లు, వేలాడుతున్న వైర్లు, తుప్పుబట్టిన కరెంటు స్తంభాల తొలగింపు, మరమ్మతులు చేస్తోంది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సబ్స్టేషన్ల పరిధిలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, లైన్మెన్లు, సిబ్బంది ఆదివారం మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఈనెల 18న సుందరాంగులు రానున్న నేపథ్యంలో ఈ రోడ్డులో శిథిలావస్థకు చేరిన 12 ట్రాన్స్ఫార్మర్లను మార్చారు. తుప్పుబట్టిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి వేశారు. వేలాడుతున్న కేబుల్ వైర్లను సరిజేశారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తున్న సుందరాంగులు తమ షెడ్యూల్లో భాగంగా వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే పోటీలు జరిగే హైటెక్స్‌కు కూడా ఈ ప్రాంతాల నుంచే వెళ్తారు. ఇక్కడ ఉన్న స్టార్ హోటళ్లలోనే వారంతా బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు గత వారం రోజులుగా సుందరాంగులు రాకపోకలు సాగించే, పర్యటించే ప్రాంతాలను సర్వే చేశారు. రోడ్డు మార్గంలో వెళ్లే క్రమంలో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు శిథిలావస్థకు చేరాయో వాటిని గుర్తించారు. ఓవైపు ఒరిగిన ట్రాన్స్ఫార్మర్ల జాబితాను తయారు చేశారు. దీని ఆధారంగానే ఆదివారం నుంచి మరమ్మతులు చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ ఫిలింనగర్ సబ్‌స్టేషన్ ఏఈ పవిత్ర పర్యవేక్షణలో 30 మంది సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు అన్ని సబ్స్టేషన్ల పరిధిలోనూ పనులు చేస్తున్నారు. ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు -
భాగ్యనగరంలో అందాల హడావిడి..!
హైదరాబాద్ నగర వేదికగా జరగనున్న 72వ ప్రపంచ సుందరి పోటీల కోసం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబై ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 120 దేశాలకు చెందిన అందాల భామలు ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ వంటి ప్రముఖులు నగరానికి చేరుకున్నారు. కాగా ఆదివారం మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాన్డియుజ్జి పెడ్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్ నగరానికి చేరుకున్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్న మిస్ బ్రెజిల్ జెస్సికా, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్కు భారతీయ సంస్కృతి, సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంస్కృతిక నృత్యాలతో జెస్సికాను, జోయలైజ్ను ఆహ్వానించిన విధానం విశేషంగా ఆకట్టుకుంది. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకూ జరగనున్న అంతర్జాతీయ కార్యక్రమం ‘మిస్ వరల్డ్–2025’ పోటీల్లో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి మరికొందరు సుందరీమణులు ఈనెల 6వ తేదీ వరకూ ఒక్కొక్కరుగా రానున్నట్లు నిర్వాహక ప్రతినిధులు తెలిపారు. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల సందడి.. మరి కొద్ది రోజుల్లో నగర వేదికగా జరగనున్న ప్రారంభ వేడుకల్లో గ్లోబల్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేయనున్నారు. వీరి కోసం నగరంలోని పలు ఫైవ్ స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్‌లో ముందస్తు బుకింగ్ చేశారు. అంతేకాకుండా విమానాశ్రయంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు భారత్ నుంచి మిస్ వరల్డ్‌గా నిలిచిన మాజీ మిస్ వరల్డ్‌లు సైతం నగరానికి చేరుకోనున్నారు. ఈనెల 10వ తేదీ లోపు బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ముఖ్య అతిథులుగా రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.(చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర) -
మిస్ వరల్డ్‌లో మన హస్తకళలు!
సాక్షి, హైదరాబాద్: నిత్యం ఫ్యాషన్ ప్రపంచంలో మునిగితేలే సుందరీమణులు నిర్మల్ కొయ్య బొమ్మలను చెక్కనున్నారు.. పోచంపల్లి చీరల తయారీకి పోగులు సిద్ధం చేయబోతున్నారు. చేర్యాల పెయింటింగ్స్‌కు రంగులద్దనున్నారు.. ఇలా ఒకటేమిటి తెలంగాణ సంప్రదాయ హస్తకళలకు సంబంధించి కాసేపు ‘కళాకారులు’కాబోతున్నారు. పోటీలో భాగంగా తెలంగాణ హస్తకళలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. ‘ప్రపంచ సుందరి’ 72వ ఎడిషన్ పోటీలకు వేదికైన హైదరాబాద్ కొత్త ‘అందం’తో తళుకులీనుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలకు చెందిన పోటీదారులు నగరానికి చేరుకోగా, మరికొందరు సోమ, మంగళవారాల్లో వస్తున్నారు. వీరి రాకకు దాదాపు వారం ముందే మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ, చైర్పర్సన్ జూలియా మోర్లే తన సిబ్బందితో నగరానికి చేరుకున్నారు. హైటెక్‌సిటీ సమీపంలోని ట్రైడెంట్ స్టార్ హోటల్లో ఆమె తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోటీల నిర్వహణ పూర్తిగా మిస్ వరల్డ్ లిమిటెడ్ కనుసన్నల్లోనే జరగనుంది. పోటీల షెడ్యూల్, ఇతివృత్తాలను ఆ సంస్థే నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని డిజైన్ చేసింది. ఇదే సందర్భంలో జూలియా మోర్లే రాష్ట్రప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సంప్రదాయ హస్తకళలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, వాటిని పోటీల్లో భాగంగా చేర్చాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆయా హస్తకళలపై పోటీదారులకు అవగాహన కల్పించాలని కోరారు. దీంతో రాష్ట్రప్రభుత్వం శిల్పారామంలో ప్రత్యేకంగా వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. 22 రకాల హస్తకళల లైవ్ డెమానిస్ట్రేషన్ ఇక్కడ ఉండనుంది. ఈ నెల 21న వివిధ దేశాల పోటీదారులు అక్కడికి రానున్నారు. వారి ముందే నిపుణులైన కళాకారులు ఆయా కళాకృతులను తీర్చిదిద్ది, వాటి ప్రత్యేకతలను వివరించనున్నారు. వాటి తయారీలో పోటీదారులు కూడా స్వయంగా పాల్గొంటారు. శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుంది. స్టాళ్లు చూసి ఆసక్తి..మార్చి 20న మిస్ వరల్డ్ పోటీల వివరాలను తొలిసారి జూలియా మోర్లే పర్యాటక భవన్లో మీడియాకు వెల్లడించారు. మిస్ వరల్డ్–2024 విజేత, చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టీనీ పిజ్కోవా కూడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వాగతం పలికేందుకు తెలంగాణ హస్తకళలను స్వయంగా రూపొందిస్తూ కళాకారులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిని జూలియా, క్రిస్టీనీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. క్రిస్టీనా పిజ్కోవా అయితే కాసేపు మగ్గం మీద కూర్చుని పోచంపల్లి చీర అల్లికను పరిశీలించారు. అప్పుడే వీటిపై మిస్‌వరల్డ్ సీఈఓకు ప్రత్యేకాసక్తి కలిగిందని సమాచారం. ఆమె సూచనతో అధికారులు ప్రత్యేకంగా వాటి లైవ్ డెమానిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేశారు. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ చిత్రకళ, నిర్మల్ కొయ్య బొమ్మలు, బిద్రి వేర్, బంజారా ఎంబ్రాయిడరీ, పోచంపల్లి, కొత్తకోట, నారాయణపేట, గద్వాల హ్యాండ్లూమ్స్, పెంబర్తి ఇత్తడి బొమ్మలు, సిల్వర్ ఫిలిగ్రీ, సిద్ది పేట గొల్లభామ చీరలు, నకాషీ, మట్టికుండల తయారీ, కళంకారీ.. ఇలా పలు కళలకు సంబంధించిన ఏర్పాట్లు చేయటం విశేషం. -
హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్ పోటీలు.. బ్యూటీక్వీన్స్పై టాలీవుడ్ ప్రముఖుల కన్ను
మూడవసారి మన భారతదేశం అతిపెద్ద అందాల పోటీకి ఆతిధ్యం ఇవ్వనుంది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు తలమానికమైన హైదరాబాద్ నగరంలో ఈ ప్రపంచ స్థాయి బ్యూటీ కాంటెస్ట్ జరుగనుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమంపైనే విశ్వవ్యాప్త గ్లామర్ రంగం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ గ్లోబల్ ఈవెంట్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖలే మార్చే స్థాయిలో ఏర్పాట్లు షురూ చేసింది. మరో 3 రోజుల్లో ప్రపంచవ్యాప్త అందాలన్నీ రాశులు పోసినట్లుగా హైదరాబాద్ నగరంలో కొలువుదీరనున్నాయి. ఒకటీ రెండు రోజులు కాదు ఏకంగా నెల రోజుల పాటు నగరంలోనే తిష్టవేయనున్నాయి. దాదాపుగా 120 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ పోటీలో తమ దేశాల తరపున బ్యూటీ ఫైట్‌కి సై అంటున్నారు. ఈ నేపధ్యంలో హాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని వుడ్లూ తమ కెమెరాకు తగ్గ ఫుడ్ కోసం వేటను షురూ చేసేశాయి. బాలీవుడ్‌కు చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొంటున్న సుందరీ మణుల గ్లామర్, ఇతరత్రా టాలెంట్స్‌ను సమీక్షించి వారిపై నివేదికలు అందించేందుకు తగినంత మందీ మార్బలాన్ని పురమాయించినట్టు సమాచారం. తద్వారా వారిలో తమ భవిష్యత్తు తారలను ఎంచుకునే అవకాశాలను అన్వేషిస్తున్నారట. అదే విధంగా అంతర్జాతీయ చిత్రాలను అందించడంలో బాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్న టాలీవుడ్ సైతం ఇదే బాట పట్టినట్టు తెలుస్తోంది. తెలుగునాట రూ.వందల కోట్లతో సినిమాలు తీయడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. కొత్త కొత్త మార్కెట్లను పసిగట్టడం వాటిలోకి దూసుకువెళ్లడం కూడా కనిపిస్తోంది. ఏతావాతా తెలుగు సినిమాలు ఇప్పుడు దక్షిణాదిని దాటేసి ఉత్తరాదిని చుట్టేసి, అమెరికా. చైనాలను కూడా కలిపేసుకుని... జపాన్, జర్మీనీ, బంగ్లాదేశ్ అంటూ హద్దులన్నీ చెరిపేసి.. కాదేదేశమూ కలెక్షన్లకు అనర్హం అన్నట్టుగా దూసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఈ మిస్ వరల్డ్ పోటీలు టాలీవుడ్‌కి కూడా ముఖ్యమైన టాపిక్‌గా మారాయి. టైటిల్ విన్నర్‌ని అలా ఉంచితే... వీరిలో విభిన్న రకాల టైటిల్స్‌ను గెలుచుకునే అందగత్తెలు కూడా ఉంటారు. అలాగే అత్యంత అందమైన అమ్మాయి మాత్రమే మిస్ వరల్డ్ కావాలి అని రూలేం లేదు. టైటిల్ గెలుపులో అందంతో పాటు మరెన్నో అంశాలు ప్రాధాన్యత దక్కించుకుంటాయి. కాబట్టి టైటిల్ వేటలో వెనుకబడినా అందంలో అద్భుతం అనిపించే వారూ మరికొందరు కనిపిస్తారు. అలాంటి గ్లామరస్ బ్యూటీస్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటే తమ ఇంటర్నేషనల్ మూవీస్‌కి ప్లస్ అవుతారని కొందరు టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారట. మరోవైపు ఇప్పటికే టాలీవుడ్ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది దాంతో... పలువురు విదేశీ గ్లామర్ క్వీన్స్ సైతం సినిమా ఆకాంక్షల్ని వెంటబెట్టుకుని మన దేశానికి రావడంలో వింతేమీ ఉండదు. కాబట్టి... వారూ తమ టీమ్‌తో కలిసి తమ వంతు ప్రయత్నాలు చేయరని చెప్పలేం. మొత్తం మీద... తొలిసారి తెలుగు నాట జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీలో టైటిల్ విజేతలు మాత్రమే కాదు వెండి తెరపై టైటిల్స్‌లో చోటు చేసుకునే విన్నర్స్ కూడా తేలనున్నారు. ఎవరో తెలియాలంటే.. మరో నెల రోజులు ఆగాల్సిందే. -
ఇదీ తెలంగాణ బ్రాండ్..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్‌కు గుర్తింపు దక్కేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పెట్టుబడులు వీలైనంత ఎక్కువగా ఆకర్షించాలంటే తెలంగాణకు విశ్వవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అవసరమని భావిస్తోంది. ఇందుకు ప్రపంచ సుందరి పోటీలు సరైన అవకాశమని భావిస్తోంది. వీటిని విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనే పట్టుదలతో ఉంది. ఇటీవలే ప్రత్యేకంగా టూరిజం పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం.. దాన్ని ఈ పోటీల నిర్వహణతో ముడిపెట్టి విశ్వవ్యాప్త ప్రచారం కల్పించనుంది. ‘తెలంగాణ.. జరూర్ ఆనా, తెలంగాణ.. హార్ట్ ఆఫ్ ది డెక్కన్’లాంటి నినాదాలను విస్తృతంగా వినియోగిస్తోంది. మిస్ వరల్డ్ పోటీల లోగోలో కూడా వీటిని పొందుపరిచింది. నాలుగు అంశాలు.. నలుదిక్కులా ప్రచారం ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేస్తున్నారు. పోటీలకు సంబంధించిన వివిధ ఘట్టాలు హైదరాబాద్‌లోని వివిధ వేదికల్లో జరుగుతున్నప్పటికీ, ఈ హడావుడి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా యావత్ తెలంగాణను భాగస్వామ్యం చేసేలా.. పోటీ దారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేసింది. నాగార్జునసాగర్ బుద్ధవనం, చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, వరంగల్, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి, మహబూబ్‌నగర్ పిల్లలమర్రి, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐపీఎల్ మ్యాచ్ సందర్శన, శిల్పారామం.. తదితర ప్రాంతాలను సుందరీమణులు సందర్శించనున్నారు. ప్రతి టూర్‌కు అంతర్జాతీయ మీడియా ప్రచారం కల్పించనుంది. సురక్షిత ప్రాంతం, మౌలిక వసతుల నిలయం, ఘనమైన చారిత్రిక వారసత్వం, ఆధునిక వైద్యం..అంశాల ఆధారంగా తెలంగాణ బ్రాండ్‌ను ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సురక్షిత ప్రాంతంప్రశాంత వాతావరణం ఉండే చోటుకే పెట్టుబడులు ఎక్కువగా వచ్చే వీలుంటుంది. ఈ అంశాన్ని ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ సుందరి పోటీల్లో చిన్నపాటి అవాంఛనీయ ఘటనా జరగకూడదని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌త పాటు మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ పటిష్టమైన భద్రతా ఏరాట్లు చేస్తున్నారు. వారికి ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 1,200 మంది రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. మౌలిక వసతులుపోటీలకు హాజరయ్యే వారికి నగరంలో అత్యంత అభివృద్ధి చెందిన, మౌలిక వసతుల పరంగా మెరుగ్గా ఉన్న హైటెక్ సిటీలోని స్టార్ హోటళ్లలో బస కల్పించారు. ప్రధాన పోటీలు జరిగే వేదికలను ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలపై పోటీదారులు, మీడియా దృష్టి పడేలా చేయడం ద్వారా హైదరాబాద్‌లో మౌలిక వసతులపై ప్రపంచ వ్యాప్తంగా కొంత అవగాహన కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాలతో ఉన్న కనెక్టివిటీని వివరించడంతో పాటు పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త సచివాలయ భవనం లాంటి వాటిని వారికి చూపించనున్నారు. మెడికల్ టూరిజంఅభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఆధునిక వైద్యవసతి హైదరాబాద్‌లో ఉందని అతిథులకు వివరించబోతున్నారు. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే 80 శాతం తక్కువ ఖర్చుకే ఆ స్థాయి ఆధునిక వైద్యాన్ని అందించే ఆసుపత్రులకు హైదరాబాద్ కేంద్రమని ప్రత్యేకంగా పోటీదారులు, విదేశీ మీడియాకు తెలియజేయనున్నారు. పోటీదారులను నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇక్కడి ఆధునిక వైద్య పద్ధతులు ప్రత్యక్షంగా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఏయే దేశాల నుంచి ఎంతమంది ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నదీ, వారికి ఇక్కడ అందుబాటులో ఉండే వసతులు, వైద్య సదుపాయాలను ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఘనమైన చరిత్ర, సంస్కృతి, ప్రపంచ రుచులు మెడికల్ టూరిజం తరహాలో ఇటీవల స్ట్రీట్‌ఫుడ్ టూరిజం కూడా విస్తృతమవుతోంది. స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించే పర్యాటకుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఘనమైన వారసత్వం, చరిత్ర, సంస్కృతి ఉన్న నగరంలో విహరిస్తూ అక్కడి సంప్రదాయ భోజనం ఆస్వాదించటాన్ని ఈ పోటీల సందర్భంగా షోకేస్ చేసే దిశలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం విఖ్యాత చౌమొహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు (డిన్నర్) ఏర్పాటు చేశారు. ఇందులో 38 రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలను వడ్డించబోతున్నారు. కాంటినెంటల్ వెరైటీలకు సైతం హైదరాబాద్ వేదికే అన్న విషయం కూడా తెలిసేలా వివిధ ప్రాంతాల రుచులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బాధ్యతను ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు అప్పగించారు. ఇక తాజ్ ఫలక్‌నుమా, చార్మినార్ ప్రాంతాలను చూపటం ద్వారా హైదరాబాద్ చారిత్రక నేపథ్యాన్ని కూడా కళ్లకు కట్టబోతున్నారు. పోటీలకు ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష మిస్ వరల్డ్ పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీనియర్ పోలీస్, ఇతర అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాటిపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని చెప్పారు. అతిథుల బస విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రత, బందోబస్తుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమానాశ్రయం, హోటళ్ల వద్ద, అంతర్జాతీయ కార్యక్రమాల వేదికల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. పర్యాటక శాఖ తరఫున పోటీదారులకు అందజేయడానికి వివరణాత్మక బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలని సూచించారు. అతిథులు, పోటీల్లో పాల్గొనేవారు సందర్శించే అన్ని ప్రదేశాలను సుందరీకరించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. డీజీపీ జితేందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీఎంఓ) జయేశ్ రంజన్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఐఅండ్‌పీఆర్ ఇన్చార్జి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అందాల ఆతిథ్యం.. అంతర్జాతీయ గౌరవం..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోంది. మరి కొద్ది రోజుల్లో నగర వేదికగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ విశిష్టత విశ్వవ్యాప్తం కానుంది. ఈ నేపథ్యంలో దేశానికే తలమానికమైన భాగ్యనగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకూ జరగనున్న 72వ మిస్ వరల్డ్–2025 పోటీల్లో భాగంగా తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసింది తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం. అయితే 7వ తేదీ నుంచే సన్నాహక కార్యక్రమాలు ప్రారంభం కానుండగా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ చైర్పర్సన్, సీఈఓ జూలియా ఎవెలిన్ మోర్లీ శుక్రవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకోగా.. వారికి ఘన స్వాగతం పలికారు.జూలియాతో పాటు విచ్చేసిన మిస్ వరల్డ్ అధికారిణి కెర్రీ ఇతర అధికారులకు భారతీయ సంప్రదాయం పద్దతిలో ఘన స్వాగతం పలికారు. సుమారు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు పాల్గొననున్న ఈ మెగా ఈవెంట్‌ను సువర్ణ అవకాశంగా మలుచుకొని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!’ అనే స్లోగన్‌తో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చరిత్రలో మైలురాయిగా నిలువనుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ టూరిజం, తెలంగాణ గ్రోత్ స్టోరీ, ఇతర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించారు. ఇందులో భాగంగా మిస్ వరల్డ్–2025 (Miss World 2025) కార్యక్రమం ప్రయాణ ప్రణాళికలు, వేదికలను తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా రూపొందించారు.నగర వేదికగా మిస్ వరల్డ్ థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్స్.. హైదరాబాద్ హెరిటేజ్ వాక్.. (మే 12న..) హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం, గొప్పదనం ప్రపంచానికి తెలియజేసేలా నగరంలోని చారిత్రాత్మక ఆనవాలైన చారి్మనార్, లాడ్ బజార్లలో ప్రత్యేకంగా ‘హెరిటేజ్ వాక్’ నిర్వహిస్తారు. చౌమహల్లా ప్యాలెస్ సందర్శన.. (మే 13న..) హైదరాబాద్ (Hyderabad) నగరానికే తలమానికమైన చౌమహల్లా ప్యాలెస్ సందర్శిస్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను తిలకిస్తారు. ఎక్స్‌పీరియా ఎకో పార్క్ సందర్శన.. (మే 16న..) గ్రూప్–2 మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మే 16 సాయంత్రం.. హైదరాబాదు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఎక్సీ్పరియన్ ఎకో పార్కును సందర్శిస్తారు. మెడికల్ టూరిజం పై పరిచయం.. (మే 16న..) వివిధ దేశాల నుంచి రోగులను ఆకర్షించే ఉద్దేశంతో మెడికల్ టూరిజాన్ని సైతం పరిచయం చేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్‌కు గ్రూప్–1 మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హాజరవుతారు. హైదరాబాద్‌లోని ఆధునిక ఆస్పత్రుల ప్రత్యేకతలను వారికి వివరిస్తారు. ఘనంగా గ్రాండ్ ఫినాలే.. మే 22న నిర్వహించే మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలేలో.. 23న హెచ్ 2 హెచ్ ఛాలెంజ్ ఫినాలేలో కంటెస్టెంట్లు పాల్గొంటారు. 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే – జ్యువెలరీ/పెర్ల్ గది షో మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. 26న బ్యూటీ విత్ ఫ్యాషన్ కాంటెస్ట్ నిర్వహిస్తారు. చివరగా 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. ఇవే కాకుండా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని నాగార్జునసాగర్, బౌద్ధవనం ప్రాజెక్టు, వరంగల్ వెయ్యి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్, యునెస్కో గర్తింపు పొందిన రామప్ప ఆలయం, ప్రతిష్టాత్మక యాదగిరి గుట్ట దేవాలయం తదితర ప్రదేశాలను సందర్శిస్తారు. మిస్ వరల్డ్ ఆటల తుది పోటీలు.. (మే 17న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. రామోజీ ఫిలిం సిటీ సందర్శన.. (మే 17న..) ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. సేఫ్టీ టూరిజం.. (మే 18న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనీషియేటివ్‌ను పరిశీలిస్తారు. సచివాలయ సందర్శన.. (మే 18న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు అధికారులు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్ పైన ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కారి్నవాల్ను కూడా సందర్శిస్తారు. ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరు.. (మే 20 లేదా 21..) ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు గ్రూప్–1 కంటెస్టెంట్లు హాజరవుతారు. తెలంగాణ కళాకారులచే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్.. (మే 21న..) గ్రూప్–2 కంటెస్టెంట్లు శిల్పారామంలో తెలంగాణ కళాకారులచే నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్స్‌కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు. -
అందంగా.. సుందరంగా..
సాక్షి, హైదరాబాద్: నగర విశిష్టతల్లో తలమానికంగా చేరనున్న మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమం ‘మిస్ వరల్డ్ 2025’ పోటీలు. ఇందులో భాగంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే నిర్వహణ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగడం నగరానికే గర్వకారణం. ఇందులో భాగంగా పలు ప్రత్యేక ప్రాంతాల్లో క్రౌన్ రూపంలో ప్రతిమలు, లైటింగ్ ఎఫెక్టులు, అధునాతన హంగులను రూపొందించనున్నారు. మిస్ వరల్డ్ పోటీలు జరిగే ప్రధాన ప్రాంతమైన హైటెక్స్ వేదిక సమీప ప్రాంతాలను అంతర్జాతీయ ప్రముఖులు హౌరా అనేలా రమణీయంగా తీర్చిదిద్దుతున్నారు. పలు ప్రాంతాల్లో కళ్లు మిరుమిట్లుగొలిపే థీమ్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. హైటెక్ సిటీలోని దుర్గం చెరువు, ఏఎంబీ మాల్, గచ్చిబౌలి, రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద సెల్ఫీ పాయింట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా నూతనంగా రూపొందించిన మిస్ వరల్డ్ లోగోను కూడా ఈ ప్రచారంలో వినియోగిస్తున్నారు.సందడి చేయనున్న గ్లోబల్ సెలబ్రెటీలు..మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో దాదాపు 130 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రముఖులు నగరానికి రానున్న్నారు. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ రోడ్లో 130 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ అతిథుల కోసం ఇప్పటికే ట్రైడెంట్ హోటల్‌ను నెల రోజుల పాటు ముందస్తుగానే బుక్ చేయడంతో పాటు పలు 5 స్టార్, 3 స్టార్ హోటళ్లను వినియోగించుకోనున్నారు. మాజీ ప్రపంచ సుందరీమణులు, గ్లోబల్ సినీ ప్రముఖులు, విదేశాంగ ప్రముఖులు ఇతర విభిన్న రంగాలకు చెందిన సెలబ్రెటీలు నగరానికి విచ్చేయనున్నారు. శుక్రవారం (ఈ నెల 2న) నగరంలోని హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు సోనూసూద్, మాజీ మిస్ ఇండియా నందినీ గుప్తా ముఖ్య అతిథులుగా వస్తున్నట్టు సమాచారం. 10న జరగనున్న ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. -
మన ప్రతిభ మెరుస్తుందా?
అందాల పోటీలు మన దేశానికి చాలాసార్లు కిరీటాన్ని తొడిగాయి! కాస్మెటిక్స్‌కి మంచి మార్కెట్‌గా మార్చాయి! భారత్‌కు బ్రాండ్‌నూ సృష్టించాయి! మన అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి... ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో స్టార్స్‌ని చేశాయి! ఆ అవకాశాలు ఇప్పుడు తెలంగాణ వెదుక్కుంటూ వచ్చాయి... మేలో జరగనున్న 73వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌ను డెస్టినేషన్‌గా కోరుకుంటూ! ఆ స్టోరీ...భాష, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక వైవిధ్యంలో తెలంగాణ.. మన దేశానికి మినియేచర్‌గా ఉంటుంది. ఆ ప్రత్యేకతే తెలంగాణ రాష్ట్రాన్ని మిస్ వరల్డ్ పోటీలకు వేదికను చేసింది. ఇక్కడి కళలు, చేనేత, పర్యాటకప్రాభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. అందులో భాగంగానే ఈ పోటీలను తెలంగాణలోని పలుచోట్ల నిర్వహించనున్నారు. వీటిని కవర్ చేయడానికి అంతర్జాతీయంగా మూడువేల మీడియా సంస్థలు వస్తున్నాయి. అలా తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోచంపల్లి ఇక్కత్‌తో 120 దేశాల సుందరీమణులు మెరవబోతున్నారు. హిందూ, ముస్లిం సౌభ్రాతృత్వానికి చిరునామా అయిన లాడ్‌బజార్‌లో హెరిటేజ్ వాక్ చేయబోతున్నారు. చౌమొహల్లా ప్యాలెస్‌లో చవులూరించే రుచులతో విందారగించనున్నారు. వీటన్నిటితోపాటు తెలంగాణ అభివృద్ధి, తమ అబ్జర్వేషన్స్నూ అంతర్జాతీయ మీడియా సంస్థలు.. ఫీచర్స్గానో.. ఆఫ్ బీట్ స్టోరీస్గానో ఫోకస్ చేస్తాయి. అలా తెలంగాణ టాక్ ఆఫ్ ద వరల్డ్ అవుతుందని అందాల పోటీల నిర్వాహకుల అభి్రపాయం. తెలంగాణ కూడా ఇక్కడి పర్యాటకం మీద ప్రపంచదృష్టి పడేలా చేసి తద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తోంది. ఈ పోటీల్లో లోకల్ మేకప్ ఆర్టిస్ట్‌లు, హెయిర్ స్టయిలిస్ట్‌లు, టెక్స్టైల్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ఇతర కళాకారులకు అవకాశాలు లభించి, వారి ప్రతిభకు ప్రపంచ గుర్తింపు దొరకనుందా?హైదరాబాద్‌ను సౌత్ ఫ్యాషన్ హబ్‌లా మార్చనుందా? ఇక్కడా గ్రూమింగ్ సెంటర్స్, ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టేషన్స్, స్కిన్ కేర్ ఇండస్ట్రీస్ ఏర్పడనున్నాయా? ఆయా రంగాల్లోని నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!బాధ్యతనూ తీసుకోవాలినారాయణ పేట్ విమెన్ వీవర్స్ మీద నేనొక డాక్యుమెంటరీ చేశాను. లాక్డౌన్ టైమ్‌లో వాళ్లకో ఉపాధిలా ఉంటుందని తస్రిక వీవింగ్ టెక్నిక్‌తో అక్కడి స్త్రీలతో చీరలను నేయించాను. వాటికి నేను డిజిటల్ ప్రింట్స్‌ని యాడ్ చేసి ఆ చీరలతోనే వాళ్లకు మేకోవర్ చేసి నారాయణ పేట్ లోనే వీడియో షూట్, ఫొటో షూట్ చేశాను. ఆ డిజైన్స్‌ని హైదరాబాద్‌కి తీసుకొచ్చి పదిహేను రోజులు ఎగ్జిబిషన్‌లా పెట్టి.. ఆ సేల్స్‌ని పెంచాం. తర్వాత ఆ చీరలను హ్యాండ్లూమ్ డే రోజు వాళ్లకు గిఫ్ట్‌గా ఇచ్చాం. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి చేయూతా దొరక లేదు. అలాగే ఈ అందాల పోటీల వల్ల మన టెక్స్టైల్స్ గురించి ఒక వారం మాట్లాడుకుంటారేమో అంతే! అవకాశాలు రావాలి, పెరగాలంటే మాత్రం టెక్స్టైల్ మినిస్ట్రీ చొరవ తీసుకునిæతెలంగాణ ఫ్యాషన్ హబ్ లాంటిదొకటి ఏర్పాటు చేయాలి. – హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్మంచి అవకాశంనేనైతే దీన్ని పాజిటివ్‌గానే చూస్తాను. ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ తెలంగాణలో అందాల పోటీలకు ఓ స్పేస్ క్రియేట్ చేస్తుందనుకుంటున్నాను. ఫుట్‌వేర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, హెయిర్ స్టయిలిస్ట్స్, మేకప్ ఆర్టిస్ట్స్ లాంటివాళ్లెందరికో అవకాశాలు దొరుకుతాయి. అంతేకాదు ఈ పోటీల్లో వాడే ఫుట్‌వేర్, కాస్ట్యూమ్స్ తయారీకీ ఇది హబ్‌గా మారొచ్చు. గ్రూమింగ్ సెంటర్స్, ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టేషన్స్, స్కిన్ కేర్ ఇండస్ట్రీస్కీ స్కోప్ ఉంటుంది. గ్రూమింగ్ వల్ల తర్వాత అమ్మాయిలు ఏ రంగంలోకి వెళ్లాలనుకున్నా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ ఉపయోగపడతాయి. – కె. అభిమానిక యాదవ్, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని..మేకప్ రంగంలో మంచి విమెన్ మేకప్ ఆర్టిస్ట్‌లు ఉన్నారు. కానీ వాళ్లకు అవకాశాల్లేవు. అలాంటి వాళ్లకు ఈ ఈవెంట్స్ ఉపయోగపడాలి. నేను వరుసగా నాలుగేళ్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్‌కి వర్క్ చేశాను. ఆ తర్వాత నుంచి మళ్లీ అబ్బాయిలనే తీసుకుంటున్నారు. అలా కాకుండా దీన్ని తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. అర్హతలు, ప్రమాణాలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మేకప్ ఆర్టిస్ట్‌ల నుంచి కొటేషన్స్‌ను ఆహ్వానించాలి– శోభాలత, సీనియర్ మేకప్ ఆర్టిస్ట్భద్రత.. రక్షణ కల్పించి...ముందు మహిళలకు తగిన భద్రత, రక్షణ కల్పించి.. ఆ తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు వేదికను ఇవ్వడం గురించి ఆలోచించాలి. వీటివల్ల తెలంగాణ ప్రతిష్ఠ పెరగడం మాట ఎలా ఉన్నా తెలంగాణ వనరులు విదేశీ పెట్టుబడి సంస్థలకు ధారదత్తం అవడం మాత్రం ఖాయం అని నాకనిపిస్తోంది.– భండారు విజయ, రచయిత, మహిళా హక్కుల కార్యకర్తబ్యూటీ పాజంట్ విత్ తెలంగాణ స్టయిల్ఈ పోటీలు హైదరాబాద్ మొదలుకొని రామప్ప, పోచంపల్లి, చౌమొహల్లా ప్యాలెస్.. ఇలా పలుచోట్ల జరుగుతాయి. వీటివల్ల ప్రపంచం మన కళలు, సంస్కృతి, మన వారసత్వ సంపదను తెలుసుకుంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇక్కడి వైద్య సౌకర్యాలను గమనిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ వైవిధ్యాన్ని పరిచయం చేయబోతున్నాం. ఈ పోటీలను బ్యూటీ పాజంట్ విత్ తెలంగాణ స్టయిల్ అనుకోవచ్చు. – మామిడి హరికృష్ణ, డైరెక్టర్, భాష – సాంస్కృతిక శాఖ -
అందాల పోటీలో 'సీపీఆర్' స్కిల్ టెస్ట్..!
అందాల పోటీలు అనగానే ఏముంటాయి. వారి ఫిట్నెస్, విలక్షణమైన ఫ్యాషన్ వంటి పోటీలు నిర్వహిస్తారు. చివరగా వారిలో దాతృత్వం గుణాలు కొద్దిమొత్తంలోనైనా ఉన్నాయా..?. వారి దృష్టిలో అందం అంటే భౌతికమైనదే అనే తరహాలో ముఖాముఖి పరీక్షలు ఉంటాయి. కానీ అందానికి కూడా ఓ పర్పస్ ఉండాలంటూ వినూత్నంగా నిర్వహించేలా సరికొత్త పోటీకి తెరతీసింది ప్రపంచ సుందరీగా టైటిల్‌ని గెలుచుకున్నా మిల్లా మాగీ. ప్రతిసారిలా ఓ మూసధోరణిలో పోటీలు కాకుండా గొప్ప స్కిల్‌తో కూడిన పోటీ ఉండాలంటోంది. అందానికి కూడా ఓ అర్థం, పరమార్థం ఉండాలంటోంది. కేవలం కళ్లప్పగించి చూస్తుండిపోయేలా.. వావ్! అని ఆశ్యర్యచకితులని చేసేది అందం కానే కాదంటోదామె. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..మిస్‌వరల్డ్ ఇంగ్లాండ్ పోటీలో ఈ సరికొత్త రౌండ్ కాంపిటీషన్‌ని కండక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇది మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ టైటిల్ హోల్డర్ మిల్లా మాగీ ఆలోచన నుంచి వచ్చిందట. పోటీలను అధునికరించేలా ప్రభావవంతమైన నైపుణ్యాలు కూడా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ సీపీఆర్ స్కిల్‌ని ప్రవేశ పెట్టారు. అందాల పోటీల్లో సాధారణంగా ఉండే అన్ని రౌండ్ల పోటీలు ఉంటాయి. అయితే చివరి రౌండ్లో పోటీదారులకు మాత్రం సీపీఆర్ స్కిల్‌టెస్ట్ నిర్వహిస్తారు. అంతేగాదు మిస్ ఇంగ్లాండ్ పోటీలో సెమీ ఫైనల్‌కు చేరుకున్న పోటీదారులంతా ఇంగ్లాండ్ అంతటా నగరాల్లో సిపిఆర్ ఎలా చేయాలో పిల్లలకు బోంధించే కార్యక్రమాల్లో పాల్గొన్సాల్సి ఉంటుంది. ఫైనల్‌కి చేరుకున్న సుందరీమణులకు స్విమ్ రౌండ్లో ఈ సీపీఆర్ టెస్ట్‌ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన భారత్‌లోని హైదరాబాద్‌లో జరగనున్న 72వ మిస్ వరల్డ్‌పోటీల్లో కూడా ఈ రౌండ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నట్లు మిల్లా మాగీ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది. మాగీ దీన్ని తన బ్యూటీ విత్ పర్పస్ అనే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీ ఎందుకంటే..మిల్లా మాగీ తన తాతలు, తండ్రులను ఈ సీపీఆర్ స్కిల్ తెలియకే కాపాడుకోలేకపోయారట. తమ కుటుంబంలో ఎవ్వరికీ దీనిపై అంత అవగాహన గానీ నిర్వహించడం గానీ తెలియకపోవడంతో అంతటి విషాదాన్ని చవిచూడాల్సి రావడంతో ఇలా ప్రాజెక్టు చేపట్టి మరీ అవగాహన కల్పిస్తోందామె. ఒక రకంగా పోటీదారులంతా ఈ కాంపిటీషన్ కోసం అయినా..సీపీఆర్ స్కిల్ గురించి తెలుసుకుంటారు. ఎలా చేయాలో ఆన్లైన్ సెషన్లు లేదా వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి నేర్చుకునే యత్నం చేస్తారంటోందిఈ బ్యూటీ క్వీన్.ఇక మాగీ ఇంగ్లాండ్‌లోని పాఠశాలల్లో సిపిఆర్ శిక్షణను తప్పనిసరి చేయాలంటూ పోరాటం చేస్తోంది. "గో విత్ సిపిఆర్" అనే నినాదంతో ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తుల రక్షించడం ఎలా అనేదానిపై విద్యార్థులకు అవగామన కల్పిస్తోంది. ఈ నినాదం ఓ రేంజ్లో ఊపందుకుంది. ఎంతలా అంటే.. ప్రిన్స్ విలియం సైతం ఆమెకు మద్దతు తెలిపారు. తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ ఇన్ ఇండియా పోటీ డైరెక్టర్ ఎంజీ బిస్లీ కూడా ఆమెను ప్రోత్సహిస్తూ ఓ లేఖను కూడా పంపారు. పైగా ఆమె వల్లే తాను ఈ సీపీఆర్ చేయడం నేర్చుకున్నాని అన్నారు. ఆమె ప్రాజెక్టు వైవిధ్యాన్ని తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులకు తెలియజేస్తానన్నారు. ప్రాణాలను రక్షించే ఈ నైపుణ్యం ఎంత గొప్పదో తెలియజేసే.. స్విమ్‌పోటీకి వారంతా ముందుకొచ్చేలా చేస్తానన్నారు. అంతేగాదు ఈ ఏడాది అందాల పోటీల్లో ఇదే హైలెట్‌గా ఉంటుందని అన్నారు బీస్లీ. చివరగా మాగీ మాట్లాడుతూ.. అందానికి ఒక ప్రయోజనం ఉండాలని చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంతలా అందర్నీ హత్తుకునేలా ఊపందుకోవడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని అంటోందామె. View this post on Instagram A post shared by Milla Magee (@milla.magee__) (చదవండి: Coconut Fiber Matress: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్ ఐదేళ్లలో..) -
'స్మితా సబర్వాల్ అలా అనడం బాధాకరం'
మహిళలను గౌరవించే, వారి ఔన్నత్యాన్ని చూపించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి (Mallu Laxmi) అన్నారు. మంగళవారం హైదరాబాద్ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలోని ఐద్వా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. విభిన్నమైన కళా వారసత్వం ఉన్న తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలను స్వాగతిస్తున్నామని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) అనడం బాధాకరమని అన్నారు. అందాల పోటీ లంటే మహిళల శరీరాలను అవమానించడం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క (Vimalakka) మాట్లాడుతూ మహిళల అందాలను కొలతల చూపడం, అర్ధ నగ్న సౌందర్యాన్ని ప్రదర్శించడం అవమానకరమని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అందాల పోటీల మీద ఖర్చుపెట్టే బదులు ప్రజలకు విద్యా, వైద్య సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు అనసూయ, ఐద్వా అధ్యక్షురాలు అరుణజ్యోతి, కేఎన్ ఆశాలత, ఝాన్సీ, స్వరూప, ఇందిర పాల్గొన్నారు. అందాల పోటీలు రద్దు చేయాలని ఆందోళన భారతదేశ నైతిక విలువలు, సాంస్కృతిక నైతికతను దిగజార్చే అసభ్యకరమైన అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేశారు. హైదరాబాద్‌లో మే 7 నుంచి 31 వరకు జరిగే 72వ మిస్ వరల్డ్–2025 (Miss World 2025) అందాల పోటీలను వ్యతిరేకిస్తూ మంగళవారం హిమాయత్‌నగర్ జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగాభారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించడంలో, మహిళల భద్రతను పెంచడంలో, మహిళలపై హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైందన్నారు. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీనియర్ నాయకురాలు పి.ప్రేమ్ పావని మాట్లాడుతూ.. అసలే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం మరింత భారం కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పడాల నళిని, ఎస్.ఛాయాదేవి, ఫైమీద, ఎన్.కరుణ కుమారి, జ్యోతి శ్రీమాన్, షహనా అంజూమ్, రొయ్యల గిరిజ, ఎం.లక్ష్మి, కె.అరుణ వి.కమల, ఎ.దేవమ్మ, సీహెచ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.చదవండి: హెచ్ఎండీఏ ‘మెగా మాస్టర్‌ప్లాన్–2050’పై భారీ కసరత్తు -
అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు
అందాల భామలకు అతిథ్యమిచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో మే 7 నుంచి 31 వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్–2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలకు 140 దేశాల నుంచి మూడు వేల మంది అందాల భామలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిద్వారా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా అందాల భామలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఇలా వివిధ దేశాల అందాల భామలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మే 15న ఇక్కత్ వస్త్రాలతో ర్యాంప్‌వాక్..ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరుగాంచిన భూదాన్‌పోచంపల్లికి మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే 15వ తేదీన రానున్నారు. వీరు ఇక్కడి చేనేత కార్మికులతో ముఖాముఖి మా ట్లాడుతారు. అనంతరం మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. తరువాత చేనేత చీరలు ధరించి ర్యాంప్‌వాక్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మిస్‌వరల్డ్ పోటీల ఈవెంట్లను నిర్వహించే పోచంపల్లి ఇక్కత్వస్త్రాల విశిష్టతను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఫలితంగా చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మరింత పేరును తీసుకురావడమే ఈవెంట్ల ముఖ్య ఉద్దేశమని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పేర్కొంటోంది. ఇప్పటికే అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు వేదికైన పోచంపల్లికి ఇప్పుడు మరోసారి ప్రపంచ సుందరీమణులు వస్తుండడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి పొందనుంది.ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. విజయ విహార్‌లో విడిదిప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్‌లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్‌వరల్డ్ పోటీదారులు సాగర్‌లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరికి.. మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. -
KBR పార్క్‌లో అందమైన అమ్మాయి (ఫొటోలు)
-
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు కాసులు, కాంట్రవర్సీలు
-
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా సందడి (ఫొటోలు)
-
జగదేక నగరానికి అతిలోక సుందరి
సాక్షి, హైదరాబాద్: అప్పుడెప్పుడో ఓ సినిమాలో అంగుళీయకం కోసం అతిలోక సుందరి దివి నుంచి భువికి దిగొచ్చింది. ఇప్పుడు.. అంగుళీయకం పోకున్నా.. అతిలోక సుందరీమణులెందరో అందాల పోటీల కోసం భాగ్యనగరానికి తరలిరానున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అద్భుతమైన వేడుక ‘మిస్ వరల్డ్ 2025’ నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమవుతోంది.మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి స్టేడియం, గచ్చిబౌలి ఐఎస్బీ, టీ–హబ్, శిల్పకళావేదిక.. ఇలా పలు వేదికల్లో సుందరీమణులు వారి ప్రత్యేకతను చాటుకుని జగజ్జేతగా నిలిచేందుకు పోటీ పడనున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పోటీలు కావడంతో భాగ్యనగర పేరు ప్రఖ్యాతులు కూడా మరింత విశ్వవ్యాప్తం కానున్నాయి.గతంలో రెండుసార్లు.. మన దేశంలో ఇప్పటివరకు రెండు పర్యాయాలు ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. 1996లో తొలిసారి బెంగళూరు ఇందుకు వేదికైంది. ఆ తర్వాత గతేడాదే 71వ ఎడిషన్ పోటీలకు ముంబై ఆతిథ్యమిచ్చింది. ఇక వరుసగా రెండోసారి.. 72వ ఎడిషన్‌కు కూడా మన దేశమే వేదిక కానుంది. ఇతర దేశాల్లో పోటీలు జరిగినప్పుడు ఏర్పాట్లు ఘనంగా ఉన్నా, భారీ జనసందోహంలో కార్యక్రమాలు జరిగేవి కాదు. అయితే గతేడాది ముంబైలో జరిగినప్పుడు, ఈ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారు.దీంతో మిస్ వరల్డ్ నిర్వాహకులకు ఇది క్రేజీగా కనిపించింది. దీంతో మరోసారి భారత్‌లోనే నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. నిర్వాహకులతో మాట్లాడి ఒప్పించే బాధ్యతను పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు అప్పగించింది. ఆమె నిర్వాహకులను ఒప్పించడంలో సఫలీకృతం కావడంతో హైదరాబాద్‌కు అరుదైన అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడే ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది.అప్పటి నుంచే ఆయన నిర్వాహకులతో సంప్రదింపులకు సన్నాహాలు ప్రారంభించారు. కాగా ఈసారి 140 దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. ఆయా కార్యక్రమాలను కవర్ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 3,300 మంది మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. బికినీలకు నో.. ప్రపంచ సుందరి పోటీల్లో పలు అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. వాటిల్లో కొన్నింటిలో బికినీల్లాంటి వ్రస్తాలు ధరించాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో శరీరాన్ని ప్రదర్శించే విధంగా వస్త్రధారణ ఉండొద్దని ప్రభుత్వం నిర్వాహకులకు ముందుగానే షరతు విధించింది. ఆయా దేశాల సంప్రదాయ, కాస్త ఆధునిక వ్రస్తాలు ధరించొచ్చని, ఒక పోటీలో పూర్తిగా భారతీయ సంప్రదాయ వ్రస్తాలే ధరించాలని సూచించింది. దీనికి నిర్వాహకులు అంగీకరించారు. గచ్చిబౌలి స్టేడియం టూ హైటెక్స్.. అందాల పోటీల్లో పాల్గొనే సుందరీమణులు మే 6, 7 తేదీల్లో నగరానికి చేరుకుంటారు. 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుక ఘనంగా జరుగుతుంది. తెలంగాణ జానపద, గిరిజన నృత్యాభినయ ఇతివృత్తంతో ఇది ఉంటుంది. నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, టీ–హబ్, శిల్పకళావేదిక, ఐఎస్బీ క్యాంపస్, హైటెక్స్ వేదికల్లో వివిధ అంశాల్లో పోటీలు జరుగుతాయి. వాటిని మిస్ వరల్డ్ నిర్వాహకులే ఎంచుకున్నారు. రాష్ట్రంలో పర్యటనలు ఇలా.. పోటీలు జరిగే సమయంలో సుందరీమణులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ సందర్భంలో వారందరితో పోచంపల్లి చీరలు కట్టించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వారిని తీసుకెళుతుంది. 40 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసి, ఒక్కో బృందాన్ని ఒక్కోచోటకు తీసుకెళ్తారు. బుద్ధవనం: 12న ఓ బృందం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం సందర్శిస్తుంది. బౌద్ధం ఇతివృత్తంగా ఇది సాగుతుంది. చార్మినార్: 13న సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ఓ బృందం చార్మినార్, లాడ్‌బజార్‌లలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తుంది. అక్కడ షాపింగ్ చేస్తారు. చౌమొహల్లాలో డిన్నర్: 13న చౌమొహల్లా ప్యాలెస్‌లో ప్రత్యక్ష సంగీత విభావరి నడుమ పోటీదారులు విందులో పాల్గొంటారు. కాళోజీ కళాక్షేత్రం: 14న అమెరికా–కరేబియన్ ప్రాంతాల పోటీదారులు వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉదయం 11 నుంచి 2 వరకు అక్కడ స్థానికులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. రామప్ప: సాయంత్రం 5 నుంచి 7 వరకు యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ పేరిణి నృత్యరీతులతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. యాదగిరిగుట్ట: యూరప్‌నకు చెందిన పోటీదారుల బృందం 15న మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు యాదగిరిగుట్ట దేవాలయాన్ని సందర్శిస్తుంది. పోచంపల్లి: యూరప్‌నకు చెందిన రెండో బృందం 15న సాయంత్రం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ గుర్తించిన పోచంపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను పరిశీలిస్తారు. మెడికల్ టూరిజం: 16న ఆఫ్రికా, మధ్య ప్రాచ్య (మిడిలీస్ట్) దేశాలకు చెందిన పోటీదారులు మెడికల్ టూర్లలో భాగంగా నగరంలోని అపోలో, ఏఐజీ, యశోదా ఆసుపత్రులను సందర్శిస్తారు. స్పోర్ట్స్ ఫైనల్: స్పోర్ట్స్ ఫైనల్ కార్యక్రమం 17న ఉదయం ఏడున్నర నుంచి పదిన్నర వరకు గచి్చబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. కల్చరల్, మ్యూజిక్, డాన్స్, ఫుడ్ ఆర్ట్ : 17న సాయంత్రం నగర శివారులోని ఎకో టూరిజం పార్కులో జరిగే కల్చరల్, ఫుడ్, ఆర్ట్ ఫెస్టివల్లో పాల్గొంటారు. సేఫ్టీ టూరిజం: నగరంలో పోలీసింగ్ తీరును పరిశీలించేందుకు 19న పోటీదారులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శిస్తారు. సచివాలయం: 19న హుస్సేన్‌సాగర్ తీరం, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం ప్రాంతాలను సందర్శిస్తారు. టీహబ్: 20, 21 తేదీల్లో టీహబ్‌లో మిస్ వరల్డ్ కరేబియన్, మిస్ వరల్డ్ ఆఫ్రికా, మిస్ వరల్డ్ ఏషియా, ఓషియానియాల మధ్య కాంటినెంటల్ ఫినాలే ఉంటుంది. శిల్పారామం: 21న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు శిల్పారామంలో ఆర్ట్స్ క్రాఫ్టŠస్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. శిల్పకళావేదిక: 22న శిల్పకళావేదికలో టాలెంట్ ఫినాలే జరుగుతుంది. ఐఎస్బీ: గచ్చిబౌలిలోని ఐఎస్బీలో 23న హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ ఫినాలే జరుగుతుంది. హైటెక్స్: 24న హైటెక్స్‌లో మోడల్ అండ్ ఫ్యాషన్ ఫినాలే జరుగుతుంది. హైటెక్స్‌లోనే 25న నగలు వజ్రాభరణాల ఫ్యాషన్ షో జరుగుతుంది. బ్రిటిష్ రెసిడెన్సీ: 26న బ్రిటిష్ రెసిడెన్సీ, తాజ్ ఫలక్‌నుమాలలో పర్పస్ ఈవెంట్ గలా డిన్నర్ ఉంటుంది. ప్రముఖ కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శన ఉంటుంది. హైటెక్స్: మే 31న పోటీల తుది పోరు (గ్రాండ్ ఫినాలె). సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతుంది. రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి ఈసారి పరేడ్ మైదానంలో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి సందడి చేయనుంది. మే 31న జరిగే తుదిపోరులో ఏ దేశానికి చెందిన సుందరి విజేతగా నిలుస్తుందో ఆమె.. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మిస్ వరల్డ్ లిమిటెడ్ నిర్వాహకులు అంగీకరించారు.మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న సుందరితో పాటు, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన మొదటి, రెండో రన్నరప్‌లు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్టు తెలిసింది. పరేడ్ మైదానంలో జరిగే ముఖ్య కార్యక్రమాలతో పాటు ఆరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి కూడా వారు హజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ గవర్నర్ ఏర్పాటు చేసే హై టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొంటారు. -
యాదగిరీశుడి సేవలో మిస్ వరల్డ్
యాదగిరిగుట్ట/ సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని 2024 మిస్ వరల్డ్ (ప్రపంచ సుందరి) క్రిస్టినా పిష్కోవా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈవో భాస్కర్‌రావు ఆమెకు స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ ప్రతిష్టాలంకార మూర్తులను పిష్కోవా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన, అస్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. శ్రీస్వామిని దర్శించుకున్న పిష్కోవాకు ఈవో భాస్కర్‌రావు లడ్డూ ప్రసాదంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకు ముందు ప్రధానాలయానికి ఈశాన్య దిశలో ఉన్న అఖండ జ్యోతి వద్ద, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆమె పూజలు చేశారు. ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా ప్రపంచ సుందరి క్రిస్టినా పిష్కోవా సంప్రదాయ రీతిలో చీరకట్టులో రావడం అందరినీ ఆకర్షించింది. యాదగిరిగుట్టకు ప్రపంచస్థాయిలో ప్రాచుర్యం త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల ప్రమోషన్ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళవారం యాదాద్రిని క్రిస్టినా పిష్కోవా సందర్శించారు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రపంచంలో ఆమె సందర్శించిన ప్రాంతాలను డాక్యుమెంటరీ చేస్తున్నారు. తద్వారా ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆమె సందర్శించిన ప్రాంతాల డాక్యుమెంటరీని మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రదర్శిస్తారు. నూతన టూరిజం పాలసీలో భాగంగా గుర్తించిన ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ జాబితాలో యాదగిరిగుట్ట, భువనగిరి కోట, బస్వాపూర్ రిజర్వాయర్, కొలనుపాక దేవాలయం, మహాదేవపురం ఉన్నాయి. -
హైదరాబాద్ ఖ్యాతి పెరిగేలా..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పర్యాటక పటంలో హైదరాబాద్‌ను సమున్నతంగా నిలిపే అరుదైన అవకాశం.. ప్రపంచం యావత్తు నగరం వైపు దృష్టి సారించే కీలక సన్నివేశం.. ప్రపంచ మీడియా హైదరాబాద్ పేరును ప్రముఖంగా వినిపించి/చూపించే విశిష్ట నేపథ్యం.. అవును.. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతోంది. మే ఏడో తేదీ నుంచి 31 వరకు హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు జరగబోతున్నాయి. ఈ పోటీలను నిర్వహించేందుకు చాలా దేశాలు పోటీపడినా ఈసారి ఆ అవకాశాన్ని హైదరాబాద్ సాధించింది. అందాల పోటీలపై ఆసక్తితో ఆ పోటీలకు వేదికైన హైదరాబాద్ గురించీ ప్రపంచం ఆసక్తిని కనబరుస్తుంది. ఇప్పుడు ఈ ‘ఆసక్తి’ని భావిశక్తిగా మార్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రపంచ సుందరి పోటీలకు వేదికవడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని పొందే ప్రయత్నం చేస్తోంది. తద్వారా రైజింగ్ తెలంగాణ గుర్తు ప్రపంచం నలుమూలలా చాటడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం ప్రారంభించింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా.. ఈ పోటీలను కవర్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరున్న దాదాపు 3 వేల మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నారు. కేవలం పోటీల వివరాలనే కాకుండా, పోటీలకు అతిథ్యమిస్తున్న నగర విశేషాలను కూడా వారు ప్రపంచం ముందుంచనున్నారు. ఇక్కడి చరిత్ర, సంస్కృతి, ఐటీలో హైదరాబాద్ పురోగతి, స్థానికంగా ఉన్న మౌలిక వసతులు.. ఇలా అన్ని వివరాలను ప్రచారం చేస్తారు. దీంతో హైదరాబాద్ అంటే పర్యాటకుల్లో కొత్త ఆసక్తి పెరిగి ఈ నగర పర్యటనకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక పోటీలకు సంబంధించి న్యాయనిర్ణేతలుగా వైద్యులు, క్రీడాకారులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు.. ఇలా వివిధ నేపథ్యాలకు చెందిన 140 మంది కూడా ఇక్కడికి రానున్నారు. వీరు కూడా హైదరాబాద్ ప్రత్యేకతలను విశ్వవ్యాప్తం చేయటంలో ఉపకరిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వెరసి పర్యాటక రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను కూడా ఆకర్షించాలన్న ఆలోచనతో ఉంది. ప్రపంచస్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ రంగంలో పురోగతి, ఘనమైన చరిత్ర, అద్భుత వైద్యసదుపాయాలు.. ఇలాంటి వివరాలను విశ్వవ్యాప్తం చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు జరిగే వేళ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప సహా ఇతర చారిత్రక నిర్మాణాల నేపథ్యాన్ని ఈ సందర్భంగా కళ్లకు కట్టబోతోంది. -
హైదరాబాద్‌లో ‘మిస్ వరల్డ్ ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మరో ప్రతిష్టాత్మక పోటీలకు వేదిక కాబోతోంది. ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించే ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు ఈ ఏడాది హైదరాబాద్‌లో జరగనున్నాయి. మే 7వ తేదీ నుంచి 31 వరకు నగరంలో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్, సీఈవో జులియా మోర్లే.. తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ బుధవారం సంయుక్తంగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఈ పోటీలను నిర్వహించనుంది. పోటీల ప్రారంభ, ముగింపు, గ్రాండ్ ఫినాలే వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు జులియా మోర్లే వెల్లడించారు. ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’నినాదంతో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: జులియా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఎదుచూస్తున్నట్లు జులియా మోర్లే తెలిపారు. ‘గొప్ప సంస్కృతి, వారసత్వం, అద్భుత ఆతిథ్యం, వేగవంతమైన వృద్ధి ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్న ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ అభిమానులకు గొప్ప అనుభూతిని పంచనున్నాయి. ఈ భాగస్వామ్యం మిస్ వరల్డ్ పోటీల కోసం మాత్రమే కాదు.. సమూహాల సాధికారతకు, బ్యూటీ విత్ ఏ పర్సస్ అనే మా ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనం’అని పేర్కొన్నారు. ఇది అద్భుతాల తెలంగాణ: స్మిత ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక కావటంపై రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సంతోషం వ్యక్తంచేశారు. ‘ఇది తెలంగాణ.. ఇక్కడ ప్రతి పండుగలో గొప్ప ఆనందం ఉంటుంది. ప్రతి చేతి నైపుణ్యం ఓ కొత్త కథను, ఆరాధనను తెలిపే నేల ఇది. ఇది తెలంగాణ.. అసలైన అందాలను ప్రతిబింబించే నేల. మిస్ వరల్డ్ వేదిక తెలంగాణలోని చేనేత గొప్పతనాన్ని, అద్భుతమైన ఆతిథ్యాన్ని, జానపద రీతులకు వేదిక కాబోతోంది’అని వెల్లడించారు. 2024 మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో నిర్వహించారు. ఆ పోటీల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. మే 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో విజేతకు ఆమె వజ్రాల కిరీటాన్ని అలంకరిస్తారు.